Sunday, November 7, 2021

Heart's Sacrifice

 

ఏవేవి నాకు లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని*_ (ఫిలిప్పీ 3:7).


అంధ ప్రసంగీకుడు జార్జి మాథ్సన్ గారిని సమాధి చేసినప్పుడు ఆ సమాధి చుట్టూ ఎర్ర గులాబీలను నాటారు. ప్రేమ, త్యాగాలతో నిండిన ఆయన జీవితానికి అవి చిహ్నాలు. ఈ ధన్యుడైన భక్తుడే ఈ క్రింది గీతాన్ని రచించాడు.


*నన్ను కట్టి పడేసిన ప్రేమా,*

*నీలోనే నాకు విశ్రాంతి*

*నువ్విచ్చిన బ్రతుకు ఇదుగో నీదే*

*నీ కరుణాసంద్రంలో కలిసి*

*నా జీవనధార ధన్యమవుతుంది*


*నన్నెప్పుడూ వెంబడించే కాంతీ,*

*కొడిగట్టిన ఈ దీపాన్ని నీలో కలుపుకో*

*నా హృదయపు మసక రేఖలు*

*నీ సూర్యకాంతిలో లీనమై*

*ప్రకాశమానమై వెలగనీ*


*బాధలో తోడుండే ఆనందమా,*

*నా హృదయపు తలుపులు తెరిచాను*

*కురిసే వానలో వర్షపు ధనుస్సును వెదికాను*

*వాగ్దానాలు ఎన్నడూ భంగం కావు.*

*తెల్లవారితే ఇక కన్నీళ్ళుండవు*

*అతిశయాస్పదమైన నా ప్రభుని సిలువా*

*నిన్ను వదిలించుకునే సాహసం చెయ్యనెప్పుడూ*

*జీవం మన్నై నేను సమాధైపోతే*

*నేలలోనుంచి ఎర్రగులాబీలు పూస్తాయి*

*నాలోని జీవాత్మ నిత్యం జీవిస్తుంది.*


ఒక కథ ఉంది. ఒక చిత్రకారుడు తాను గీసే బొమ్మలో ఒక విలక్షణమైన ఎరుపు రంగును వాడుతుండేవాడట. అలాటి ఎరుపు రంగును ఎవరూ ఉపయోగించేవారు కాదట. అతడు ఆ ఎరుపురంగును ఎలా తయారుచేశాడో, ఆ రహస్యం ఎవరికీ తెలియకుండానే చనిపోయాడట. అతడు చనిపోయిన తరువాత అతని శవాన్ని పరీక్షిస్తే అతని రొమ్ముమీద ఎప్పటినుంచో మానకుండా ఉన్న గాయం కనిపించిందట. అతడు గీసే బొమ్మల్లో ఉపయోగించే ఎరుపురంగు ఎక్కడిదో అప్పుడు అర్థమైంది అందరికీ. హృదయ రుధిరాన్ని ఖర్చు పెట్టకుండా ఏ ఘనకార్యమూ సాధించలేము, ఏ యోగ్యమైన గమ్యాన్ని చేరలేము.

--------------------------------------------------------------------But what things were gain to me, those I counted loss for Christ* (Phil - 3:7)


When they buried the blind preacher, George Matheson, they lined his grave with red roses in memory of his love-life of sacrifice. And it was this man, so beautifully and significantly honored, who wrote,


“O Love that wilt not let me go,  

I rest my weary soul in Thee,  

I give Thee back the life I owe,  

That in thine ocean depths its flow  

May richer, fuller be.


“O Light that followest all my way,  

I yield my flickering torch to Thee,  

My heart restores its borrowed ray,  

That in Thy sunshine’s blaze its day  

May brighter, fairer be.


“O Joy that seekest me through pain,  

I cannot close my heart to Thee,  

I trace the rainbow through the rain,  

And feel the promise is not vain,  

That morn shalt tearless be.


“O Cross that liftest up my head,  

I dare not ask to fly from Thee,  

I lay in dust life’s glory dead,  

And from the ground there blossoms red,  

Life that shall endless be.”


There is a legend of an artist who had found the secret of a wonderful red which no other artist could imitate. The secret of his color died with him. But after his death an old wound was discovered over his heart. This revealed the source of the matchless hue in his pictures. The legend teaches that no great achievement can be made, no lofty attainment reached, nothing of much value to the world done, save at the cost of heart’s blood.-

Saturday, November 6, 2021

The Greatest Pains

 నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను (ప్రకటన 3:19).

దేవుడు తన సేవకుల్లో అతి ప్రధానులైన వాళ్ళను ఎన్నుకుని శ్రమల్లో అతి ప్రధానమైన వాటిని ఎంచి వారి మీదికి పంపిస్తాడు. దేవుని నుండి ఎక్కువ కృప పొందినవాళ్ళు, ఆయన ద్వారా వచ్చే ఎక్కువ కష్టాలను భరించగలిగి ఉంటారు. శ్రమలు విశ్వాసిని ఏ కారణమూ లేకుండా అంటవు. వాటిని కేవలం దేవుడే అతని కోసం నిర్దేశించి పంపించాడు. దేవుడు వ్యర్థంగా తన విల్లును ఎక్కుపెట్టడు. ఆయన వదిలిన ప్రతి బాణమూ ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని సాధిస్తుంది. దాని గురికి తప్ప మరెక్కడా అది నాటుకోదు. విశ్వాసులముగా మనం తొణకకుండా నిలబడి శ్రమలను అనుభవించడం ఎంతో మహిమకరం.


నా కంట నీరు లేకుంటే

దేవుడు నన్ను ఓదార్చడమెలా?


నా బ్రతుక్కి అలసటే లేకుంటే

ఆయనిచ్చే విశ్రాంతితో నాకేం పని?


సమాధులు నా కళ్ళెదుట లేకుంటే

బ్రతుకంతా ఒక భావం లేని స్వప్నమే గదా


నా కన్నీళ్ళు నా అలసట నా సమాధులు

అన్నీ ఆయన దీవెనల వాహనాలు


వాటికి కష్టాలని పేరు కాని

నా దేవుని ప్రేమ గుర్తులే కదా అవి?


ఆత్మలో గొప్ప ఆవేదన జ్వాలలు చెలరేగిన క్రైస్తవులే దేవుని బడిలో ఎక్కువ నేర్చుకున్న విద్యార్థులు. క్రీస్తును ఎక్కువగా తెలుసుకోవాలని నువ్వు ప్రార్థిస్తున్నట్టయితే, ఆయన నిన్ను ఎడారిలోకో, లేక బాధల కొలిమిలోకో తీసుకువెళ్తే ఆశ్చర్యపడకు.


"దేవా, సిలువను నా నుండి తీసెయ్యడం ద్వారా నన్ను శిక్షించకు. నేను నీ చిత్తానికి లోబడేలా చేసి, నీ సిలువను ప్రేమించేలా ప్రేరేపించి నన్ను ఆదరించు. నిన్ను నిండు మనస్సుతో సేవించడానికి సాధనమేదైనాసరే, అది నాకు దయచెయ్యి. నాలో నువ్వు నీ నామాన్ని మహిమపరచుకునే ఆ గొప్ప కృపను నీ చిత్తం చొప్పున నాకు అనుగ్రహించు.”

-----------------------------------------------------------------------------------------------------------------------------

As many as I love I rebuke and chasten (Rev - 3:19)


God takes the most eminent and choicest of His servants for the choicest and most eminent afflictions. They who have received most grace from God are able to bear most afflictions from God. Affliction does not hit the saint by chance, but by direction. God does not draw His bow at a venture. Every one of His arrows goes upon a special errand and touches no breast but his against whom it is sent. It is not only the grace, but the glory of a believer when we can stand and take affliction quietly. —Joseph Caryl


If all my days were sunny, could I say,  

“In His fair land He wipes all tears away”?  


If I were never weary, could I keep  

Close to my heart, “He gives His loved ones sleep”?  


Were no graves mine, might I not come to deem  

The Life Eternal but a baseless dream?  


My winter, and my tears, and weariness,  

Even my graves, may be His way to bless.  


I call them ills; yet that can surely be  

Nothing but love that shows my Lord to me!  

—Selected


“The most deeply taught Christians are generally those who have been brought into the searching fires of deep soul-anguish. If you have been praying to know more of Christ, do not be surprised if He takes you aside into a desert place, or leads you into a furnace of pain.”


Do not punish me, Lord, by taking my cross from me, but comfort me by submitting me to Thy will, and by making me to love the cross. Give me that by which Thou shalt be best served … and let me hold it for the greatest of all Thy mercies, that Thou shouldst glorify Thy name in me, according to Thy will. —A Captive’s Prayer

Friday, November 5, 2021

Nothing is Too Hard

 

యెహోవాకు అసాధ్యమైనది ఏదైననున్నదా? (ఆది 18:14).


ఇది నీకూ, నాకూ ఈ రోజు దేవుని ప్రేమపూర్వకమైన సవాలు. మన హృదయంలో ఉన్న ప్రియమైన అత్యున్నతమైన, అత్యంత యోగ్యమైన కోరికను దేన్నయినా తలుచుకోమంటున్నాడు. అది మన కోసం గాని, మనకు అయినవాళ్ళ కోసం గాని మనం మనసారా ఆశించింది. ఎంతో కాలంగా అది నెరవేరకపోతున్నందుకు దాన్ని గురించి నిరాశ పడిపోయి ఆ విషయం ఇంక ఆలోచించడం మానేసామేమో. గతంలో అయితే అది జరిగి ఉండదేమో. ఇక జరిగే ఆశ లేదనుకుని, ఈ జీవితంలో ఇక దాన్ని చూడలేమనుకుని వదిలేసిన కోరికేమో అది.


అదే, ఆ విషయమే, మనకు ఇస్తానని దేవుడు తన సమ్మతిని తెలియజేసి ఉన్నట్టయితే (అబ్రాహాము శారాలకు సంతానంలాగా) అది ఎంత అసంభవం అయినప్పటికీ, అది హాస్యాస్పదంగా అనిపించి మనకు నవ్వు వచ్చినప్పటికీ, ఆ విషయాన్ని దేవుడు మనపట్ల అక్షరాలా జరిగించనున్నాడు - మనం ఆయన్ను జరిగించనిస్తే.


దేవునికి అసాధ్యమైనదేదైనా ఉన్నదా? అవును, మనం ఆయనలో విశ్వాసముంచి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ అసంభవమైన దానిని మన పక్షంగా చెయ్యడానికి ఆయనతో సహకరిస్తే ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు. అబ్రాహాము, శారా కూడా అపనమ్మకంతోనే ఉన్నట్టయితే దేవుని తలంపు వారిపట్ల నెరవేరేది కాదు.


యెహోవాకు కష్టమనిపించేది ఒకటే. ఆయన ప్రేమనూ, శక్తినీ మనం అదే పనిగా శంకిస్తూ, మనపట్ల ఆయనకు ఉన్న ఉద్దేశాలను త్రోసిపుచ్చుతూ ఉండడమే. తనమీద విశ్వాసం ఉన్నవాళ్ళ విషయంలో దేవునికి అసాధ్యం ఏదీ లేదు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Is there anything too hard for Jehovah? (Gen - 18:14)


Here is God’s loving challenge to you and to me today. He wants us to think of the deepest, highest, worthiest desire and longing of our hearts, something which perhaps was our desire for ourselves or for someone dear to us, yet which has been so long unfulfilled that we have looked upon it as only a lost desire, that which might have been but now cannot be, and so have given up hope of seeing it fulfilled in this life.


That thing, if it is in line with what we know to be His expressed will (as a son to Abraham and Sarah was), God intends to do for us, even if we know that it is of such utter impossibility that we only laugh at the absurdity of anyone’s supposing it could ever now come to pass. That thing God intends to do for us, if we will let Him.


“Is anything too hard for the Lord?” Not when we believe in Him enough to go forward and do His will, and let Him do the impossible for us. Even Abraham and Sarah could have blocked God’s plan if they had continued to disbelieve.


The only thing too hard for Jehovah is deliberate, continued disbelief in His love and power, and our final rejection of His plans for us. Nothing is too hard for Jehovah to do for them that trust Him —Messages for the Morning Watch