Tuesday, November 23, 2021

Rock Flowers

 

నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి (కీర్తనలు 60:3).


“కొన్ని విషయాలు కఠినంగా ఉన్నాయి” అని కీర్తనకారుడు దేవునితో అన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇందులో పొరపాటేమీ లేదు. జీవితంలో కఠినమైన విషయాలెన్నో ఉన్నాయి. ఈ మధ్య నాకు ఎవరో అందమైన ఎర్రటి పూలగుత్తి ఇచ్చారు. “ఎక్కడివి?” అని అడిగాను. “ఇవి రాళ్ళలో పూసిన పూలు. నేల ఏమీ లేని రాళ్ళపైనే ఇవి వికసిస్తాయి” అని చెప్పారు. కఠినమైన పరిస్థితుల్లో దేవుని పుష్పాల గురించి ఆలోచించాను. ఇలాటి రాతి పూల విషయంలో ఆయన హృదయంలో గులాబీలపై లేని ఓ ప్రత్యేకమైన వాత్సల్యం ఉందేమోనని నేను అనుకుంటాను.


జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనలను కట్టడానికే గాని పడగొట్టడానికి కాదు. కష్టాలు ఒక మనిషి వ్యాపారాన్ని పాడుచేయవచ్చు గాని అతని వ్యక్తిత్వాన్ని బాగుచేస్తాయి. బాహ్య పురుషుడి పాలిట కత్తి దెబ్బ అంతరంగ పురుషుడికి ఆశీర్వాద కారణం కావచ్చు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఏదన్నా శ్రమలకు అవకాశమిస్తే మనకు వాస్తవంగా జరిగే నష్టం ఏమిటంటే పెనుగులాడడం ద్వారా, తిరుగుబాటు చేయడం ద్వారా మనం పోగొట్టుకొనేదే.


కొలిమిలో దగ్ధమై

సమ్మెట దెబ్బలు తిన్నవారే యోధులౌతారు

అగ్ని పరీక్ష ద్వారానే వస్తుంది శౌర్యం

రక్తం తడిసిన నేలలోనే

పుష్పిస్తుంది పరమాత్మకి ఇష్టమైన పుష్పం 


శ్రమల కొండ ప్రాంతాలలో దేవుని సైన్యంలో చేరేందుకు పరాక్రమవంతులు దొరుకుతారు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Thou hast shewed thy people hard things (Ps - 60:3)

I have always been glad that the Psalmist said to God that some things were hard. There is no mistake about it; there are hard things in life. Some beautiful pink flowers were given me this summer, and as I took them I said, “What are they?” And the answer came, “They are rock flowers; they grow and bloom only on rocks where you can see no soil.” Then I thought of God’s flowers growing in hard places; and I feel, somehow, that He may have a peculiar tenderness for His “rock flowers” that He may not have for His lilies and roses. —Margaret Bottome

The tests of life are to make, not break us. Trouble may demolish a man’s business but build up his character. The blow at the outward man may be the greatest blessing to the inner man. If God, then, puts or permits anything hard in our lives, be sure that the real peril, the real trouble, is what we shall lose if we flinch or rebel. —Maltbie D. Babcock


“Heroes are forged on anvils hot with pain,  

And splendid courage comes but with the test.  

Some natures ripen and some natures bloom  

Only on blood-wet soil, some souls prove great  

Only in moments dark with death or doom.”


“God gets his best soldiers out of the highlands of affliction.”

Monday, November 22, 2021

Dealing With the Past

 నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? (మత్తయి 9:28).


అసాధ్యాలను సాధ్యం చెయ్యడం దేవునికి అలవాటు. ఎవరి జీవితాల్లోనయితే అసాధ్యం అనుకున్నవి, దేవుని మహిమార్థం తప్పకుండా సాధ్యం కావాల్సి ఉన్నాయో వాళ్ళు సంపూర్ణ విశ్వాసంతో వాటిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏ పనీ ఆయన చెయ్యి దాటిపోయి సమయం మించిపోయిన పనికాదు. మన జీవితాల్లో తిరుగుబాటు, అపనమ్మకం, పాపం, ఆపద, ఇవన్నీ పొంచి ఉంటాయి. ఈ విచారకరమైన నిజాలను పూర్తి విధేయతతో నమ్మకంతో ఆయన ఎదుటికి తీసుకువస్తే 'ఇది చెయ్యి దాటి పోయిందని' ఆయనెప్పుడూ అనడు. క్రీస్తు మార్గం గురించి ఒక మాట ఉంది. ఇది నిజం కూడా. “క్రైస్తవ మార్గం ఒక్కటే ఒక మనిషి ఎప్పుడో చేసిన దానిని కూడా సరిదిద్దగల మార్గం.” దేవుడు “చీడ పురుగులు.. తినివేసిన సంవత్సరముల పంటను” మనకి మరల ఇవ్వగలడు. మనం మన పరిస్థితినంతటినీ, మనలనూ ఏమీ దాచుకోకుండా నమ్మికతో ఆయన చేతుల్లో పెడితేనే ఇది సాధ్యం. ఇదంతా మనం ఏమై ఉన్నామో దానివల్ల కాదుగాని తానేమై ఉన్నాడో దాని మూలంగా జరుగుతుంది. దేవుడు క్షమిస్తాడు, బాగుచేస్తాడు. తిరిగి మునుపటి స్థితిని దయచేస్తాడు. ఆయన కృపకు మూలమైన దేవుడు. ఆయన మీద నమ్మకముంచి స్తుతించుదాము.


కాదేదీ అసాధ్యం క్రీస్తుకి

లేరెవరూ ఆయనతో సాటి


అసాధ్యాలను చూసి సరదా పడే దేవుడు నాకున్నాడు. నాకేదీ అసాధ్యం కాదు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Believe ye that I am able to do this? (Matt -  9:28)

God deals with impossibilities. It is never too late for Him to do so, when the impossible is brought to Him, in full faith, by the one in whose life and circumstances the impossible must be accomplished if God is to be glorified. If in our own life there have been rebellion, unbelief, sin, and disaster, it is never too late for God to deal triumphantly with these tragic facts if brought to Him in full surrender and trust. It has often been said, and with truth, that Christianity is the only religion that can deal with man’s past. God can “restore the years that the locust hath eaten” (Joel 2:25); and He will do this when we put the whole situation and ourselves unreservedly and believingly into His hands. Not because of what we are but because of what He is. God forgives and heals and restores. He is “the God of all grace.” Let us praise Him and trust Him. —Sunday School Times


“Nothing is too hard for Jesus  

No man can work like Him.”  


“We have a God who delights in impossibilities.” Nothing too hard for Me. —Andrew Murray

Sunday, November 21, 2021

Leave It To God

 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము (కీర్తనలు 37:5). 


నిన్ను ఇబ్బంది పెడుతున్నదేదైనా వెళ్ళి తండ్రికి చెప్పు. దాన్నంతటినీ తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు. అప్పుడే ప్రపంచమంతా పరుచుకుని ఉండి నిన్ను కంగారు పెట్టే తత్తరపాటులనుండి విముక్తుడివివౌతావు. నువ్వు ఏదైనా చెయ్యవలసివస్తే, బాధను భరించవలసి వస్తే, ఏదైనా కార్యాన్ని తలపెడితే, వెళ్ళి దాని గురించి ప్రభువుతో చెప్పు. దాన్నంతటినీ ఆయనకి అప్పగించు. ఇక నీకు దిగుళ్ళేమీ ఉండవు. ఆందోళన ఉండదు. తాపీగా ప్రశాంతంగా నీ పనిలో నమ్మకంగా ఉండు. నీ కార్యభారాన్ని ఆయన మీద పడెయ్యి. నీ దిగుళ్ళన్నిటినీ, నిన్ను కూడా చాపలాగా చుట్టి నీ దేవుని వీపు మీద వెయ్యి.


"ఈ రోజు” చుట్టూ

నమ్మకమనే కంచె కట్టు

ప్రేమతో దాన్ని పూర్తిచేసి

హాయిగా దాన్లో కాపురం పెట్టు

రేపు వైపు చూడకు కన్నెత్తి

రేపే ఇస్తాడు దేవుడు

రేపును జయించే కత్తి


దేవుడు మనం నడిచే దారిని సమ్మతిస్తే దాన్ని ఆయన వశం చెయ్యడం వీలౌతుంది. తన మార్గాన్ని ప్రభువుకి అప్పగించడం విశ్వాసమున్న వాడికే సాధ్యం. మన దారి మంచి దారి కాదని ఏ మాత్రం అనుమానం ఉన్నా, విశ్వాసం ఆ ఛాయలకే రాదు. ఆయన చేతుల్లో పెట్టడమన్నది ఒక్కసారి జరిగి చేతులు దులిపేసుకునేది కాదు. ఇది ఎప్పుడూ సాగే ప్రక్రియ. ఆయన నడిపింపు ఎంత వింతగా, ఊహించలేనిదిగా కనిపించినప్పటికీ కొండ అంచుకి ఎంత దగ్గరగా ఆయన నిన్ను తీసికెళ్ళినప్పటికీ, ఆయన చేతుల్లోంచి కళ్ళాన్ని లాగేసుకోకూడదు. మన మార్గాన్ని ఆయన ఎదుట పెట్టబోయేముందు దాన్ని గురించి ఆయన ఇచ్చే తీర్పుని స్వీకరించడానికి సిద్ధపడి ఉన్నామా? అన్నిటికంటే ముఖ్యంగా ఒక క్రైస్తవుడు తన అలవాటుల్నీ, పాతుకుపోయిన తన అభిప్రాయాలను నిశితంగా పరిశీలించుకునే పరిస్థితిలో ఉండాలి.  కొందరు క్రైస్తవులు ఎందుకంత భయం భయంగా ఉంటారు? జవాబు స్పష్టం. వాళ్ళు తమ మార్గాన్ని యెహోవాకు అప్పగించ లేదు. దాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళారుగాని తిరిగి తమతో తెచ్చేసుకున్నారు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Roll on Jehovah thy way (Ps - 37:5)


Whatever it is that presses thee, go tell the Father; put the whole matter over into His hand, and so shalt thou be freed from that dividing, perplexing care that the world is full of. When thou art either to do or suffer anything, when thou art about any purpose or business, go tell God of it, and acquaint Him with it; yes, burden Him with it, and thou hast done for matter of caring; no more care, but quiet, sweet, diligence in thy duty, and dependence on Him for the carriage of thy matters. Roll thy cares, and thyself with them, as one burden, all on thy God. —R. Leighton


Build a little fence of trust  

Around today;  

Fill the space with loving work  

And therein stay.  

Look not through the sheltering bars  

Upon tomorrow;  

God will help thee bear what comes  

Of joy or sorrow. —Mary Butts  


We shall find it impossible to commit our way unto the Lord, unless it be a way that He approves. It is only by faith that a man can commit his way unto the Lord; if there be the slightest doubt in the heart that “our way” is not a good one, faith will refuse to have anything to do with it. This committing of our way must be a continuous, not a single act. However extraordinary and unexpected may seem to be His guidance, however near the precipice He may take you, you are not to snatch the guiding reins out of His hands. Are we willing to have all our ways submitted to God, for Him to pronounce judgment on them? There is nothing a Christian needs to be more scrutinizing about than about his confirmed habits and views. He is too apt to take for granted the Divine approbation of them. Why are some Christians so anxious, so fearful? Evidently because they have not left their way with the Lord. They took it to Him, but brought it away with them again.