Tuesday, November 9, 2021

Seek Communion

 అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టువలె వారు వికసింతురు (హోషేయ 14:7). 


ఆ రోజు జోరుగా వాన కురిసింది. మా తోటలోని చెట్లన్నీ వంగిపోయాయి. తోటలో నాకు ఎక్కువ ఇష్టమైన ఒక పువ్వును చూశాను. దాని అందంతో అది నన్ను ఆకట్టుకుంది. దాని పరిమళం నన్ను మత్తెక్కించేది. ఇప్పుడు అది ఆ జడివాన పాలయింది. దాని రేకులన్నీ ముడుచుకుపోయి, వాడిపోయి వేలాడుతుంది. దాని అందమంతా పోయింది. 'ఇంత అందమైన పువ్వును మళ్ళీ చూడాలంటే వచ్చే సంవత్సరం దాకా ఆగాలి' అనుకున్నాను.


ఆ రాత్రి గడిచి తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. ఉదయంతో పాటే ఆ పువ్వుకి ఏదో క్రొత్త బలం వచ్చింది. సూర్యకాంతి ఆ పువ్వు మీద పడింది. పువ్వు దాని వంకకి చూసింది. అవి రెండూ ఏమి గుసగుసలాడుకున్నాయో, సూర్య కిరణాలలోని ఏ శక్తి ఆ పువ్వుకు సోకిందో, అది తన తలను పైకెత్తి రేకుల్ని విప్పి నిటారుగా నిలిచి తన అందాన్నంతటినీ మళ్ళీ ప్రదర్శించింది. ఇదివరకటి కంటే ఇంకా అందంగా ఉన్నట్టు అనిపించింది. ఇదెలా జరిగింది! అని నాకాశ్చర్యం వేస్తూ ఉంటుంది. వడలి వేలాడిపోయిన ఈ పువ్వుకు చైతన్యవంతమైన కిరణాలు తాకే సరికి ఆ పువ్వు వాటి శక్తిని పొందింది.


నా హృదయంలోకి దేవుని శక్తిని ఎలా గ్రహించగలనో, ఆయనతో ఎలా సంబంధం పెట్టుకోగలనో తెలియదుగాని ఇది వాస్తవంగా జరిగిందని మాత్రం చెప్పగలను.


నిన్ను అణచివేసే శ్రమలో, ఆపదలో ఉన్నావా? క్రీస్తుతో ఈ సంబంధాన్ని ఏర్పరచుకో. నీకు శక్తి లభిస్తుంది. శ్రమలను జయించగలుగుతావు. “నేను నిన్ను బలపరుస్తాను” అన్నాడు దేవుడు. 


నిన్నటి వానలే నేడు గులాబి రేకపై వైఢూర్యం

తామరాకు పైన మంచి ముత్యం

నిన్నటి శోకం ఈనాటి దేవుని ప్రేమ

హృదయంపై చెక్కిన స్వర్ణ శిలాక్షరం.


నిన్నటి వర్షం కొండ చరియలను

నేడు తళతళలాడించింది

గడ్డిని మిసమిసలాడించింది.

నిన్నటి శోకం హృదయానికి పాఠం నేర్పింది

ఎన్ని గాలులు వీచినా నిత్యానందం

మనసులో గుసగుసలాడుతూనే ఉంది.


అల్పవిశ్వాసీ, నేటి వర్షం రేపు నిన్ను పరిశుద్ధుడిని చేస్తుంది

అది ముళ్ళపొదల్లో చిక్కుకున్న ముత్యాలహారం వంటిది

ఈనాడు శోకం కలవరపెట్టినా

ఉదయమయ్యేసరికి అది అందమైన ఆనందమౌతుంది.

----------------------------------------------------------------------------------------------------------------------------

They that dwell under his shadow shall return; they shall revive as the corn and grow as the vine (Hos - 14:7)


The day closed with heavy showers. The plants in my garden were beaten down before the pelting storm, and I saw one flower that I had admired for its beauty and loved for its fragrance exposed to the pitiless storm. The flower fell, shut up its petals, dropped its head; and I saw that all its glory was gone. “I must wait till next year,” I said, “before I see that beautiful thing again.”


That night passed, and morning came; the sun shone again, and the morning brought strength to the flower. The light looked at it, and the flower looked at the light. There was contact and communion, and power passed into the flower. It held up its head, opened its petals, regained its glory, and seemed fairer than before. I wonder how it took place—this feeble thing coming into contact with the strong thing, and gaining strength!


I cannot tell how it is that I should be able to receive into my being a power to do and to bear by communion with God, but I know It is a fact.


Are you in peril through some crushing, heavy trial? Seek this communion with Christ, and you will receive strength and be able to conquer. “I will strengthen thee.”


YESTERDAY’S GRIEF


The rain that fell a-yesterday is ruby on the roses,  

Silver on the poplar leaf, and gold on willow stem;  

The grief that chanced a-yesterday is silence that incloses  

Holy loves when time and change shall never trouble them.  


The rain that fell a-yesterday makes all the hillsides glisten,  

Coral on the laurel and beryl on the grass;  

The grief that chanced a-yesterday has taught the soul to listen  

For whispers of eternity in all the winds that pass.  


O faint-of-heart, storm-beaten, this rain will gleam tomorrow,  

Flame within the columbine and jewels on the thorn,  

Heaven in the forget-me-not; though sorrow now be sorrow,  

Yet sorrow shall be, beauty in the magic of the morn.

Monday, November 8, 2021

Come Close to Him

 ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థన చేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను . . . వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను.. చూచిరి (లూకా 9:28-32). నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల.. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము (నిర్గమ 33:13). 


యేసు తన ముగ్గురు శిష్యులను దూరంగా కొండ మీదికి తీసుకొనిపోయి వారిని తనతో సన్నిహిత సహవాసంలోకి తీసుకువచ్చాడు. వారు యేసు మహిమను చూశారు. అక్కడ ఉండడం వారికెంతో శ్రేష్టతరం. తమ ప్రభువుతో ఒంటరిగా కొండమీద ఉన్నవారికి పరలోకం ఇంకెంతో దూరం ఉండదు.


ఏకాంత ప్రార్థనలో, ధ్యానంలో తెరిచి ఉన్న పరలోకపు ద్వారాలను చూడలేని వారెవరుంటారు? ప్రభువుతో ఏకాంత సేవలో ఉన్నప్పుడు శ్వేత కెరటంలాగా లేచే అనుభూతుల్ని, పరలోకపు అనుభవాల వాసనల్నీ రుచి చూడని వారెవరుంటారు?


మన ప్రభువు తన శిష్యులతో ఏకాంతంగా మాట్లాడడానికి రకరకాల సమయాలనూ, స్థలాలను ఎన్నుకుంటూ ఉంటాడు. ఒకసారి హెర్మోను కొండమీద, చాలాసార్లు ఒలీవ కొండమీద ఇలా ఎన్నెన్నో స్థలాలకు తీసుకెళ్తూ ఉండేవాడు. ప్రతి క్రైస్తవుడికీ ఒలీవ కొండ అనుభవం ఉండాలి. మనలో చాలామంది పట్టణాలలో నివసించేవాళ్ళం. అస్తమానమూ అనేక ఒత్తిడులకు గురవుతూ ఉంటాము. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయేదాకా మనం ఈ సుడిగాలిలోనే తిరుగాడుతుంటాము. ఈ గందర గోళంలో ధ్యానపూర్వకమైన ఒక్క ఆలోచనకీ, ప్రార్థనకీ, మనసు విప్పి దేవునితో సంభాషించడానికి సమయమెక్కడుంది?


బబులోను విగ్రహారాధనలు, అర్చనల గోల మధ్య దానియేలుకు తన గదిలో ఒక ఒలీవల కొండ ఉంది. యొప్పేలోని ఇంటి పైకప్పు మీద పేతురుకు ఒలీవల కొండ ఉంది. మార్టిన్ లూథరు విట్టెన్బర్గులోని ఒక మేడగదిలో ఈ ఏకాంతం దొరికింది. దాన్ని ఇప్పటికీ పవిత్రస్థలంగా ఎంచుతారు.


ఒకసారి డాక్టర్ జోసఫ్ పార్కర్ గారన్నారు. "మనం తిరిగి మన దర్శనాలలోకి, పరలోకపు దృశ్యాలను తొంగిచూసే సమయాల్లోకీ, ఉన్నతమైన మహిమ లోకాలనూ, సమృద్ది జీవితాన్ని అనుభవించగలిగే తాదాత్మ్యంలోకి వెళ్ళలేకపోతే మన ఆధ్యాత్మిక జీవితానికి నీళ్ళొదులుకోవలసిందే. మన బలిపీఠం ఒక రాయిలాగా మిగిలిపోతుంది. దాన్ని పరలోకపు అగ్ని దర్శించడం మానుకుంటుంది.” ప్రపంచానికి నేడు కావలసిందేమిటంటే దేవుణ్ణి చూసిన మనుషులు.


దేవునికి సన్నిహితంగా రండి. తమ బోధకుడినీ, ఆయన ఉద్దేశాలనూ అర్థం చేసుకోవడానికి మాటిమాటికీ విఫలులైన యోహాను, యాకోబులనూ, తప్పటడుగులు వేసే పేతురునూ యేసు ఏకాంతంలోకి తీసుకువెళ్ళాడు. మిమ్మల్మి ఈరోజు ఆయన ఏకాంతంగా కొండమీదికి తీసుకెళ్తాడేమో. ఎందుకు తీసుకెళ్ళకూడదు? మిమ్మల్ని మీరే తగ్గించేసుకుని “ఆ… , అలాంటి ఆశ్చర్యకరమైన దర్శనాలు, దేవుని వాక్కులు వచ్చేది ఎవరో కొద్దిమంది భక్తవరేణ్యులకే” అనకండి. మీకోసం కాదని ఎక్కడా రాసి లేదు.

----------------------------------------------------------------------------------------------------------------------------

He took Peter and John and James, and went up into a mountain to pray, and as he prayed, the fashion of his countenance was altered, and his raiment was white and glistering ... they saw his glory (Luke - 9:29,32)


If I have found grace in thy sight, show me thy glory  Exod-  33:13


When Jesus took these three disciples up into that high mountain apart, He brought them into close communion with Himself. They saw no man but Jesus only; and it was good to be there. Heaven is not far from those who tarry on the mount with their Lord.


Who has not in moments of meditation and prayer caught a glimpse of opening gates? Who has not in the secret place of holy communion felt the rush of some white surging wave of emotion—a foretaste of the joy of the blessed?


The Master had times and places for quiet converse with His disciples, once on the peak of Hermon, but oftener on the sacred slopes of Olivet. Every Christian should have his Olivet. Most of us, especially in the cities and towns, live at high pressure. From early morning until bedtime we are exposed to the whirl. Amid all this maelstrom how little chance for quiet thought, for God’s Word, for prayer and heart fellowship!


Daniel needed to have an Olivet in his chamber amid Babylon’s roar and idolatries. Peter found his on a housetop in Joppa; and Martin Luther found his in the “upper room” at Wittenberg, which is still held sacred.


Dr. Joseph Parker once said: “If we do not get back to visions, peeps into heaven, consciousness of the higher glory and the larger life, we shall lose our religion; our altar will become a bare stone, unblessed by visitant from Heaven.” Here is the world’s need today—men who have seen their Lord. —The Lost Art of Meditation


Come close to Him! He may take you today up into the mountain top, for where He took Peter with his blundering, and James and John, those sons of thunder who again and again so utterly misunderstood their Master and His mission, there is no reason why He should not take you. So don’t shut yourself out of it and say, “Ah, these wonderful visions and revelations of the Lord are for choice spirits!” They may be for you! —John McNeill

Sunday, November 7, 2021

Heart's Sacrifice

 

ఏవేవి నాకు లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని*_ (ఫిలిప్పీ 3:7).


అంధ ప్రసంగీకుడు జార్జి మాథ్సన్ గారిని సమాధి చేసినప్పుడు ఆ సమాధి చుట్టూ ఎర్ర గులాబీలను నాటారు. ప్రేమ, త్యాగాలతో నిండిన ఆయన జీవితానికి అవి చిహ్నాలు. ఈ ధన్యుడైన భక్తుడే ఈ క్రింది గీతాన్ని రచించాడు.


*నన్ను కట్టి పడేసిన ప్రేమా,*

*నీలోనే నాకు విశ్రాంతి*

*నువ్విచ్చిన బ్రతుకు ఇదుగో నీదే*

*నీ కరుణాసంద్రంలో కలిసి*

*నా జీవనధార ధన్యమవుతుంది*


*నన్నెప్పుడూ వెంబడించే కాంతీ,*

*కొడిగట్టిన ఈ దీపాన్ని నీలో కలుపుకో*

*నా హృదయపు మసక రేఖలు*

*నీ సూర్యకాంతిలో లీనమై*

*ప్రకాశమానమై వెలగనీ*


*బాధలో తోడుండే ఆనందమా,*

*నా హృదయపు తలుపులు తెరిచాను*

*కురిసే వానలో వర్షపు ధనుస్సును వెదికాను*

*వాగ్దానాలు ఎన్నడూ భంగం కావు.*

*తెల్లవారితే ఇక కన్నీళ్ళుండవు*

*అతిశయాస్పదమైన నా ప్రభుని సిలువా*

*నిన్ను వదిలించుకునే సాహసం చెయ్యనెప్పుడూ*

*జీవం మన్నై నేను సమాధైపోతే*

*నేలలోనుంచి ఎర్రగులాబీలు పూస్తాయి*

*నాలోని జీవాత్మ నిత్యం జీవిస్తుంది.*


ఒక కథ ఉంది. ఒక చిత్రకారుడు తాను గీసే బొమ్మలో ఒక విలక్షణమైన ఎరుపు రంగును వాడుతుండేవాడట. అలాటి ఎరుపు రంగును ఎవరూ ఉపయోగించేవారు కాదట. అతడు ఆ ఎరుపురంగును ఎలా తయారుచేశాడో, ఆ రహస్యం ఎవరికీ తెలియకుండానే చనిపోయాడట. అతడు చనిపోయిన తరువాత అతని శవాన్ని పరీక్షిస్తే అతని రొమ్ముమీద ఎప్పటినుంచో మానకుండా ఉన్న గాయం కనిపించిందట. అతడు గీసే బొమ్మల్లో ఉపయోగించే ఎరుపురంగు ఎక్కడిదో అప్పుడు అర్థమైంది అందరికీ. హృదయ రుధిరాన్ని ఖర్చు పెట్టకుండా ఏ ఘనకార్యమూ సాధించలేము, ఏ యోగ్యమైన గమ్యాన్ని చేరలేము.

--------------------------------------------------------------------But what things were gain to me, those I counted loss for Christ* (Phil - 3:7)


When they buried the blind preacher, George Matheson, they lined his grave with red roses in memory of his love-life of sacrifice. And it was this man, so beautifully and significantly honored, who wrote,


“O Love that wilt not let me go,  

I rest my weary soul in Thee,  

I give Thee back the life I owe,  

That in thine ocean depths its flow  

May richer, fuller be.


“O Light that followest all my way,  

I yield my flickering torch to Thee,  

My heart restores its borrowed ray,  

That in Thy sunshine’s blaze its day  

May brighter, fairer be.


“O Joy that seekest me through pain,  

I cannot close my heart to Thee,  

I trace the rainbow through the rain,  

And feel the promise is not vain,  

That morn shalt tearless be.


“O Cross that liftest up my head,  

I dare not ask to fly from Thee,  

I lay in dust life’s glory dead,  

And from the ground there blossoms red,  

Life that shall endless be.”


There is a legend of an artist who had found the secret of a wonderful red which no other artist could imitate. The secret of his color died with him. But after his death an old wound was discovered over his heart. This revealed the source of the matchless hue in his pictures. The legend teaches that no great achievement can be made, no lofty attainment reached, nothing of much value to the world done, save at the cost of heart’s blood.-