Sunday, November 14, 2021

Only Through Death

 

గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును (యోహాను 12:24).


నార్త్ ఆంప్టన్ లో ఉన్న సమాధుల్లోకి వెళ్ళి డేవిడ్ బ్రెయినార్డ్ సమాధినీ, అతడు ప్రేమించినప్పటికీ పెళ్ళి చేసుకోలేకపోయిన అందాల రాశి జెరూషా ఎడ్వర్డ్సు సమాధినీ చూడండి.


ఆ యువ మిషనరీతో పాటే ఎన్ని ఆశలు, క్రీస్తు కోసం ఎన్ని ఆశయాలు ఆ సమాధిలోకి వెళ్ళిపోయాయో. అతని మిషనరీ సేవ గురించిన జ్ఞాపకాలన్నీ తెరమరుగయ్యాయి. అయితే తన కుమార్తె జెరూషాను అతనికిద్దామనుకున్న దైవజనుడు జోనాథాన్ ఎడ్వర్డు గారు అతని జీవిత విశేషాలను సంగ్రహించి చిన్న పుస్తకం రాశారు.ఆ పుస్తకం అట్లాంటిక్ సముద్రం దాటి కేంబ్రిడ్జిలో విద్యనభ్యసిస్తున్న హెన్రీ మార్టిన్ కంటబడింది.


పాపం మార్టిన్! అతనికి వస్తున్న ఉపకారవేతనాన్ని, అతని తెలివితేటల్నీ, విజ్ఞాన సముపార్జననీ ఎందుకు వదిలేశాడు? ఇండియాకు మిషనరీగా వెళ్ళి ఆరోగ్యం పాడైనప్పటికీ లెక్కచేయ్యకుండా ఉత్తరదిశగా ఎందుకు ప్రయాణించాడు? టర్కీ ఎడారి ప్రాంతాలగుండా నల్ల సముద్రం దాకా వెళ్ళి, మాడిపోతున్న జ్వరం నుండి కాస్తంత చల్లదనం కోసం ఆ ఎడారి ఇసుకల్లో గుర్రం కళ్ళేల క్రింద తలదాచుకుని ఒంటరి చావు చావవలసిన అగత్యం ఏముంది?


ఎందుకిలా మనుషులు వ్యర్థంగా నశించడం? యవ్వన ప్రాయంలో చనిపోయిన బ్రెయినార్డు సమాధి నుండి, నల్ల సముద్రం ఇసుకలో ఉన్న మార్టిన్ ఒంటరి సమాధి దాకా వేలమంది ఆధునిక మిషనరీలు ఎంతెంతమందో! అందుకని.


ఎడారి ఉందా ఎల్లలులేని సముద్రముందా

ప్రభూ నన్నెక్కడికి పంపుతావు?

నరకవలసిన దేవదారు మ్రాను ఉందా

పగలగొట్టాల్సిన బండ ఉందా?


లేక పొలంలో చల్లేందుకు

పిడికెడు గింజలున్నాయా?

అవి ఫలించి పంట పండితే

పంచి పెట్టడానికి నీ ప్రజలున్నారా?


తండ్రీ! ఎడారినైనా సాగరాన్నైనా

చూపించు, నన్ను పంపించు నీ ఇష్టమైతే

నా తనువు రాలిన తరువాత

తండ్రీ! నన్ను విశ్వాసుల్లో లెక్కించు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Except a grain of wheat fall into the ground and die, it remains a single grain, but if it dies away in the ground, the grain is freed to spring up in a plant bearing many grains (John - 12:24)

Go to the old burying ground of Northampton, Mass., and look upon the early grave of David Brainerd, beside that of the fair Jerusha Edwards, whom he loved but did not live to wed.

What hopes, what expectations for Christ’s cause went down to the grave with the wasted form of that young missionary of whose work nothing now remained but the dear memory, and a few score of swarthy Indian converts! But that majestic old Puritan saint, Jonathan Edwards, who had hoped to call him his son, gathered up the memorials of his life in a little book, and the little book took wings and flew beyond the sea, and alighted on the table of a Cambridge student, Henry Martyn.

Poor Martyn! Why should he throw himself away, with all his scholarship, his genius, his opportunities! What had he accomplished when he turned homeward from “India’s coral strand,” broken in health, and dragged himself northward as far as that dreary khan at Tocat by the Black Sea, where he crouched under the piled-up saddles, to cool his burning fever against the earth, and there died alone?

To what purpose was this waste? Out of that early grave of Brainerd, and the lonely grave of Martyn far away by the splashing of the Euxine Sea, has sprung the noble army of modern missionaries. —Leonard Woolsey Bacon


“Is there some desert, or some boundless sea,  

Where Thou, great God of angels, wilt send me?  

Some oak for me to rend, Some sod for me to break,  

Some handful of Thy corn to take  

And scatter far afield,  

Till it in turn shall yield  

Its hundredfold  

Of grains of gold  

To feed the happy children of my God?


“Show me the desert, Father, or the sea;  

Is it Thine enterprise? Great God, send me!  

And though this body lies where ocean rolls,  

Father, count me among all faithful souls.”

Saturday, November 13, 2021

He Knows Us

 

తన పిల్లలును, తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించునట్లు నేనతని నెరిగియున్నాననెను (ఆది 18:19). 


బాధ్యత గల వ్యక్తులు దేవునికి కావాలి. అబ్రాహాము గురించి ఏమంటున్నాడో చూడండి. 'తన పిల్లలకు అతడు ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు.' ఇది యెహోవా దేవుడు “అబ్రాహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు చేసింది.” దేవుడు నమ్మదగినవాడు. మనం కూడా అంత నమ్మకస్థులుగా, స్థిరులుగా కావాలని కోరుతున్నాడు. విశ్వాసమంటే సరిగ్గా ఇదే.


తన ప్రేమ భారం, తన శక్తి, తన నమ్మదగిన వాగ్దానాల భారం మోసే నిమిత్తం తగిన మనుషుల కోసం దేవుడు వెదుకుతున్నాడు. మనం తగిలించే ఎంత బరువునైనా తన వైపుకు ఆకర్షించుకోగలిగే యంత్రాలు ఆయన వద్ద ఉన్నాయి. కాని దురదృష్టవశాత్తూ మన ప్రార్థనలను దేవుని యంత్రాలకు కలిపే ఇనుప తీగె బలహీనంగా ఉంది. అందుకే దేవుడు మనకు స్థిరత్వాన్ని, దారుఢ్యాన్ని చేకూర్చడానికి విశ్వాస జీవితంలో శిక్షణనిస్తున్నాడు. మన పాఠాలను సరిగ్గా నేర్చుకొని స్థిరులై ఉందాము.


శ్రమను నువ్వు తట్టుకోగలవని దేవునికి తెలుసు. అలా కాదనుకుంటే ఆయన ఆ శ్రమను నీ మీదికి పంపించేవాడు కాదు. శ్రమలు ఎంత తీవ్రమైనవైనా ఆయన మీద నీకున్న నిరీక్షణే వాటికి జవాబు. దేవుడు మన శక్తిని ఆఖరు అంగుళం వరకు కొలిచిన తరువాతే దానికి పరీక్ష పెడతాడు. ఆయనలో మనకున్న శక్తిని మించిన పరీక్ష ఎప్పుడూ మనకు రాదు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

I know him, that he will command his children (Gen - 18:19)

God wants people that He can depend upon. He could say of Abraham, “I know him, that he will command his children … that the Lord may bring upon Abraham that which he hath spoken.” God can be depended upon; He wants us to be just as decided, as reliable, as stable. This is just what faith means.

God is looking for men on whom He can put the weight of all His love and power and faithful promises. God’s engines are strong enough to draw any weight we attach to them. Unfortunately the cable which we fasten to the engine is often too weak to hold the weight of our prayer; therefore God is drilling us, disciplining us to stability and certainty in the life of faith. Let us learn our lessons and stand fast. —A. B. Simpson

God knows that you can stand that trial; He would not give it to you if you could not. It is His trust in you that explains the trials of life, however bitter they may be. God knows our strength, and He measures it to the last inch; and a trial was never given to any man that was greater than that man’s strength, through God, to bear it.

Friday, November 12, 2021

Unadorned Life

 

వారు కుమ్మరివాండ్లయి నెతాయీమునందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి (1 దిన 4:23).


మన రాజు కోసం పని చెయ్యడం కోసం ఎక్కడైనా మనం కాపురముండడానికి జంక కూడదు. ఇందు కోసం మనం అననుకూలమైన స్థలాలకు వెళ్ళవలసి రావచ్చు. పల్లెటూళ్ళలో, రాజు సన్నిధి ఎక్కువగా కనిపించని ప్రదేశాల్లో, ఆటంకాలున్న ప్రాంతాల్లో పనిచెయ్యవలసి రావచ్చు. దానికి తోడు మన చేతి నిండా మనం చెయ్యవలసిన కుండలూ, పని భారంతో ఉండవచ్చు.


ఫర్వాలేదు. మనలను అక్కడ ఉంచిన మన రాజు తానే వచ్చి మనతో ఉంటాడు. అక్కడున్న అడ్డు గోడలన్నీ మన మేలు కోసమే. లేకపోతే వాటినెప్పుడో తొలగించేవాడుగా. అలాగే మన దారికి అడ్డుగా ఉన్నవి ఒకవేళ ఆ దారికి భద్రత కలిగించడానికే అక్కడ ఉన్నాయేమో. కుమ్మరి పని మాటేమిటి? మనకు దేవుడు అప్పగించాలనుకున్న పని అదే అయితే ఇక వాదాలెందుకు. కాబట్టి ప్రస్తుతానికి మన పని ఇదే.


ప్రియా, తోటలోకి తిరిగి వెళ్ళు

సాయంత్రమయ్యేదాకా శ్రమించు

పాదులు త్రవ్వి పందిళ్ళు కట్టు

యజమాని పిలిచేదాకా పని చేపట్టు


నీ చేతనైనంత సింగారించు నీ తోటను

నీ శ్రమ వ్యర్థం కాదు

నీ ప్రక్కన ఉన్న మరో పనివాడు

నిన్ను చూసైనా ఒళ్ళు వంచుతాడేమో


రంగు రంగుల సూర్యాస్తమయాలు, చుక్కలు పొదిగిన ఆకాశం, అందమైన పర్వతాలు, మెరిసే సముద్రం, పరిమళం నిండిన అరణ్యాలు, కోటి కాంతుల పుష్పాలు... ఇవేవీ క్రీస్తు కోసం ప్రేమతో పాటుపడుతున్న హృదయానికి సాటి రావు.


రచయితలు గానో, ఇతరులు శ్లాఘించేలా ఘనకార్యాలు చేసినవాళ్ళు గానో ఎన్నడూ ప్రఖ్యాతి చెందని వాళ్ళలో నిజమైన పరిశుద్ధులు ఎందరో ఉన్నారు. వాళ్ళంతా తమ అంతరంగాలలో పవిత్ర జీవనం నెరిపారు. ఎక్కడో మనుష్య సంచారంలేని లోయల్లో, కొండవాగుల ఒడ్డున విరబూసిన పుష్పగుచ్ఛంలాగా తన పరిమళాలు వెదజల్లి వెళ్ళి పోయారు.

----------------------------------------------------------------------------------------------------------------------------

These were the potters, and those that dwelt among plants and hedges: there they dwelt with the king for his work (1 Chr - 4:23)

Anywhere and everywhere we may dwell “with the king for his work.” We may be in a very unlikely and unfavorable place for this; it may be in a literal country life, with little enough to be seen of the “goings” of the King around us; it may be among the hedges of all sorts, hindrances in all directions; it may be furthermore, with our hands full of all manner of pottery for our daily task.

No matter! The King who placed us “there” will come and dwell there with us; the hedges are right, or He would soon do away with them. And it does not follow that what seems to hinder our way may not be for its very protection; and as for the pottery, why, that is just exactly what He has seen fit to put into our hands, and therefore it is, for the present, “His work.”—Frances Ridley Havergal


“Go back to thy garden-plot, sweetheart!  

Go back till the evening falls,  

And bind thy lilies and train thy vines,  

Till for thee the Master calls.  


“Go make thy garden fair as thou canst,  

Thou workest never alone;  

Perhaps he whose plot is next to thine  

Will see it and mend his own.”  


The colored sunsets and starry heavens, the beautiful mountains and the shining seas, the fragrant woods and painted flowers, are not half so beautiful as a soul that is serving Jesus out of love, in the wear and tear of common, unpoetic life. —Faber

The most saintly spirits are often existing in those who have never distinguished themselves as authors, or left any memorial of themselves to be the theme of the world’s talk; but who have led an interior angelic life, having borne their sweet blossoms unseen like the young lily in a sequestered vale on the bank of a limpid stream. —Kenelm Digby