Tuesday, November 2, 2021

Expectations Beyond Us

సంఘమయితే . . . ప్రార్థన చేయుచుండెను (అపొ.కా. 12:5).


ప్రార్థన మనలను దేవునితో కలిపే లింకు వంటిది. ఇది అగాధాలన్నిటినీ దాటించే వంతెన. ప్రమాదాలు, అవసరాలు అనే గోతుల మీదుగా మనలను అది దాటిస్తుంది.


ఇక్కడ అపొస్తలుల కాలం నాటి సంఘం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. పేతురు చెరసాలలో ఉన్నాడు. యూదులు విజయోత్సాహంతో ఉన్నారు. హేరోదు ఆ హతసాక్షుల వధాస్థలం దగ్గర అపొస్తలుడి రక్తం ఒలికించడానికి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తున్న మృగం లాగా ఉన్నాడు. అయితే దేవుని సన్నిధికి ప్రార్థన ఎడతెగక చేరుతూనే ఉంది. అప్పుడు జరిగిందేమిటి? చెరసాల తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు.


యూదులు తికమకపడ్డారు. దుష్టుడైన రాజు పురుగులు పడి చనిపోయాడు. దేవుని వాక్యం జయోత్సాహంతో ఉరకలు వేసింది. 


మనకు ఉన్న ఈ దివ్య ఖడ్గానికి ఉన్న శక్తి మనకు తెలుసా? ఈ ఆయుధాన్ని విశ్వాసంతో, మనకిచ్చిన అధికారంలో వాడడానికి మనకు సాహసం ఉన్నదా? దేవుడు మనలను పరిశుద్ధమైన ధైర్యం లోను, దివ్య సాహసం లోను బాప్తిస్మమిస్తాడు. ఆయనకు గొప్పవాళ్ళు అక్కరలేదు. తమ దేవుడి గొప్పదనాన్ని నిరూపించే మనుషులు కావాలి.


మీ ప్రార్థనల్లో అవిశ్వాసం వల్ల గాని, ఆయన శక్తి ఎంతటిదో మనకు తెలుసునన్న భ్రమలో గాని, ఆయన్ను తక్కువగా అంచనా వేసి ఆయన ఇవ్వగలిగిన దానికి పరిధులను ఏర్పరుస్తున్నామేమో. మనం అడిగిన దానికంటే, ఆలోచించగలిగిన దానికంటే అతీతమైన వాటిని ఇస్తాడని ఎదురు చూడండి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడల్లా ముందుగా మౌనముద్ర వహించి ఆయన మహిమలో ఆయన్ను ఆరాధించు. ఆయన ఏమేమి చెయ్యగలడో ఊహించు. క్రీస్తు నామంలో ఆయనకెంత సంతోషమో అర్ధం చేసుకో. శ్రేష్టమైన విషయాల కోసం ఎదురు చూడు.


మన ప్రార్థనలే దేవుడి అవకాశాలు.


నువ్వు దుఃఖంలో ఉన్నావా? ప్రార్థన నీ శ్రమలను మధురంగా, శక్తి పూరితంగా చేస్తుంది. ఉల్లాసంగా ఉన్నావా? నీ ఉల్లాసానికి ప్రార్థన ఉత్సాహ పరిమళాన్ని కలుపుతుంది. బయటినుంచో, లోపలినుంచో శత్రువులు నిన్ను బెదిరిస్తున్నారా? ప్రార్ధన నీ కుడిచేతి వైపున దేవదూతను నిలబెట్టగలదు. ఆ దూత తాకితే చాలు, బండరాయి పిండి అయిపోతుంది. అతడి ఓరచూపులో సైన్య సమూహాలు కూలిపోతాయి. దేవుడు ఏమేమి చెయ్యగలడో అవన్నీ నీ ప్రార్థన ద్వారానే నీకు చెయ్యగలడు. నీకేం కావాలో అడుగు.


పెనుగులాడే ప్రార్థన అద్భుతాలు చెయ్యగలదు

లోతైన అగాధాల్లోంచి లేవనెత్తగలదు

ఇనుప తలుపులగుండా ఇత్తడి కిటికీలగుండా

దూసుకు పోయేలా చెయ్యగలదు.

--------------------------------------------------------------------------------------------------------------------------

But prayer (Acts - 12:5)


But prayer is the link that connects us with God. This is the bridge that spans every gulf and bears us over every abyss of danger or of need.


How significant the picture of the Apostolic Church: Peter in prison, the Jews triumphant, Herod supreme, the arena of martyrdom awaiting the dawning of the morning to drink up the apostle’s blood, and everything else against it. “But prayer was made unto God without ceasing.” And what was the sequel? The prison open, the apostle free, the Jews baffled, the wicked king eaten of worms, a spectacle of hidden retribution, and the Word of God rolling on in greater victory.


Do we know the power of our supernatural weapon? Do we dare to use it with the authority of a faith that commands as well as asks? God baptize us with holy audacity and Divine confidence! He is not wanting great men, but He is wanting men who will dare to prove the greatness of their God. But God! But prayer! —A. B. Simpson


Beware in your prayer, above everything, of limiting God, not only by unbelief, but by fancying that you know what He can do. Expect unexpected things, above all that we ask or think. Each time you intercede, be quiet first and worship God in His glory. Think of what He can do, of how He delights to hear Christ, of your place in Christ; and expect great things. —Andrew Murray


Our prayers are God’s opportunities.


Are you in sorrow? Prayer can make your affliction sweet and strengthening. Are you in gladness? Prayer can add to your joy a celestial perfume. Are you in extreme danger from outward or inward enemies? Prayer can set at your right hand an angel whose touch could shatter a millstone into smaller dust than the flour it grinds, and whose glance could lay an army low. What will prayer do for you? I answer: All that God can do for you. “Ask what I shall give thee.” —Farrar


“Wrestling prayer can wonders do,  

Bring relief in deepest straits;  

Prayer can force a passage through  

Iron bars and brazen gates.”

Monday, November 1, 2021

Waiting is Hard

 

ఆ మేఘము… నిలిచిన యెడల ఇశ్రాయేలీయులు ... ప్రయాణము చేయకుండిరి (సంఖ్యా 9:19).


ఇది విధేయతకు తుది పరీక్ష. గుడారాలను పీకేయడం బాగానే ఉంటుంది. సిల్కు పొరలవంటి మేఘం సన్నిధి గుడారం పైనుండి అలవోకగా, ఠీవిగా తేలిపోతూ ముందుకు సాగితే దాని వెంబడి నడిచిపోవడం చాలా హుషారుగా ఉంటుంది. మార్పు ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. దారి వెంటపోతూ ఉంటే కనబడే ప్రకృతి సౌందర్యం, క్రొత్త ప్రదేశాలను చూడడం, తరువాతి మజిలీ ఎక్కడో అనే ఉత్సుకత.. ఇదంతా ఎంతో బాగుంటుంది. కాని ఉన్నచోటే ఆగిపోవడం అన్నదే ప్రయాణంలో ఉండేవారికి బహు కష్టమైన పని. 


ఆ ఉన్న ప్రదేశం సౌకర్యాలేవీ లేకుండా ఉన్నా, సదుపాయాలేమీ లేకుండా ఉన్నా, ఒంటికి ఎంత సరిపడకున్నా అది మన సహనాన్ని ఎంత పరీక్షించినా, ప్రమాదానికి ఎంత చేరువైనా అక్కడే తిష్ట వేసుకుని కూర్చోవడం తప్ప గత్యంతరం లేదు - అనే పరిస్థితి ఎంత బాధగా ఉంటుంది? 


కీర్తనకారుడు ఇలా అంటాడు. “ప్రభువు కొరకు ఓపికతో కనిపెడుతున్నాను, ఆయన నా మొరకు చెవినిచ్చి ఆలకించాడు”. దేవుడు అప్పటి పాత నిబంధన పరిశుద్ధుల కోసం చేసిన పనులను అన్ని కాలాల్లోనూ చేయగలడు.


కాని దేవుడు మనలను కొంతకాలం ఎదురుచూస్తూ ఉండనిస్తాడు. హడలగొట్టే శత్రువులకు ముఖాముఖిగా నిలబెట్టి, కంగారు పెట్టే పరిస్థితుల్లో ఆపదలు చుట్టుముట్టినప్పుడు మనలను అక్కడే ఉండమంటాడు. అయితే మనం వెళ్ళిపోవాలి. గుడారాలను ఎత్తివేయాలి. ఇప్పటికే సర్వనాశనం అయిపోయేంతలా బాధలుపడి ఉన్నాం అని అనుకుంటాం. ఈ వడగాలిని, మంటలను విడిచిపెట్టి పచ్చిక బయళ్ళనూ, నదీజలాలను వెదుక్కుంటూ వెళ్ళవలసిన సమయం వచ్చింది గదా.


దేవుని దగ్గరనుంచి ఏ ఉలుకూ పలుకూ లేదు. మేఘం కదలడం లేదు. మనం కదలడానికి వీలు లేదు. అయితే మన్నా, రాతిలోనుండి నీళ్ళు, ఆశ్రయం, రక్షణ మనతో ఉన్నాయి. దేవుడు తన సన్నిధిని మనతో ఉంచకుండా, మన అనుదిన అవసరాలను తీర్చకుండా ఎక్కడా మనల్ని ఆగిపొమ్మని చెప్పడు.


యువకుల్లారా, తొందరపడి మార్పు కోసం పరుగెత్తకండి. దైవ సేవకుల్లారా, మీరున్న చోటే నిలిచి ఉండండి. మేఘం కదిలే దాకా మీరు కదలడానికి వీల్లేదు. ఆయన తనకు ఇష్టమైనప్పుడు మీకు అనుమతి ఇస్తాడు.


చతికిలబడి ఉన్నాను

లేచి పరుగెత్తాలని కంగారు

కోరుకున్న చోటు వేరే ఉంది 

అయితే అంతకన్నా

ఆయనపై ఆధారపడాలని ఉంది.


నా కుమారీ కదలకు 

అన్యులు నశిస్తున్నారు

నేనేమీ చేయలేకున్నాను

వాళ్ళని చేరాలనుంది

కాని దేవునిపై ఆధారపడాల్సి ఉంది.


పొందడం మంచిది

ఇవ్వడం మరీ మంచిది

అయితే అడుగడుక్కి

క్షణక్షణానికి అన్ని వేళల్లో

దేవునికి లోబడిపోవడం

అన్నిటికంటే ఉత్తమం.

----------------------------------------------------------------------------------------------------------------------------

When the cloud tarried ... then the children of Israel ... journeyed not (Num -  9:19)


This was the supreme test of obedience. It was comparatively easy to strike tents, when the fleecy folds of the cloud were slowly gathering from off the Tabernacle, and it floated majestically before the host. Change is always delightful; and there was excitement and interest in the route, the scenery, and the locality of the next halting-place. But, ah, the tarrying.


Then, however uninviting and sultry the location, however trying to flesh and blood, however irksome to the impatient disposition, however perilously exposed to danger—there was no option but to remain encamped.


The Psalmist says, “I waited patiently for the Lord; and he inclined unto me, and heard my cry.” And what He did for the Old Testament saints He will do for believers throughout all ages.


Still God often keeps us waiting. Face to face with threatening foes, in the midst of alarms, encircled by perils, beneath the impending rock. May we not go? Is it not time to strike our tents? Have we not suffered to the point of utter collapse? May we not exchange the glare and heat for green pastures and still waters?


There is no answer. The cloud tarries, and we must remain, though sure of manna, rock-water, shelter, and defense. God never keeps us at post without assuring us of His presence, and sending us daily supplies.


Wait, young man, do not be in a hurry to make a change! Minister, remain at your post! Until the cloud clearly moves, you must tarry. Wait, then, thy Lord’s good pleasure! He will be in plenty of time!—Daily Devotional Commentary


An hour of waiting!  

Yet there seems such need  

To reach that spot sublime!  

I long to reach them—but I long far more  

To trust HIS time!


“Sit still, my daughter”—  

Yet the heathen die,  

They perish while I stay!  

I long to reach them—but I long far more  

To trust HIS way!


’Tis good to get,  

’Tis good indeed to give!  

Yet is it better still—  

O’er breadth, thro’ length, down depth, up height,  

To trust HIS will! —F. M. N.

Sunday, October 31, 2021

What Cannot Be Uttered

అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు (రోమా 8:26, 27).


ప్రార్థనలోని అతి నిగూఢమైన రహస్యమిది. మానవ భాషలో చెప్పలేని దైవ సంబంధమైన ఏర్పాటు. మన వేదాంత విద్య దీనిని వివరించ లేదు. అయితే ఈ విషయం అర్థం కాకపోయినా అతి సామాన్యమైన విశ్వాసికి కూడా ఈ విషయం అనుభవమే.


మనకు అర్థం కాని భారాలెన్నో మన హృదయంపై మోస్తూ ఉన్నాం. మన మనస్సు ఎన్నెన్నో అస్పష్టమైన నివేదనలను దేవుని యెదుట ఉంచాలని ఉవ్విళ్ళూరుతున్నది. అయితే ఇవన్నీ పరమ సింహాసనం నుండి వచ్చిన ప్రతిధ్వనులే. దేవుని హృదయంలోనుండి వెలువడిన గుసగుసలే. సాధారణంగా మన హృదయంలో పాట కంటే మూలుగే ఎక్కువ ధ్వనిస్తూ ఉంటుంది. అయితే ఈ భారం ధన్యకరమైనది. ఈ భారం క్రింద ఆనందగానాలు, భాషకందని ఉత్సాహగానాలు ఉన్నాయి. ఇది ఉచ్ఛరింపశక్యం గాని మూలుగు. దీనిని మనకై మనం పలకలేం. కొన్నిసార్లు మన అంతరంగంలో దేవుడే ప్రార్థిస్తున్నాడన్న ఒక భావం తప్ప మరేదీ అనుభవంలోకి రాదు. ఆయనకే అర్థమయ్యే ఒక అవసరం కోసం ఆయన మనలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు.


ఇందువల్ల మన హృదయ సంపూర్ణతను, మన ఆత్మ భారాన్నీ, మనలను వేధించే వేదననూ ఆయన సన్నిధిలో ఒలకబొయ్యాలి. ఆయన వింటున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. స్వీకరిస్తున్నాడు.


మన ప్రార్థనలో ఏదైనా సరికానిది గాని, అడగకూడనిది గాని ఉంటే దాన్ని వేరుచేసి మిగిలినదాన్ని ప్రధానయాజకుని హోమంతో పాటు మహోన్నతుని సింహాసనం చెంతకు పంపిస్తున్నాడు. మన ప్రార్థన ఆయన నామం పేరిట అంగీకరించబడుతుంది.


ఊహలకందని ఒక తియ్యని సహవాసమేదో ఎప్పుడూ దేవుణ్ణి మన హృదయంతో ఐక్యం చేస్తూనే ఉంటుంది. తల్లి ప్రక్కన ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడనుకోండి. తల్లిగాని, పిల్లవాడు గాని మాట్లాడుకోక పోయినా వాళ్ళ మధ్య ఒక బంధం ఉంటుంది. పిల్లవాడు తన ఆటలో తానుంటాడు. తల్లి తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఇద్దరి మధ్య సహవాసం తెగిపోదు. తన తల్లి తనతో ఉన్నదని పిల్లవాడికి తెలుసు. పిల్లవాడు క్షేమంగా ఉన్నాడని తల్లికి తెలుసు. అలాగే విశ్వాసి, దేవుడు గంటల తరబడి తమ మౌన సహవాసంలో ఉంటారు. విశ్వాసి తన పనుల్లో నిమగ్నమై ఉంటాడు. అయినప్పటికీ తాను చేస్తున్న ప్రతి చిన్న పనిలోనూ దేవుని హస్తం తోడుగా ఉన్నదన్న ఆత్మ జ్ఞానం అతనికి ఉంటుంది. దేవుని సమ్మతి, ఆయన ఆశీర్వాదం తనతో ఉన్నాయని అతనికి తెలుసు.


అయితే చెప్పశక్యం కాని భారాలు, బాధలు వచ్చిపడినప్పుడు, అర్థం చేసుకోలేని సమస్యలు ఆవహించినప్పుడు నేరుగా దేవుని ఒడిలో వాలిపోగలగడం, మన దుఃఖాన్ని ఆయన యెదుట వెళ్ళబుచ్చడం ఎంత ధన్యకరం!

-----------------------------------------------------------------------------------------------------------------------------


Likewise also the Spirit helpeth our infirmities; for we know not what to pray for as we ought; but the Spirit itself maketh intercession for us with groanings which cannot be uttered. And he that searcheth the hearts knoweth what is the mind of the Spirit, because he maketh intercession for the saints according to the will of God (Rom -  8:26-27)


This is the deep mystery of prayer. This is the delicate divine mechanism which words cannot interpret, and which theology cannot explain, but which the humblest believer knows even when he does not understand.


Oh, the burdens that we love to bear and cannot understand! Oh, the inarticulate out-reaching's of our hearts for things we cannot comprehend! And yet we know they are an echo from the throne and a whisper from the heart of God. It is often a groan rather than a song, a burden rather than a buoyant wing. But it is a blessed burden, and it is a groan whose undertone is praise and unutterable joy. It is “a groaning which cannot be uttered.” We could not ourselves express it always, and sometimes we do not understand any more than that God is praying in us, for something that needs His touch and that He understands.


And so we can just pour out the fullness of our heart, the burden of our spirit, the sorrow that crushes us, and know that He hears, He loves, He understands, He receives; and He separates from our prayer all that is imperfect, ignorant and wrong, and presents the rest, with the incense of the great High Priest, before the throne on high; and our prayer is heard, accepted and answered in His name. —A. B. Simpson


It is not necessary to be always speaking to God or always hearing from God, to have communion with Him; there is an inarticulate fellowship more sweet than words. The little child can sit all day long beside its busy mother and, although few words are spoken on either side, and both are busy, the one at his absorbing play, the other at her engrossing work, yet both are in perfect fellowship. He knows that she is there, and she knows that he is all right. So the saint and the Savior can go on for hours in the silent fellowship of love, and he be busy about the most common things, and yet conscious that every little thing he does is touched with the complexion of His presence, and the sense of His approval and blessing.


And then, when pressed with burdens and troubles too complicated to put into words and too mysterious to tell or understand, how sweet it is to fall back into His blessed arms, and just sob out the sorrow that we cannot speak!