Thursday, January 20, 2022

Persistent Prayer

 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను  (లూకా 18:1)

“చీమ దగ్గరికి వెళ్ళండి” తామర్లేన్ ఒక సంఘటనను తన స్నేహితులకి ఎప్పుడూ చెబుతుండేవాడు. “ఒకసారి నేను శత్రువు తరుముతుంటే పారిపోతూ ఒక పాడుబడిన భవనంలో తలదాచుకున్నాను. అక్కడ కూర్చుని చాలా గంటలు గడిపాను. నా నికృష్ట స్థితిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాను. అది తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతున్నది. గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో లెక్కబెట్టాను. ఆ గింజ అరవై తొమ్మిదిసార్లు పడిపోయింది. అయినా చీమ తన ప్రయత్నాన్ని మానలేదు. డెబ్భైయవసారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగిందా చీమ. ఆ క్షణంలో ఆ దృశ్యం నాకు ధైర్యాన్నిచ్చింది. ఆ పాఠాన్ని నేనెప్పుడూ మరచిపోను.”


గతంలో ప్రార్థనలకి జవాబు రాలేదన్న కారణం చేత, సోమరితనంగా యధాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదు. ప్రార్థనలకి జవాబు ఇంతవరకు రాలేదంటే ఆ జవాబు అతి సమీపంగా ఉందన్నమాట. ఇలా అనుకుని చేసేదే నిజమైన ప్రార్థన. మొదటినుండి చివరిదాకా మనం యేసుప్రభువు ఉదాహరణలను పాఠాలుగా తీసుకోవాలి. దీర్ఘశాంతంతో చెయ్యని ప్రార్థన, నివేదనను పట్టు వదలకుండా మరీ మరీ వినిపించని ప్రార్థన, చేసిన కొద్దీ బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్ధన - ఫలితాలను సంపాదించే ప్రార్థన కాదని యేసు ప్రభువు చూపిన ఆదర్శం మనకు బోధిస్తున్నది.


సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ ఒకసారి అన్నాడు. “సంగీత సాధనను నేను ఒక రోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది. రెండు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకి తెలిసిపోతుంది. మూడురోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరికి హాజరైన వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది చాలా పాత సిద్ధాంతమే. సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది.” మనం నమ్మకంలోను, ప్రార్థనలోను, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోను ఎడతెగక ఉండాలి. ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేసాడనుకోండి, ఏమవుతుందో మనకి తెలుసు. ఇదే సూత్రాన్ని, ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనమూ సర్వశ్రేష్టతని సంతరించుకోగలం.

డేవిడ్ లివింగ్ స్టన్ ఆశయం ఇది. “నా గమ్యాన్ని చేరేదాకా, అనుకున్నదాన్ని సాధించేదాకా ఆగిపోకూడదని నా దృఢ నిర్ణయం.” తడబాటులేని నిశ్చయంతో, దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలు సాధించాడు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Men ought always to pray and not to faint - (Luke - 18:1) 

    “Go to the ant.” Tamerlane used to relate to his friends an anecdote of his early life. “I once,” he said, “was forced to take shelter from my enemies in a ruined building, where I sat alone for many hours. Desiring to divert my mind from my hopeless condition, I fixed my eyes on an ant that was carrying a grain of corn larger than itself up a high wall. I numbered the efforts it made to accomplish this object. The grain fell sixty-nine times to the ground, but the insect persevered, and the seventieth time it reached the top. This sight gave me courage at the moment, and I never forgot the lesson.”  —The King’s Business

    A prayer that takes the fact that past prayers have not been answered as a reason for languor has already ceased to be the prayer of faith. To the prayer of faith, the fact that prayers remain unanswered is only evidence that the moment of the answer is so much nearer. From first to last, the lessons and examples of our Lord all tell us that prayer which cannot persevere and urge its plea importunately, and renew, and renew itself again, and gather strength from every past petition, is not the prayer that will prevail.  —William Arthur

    Rubenstein, the great musician, once said, “If I omit practice one day, I notice it; if two days, my friends notice it; if three days, the public notice it.” It is the old doctrine, “Practice makes perfect.” We must continue believing, continue praying, continue doing His will. Suppose along any line of art, one should cease practicing, we know what the result would be. If we would only use the same quality of common sense in our religion that we use in our everyday life, we should go on to perfection.

    The motto of David Livingstone was in these words, “I determined never to stop until I had come to the end and achieved my purpose.” By unfaltering persistence and faith in God, he conquered.

Wednesday, January 19, 2022

The Fiery Furnace

 

ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము (2 కొరింథీ 2:14)

ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘనవిజయాలనిస్తాడు. చాలా సార్లు శత్రువు కొంత కాలం జయిస్తాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. కాని మధ్యలో కలిగించుకుని శత్రువు ప్రయత్నాలను పాడుచేసి అతనికందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకుంటాడు. దుష్టుల మార్గాన్ని దేవుడు తల్లక్రిందులు చేస్తాడు అని బైబిల్లో రాసివున్నట్టు ఇది జరుగుతుంది. ఆ తరువాత మనకి దొరికే ఘన విజయం ‘అంతకు ముందు శత్రువుది పైచెయ్యిగా ఉండకపోయినట్టయితే’, అంత ఘనంగా కనిపించేది కాదు.


ముగ్గురు యూదా యువకుల్ని మండుతున్న అగ్నిగుండంలోకి పడేసిన కథ మనకి తెలుసు కదా. ఇక్కడ శత్రువు గెలిచినట్టే ముందు అనిపించింది. సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయాన్ని ఎదుర్కోబోతున్నట్టు అనిపించింది. మనకి కూడా ఎన్నో పరిస్థితుల్లో మనం ఓడిపోయినట్టు, శత్రువు గెలిచినట్టు అనిపిస్తుంది. ఆ యూదులను మంటల్లోకి విసిరేసిన పగవాళ్ళు ఆనందంగా తొంగి చూస్తున్నారు. ఆ యువకులు అగ్నికి ఆహుతైపోతారని. అయితే వాళ్ళు అగ్ని గుండంలో హాయిగా పచార్లు చేస్తూ ఉండడం చూసి నివ్వెరబోయారు. నెబుకద్నెజరు వాళ్ళని అగ్నిలోనుంచి బయటికి రమ్మని పిలిచాడు. వాళ్ళ తలవెంట్రుకలైనా కాల లేదు. వాళ్ళ బట్టలకి అగ్ని వాసనైనా అంటలేదు. ఎందుకంటే “ఈ విధమైన ఆశ్చర్యకరమైన రక్షణనిచ్చే దేవుడు మరెవరూ లేరు.”


అపజయంగా అనిపించినది ఉన్నట్టుండి ఘనవిజయంగా మారిపోయింది. ఈ ముగ్గురు యువకులు ఒకవేళ విశ్వాసాన్నీ, ధైర్యాన్నీ కోల్పోయి “దేవుడు మమ్మల్ని ఎందుకీ అగ్నిగుండం పాలు చెయ్యబోతున్నాడు!” అని గోల పెట్టినట్టయితే వాళ్ళా అగ్ని గుండంలో కాలి మాడి మసైపోయేవాళ్ళేమో. దేవుడికి ఏమీ మహిమ కలిగేది కాదు. ఇప్పుడు నీకేదైనా గొప్ప శోధన ఉన్నప్పుడు దాన్ని నువ్వు పరాజయంగా స్వీకరించవద్దు. విశ్వాసంతో అలానే సాగిపోతూ ఉండు. నిన్ను విజేతగా నిలబెట్టగలవాని పేరట విజయాన్ని ఆశించు. త్వరలోనే ఘనవిజయం నీదవుతుంది. దేవుడు మనల్ని నడిపించే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన మన విశ్వాసం బహిర్గతమయ్యే అవకాశాలను కల్పిస్తున్నాడు. ఆ విశ్వాసం ద్వారా మనం ఆశీర్వాదకరమైన ఫలితాలను పొంది ఆయనను ప్రస్తుతించాలి.

----------------------------------------------------------------------------------------------------------------------------

Now thanks be unto God, which always causeth us to triumph in Christ - (2 Cor - 2:14)

    God gets His greatest victories out of apparent defeats. Very often the enemy seems to triumph for a little, and God lets it be so; but then He comes in and upsets all the work of the enemy, overthrows the apparent victory, and as the Bible says, “turns the way of the wicked upside down.” Thus He gives a great deal larger victory than we would have known if He had not allowed the enemy, seemingly, to triumph in the first place.

    The story of the three Hebrew children being cast into the fiery furnace is a familiar one. There was an apparent victory for the enemy. It looked as if the servants of the living God were going to have a terrible defeat. We have all been in places where it seemed as though we were defeated, and the enemy rejoiced. We can imagine what a complete defeat this looked to be. They fell down into the flames, and their enemies watched them see them burn up in that awful fire, but were greatly astonished to see them walking around in the fire enjoying themselves. Nebuchadnezzar told them to “come forth out of the midst of the fire.” Not even a hair was singed, nor was the smell of fire on their garments, “because there is no other god that can deliver after this sort.”

    This apparent defeat resulted in a marvelous victory.

    Suppose that these three men had lost their faith and courage, and had complained, saying, “Why did not God keep us out of the furnace!” They would have been burned, and God would not have been glorified. If there is a great trial in your life today, do not own it as a defeat, but continue, by faith, to claim the victory through Him who can make you more than a conqueror, and a glorious victory will soon be apparent. Let us learn that in all the hard places God brings us into, He is making opportunities for us to exercise such faith in Him as will bring about blessed results and greatly glorify His name.  —Life of Praise

“Defeat may serve as well as victory

To shake the soul and let the glory out.

When the great oak is straining in the wind,

The boughs drink in new beauty and the trunk

Sends down a deeper root on the windward side.

Only the soul that knows the mighty grief

Can know the mighty rapture. Sorrows come

To stretch out spaces in the heart for joy.”

Tuesday, January 18, 2022

The Living God

 

జీవముగల దేవుని సేవకుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? (దానియేలు 6:20)

దేవుని వాక్యంలో ఇలాంటి మాటలు చాలాసార్లు కనిపిస్తాయి. కాని మనం ఎప్పుడూ మర్చిపోయేది ఈ సంగతినే. “జీవముగల దేవుడు" అని రాసి ఉందని మనకి తెలుసు. కాని మన అనుదిన జీవితంలో ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా మరి దేన్నీ నిర్లక్ష్యం చెయ్యం. మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడన్నది లక్ష్యపెట్టం. ఆయనకి అప్పటికీ, ఇప్పటికీ అదే రాజరికం ఉందనీ, ఆయన్ని ప్రేమించి, సేవించే వారిపట్ల ఆయనకి అదే ప్రేమ ఉందనీ, ఆ రోజుల్లో వాళ్ళ కోసం ఆయన చేసిన పనుల్నే ఈ రోజుల్లోనూ చెయ్యగలడనీ.


ఇదంతా ఎందుచేతనంటే ఆయన సజీవుడూ, మార్పులేని దేవుడనీ మనం మర్చిపోతుంటాము. ఆయనకి మన కష్టసుఖాలు చెప్పుకోవడం ఎంత అవసరం! మనం చీకటిలో ఉన్న సమయాల్లో ఆయన ఇప్పటికీ మరెప్పటికీ జీవముగల దేవుడు అన్న విషయాన్ని మనసులో ఉంచుకుందాము.


నువ్వు ఆయనతో నడుస్తూ, ఆయన వంక చూస్తూ, ఆయన నుండి సహాయం ఆశిస్తూ ఉంటే ఆయన నిన్నెప్పుడూ నిరాశపరచడన్న నిశ్చయత కలిగియుండు. “నలభైనాలుగు సంవత్సరాలుగా ప్రభుని ఎరిగి ఉన్న జార్జి ముల్లర్ అనే నీ అన్ననైన నేను ఈ మాటలు రాస్తున్నాను. నన్ను దేవుడెప్పుడూ నిరాశపరచలేదు. ఇది నీ ప్రోత్సాహం కొరకు వ్రాస్తున్నాను. ఘోర కష్టాల్లో, తీవ్రమైన శ్రమల్లో, నిరుపేదగా ఉన్నప్పుడు, అవసరాల్లో ఆయన నాకు సహాయం చెయ్యకుండా ఎప్పుడూ ఉండలేదు. తన కృపతో ఆయన్ని ఆనుకునే గుణాన్ని ఇచ్చాడు. ప్రతీసారి నాకు సహాయం చేసాడు. ఆయన నామం గురించి ఈ మంచి మాటలు చెప్పడం నాకెంతో ఆనందదాయకం. -జార్జి ముల్లర్”


మార్టిన్ లూథర్ ఒకసారి ఆపదలో చిక్కుకున్నాడు. భయం ఆవరించింది. తన టేబుల్ దగ్గర నిస్త్రాణంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అతని వేళ్ళు అతని ప్రమేయం లేకుండా ఏవో అక్షరాలను టేబుల్ మీద దిద్దుతున్నాయి. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు.... మనకీ, సమస్త మానవాళికీ ఉన్న నిరీక్షణ ఇదే. మనుషులు వస్తారు,  పోతారు. నాయకులు,  బోధకులు, తత్వవేత్తలు వస్తారు, మాట్లాడుతారు. కొంతకాలం పనులు చేస్తారు. అందరూ నిశ్శబ్దంగా నిర్జీవంగా నిష్క్రమిస్తారు. దేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. వాళ్ళంతా చనిపోతారు. ఆయన బ్రతికే ఉంటాడు. వాళ్ళంతా వెలిగించిన దీపాలు. ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోవలసినదే. కాని వాళ్ళందరిని వెలిగించిన స్వయం ప్రకాశకుడు దేవుడే. ఆయన నిత్యమూ ప్రకాశిస్తాడు.


సి.జి. ట్రంబుల్ గారు ఇలా రాసారు “ఒక రోజున నాకు డాక్టర్ జాన్ డగ్లస్ ఆడమ్స్ గారితో పరిచయమయింది. తనకి ఉన్న అతి ప్రశస్తమైన ఆత్మవరం ఏమిటంటే - యేసుక్రీస్తు ప్రత్యక్షంగా తన మనసులో ఉంటున్నాడన్న అచంచలమైన స్పందన అని ఆయన నాతో చెప్పారు. యేసు నిత్యమూ వ్యక్తిగతంగా తనతో ఉన్నాడన్న విషయం తనని నిత్యమూ నిలబెడుతూ ఉంటుందన్నారాయన. ఇదంతా ఆయన ఆలోచనలకి, యేసు తనలో ఎలా ఉంటున్నాడు అన్న అవగాహనకీ సంబంధంలేని ఒక అనుభూతి.


ఇంకా క్రీస్తు తన ఆలోచనకి నివాసం అన్నారాయన. ఇతర విషయాలనుండి బయటపడిన వెంటనే క్రీస్తువైపుకి తిరిగేది తన మనస్సు. తాను ఒంటరిగా ఉన్నప్పుడు క్రీస్తుతో బిగ్గరగా సంభాషించేవాడు. వీధిలోగాని, మరెక్కడైనా, తన స్నేహితుడితో మాట్లాడినట్టే మాట్లాడేవాడు. ఆయన క్రీస్తు సాహచర్యాన్ని అంత ప్రత్యక్షంగా అనుభవించాడు.”

-----------------------------------------------------------------------------------------------------------------------------

O Daniel, a servant of the living God, is thy God whom thou servest continually, able to deliver thee - (Dan - 6:20)

    How many times do we find this expression in the Scriptures, and yet it is just this very thing that we are so prone to lose sight of. We know it is written “the living God”; but in our daily life, there is scarcely anything we practice so much lose sight of as the fact that God is the living God; that He is now whatever He was three or four thousand years since; that He has the same sovereign power, the same saving love towards those who love and serve Him as ever He had and that He will do for them now what He did for others two, three, four thousand years ago, simply because He is the living God, the unchanging One. Oh, how therefore we should confide in Him, and in our darkest moments never lose sight of the fact that He is still and ever will be the living God!

    Be assured, if you walk with Him and look to Him and expect help from Him, He will never fail you. An older brother who has known the Lord for forty-four years, who writes this, says to you for your encouragement that He has never failed him. In the greatest difficulties, in the heaviest trials, in the deepest poverty and necessities, He has never failed me; but because I was enabled by His grace to trust Him He has always appeared for my help. I delight in speaking well of His name.  —George Mueller

    Luther was once found at a moment of peril and fear, when he had a need to grasp unseen strength, sitting in an abstracted mood tracing on the table with his finger the words, “Vivit! visit!” (“He lives! He lives!”). It is our hope for ourselves, for His truth, and for mankind. Men come and go; leaders, teachers, thinkers speak and work for a season, and then fall silent and impotent. He abides. They die, but He lives. They are lights kindled, and, therefore, sooner or later quenched; but He is the true light from which they draw all their brightness, and He shines forevermore.  —Alexander Maclaren

    “One day I came to know Dr. John Douglas Adam,” writes C. G. Trumbull. "I learned from him that what he counted his greatest spiritual asset was his unvarying consciousness of the actual presence of Jesus. Nothing bore him up so, he said, as the realization that Jesus was always with him in actual presence; and that this was so independent of his own feelings, independent of his deserts, and independent of his own notions as to how Jesus would manifest His presence.

    “Moreover, he said that Christ was the home of his thoughts. Whenever his mind was free from other matters it would turn to Christ; and he would talk aloud to Christ when he was alone—on the street, anywhere—as easily and naturally as to a human friend. So real to him was Jesus’ actual presence.