ఆ మేఘము… నిలిచిన యెడల ఇశ్రాయేలీయులు ... ప్రయాణము చేయకుండిరి (సంఖ్యా 9:19).
ఇది విధేయతకు తుది పరీక్ష. గుడారాలను పీకేయడం బాగానే ఉంటుంది. సిల్కు పొరలవంటి మేఘం సన్నిధి గుడారం పైనుండి అలవోకగా, ఠీవిగా తేలిపోతూ ముందుకు సాగితే దాని వెంబడి నడిచిపోవడం చాలా హుషారుగా ఉంటుంది. మార్పు ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. దారి వెంటపోతూ ఉంటే కనబడే ప్రకృతి సౌందర్యం, క్రొత్త ప్రదేశాలను చూడడం, తరువాతి మజిలీ ఎక్కడో అనే ఉత్సుకత.. ఇదంతా ఎంతో బాగుంటుంది. కాని ఉన్నచోటే ఆగిపోవడం అన్నదే ప్రయాణంలో ఉండేవారికి బహు కష్టమైన పని.
ఆ ఉన్న ప్రదేశం సౌకర్యాలేవీ లేకుండా ఉన్నా, సదుపాయాలేమీ లేకుండా ఉన్నా, ఒంటికి ఎంత సరిపడకున్నా అది మన సహనాన్ని ఎంత పరీక్షించినా, ప్రమాదానికి ఎంత చేరువైనా అక్కడే తిష్ట వేసుకుని కూర్చోవడం తప్ప గత్యంతరం లేదు - అనే పరిస్థితి ఎంత బాధగా ఉంటుంది?
కీర్తనకారుడు ఇలా అంటాడు. “ప్రభువు కొరకు ఓపికతో కనిపెడుతున్నాను, ఆయన నా మొరకు చెవినిచ్చి ఆలకించాడు”. దేవుడు అప్పటి పాత నిబంధన పరిశుద్ధుల కోసం చేసిన పనులను అన్ని కాలాల్లోనూ చేయగలడు.
కాని దేవుడు మనలను కొంతకాలం ఎదురుచూస్తూ ఉండనిస్తాడు. హడలగొట్టే శత్రువులకు ముఖాముఖిగా నిలబెట్టి, కంగారు పెట్టే పరిస్థితుల్లో ఆపదలు చుట్టుముట్టినప్పుడు మనలను అక్కడే ఉండమంటాడు. అయితే మనం వెళ్ళిపోవాలి. గుడారాలను ఎత్తివేయాలి. ఇప్పటికే సర్వనాశనం అయిపోయేంతలా బాధలుపడి ఉన్నాం అని అనుకుంటాం. ఈ వడగాలిని, మంటలను విడిచిపెట్టి పచ్చిక బయళ్ళనూ, నదీజలాలను వెదుక్కుంటూ వెళ్ళవలసిన సమయం వచ్చింది గదా.
దేవుని దగ్గరనుంచి ఏ ఉలుకూ పలుకూ లేదు. మేఘం కదలడం లేదు. మనం కదలడానికి వీలు లేదు. అయితే మన్నా, రాతిలోనుండి నీళ్ళు, ఆశ్రయం, రక్షణ మనతో ఉన్నాయి. దేవుడు తన సన్నిధిని మనతో ఉంచకుండా, మన అనుదిన అవసరాలను తీర్చకుండా ఎక్కడా మనల్ని ఆగిపొమ్మని చెప్పడు.
యువకుల్లారా, తొందరపడి మార్పు కోసం పరుగెత్తకండి. దైవ సేవకుల్లారా, మీరున్న చోటే నిలిచి ఉండండి. మేఘం కదిలే దాకా మీరు కదలడానికి వీల్లేదు. ఆయన తనకు ఇష్టమైనప్పుడు మీకు అనుమతి ఇస్తాడు.
చతికిలబడి ఉన్నాను
లేచి పరుగెత్తాలని కంగారు
కోరుకున్న చోటు వేరే ఉంది
అయితే అంతకన్నా
ఆయనపై ఆధారపడాలని ఉంది.
నా కుమారీ కదలకు
అన్యులు నశిస్తున్నారు
నేనేమీ చేయలేకున్నాను
వాళ్ళని చేరాలనుంది
కాని దేవునిపై ఆధారపడాల్సి ఉంది.
పొందడం మంచిది
ఇవ్వడం మరీ మంచిది
అయితే అడుగడుక్కి
క్షణక్షణానికి అన్ని వేళల్లో
దేవునికి లోబడిపోవడం
అన్నిటికంటే ఉత్తమం.
----------------------------------------------------------------------------------------------------------------------------
When the cloud tarried ... then the children of Israel ... journeyed not (Num - 9:19)
This was the supreme test of obedience. It was comparatively easy to strike tents, when the fleecy folds of the cloud were slowly gathering from off the Tabernacle, and it floated majestically before the host. Change is always delightful; and there was excitement and interest in the route, the scenery, and the locality of the next halting-place. But, ah, the tarrying.
Then, however uninviting and sultry the location, however trying to flesh and blood, however irksome to the impatient disposition, however perilously exposed to danger—there was no option but to remain encamped.
The Psalmist says, “I waited patiently for the Lord; and he inclined unto me, and heard my cry.” And what He did for the Old Testament saints He will do for believers throughout all ages.
Still God often keeps us waiting. Face to face with threatening foes, in the midst of alarms, encircled by perils, beneath the impending rock. May we not go? Is it not time to strike our tents? Have we not suffered to the point of utter collapse? May we not exchange the glare and heat for green pastures and still waters?
There is no answer. The cloud tarries, and we must remain, though sure of manna, rock-water, shelter, and defense. God never keeps us at post without assuring us of His presence, and sending us daily supplies.
Wait, young man, do not be in a hurry to make a change! Minister, remain at your post! Until the cloud clearly moves, you must tarry. Wait, then, thy Lord’s good pleasure! He will be in plenty of time!—Daily Devotional Commentary
An hour of waiting!
Yet there seems such need
To reach that spot sublime!
I long to reach them—but I long far more
To trust HIS time!
“Sit still, my daughter”—
Yet the heathen die,
They perish while I stay!
I long to reach them—but I long far more
To trust HIS way!
’Tis good to get,
’Tis good indeed to give!
Yet is it better still—
O’er breadth, thro’ length, down depth, up height,
To trust HIS will! —F. M. N.