నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. (ప్రసంగి 7:3)
విచారం దేవుని కృప క్రిందికి వస్తే, అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది. ఆత్మలో ఎక్కడో మరుగుపడిపోయిన లోతుల్ని విచారం వెలికి తీస్తుంది. తెలియని సామర్ధ్యాలను, మరచిపోయిన అనుభవాలను వెలుగులోకి తెస్తుంది. నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండేవాళ్ళలో లోతు ఉండదు. తమలోని సంకుచితత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు. ఆత్మ అనే నేలను దున్ని పూడుకుపోయిన సారవంతమైన మట్టిని పైకి తీసే దేవుని నాగలే దుఃఖం. అందువల్ల పంటలు బాగా పండుతాయి. మనం పాపంలో పడకుండా మహిమ జీవితాలే గడుపుతూ ఉన్నట్లయితే దేవుని సంతోషం అనే మందమారుతమే మనలోని నిపుణతలను వెలికి తీసే సాధనమయ్యేది. కానీ ఈ పతనమైన లోకంలో మనకర్థమయ్యేలా చెయ్యడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం నిరాశతో కలుషితం కాని విచారమే. విచారంలోనే మనం దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తాం.
విచారం మనల్ని మెల్లగా తరచి తరచి మన హృదయాలను, అభిప్రాయాలను తలపోసుకుంటూ సాగేలా చేస్తుంది. పరలోకపు జీవితంలోని మాధుర్యాలను మనలో పుట్టించేది విచారమే. దేవుని కొరకు, తోటి మానవుల కొరకు సేవ చెయ్యడమనే మహా సముద్రంలో మన సమర్పణా నౌకను నడిపించడానికి మనలను ప్రోత్సహించేది విచారమే.
ఒక గొప్ప పర్వత శేణి దగ్గర కొందరు సోమరి జనం నివశిస్తున్నారు. ఆ పర్వతాల లోయలనూ దారులనూ వాళ్ళెప్పుడూ పరిశోధించడానికి పూనుకోలేదు. ఒక రోజు ఆ ప్రాంతాల్లో ఒక పెను తుఫాను వచ్చింది. వాళ్ళున్న ప్రాంతం మునిగిపోయే ప్రమాదం వచ్చేసరికి తప్పనిసరై వాళ్ళంతా పర్వతాల్లోకి వెళ్ళి నివాస స్థలం కోసం వెదకసాగారు. ఆ గాలివానలోనే వాళ్లకి ఆ పర్వతాల నిండా మంచి గుహలు, పండ్ల చెట్లు, నీటి వాగులు, మానవ నివాసానికి అన్ని సౌకర్యాలున్న ప్రదేశాలెన్నో కనిపించాయి. అప్పటి దాకా వాటిని వృధాగా పోనిచ్చినందుకు వాళ్ళు బాధ పడ్డారు. మనం కూడా ఇంతే. మన వ్యక్తిత్వపు ఇవతలి అంచులో ఏ చలనమూ లేకుండా ఉంటుంటాము. దుఃఖపు గాలివానలు వచ్చి మనలో అంత శక్తి ఉందని మనం ఊహించనైనా ఊహించలేని వ్యక్తిత్వాన్ని మనకి చూపిస్తాయి.
దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా విరగ్గొడితే గాని ఏ గొప్ప పనికీ వాడుకోడు. యాకోబుకున్న అందరు కొడుకుల కంటే యోసేపు ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు. ఇదే అతణ్ణి అనేక జనాంగాలకి అన్నదాతగా నిలబెట్టింది. అందుకే పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా అతని గురించి ఇలా వచించాడు. "యోసేపు ఫలించెడి కొమ్మ..." దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును" (ఆది 49:22). ఆత్మ విశాలం కావాలంటే దుఃఖం అవసరం.
నాగటి చాలు పైకి తెస్తుంది
సారవంతమైన సేంద్రియాన్ని
నేర్పింది ఇది నాకో సరికొత్త పాఠాన్ని
ఆకాశం కింద పరచుకున్న
అవనీతలం నా జీవితం
అందులో విరివిగా పండాలి ఫలసాయం
విశ్వాసం, దయ వంటి
బంగారు పంట ఎక్కడ పండుతుంది?
దుఃఖం అనే నాగలి దున్నిన గుండె పొలం లోనే
దేవుని కష్టాల బడిలో ప్రతి వ్యక్తి, ప్రతి జాతి పాఠాలు నేర్చుకోవాలి. "రాత్రి ఎంత బావుంటుంది! రాత్రిళ్ళే కదా చుక్కలు కనిపిస్తాయి" అంటాము. అలాగే "దుఃఖం ఎంత మంచిది. దుఃఖంలోనే దేవుని ఆదరణ మనకి దొరికేది" అనాలి. వరదలు వచ్చి ఒకతని ఇల్లు, అతని జీవనోపాది సర్వస్వం కొట్టుకుపోయింది. నీళ్ళన్నీ ఇంకిపోయిన తరువాత దిగాలుగా నిలబడి చూస్తున్నాడా వ్యక్తి. అంతలో నేలలో పాతుకొని ఏదో మెరుస్తూ కనిపించిందతనికి. వరద నీళ్ళు దానిపైనున్న మట్టిని కడిగేశాయి. "బంగారంలా ఉందే" అంటూ చూసాడతను. బంగారమే! అతన్ని దరిద్రుణ్ని చేసిన వరదలే అతన్ని ధనికుణ్ని చేసాయి. జీవితంలో చాలా సందర్భాలలో ఇలాగే జరుగుతుంది.
-----------------------------------------------------------------------------------------------------------------------------
Sorrow is better than laughter; for by the sadness of the countenance the heart is made better - (Eccl - 7:3)
When sorrow comes under the power of Divine grace, it works out a manifold ministry in our lives. Sorrow reveals unknown depths in the soul and unknown capabilities of experience and service. Gay, trifling people are always shallow, and never suspect the little meannesses in their nature. Sorrow is God’s plowshare that turns up and subsoils the depths of the soul, that it may yield richer harvests. If we had never fallen or were in a glorified state, then the strong torrents of Divine joy would be the normal force to open up all our souls’ capacities; but in a fallen world, sorrow, with despair taken out of it, is the chosen power to reveal ourselves to ourselves. Hence it is sorrow that makes us think deeply, long, and soberly.
Sorrow makes us go slower and more considerately, and introspect our motives and dispositions. It is sorrow that opens up within us the capacities of the heavenly life, and it is sorrow that makes us willing to launch our capacities on a boundless sea of service for God and our fellows.
We may suppose a class of indolent people living at the base of a great mountain range, who had never ventured to explore the valleys and canyons back in the mountains; and someday, when a great thunderstorm goes careening through the mountains, it turns the hidden glens into echoing trumpets, and reveals the inner recesses of the valley, like the convolutions of a monster shell, and then the dwellers at the foot of the hills are astonished at the labyrinths and unexplored recesses of a region so nearby, and yet so little known. So it is with many souls who indolently live on the outer edge of their own natures until great thunderstorms of sorrow reveal hidden depths within that were never hitherto suspected.
God never uses anybody to a large degree, until after He breaks that one all to pieces. Joseph had more sorrow than all the other sons of Jacob, and it led him out into a ministry of bread for all nations. For this reason, the Holy Spirit said of him, “Joseph is a fruitful bough…by a well, whose branches run over the wall” (Gen. 49:22). It takes sorrow to widen the soul. —The Heavenly Life
The dark brown mold’s upturned
By the sharp-pointed plow;
And I have a lesson learned.
My life is but a field,
Stretched out beneath God’s sky,
Some harvest rich to yield.
Where grows the golden grain?
Where faith? Where sympathy?
In a furrow cut by pain.
—Maltbie D. Babcock
Every person and every nation must take lessons in God’s school of adversity. “We can say, ’Blessed is night, for it reveals to us the stars.’ In the same way, we can say, ’Blessed is sorrow, for it reveals God’s comfort.’ The floods washed away home and mill, all the poor man had in the world. But as he stood on the scene of his loss, after the water had subsided, broken-hearted and discouraged, he saw something shining in the bank which the waters had washed bare. ’It looks like gold,’ he said. It was gold. The flood which had beggared him made him rich. So it is ofttimes in life.” —H. C. Trumbull