Monday, January 10, 2022

Made Perfect Through Suffering

 

మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొనుచున్నాను*_  (రోమా  8:18)


ఒక సీతాకోకచిలుకకి చెందిన ఒక ప్యూపాను దాదాపు సంవత్సరం పాటు దాచిపెట్టాను. అది చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అది కూజా ఆకారంలో ఉంది. దాని మెడ దగ్గర చిన్న రంధ్రం ఉంది. లోపల తయారవుతున్న కీటకం దాన్లోగుండా చీల్చుకొని బయటకి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఖాళీ ప్యూపాకీ , కీటకం ఇంకా లోపలే ఉన్న ప్యూపాకీ ఆకారంలో ఏమీ తేడా లేదు. ఆ రంధ్రం చుట్టుతా ఉన్న సిల్కు దారాలు ఏమీ తెగిపోయినట్టుగాని, చెదరినట్టుగాని లేవు. కీటకం సైజుకీ, ఆ రంధ్రానికి ఉన్న తేడాను బట్టి చూస్తే కీటకం పడే పాట్లు వర్ణించనలవి కాదు. జీవశాస్త్రజ్ఞులు కనుక్కున్నదేమిటంటే అంత చిన్నరంధ్రంలో నుండి దూరి బయటికి వస్తున్నప్పుడు ఆ వత్తిడికి ఆ కీటకం శరీరంలోని జీవద్రవాలు దాని రెక్కల్లోని నాళాల్లోకి వెళ్తాయట. ఎందుకంటే ఆ జాతికి చెందిన కీటకాల్లో అప్పటిదాకా రెక్కలు సరిగ్గా తయారు కావట. ఆ ద్రవాలు రెక్కల్లోకి ప్రవహించే దాకా ఆ రెక్కలు ఎగరడానికి పనికిరావట. 


నా దగ్గర ఉంచుకున్న ఆ ప్యూపాలోనుండి కీటకం చెరలోనుండి బయటపడ్డట్టు బయటకి రావడాన్ని నేను చూసాను. ఓ మధ్యాహ్నమంతా అప్పుడప్పుడూ అటు ఒక కన్నేస్తూ దాన్ని గమనించాను. అది ఓపికగా పాటుపడుతూ, బయటపడడానికి  ప్రయత్నిస్తూ ఉంది. ఎంత కష్టపడినా అంగుళమైనా బయటకు వచ్చినట్టు అనిపించేది కాదు. చివరికి నాకు విసుగెత్తింది. బహుశా ఆ రంధ్రం చుట్టూ ఉన్న దారాలు పొడిగా ఉండడం చేత సాగడం లేదేమో. నేను ఆ ప్యూపాని చెట్టు మీదే ఉంచినట్టయితే  ఆ దారాలకు కాస్త చెమ్మ తగిలి రబ్బరులాగా సాగేవేమో. నేనే దాన్ని ఇంట్లోకి తీసుకువచ్చి దాన్ని సహజమైన సాగే గుణాన్ని చెడగొట్టానేమో అనుకొని ఆ రంధ్రాన్ని వదులు చేద్దామనుకొన్నాను . దాని సృష్టికర్తకంటే ఎక్కువ జ్ఞానం, జాలి నాకే ఉన్నట్టు దానికి సహాయం చేద్దామనుకొన్నాను. ఒక చిన్న కత్తెర తీసుకొని అది కాస్తంత తేలికగా బయటకి రావడానికి వీలుగా ఆ రంధ్రం అంచును కొద్దిగా కత్తిరించాను. చూస్తుండగానే హాయిగా, తేలికగా ఆ కిరీటం తన ఉబ్బిన శరీరాన్ని ఈడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. దాని రెక్కలు మాత్రం కృశించిపోయి చిన్న చిన్న చింతాకులంత ఉన్నాయి. ఆ జాతి కీటకాల రెక్కలు వెడల్పుగా ఇంద్రధనుస్సు రంగులతో మెరిసిపోతుంటాయి. ఆ రెక్కలు విచ్చుకుంటాయని, మిరుమిట్లు గొలిపే ఆ రంగులు అలరిస్తాయని నేను ఆ కీటకం వంక ఆత్రుతగా చాలా సేపు చూశాను. 


ఆ రంగులన్నీ ఉన్నాయిగాని కంటిక్కనిపించని చిన్న చిన్న బొట్లులా ఉన్నాయి. నేను అనవసరంగా కల్పించుకొని ఆ రంగులన్నీ పూర్తిగా రూపుదిద్దుకొనకుండా చేసాను. కీటకాన్ని అలా బయటకి రప్పించడం గర్భస్రావంలాంటిది తప్ప మరేమీ కాదు. అది ఆకాశ వీధుల్లో రెక్కలార్చి ఎగిరిపోవలసింది. అయితే దయనీయంగా నా ఎదుట నేల మీద కాస్సేపు పాకింది, అంతే. 


బాధలో, చిరాకులో, దుఖంలో, అయోమయంగా తిరుగులాడుతూ ఉండేవాళ్ళని చూస్తూ దీన్ని గురించి నేను చాలా సార్లు ఆలోచించాను. క్రమశిక్షణను కత్తెరతో కత్తిరించేసి పూర్తి బలం తెచ్చుకునే అవకాశాన్ని జారవిడుచుకుంటారు దూరదృష్టిలేని మనుషులు. కాసేపు ఉండి అంతరించిపోయే బాధను  మనల్ని ప్రేమించే ముందు చూపు గల జ్ఞానవంతుడైన దేవుడు మన కోసం సిద్ధంచేస్తే, మనం దాని నుండి మొహం చాటేసి అవిటివాళ్ళుగా మిగిలిపోతాము. మన పరమ తండ్రి తన పిల్లలను ప్రేమిస్తాడు గనుకనే తన పరిశుద్ధతలో మనం పాలుపంచుకోవాలని మనల్ని శిక్షకు గురిచేస్తాడు. ఆయన పథకం ప్రకారం మన అంతము మహిమకరమై ఉంటుంది. అందుకనే మనం ఏడ్చి గోలపెట్టినా ఆయన చలించడు. మనం  శ్రమల మూలంగా మచ్చలేని వాళ్ళంగా అవుతాము. దేవుని పిల్లలు విధేయత అనే శిక్షణ పొంది, శ్రమల ద్వారా మహిమలోకి ప్రవేశిస్తారు.

---------------------------------------------------------------------For I reckon that the sufferings of this present time are not worthy to be compared with the glory which shall be revealed in us*_ - (Rom  - 8:18) 


    I kept for nearly a year the flask-shaped cocoon of an emperor moth. It is very peculiar in its construction. A narrow opening is left in the neck of the flask, through which the perfect insect forces its way, so that a forsaken cocoon is as entire as one still tenanted, no rupture of the interlacing fibers having taken place. The great disproportion between the means of egress and the size of the imprisoned insect makes one wonder how the exit is ever accomplished at all—and it never is without great labor and difficulty. It is supposed that the pressure to which the moth’s body is subjected in passing through such a narrow opening is a provision of nature for forcing the juices into the vessels of the wings, these being less developed at the period of emerging from the chrysalis than they are in other insects.


    I happened to witness the first efforts of my prisoned moth to escape from its long confinement. During a whole forenoon, from time to time, I watched it patiently striving and struggling to get out. It never seemed able to get beyond a certain point, and at last my patience was exhausted. Very probably the confining fibers were drier and less elastic than if the cocoon had been left all winter on its native heather, as nature meant it to be. At all events I thought I was wiser and more compassionate than its Maker, and I resolved to give it a helping hand. With the point of my scissors I snipped the confining threads to make the exit just a very little easier, and lo! immediately, and with perfect case, out crawled my moth dragging a huge swollen body and little shrivelled wings. In vain I watched to see that marvelous process of expansion in which these silently and swiftly develop before one’s eyes; and as I traced the exquisite spots and markings of divers colors which were all there in miniature, I longed to see these assume their due proportions and the creature to appear in all its perfect beauty, as it is, in truth, one of the loveliest of its kind. But I looked in vain. My false tenderness had proved its ruin. It never was anything but a stunted abortion, crawling painfully through that brief life which it should have spent flying through the air on rainbow wings. I have thought of it often, often, when watching with pitiful eyes those who were struggling with sorrow, suffering, and distress; and I would fain cut short the discipline and give deliverance. Short-sighted man! How know I that one of these pangs or groans could be spared? The far-sighted, perfect love that seeks the perfection of its object does not weakly shrink from present, transient suffering. Our Father’s love is too true to be weak. Because He loves His children, He chastises them that they may be partakers of His holiness. With this glorious end in view, He spares not for their crying. Made perfect through sufferings, as the Elder Brother was, the sons of God are trained up to obedience and brought to glory through much tribulation.  —Tract.

Saturday, January 8, 2022

Showers and Sunshine

 వారిని, నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరముగు వర్షములు కురియును (యెహెజ్కేలు 34:26)


ఈ వేళ ఏ ఋతువు? అనావృష్టి కాలమా? వర్ష ఋతువు ఇంకెంతో దూరం లేదు. గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా? వర్ష ఋతువు వచ్చేసింది. నీ బలం దిన దినం అభివృద్ది చెందుతుంది. దీవెనకరమైన వర్షాలు కురుస్తాయి. ఇక్కడ బహువచనం ఉంది. అన్ని రకాలైన దీవెనలనూ దేవుడు కురిపిస్తాడు. దేవుని దీవెనలన్నీ కలిసికట్టుగా వస్తాయి. బంగారు గొలుసులోని లింకుల్లాగే అన్నీ ఒక దాని వెంట ఒకటి వస్తాయి. మారుమనస్సు పొందడానికి ఆయన కృపనిస్తే నిన్ను ఆదరించే కృపలను కూడా ఆయనే ఇస్తాడు. ఆయన ‘దీవెనకరమైన వర్షాలు’ కురిపిస్తాడు. ఎండిపోయిన మొక్కల్లారా, పైకి చూడండి. మీ ఆకుల్ని, పువ్వుల్ని విప్పండి. పరలోక వర్షాలు మిమ్మల్ని తడుపుతాయి.


దిగుడులోయగా మార్చుకో నీ గుండెను 

అది నిండి, పొంగి పొర్లేదాకా 

దేవుడు కురిపిస్తాడు దీవెన వర్షాన్ని 


ప్రభూ, నా ముల్లుని నువ్వు పువ్వుగా మార్చగలవు. నా నివేదన ఇదే. యోబు జీవితంలో వర్షం తరువాత ఎండ కాసింది. కాని కురిసిన వర్షం వ్యర్ధం కాలేదుగా. యోబు అడిగాడు, నేనూ అడుగుతున్నాను. వర్షం తరువాత వచ్చే తళతళలకు, వర్షానికీ సంబంధం లేదా? నువ్వు చెప్పగలవు – నీ శిలువ చెప్పగలదు. నీ బాధల్లో కిరీటం ఉంది. ప్రభూ, ఆ కిరీటం నాకు కావాలి. వర్షం కురిసి వెలసిన తరువాత ఉండే తళతళల్లోని తళుకుని నాకు బోధపరచు. అప్పుడే నేను జయశీలిగా ఉండగలను. 


జీవితం ఫలభరితం కావాలంటే సూర్యరశ్మితోబాటు వర్షం కూడా కావాలి.


ఎండి పగులువారిన నేలపై 

జీవవాయువు పోసే వర్షం కావాలి  

ధరణీతలం హరిత శాద్వలంగా మారాలంటే 

మబ్బు నీళ్ళు కావాల్సిందే !

భయాల మొయిళ్లు

బాధల వర్షాన్ని మోసుకొచ్చాయి

బ్రతుకు భూమిపై కురిసి 

గుండెలోతుల్లోకి తేమను తెచ్చాయి


దేవుని దివ్య సూత్రాన్ని ఆచరించగా 

పగుళ్ళు విచ్చిన దిగుళ్ల నేలలో 

పచ్చదనం మందహాసం చేసింది 

నిన్ను ఆవరించిన ప్రతి కారుమబ్బులో 

పౌలు రాసిన పవిత్ర వాక్కులు గమనించు 

ఈ మేఘాలు నీ ఆత్మకు క్షేమాలు 

అవి నీకు మేలే చేస్తాయి 

అది నీవు గుర్తించు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

I will cause the shower to come down in his season; there shall be showers of blessing - (Ezek - 34:26)  

    What is thy season this morning? Is it a season of drought? Then that is the season for showers. Is it a season of great heaviness and black clouds? Then that is the season for showers. “As thy day so shall thy strength be.” “I will give thee showers of blessing.” The word is in the plural. All kinds of blessings God will send. All God’s blessings go together, like links in a golden chain. If He gives converting grace, He will also give comforting grace. He will send “showers of blessings.” Look up today, O parched plant, and open thy leaves and flowers for a heavenly watering.  —Spurgeon

“Let but thy heart become a valley low,

And God will rain on it till it will overflow.”

    Thou, O Lord, canst transform my thorn into a flower. And I want my thorn transformed into a flower. Job got the sunshine after the rain, but has the rain been all waste? Job wants to know, I want to know if the shower had nothing to do with the shining. And Thou canst tell me Thy Cross can tell me. Thou hast crowned Thy sorrow. Be this my crown, O Lord. I only triumph in Thee when I have learned the radiance of the rain.  —George Matheson

    The fruitful life seeks showers as well as sunshine.

“The landscape, brown and sere beneath the sun,

Needs but the cloud to lift it into life;

The dews may damp the leaves of trees and flowers,

But it requires the cloud-distilled shower

To bring rich verdure to the lifeless life.


“Ah, how like this, the landscape of a life:

Dews of trial fall like incense, rich and sweet;

But bearing little in the crystal tray

Like nymphs of night, dews lift at break of day

And transient impress leaves, like lips that meet.


“But clouds of trials, bearing burdens rare,

Leave in the soul, moisture settled deep:

Life kindles by the magic law of God;

And where before the thirsty camel trod,

There richest beauties to life’s landscape leap.


“Then read thou in each cloud that comes to thee

The words of Paul, in letters large and clear:

So shall those clouds thy soul with blessing feed,

And with a constant trust as thou dost read,

All things together work for good. Fret not, nor fear!”