దేవుడు తన సేవకుల్లో అతి ప్రధానులైన వాళ్ళను ఎన్నుకుని శ్రమల్లో అతి ప్రధానమైన వాటిని ఎంచి వారి మీదికి పంపిస్తాడు. దేవుని నుండి ఎక్కువ కృప పొందినవాళ్ళు, ఆయన ద్వారా వచ్చే ఎక్కువ కష్టాలను భరించగలిగి ఉంటారు. శ్రమలు విశ్వాసిని ఏ కారణమూ లేకుండా అంటవు. వాటిని కేవలం దేవుడే అతని కోసం నిర్దేశించి పంపించాడు. దేవుడు వ్యర్థంగా తన విల్లును ఎక్కుపెట్టడు. ఆయన వదిలిన ప్రతి బాణమూ ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని సాధిస్తుంది. దాని గురికి తప్ప మరెక్కడా అది నాటుకోదు. విశ్వాసులముగా మనం తొణకకుండా నిలబడి శ్రమలను అనుభవించడం ఎంతో మహిమకరం.
నా కంట నీరు లేకుంటే
దేవుడు నన్ను ఓదార్చడమెలా?
నా బ్రతుక్కి అలసటే లేకుంటే
ఆయనిచ్చే విశ్రాంతితో నాకేం పని?
సమాధులు నా కళ్ళెదుట లేకుంటే
బ్రతుకంతా ఒక భావం లేని స్వప్నమే గదా
నా కన్నీళ్ళు నా అలసట నా సమాధులు
అన్నీ ఆయన దీవెనల వాహనాలు
వాటికి కష్టాలని పేరు కాని
నా దేవుని ప్రేమ గుర్తులే కదా అవి?
ఆత్మలో గొప్ప ఆవేదన జ్వాలలు చెలరేగిన క్రైస్తవులే దేవుని బడిలో ఎక్కువ నేర్చుకున్న విద్యార్థులు. క్రీస్తును ఎక్కువగా తెలుసుకోవాలని నువ్వు ప్రార్థిస్తున్నట్టయితే, ఆయన నిన్ను ఎడారిలోకో, లేక బాధల కొలిమిలోకో తీసుకువెళ్తే ఆశ్చర్యపడకు.
"దేవా, సిలువను నా నుండి తీసెయ్యడం ద్వారా నన్ను శిక్షించకు. నేను నీ చిత్తానికి లోబడేలా చేసి, నీ సిలువను ప్రేమించేలా ప్రేరేపించి నన్ను ఆదరించు. నిన్ను నిండు మనస్సుతో సేవించడానికి సాధనమేదైనాసరే, అది నాకు దయచెయ్యి. నాలో నువ్వు నీ నామాన్ని మహిమపరచుకునే ఆ గొప్ప కృపను నీ చిత్తం చొప్పున నాకు అనుగ్రహించు.”
-----------------------------------------------------------------------------------------------------------------------------
As many as I love I rebuke and chasten (Rev - 3:19)
God takes the most eminent and choicest of His servants for the choicest and most eminent afflictions. They who have received most grace from God are able to bear most afflictions from God. Affliction does not hit the saint by chance, but by direction. God does not draw His bow at a venture. Every one of His arrows goes upon a special errand and touches no breast but his against whom it is sent. It is not only the grace, but the glory of a believer when we can stand and take affliction quietly. —Joseph Caryl
If all my days were sunny, could I say,
“In His fair land He wipes all tears away”?
If I were never weary, could I keep
Close to my heart, “He gives His loved ones sleep”?
Were no graves mine, might I not come to deem
The Life Eternal but a baseless dream?
My winter, and my tears, and weariness,
Even my graves, may be His way to bless.
I call them ills; yet that can surely be
Nothing but love that shows my Lord to me!
—Selected
“The most deeply taught Christians are generally those who have been brought into the searching fires of deep soul-anguish. If you have been praying to know more of Christ, do not be surprised if He takes you aside into a desert place, or leads you into a furnace of pain.”
Do not punish me, Lord, by taking my cross from me, but comfort me by submitting me to Thy will, and by making me to love the cross. Give me that by which Thou shalt be best served … and let me hold it for the greatest of all Thy mercies, that Thou shouldst glorify Thy name in me, according to Thy will. —A Captive’s Prayer