Saturday, December 4, 2021

Set Apart

 

ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను (మత్తయి 14:23). 


ఇశ్రాయేలీయుల సబ్బాతులోని విశేషమేమంటే దాని ప్రశాంతత, విశ్రాంతి, దాని పరిశుద్ధమైన శాంతి. ఏకాంతములో అర్థంకాని బలమేదో ఉంది. కాకులు గుంపులు గుంపులుగా ఎగురుతాయి. నక్కలు గుంపులు గుంపులుగా ఉంటాయి. కాని పక్షిరాజు, సింహం మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉంటాయి.


హడావుడిలో, శబ్దంలో శక్తి లేదు. నిమ్మళంగా ఉండడంలోనే బలముంది. సరోవరం నిర్మలంగా ఉంటేనే ఆకాశ నక్షత్రాలు దాన్లో ప్రతిబింబిస్తాయి. మన ప్రభువు ప్రజలను ప్రేమించాడు. కాని ఎన్నోసార్లు ఆయన వాళ్ళకి దూరంగా ఏకాంతంగా వెళ్ళాడు. సాయంత్రమయ్యే సరికి జనసమూహాలనుండి దూరంగా వెళ్ళిపోయేవాడు. ఆయన సేవంతా సముద్ర తీరప్రాంతాల్లోని పట్టణాల్లో జరిగింది. కాని కొండ ప్రాంతాలను ఆయన ఎక్కువ ఇష్టపడ్డాడు. చాలాసార్లు రాత్రి వేళల్లో ఆయన ఆ కొండల ప్రశాంతతలోకి వెళ్ళాడు.


ఈ రోజుల్లో ముఖ్యంగా మనకి కావలసిందేమిటంటే మన ప్రభువుతో ఏకాంతంగా వెళ్ళడం. ఆయన పాదాల చెంత, ఆయన సన్నిధిలో కూర్చోవడం. ధ్యానం అనే కళను అందరం మర్చిపోయాం. రహస్యంగా తండ్రిని ఆరాధించడం మర్చిపోయాం. దేవుని కోసం నిరీక్షించే ఔషధాన్ని త్రాగడం మర్చిపోయాం.


సారవంతమైన లోయ మంచిదే 

గోధుమ పొలాల్లో పనివాళ్ళక్కడ ఉంటారు

సూర్యాస్తమయం దాకా పంట కోస్తుంటారు

కాని, దూరాన కన్పిస్తున్నాయి కొండలు

వచ్చే పోయే వాహనాల రొద అక్కడ లేదు

నన్ను పిలిచే ఒక స్వరం ఉంది

శిఖరాగ్రంనుండి ఏకాంతానికి పిలుస్తుంది

లోయలో ఉండడం బాగానే ఉంది

రోజంతా పనిచెయ్యడం బాగానే ఉంది

నా ఆత్మ మట్టుకు శిఖరాగ్ర అనుభవం కోసం

అర్రులు చాస్తూ ఉంది

కొండలపై తిరుగాడే దైవాత్మ కోసం

కొండలపై దొరికే ప్రశాంతత కోసం

నా గుండె తహతహలాడుతోంది.


ప్రతి జీవితంలోను దేవుడు మాత్రమే ప్రవేశించగల అతి పరిశుద్ధ స్థలం ఉండాలి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

He went up into a mountain apart - (Matt 14:23)

One of the blessings of the old-time Sabbath was its calm, its restfulness, its holy peace. There is a strange strength conceived in solitude. Crows go in flocks and wolves in packs, but the lion and the eagle are solitaires.

Strength is not in bluster and noise. Strength is in quietness. The lake must be calm if the heavens are to be reflected on its surface. Our Lord loved the people, but how often we read of His going away from them for a brief season. He tried every little while to withdraw from the crowd. He was always stealing away at evening to the hills. Most of His ministry was carried on in the towns and cities by the seashore, but He loved the hills the best, and oftentimes when night fell He would plunge into their peaceful depths.

The one thing needed above all others today is that we shall go apart with our Lord, and sit at His feet in the sacred privacy of His blessed presence. Oh, for the lost art of meditation! Oh, for the culture of the secret place! Oh, for the tonic of waiting upon God! —Selected

“It is well to live in the valley sweet,  

Where the work of the world is done,  

Where the reapers sing in the fields of wheat,  

As they toil till the set of sun.  

But beyond the meadows, the hills I see  

Where the noises of traffic cease,  

And I follow a Voice that calleth to me  

From the hilltop regions of peace.  


“Aye, to live is sweet in the valley fair,  

And to toil till the set of sun;  

But my spirit yearns for the hilltop’s air  

When the day and its work are done.  

For a Presence breathes o’er the silent hills,  

And its sweetness is living yet;  

The same deep calm all the hillside fills,  

As breathed over Olivet.”  


“Every life that would be strong must have its Holy of Holies into which only God enters.”

Friday, December 3, 2021

Strong in Suffering

 నీవును నీ పెనిమిటియు, నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా? (2 రాజులు 4:26)


హృదయమా ధృతి వహించు
నీ ప్రియులు గతించిపోయినా
ఎప్పటికైనా దేవుడు నీవాడే
ధైర్యం ధరించు

చావు కాచుకుని ఉంది
ఇదుగో నీ ప్రభువు
నిన్ను క్షేమంగా నడిపిస్తాడు
ధైర్యం వహించు


జార్జిముల్లర్ ఇలా రాసాడు, “అరవై రెండు సంవత్సరాల ఐదు నెలలు నా భార్య నాతో ఉంది. ఇప్పుడు నా తొంభై రెండవ ఏట నేను ఒంటరివాడినయ్యాను. కాని నిరంతరం నాతో ఉండే యేసువైపుకి తిరిగాను. నా గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆయనతో అన్నాను “యేసుప్రభూ, ఇప్పుడు నేను ఒంటరివాణ్ణి. కాని నాకు ఒంటరితనమేమీ లేదు. నాతో నువ్వున్నావు. నా స్నేహితుడివి నువ్వే. ప్రభువా ఇప్పుడు నన్ను ఆదరించి బలపరచు. అవసరమని నీకు తోచిన వాటినన్నిటినీ ఈ దీన సేవకుడికి అనుగ్రహించు.” యేసు ప్రభువు అవసరాల్లోనూ, అలవాట్లలోనూ మన స్నేహితుడని మనకి నిర్ధారణ అయ్యేదాకా తృప్తి చెందకూడదు.


“శ్రమల్లో మనకి విధేయత ఉంటే ఆ శ్రమలు మనకు హాని చెయ్యవు. చలి ప్రదేశాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయినప్పుడు చెట్ల కొమ్మల మీద 'ఐస్' లాగా తయారై ఆ బరువుకు కొన్ని కొమ్మలు విరిగిపోతుంటాయి. చాలామంది శ్రమలవల్ల వంగిపోయి క్రుంగిపోయి ఉంటారు. కాని అప్పుడప్పుడూ శ్రమల్లో పాటలు పాడుతుండేవాళ్ళు తారసపడుతుంటారు. అప్పుడు నా తరుపునా, ఆ వ్యక్తి తరపునా దేవునికి వందనాలు చెల్లిస్తాను. రాత్రిలో వినిపించే పాటకన్నా తియ్యగా మరేదీ వినిపించదు.”


చనిపోయిన వాళ్ళకోసమైనా సరే

దుఃఖానికి నా గుండెను కట్టెయ్యను

మరణం ఎంతోకాలం వేరు చెయ్యలేదు

నా ఇంట్లోని తీగె ప్రాకి

గోడ అవతల పూలు పూసినట్టు

నా చెలీ! మరణం నిన్ను దాచి పెడుతుంది గాని

నా నుండి అది నిన్ను వేరు చెయ్యలేదు, చనిపోయిన నువ్వు 

క్రీస్తుకి ఆవలి వైపున క్రీస్తుతో ఉన్నావు

క్రీస్తు నాతో కూడా ఉన్నాడు

ఇప్పుడు క్రీస్తులో మనం ఒక్క దగ్గర ఉన్నట్టే

-----------------------------------------------------------------------------------------------------------------------------

Is it well with thy husband? Is it well with the child? And she answered, It is well (2 Kgs - 4:26)


“Be strong, my soul!  

Thy loved ones go  

Within the veil. God’s thine, e’en so;  

Be strong.  


“Be strong, my soul!  

Death looms in view.  

Lo, here thy God! He’ll bear thee through;  

Be strong.”  


For sixty-two years and five months I had a beloved wife, and now, in my ninety-second year I am left alone. But I turn to the ever present Jesus, as I walk up and down in my room, and say, “Lord Jesus, I am alone, and yet not alone—Thou art with me, Thou art my Friend. Now, Lord, comfort me, strengthen me, give to Thy poor servant everything Thou seest he needs.” And we should not be satisfied till we are brought to this, that we know the Lord Jesus Christ experimentally, habitually to be our Friend: at all times, and under all circumstances, ready to prove Himself to be our Friend. —George Mueller


Afflictions cannot injure when blended with submission.


Ice breaks many a branch, and so I see a great many persons bowed down and crushed by their afflictions. But now and then I meet one that sings in affliction, and then I thank God for my own sake as well as his. There is no such sweet singing as a song in the night. You recollect the story of the woman who, when her only child died, in rapture looking up, as with the face of an angel, said, “I give you joy, my darling.” That single sentence has gone with me years and years down through my life, quickening and comforting me. —Henry Ward Beecher


“E’en for the dead I will not bind my soul to grief;  

Death cannot long divide.  

For is it not as though the rose that climbed my garden wall  

Has blossomed on the other side?  

Death doth hide,  

But not divide;  

Thou art but on Christ’s other side!  

Thou art with Christ, and Christ with me;  

In Christ united still are we.”

Thursday, December 2, 2021

Reaching Perfection

శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట... (హెబ్రీ 2:10). 


ఇనుము, అగ్ని కలిస్తే ఉక్కు అవుతుంది. అది భూగర్భంలోని రాయి, వేడిమి కలిసిన మిశ్రమం. నూలు అనే పదార్థానికి శుభ్రపరిచే సబ్బూ, దారాలుగా చేసే దువ్వెనా, నేతనేసే మగ్గమూ కలిస్తేనే వస్త్రం తయారవుతుంది. మానవ ప్రవృత్తిలో మరోటి కలవాలి. అలాటి వ్యక్తిత్వాలను ప్రపంచమెప్పుడూ మర్చిపోదు. మనుషులు గొప్పవాళ్ళయ్యేది సుఖభోగాల వల్ల కాదు, శ్రమలననుభవించడంవల్లనే. 


ఒక తల్లి తన కొడుక్కి తోడుగా ఒక గూని కుర్రవాడిని తెచ్చి ఇంట్లో ఉంచింది. అతనికి కాలు కుంటి కూడా. ఆ కుర్రవాడిని అతని అంగవైకల్యం గురించి ఏమీ అనవద్దనీ, అతను మామూలు పిల్లవాడన్నట్టుగానే అతనితో ఆడుకోమని తన కొడుక్కి గట్టిగా చెప్పింది. ఒకరోజు వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండగా ఆమె కొడుకు గూనిపిల్లవాడితో అనడం విందామె. “నీ వీపు మీద ఏముందో తెలుసా?” గూనిపిల్లవాడికి ఇబ్బందిగా అనిపించింది. మాట్లాడలేదు. చాలా సేపు సందేహించి ఆమె కొడుకే సమాధానం చెప్పాడు. “అది నీ రెక్కలున్న పెట్టె. ఒక రోజున దేవుడు దాన్ని విప్పి ఆ రెక్కల్ని విడుదల చేస్తాడు. నువ్వు దేవదూతలాగా ఆ రెక్కల సహాయంతో ఎగిరి పోతావు.”


ఒక దినాన దేవుడు క్రైస్తవులందరికి తెలియజేయనున్నాడు. ఇప్పుడు వాళ్ళందరికి కష్టంగా అనిపించిన ఆదేశాలు అనేవి దేవుని సాధనాలే. వాళ్ళ వ్యక్తిత్వాలను సరిచెయ్యడానికి, వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి పరలోకంలో తాను కట్టబోయే పట్టణంలో వాడడానికి మెరుగుపెట్టిన రాళ్ళలా చెయ్యడానికి వాడిన సాధనాలవి.


వ్యక్తిత్వం అనే మొక్కకి శ్రమలు మంచి ఎరువులు. మన జీవితంలో అత్యుత్కృష్టమైనది వ్యక్తిత్వమే. మనతో బాటు నిత్యత్వంలోకి మనం తీసుకుపోగలిగేది ఇదొక్కటే.


దర్శన పర్వతానికి వెళ్ళాలంటే

ముళ్ళదారి వెంటే వెళ్ళాలి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Perfect through suffering (Heb - 2:10)

Steel is iron plus fire. Soil is rock, plus heat, or glacier crushing. Linen is flax plus the bath that cleans, the comb that separates, and the flail that pounds, and the shuttle that weaves. Human character must have a plus attached to it. The world does not forget great characters. But great characters are not made of luxuries, they are made by suffering.

I heard of a mother who brought into her home as a companion to her own son, a crippled boy who was also a hunchback. She had warned her boy to be very careful in his relations to him, and not to touch the sensitive part of his life but go right on playing with him as if he were an ordinary boy. She listened to her son as they were playing; and after a few minutes he said to his companion: “Do you know what you have got on your back?” The little hunchback was embarrassed, and he hesitated a moment. The boy said: “It is the box in which your wings are; and some day God is going to cut it open, and then you will fly away and be an angel.”

Some day, God is going to reveal the fact to every Christian, that the very principles they now rebel against, have been the instruments which He used in perfecting their characters and moulding them into perfection, polished stones for His great building yonder. —Cortland Myers

Suffering is a wonderful fertilizer to the roots of character. The great object of this life is character. This is the only thing we can carry with us into eternity. … To gain the most of it and the best of it is the object of probation. —Austin Phelps

“By the thorn road and no other is the mount of vision won.”