Tuesday, December 7, 2021

Open the Trenches

 యెహోవా సెలవిచ్చునదేమనగా - గాలియే గాని, వర్షమే గాని రాకపోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్ళతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును (2రాజులు 3:17-18). 


మానవపరంగా ఇది అసాధ్యమే. అయితే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు.


చడీ చప్పుడు లేకుండా, కనిపించని వైపునుంచి అసాధ్యమనుకున్న మార్గంలో ఆ రాత్రిలో నీళ్ళు వరదలా వచ్చేసాయి. తెల్లవారినప్పుడు స్వచ్ఛమైన నీళ్ళతో ఆ లోయంతా నిండింది. ఎర్రటి ఆ ఎదోము కొండలు సూర్యకాంతిలో ప్రతిబింబించినాయి. మన అపనమ్మకం ఎప్పుడూ ఏదో ఒక సూచక క్రియ కనబడాలని చూస్తుంటుంది. ఆధ్యాత్మికత అంటే అదేదో అలజడి కలిగించే తతంగంలా ఉండాలని చాలామంది అభిప్రాయం. ఏవేవో మహాత్కార్యాలు జరుగుతూ ఉంటేనే అది సరైన ఆధ్యాత్మికత అనుకుంటారు కొందరు. కాని విశ్వాసంలో ఘన విజయం ఏమిటంటే ఊరకుండి ఆయన దేవుడని తెలుసుకోగలగడమే.


విశ్వాస విజయమేమిటంటే దాటరాని ఒక ఎర్రసముద్రం ఒడ్డున నిలబడి “ఊరక నిలబడి ప్రభువు ఇవ్వబోయే రక్షణను చూడు” అంటున్న దేవుని మాటల్ని వినడమే. “ముందుకి సాగిపో” అనే మాట వినబడగానే మరేవిధమైన చప్పుడూ, సూచనా లేకపోయినా, మన పాదాలు తడిసిన, మొదటి అడుగు సముద్రంలోకి వెయ్యడమే. నడిచిపోతూ ఉంటే సముద్రం రెండుగా చీలి అగాధ జలాల్లో గుండా దారి ఏర్పడుతుంది.


మీరు ఇంతకుముందు ఏదైనా దైవసంబంధమైన మహాత్కార్యాన్నో స్వస్థతనో కన్నులారా చూసి ఉన్నట్టయితే మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరచినది ఆ నిశ్శబ్దమే. ఏ హడావుడీ లేకుండా మౌనంగా మామూలుగా ఆ వింత జరిగిపోయిన తీరేనని నిస్సందేహంగా చెప్పగలను. అక్కడ ఆడంబరం గాని కళ్ళు మిరుమిట్లు గొలిపే సన్నివేశాలు గాని లేవు. మన సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో శూన్యమైపోయిన హృదయంతో నిలబడి - ఇదంతా చెయ్యడం ఆయనకి ఎంత తేలికైన పనో, ఎవరి సహాయమూ లేకుండా ఎంత సునాయాసంగా చెయ్యగలిగాడో తలుచుకున్నాము.


విశ్వాసం ప్రశ్నించదు, లోబడుతుంది, అంతే. సైనికులంతా కలిసి గుంటలు త్రవ్వారు. నీటిని మాత్రం పైకి తెచ్చేది మానవాతీతమైన శక్తి. ఇది విశ్వాసాన్ని పురిగొల్పే పాఠం.


ఆత్మీయమైన ఆశీర్వాదం కోసం వెదుకులాడుతున్నావా? గుంటలు త్రవ్వండి. దేవుడు వాటిని నింపుతాడు. మనం ఊహించని స్థలాల్లో ఊహించని రీతుల్లో ఈ అద్భుతాలు జరుగుతాయి.


కనిపించేదాన్ని బట్టి కాక విశ్వాసాన్ని బట్టే పనులు చేసే స్థితి రావాలి. వర్షంగాని, గాలి గాని లేకపోయినా దేవుడు గుంటల్లో నీళ్ళు నింపుతాడని ఎదురు చూడగలగాలి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Ye shall not see wind, neither shall ye see rain; yet that valley shall be filled with water, that ye may drink, both ye, and your cattle, and your beasts. And this is but a light thing in the sight of the Lord: he will deliver the Moabites also into your hands - (2 Kgs -  3:16-18)

To human thinking it was simply impossible, but nothing is hard for God.

Without a sound or sign, from sources invisible and apparently impossible, the floods came stealing in all night long; and when the morning dawned, those ditches were flooded with the crystal waters, and reflecting the rays of the morning sun from the red hills of Edom.

Our unbelief is always wanting some outward sign. The religion of many is largely sensational, and they are not satisfied of its genuineness without manifestations, etc.; but the greatest triumph of faith is to be still and know that He is God.

The great victory of faith is to stand before some impassable Red Sea, and hear the Master say, “Stand still, and see the salvation of the Lord,” and “Go forward!” As we step out without any sign or sound—not a wave-splash—and wetting our very feet as we take the first step into its waters, still marching on we shall see the sea divide and the pathway open through the very midst of the waters.

If we have seen the miraculous workings of God in some marvelous case of healing or some extraordinary providential deliverance, I am sure the thing that has impressed us most has been the quietness with which it was all done, the absence of everything spectacular and sensational, and the utter sense of nothingness which came to us as we stood in the presence of this mighty God and felt how easy, it was for Him to do it all without the faintest effort on His part or the slightest help on ours.

It is not the part of faith to question, but to obey. The ditches were made, and the water came pouring in from some supernatural source. What a lesson for our faith!

Are you craving a spiritual blessing? Open the trenches, and God will fill them. And this, too, in the most unexpected places and in the most unexpected ways.

Oh, for that faith that can act by faith and not by sight, and expect God to work although we see no wind or rain. —A. B. Simpson

Monday, December 6, 2021

The Second Coming

నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము (ప్రకటన 3:11). 


జార్జి ముల్లర్ ఈ సాక్ష్యాన్నిస్తున్నాడు, “1829 లో నా హృదయానికి యేసుప్రభువు యొక్క వ్యక్తిగతమైన రాకడ గురించి బయలుపరిచాడు దేవుడు. ప్రపంచం అంతా మారాలని నేను ఎదురుచూస్తూ ఏమీ చేయకుండా కూర్చోవడం చాలా పొరపాటని తెలియజేశాడు. ఇది నా హృదయంలో గొప్ప మార్పుని తెచ్చింది. నా హృదయపు లోతుల్లోనుండి నశించిపోతున్న పాపుల కోసం ఓ గొప్ప ఆవేదన బయలుదేరింది. సైతాను ఆధీనంలో చిక్కి నిద్రపోతున్న ప్రపంచాన్ని చూశాను. "యేసుప్రభువు ఆలస్యం చేస్తున్నాడు కదా ఈ లోపల నాకు చేతనైనది నేను చెయ్యాలి. నిద్రమత్తులో ఉన్న సంఘాలను మేలుకొలపాలి.”


సంఘం క్రీస్తులో సంగమించే ముందు జరగవలసిన పని ఎంతో ఉంది. అయితే ఈ కాలంలో కనిపిస్తున్న గురుతులని చూస్తుంటే ఇప్పుడే దూత దిగివచ్చి కడవరి బూర ఊదుతాడేమో అన్నట్టు ఉంది. రేపు ఉదయమే క్రీస్తు సీయోను పర్వతం మీదికి దిగివచ్చాడని వార్త వస్తుందేమో, విశ్వ జనీన సామ్రాజ్యాన్ని ప్రకటించాడని తెలుస్తుందేమోనన్నట్టు ఉంది. “చనిపోయిన సంఘాల్లారా, మేలుకోండి! క్రీస్తు ప్రభూ దిగి రా! శిథిలమైన దేవాలయమా, కిరీటాన్ని ధరించు! గాయపడిన హస్తాల్లారా, రాజదండాన్ని తీసుకోండి! రక్తం కారే పాదాల్లారా సింహాసనమెక్కండి! రాజ్యం మీదే.”


నా ప్రియ బిడ్డా

రోజూ పనంతా ముగిసిన

సాయంత్రపు వేళ

సంధ్య కాంతిలో

కుంగిపోతున్న సూర్యుణ్ణి

సంద్రం మీద వింత రంగుల్ని

సంభ్రమంగా చూసే వేళ

గంటలు ప్రశాంతంగా గడిచిపోయి

నా తలపులు నీ మది నిండిన వేళ

పిల్లగాలి గలగలా వీధిలో

నడిచిపోతున్న వేళ


ఈ నిశ్శబ్ద స్తబ్ధతలో

నా అడుగుల సవ్వడి వస్తుందేమో

జాగ్రత్తగా కనిపెట్టి చూడు 

నింగిమీది తొలి చుక్క

తొంగి చూసిన వేళ 

దూరపు మసక మబ్బుల్లాగా

ద్వారం బయట వెలుగు

సమసిపోయే వేళ 

తలుపు తెరిచి ఉంచు

ఆ సంధ్య కాంతిలోనే నేనొస్తానేమో

-----------------------------------------------------------------------------------------------------------------------------

Behold, I come quickly: hold that fast which thou hast, that no man take thy crown (Rev - 3:11)

George Mueller bears this testimony, “When it pleased God in July, 1829, to reveal to my heart the truth of the personal return of the Lord Jesus, and to show me that I had made a great mistake in looking for the conversion of the world, the effect that it produced upon me was this: From my inmost soul I was stirred up to feel compassion for perishing sinners, and for the slumbering world around me lying in the wicked one, and considered, ’Ought I not to do what I can for the Lord Jesus while He tarries, and to rouse a slumbering church?”’

There may be many hard years of hard work before the consummation, but the signs are to me so encouraging that I would not be unbelieving if I saw the wing of the apocalyptic angel spread for its last triumphal flight in this day’s sunset; or if tomorrow morning the ocean cables should thrill us with the news that Christ the Lord had alighted on Mount Olivet or Mount Calvary to proclaim universal dominion. O you dead churches wake up! O Christ, descend! Scarred temple, take the crown! Bruised hand, take the sceptre! Wounded foot, step the throne! Thine is the kingdom. —Rev. T. DeWitt Talmage, D. D.


“It may be in the evening,  

When the work of the day is done,  

And you have time to sit in the twilight,  

And watch the sinking sun,  

While the long bright day dies slowly  

Over the sea,  

And the hours grow quiet and holy  

With thoughts of Me;  

While you hear the village children  

Passing along the street  

Among those passing footsteps  

May come the sound of My Feet.  

Therefore I tell you, Watch!  

By the light of the evening star  

When the room is growing dusky  

As the clouds afar,  

Let the door be on the latch  

In your home,  

For it may be through the gloaming  

I will come.”

Sunday, December 5, 2021

Who is Leading?

 

యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును (యిర్మీయా 10:23). 


సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము (కీర్తన 27:11).


చాలా మంది, దేవుడు తమని నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు గాని ఆయన్నే నడిపించాలని చూస్తారు. ఆయన తీసుకెళ్ళిన చోట్లకి వెళ్ళరు కాని ఆయనకే దారి చూపించాలనుకుంటారు.


నేనన్నాను "పొలంలో నడుస్తాను"

“ఊళ్ళో నడువు" దేవుడన్నాడు

“అక్కడ మరి పూలేమీ లేవే"

“పూలు లేవు గాని కిరీటముంది.”


నేనన్నాను “ఆకాశం నల్లగా ఉంది

అంతా రొద, రణగొణ ధ్వని”

నన్నక్కడికే పంపుతూ అన్నాడు

“అక్కడ పాపం దాగుంది.”


“గాలి స్వచ్ఛంగా లేదు

పొగమంచు పట్టేసింది” అన్నాను

“ఆత్మలు రోగాలతో ఉన్నాయి’’

ఆయనన్నాడు “పాపాంధకారముంది.”


“వెలుగుకి దూరమైపోతాను

మిత్రులుండరు" అన్నాను

ఆయనన్నాడు. "ఇప్పుడే కోరుకో

మిత్రులా? నేనా?"


కాస్త గడువియ్యమన్నాను

ఆయనన్నాడు "తేల్చుకోవడం కష్టంగా ఉందా

నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే

పరలోకానికి దారి కష్టం కాదు"


ఉద్యానవనం వంక ఒకసారి చూశాను

ఊరువైపు తిరిగి చూశాను

"కుమారుడా విధేయుడివౌతావా”

అప్పుడన్నాడు “కిరీటం కోసం పూలను వదులుతావా"


ఆయన చేతిలో పడింది చేయి

నా హృదయంలోకి వచ్చాడాయన

నిజానికి ఒకప్పుడు భయపడ్డ నేను.

ఆ దివ్యకాంతిలో నడిచాను

-----------------------------------------------------------------------------------------------------------------------------

O Lord, I know that the way of man is not in himself: it is not in man that walketh to direct his steps (Jer - 10:23)

“Lead me in a plain path” - (Ps. 27:14).

Many people want to direct God, instead of resigning themselves to be directed by Him; to show Him a way, instead of passively following where He leads. —Madame Guyon


I said: “Let me walk in the field”;  

God said: ’Nay, walk in the town“;  

I said: ”There are no flowers there“;  

He said: ”No flowers, but a crown.”


I said: “But the sky is black,  

There is nothing but noise and din”;  

But He wept as He sent me back,  

“There is more,” He said, "there is sin  


I said: “But the air is thick,  

And fogs are veiling the sun”;  

He answered: “Yet souls are sick,  

And souls in the dark undone.”  


I said: “I shall miss the light,  

And friends will miss me, they say”;  

He answered me, “Choose tonight,  

If I am to miss you, or they.”  


I pleaded for time to be given;  

He said: “Is it hard to decide?  

It will not seem hard in Heaven  

To have, followed the steps of your Guide.”  


I cast one look at the fields,  

Then set my face to the town;  

He said: “My child, do you yield?  

Will you leave the flowers for the crown?”  


Then into His hand went mine,  

And into my heart came He;  

And I walk in a light Divine,  

The path I had feared to see.  


—George MacDonald