నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను (రోమా 4:18).
అబ్రాహాము నిరీక్షణ దేవుని శక్తికి, ఆయన విశ్వాస్యతకు సరిగ్గా అతికినట్టు సరిపోయింది. అప్పుడు ఉన్న అతని పరిస్థితుల్ని బట్టి చూస్తే వాగ్దానం నెరవేరుతుందని ఎదురు చూడడం బొత్తిగా అర్థంలేని పని అనిపిస్తుంది. అయినా అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తన సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరిల్లే సమయం కోసం ఎదురు చూశాడు.
అయితే ఓ నా హృదయమా, అబ్రాహాము లాగ నీకు దేవుడు ఒక్క వాగ్దానమిచ్చి ఊరుకోలేదు. వేలకొలది వాగ్దానాలు నీకు ఉన్నాయి. ఇంతకుముందు వాటిని నమ్మి లాభం పొందిన ఎంతోమంది విశ్వాసులున్నారు కూడా. అందువల్ల దేవుని మాట మీద నమ్మకముంచి ఆయన మీద ఆధారపడడమే నీకు తగినది. ఒకవేళ ఆయన నీకు జవాబియ్యడం ఆలస్యం చేసినప్పటికీ, నీకు జరుగుతున్న కీడు నానాటికి పెరిగినప్పటికీ బలహీనుడివై పోకుండా ఇంకా బలం, ధైర్యం తెచ్చుకుంటూ సంతోషిస్తూ ఉండు. ఎందుకంటే దేవుని వాగ్దానాల్లో అతి శ్రేష్టమైనవి ఎలా నెరవేరుతుంటాయంటే, దాని నెరవేర్పుకు అనువైన పరిస్థితులు లేశమాత్రమైనా లేని పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమై వాటిని జరిగిస్తాడు.
మనం ప్రమాదంలో చిక్కుకుని ఆఖరు దశలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇలా చేస్తేనే ఆయన జోక్యం కలుగజేసుకున్నాడన్న సత్యం బయటకు కనిపిస్తుంది. పైగా అలవాటు చొప్పున కంటికి కనిపించే వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా కేవలం ఆయన ఇచ్చిన మాట మీదే సర్వకాల, సర్వావస్థల్లో మనం ఆధారపడాలని కూడా ఆయన ఇలా చేస్తాడు.
దారీ తెన్నూ తోచనప్పుడే విశ్వాసం రంగంలోకి దిగవలసి ఉంటుంది. కష్టాలు ఎంత భరించరానివైతే విశ్వాసం ఉంచడం అంత తేలికౌతూ ఉంటుంది. మనకై మనం తప్పించుకునే మార్గం కనబడుతున్నంతవరకూ విశ్వాసం స్థిరపడలేదు.
-----------------------------------------------------------------------------------------------------------------------------
Under hopeless circumstances he hopefully believed (Rom - 4:18)
Abraham’s faith seemed to be in a thorough correspondence with the power and constant faithfulness of Jehovah. In the outward circumstances in which he was placed, he had not the greatest cause to expect the fulfillment of the promise. Yet he believed the Word of the Lord, and looked forward to the time when his seed should be as the stars of heaven for multitude.
O my soul, thou hast not one single promise only, like Abraham, but a thousand promises, and many patterns of faithful believers before thee: it behooves thee, therefore, to rely with confidence upon the Word of God. And though He delayeth His help, and the evil seemeth to grow worse and worse, be not weak, but rather strong, and rejoice, since the most glorious promises of God are generally fulfilled in such a wondrous manner that He steps forth to save us at a time when there is the least appearance of it.
He commonly brings His help in our greatest extremity, that His finger may plainly appear in our deliverance. And this method He chooses that we may not trust upon anything that we see or feel, as we are always apt to do, but only upon His bare Word, which we may depend upon in every state. —C. H. Von Bogatzky
Remember it is the very time for faith to work when sight ceases. The greater the difficulties, the easier for faith; as long as there remain certain natural prospects, faith does not get on even as easily as where natural prospects fail. —George Mueller