మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును*_ (1 పేతురు 5:10) క్రీస్తుతో మనం ఏదైనా కొత్త సంబంధంలోకి ప్రవేశించబోయే ముందు ఆయనతో ఆ సంబంధం పెట్టుకోవడానికి మనకి యోగ్యత ఉన్నదా అన్న విషయంలో మనల్ని సంతృప్తిపర్చుకోవాలి. అందుకుతగ్గ మనోవికాసం మనకి ఉండాలి. ఏమాత్రం సందేహపు ఛాయలున్నా మన నిశ్చయత సడలిపోతుంది. ఇది గ్రహించి మనం ఆ నిర్ణయాన్ని, ఆ సమర్పణను, ఆ మార్గాన్ని నిస్సందేహంగా ఎంచుకోవాలి. ఒక చెట్టు నేలలో నాటుకుని ఉన్నట్టు, వివాహవేదిక మీద వధువు వరునికి శాశ్వతంగా అంకితమైనట్టు మరి తిరుగులేకుండా ఒకేసారి బేషరతుగా ఇది జరిగిపోవాలి. ఆపైన స్థిరపడి, బలపడి పరీక్షల నెదుర్కొనడానికి కొంతకాలం పడుతుంది. ఈ కాలంలో మన సంబంధం శాశ్వతమై అలవాటుగా మారిపోయేంత వరకు మనం వదలకుండా గట్టిగా అంటిపెట్టుకుని ఉండాలి. డాక్టరు విరిగిన చెయ్యిని అతకడంలాటిదే ఇది. దాన్ని చెక్కముక్కల మధ్య అటూ ఇటూ కదలకుండా ఉంచుతారు. దేవుడు కూడా తన పిల్లలు విశ్వాసపు తొలిదశల్లో చంచలులు కాకుండా ఉండడానికి తన ఆత్మ సంబంధమైన పిండికట్టు వాళ్ళచుట్టూ కడతాడు. ఇది మనకి కష్టంగా ఉండవచ్చు గాని "తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.” పాపానికి, రోగానికి ఒకటే సహజ ధర్మం ఉంది. పరిస్థితుల ప్రభావానికి మనం లొంగి కృంగితే, ఇక అంతే. శోధకుని శక్తి మనల్ని పూర్తిగా అధోగతికి తొక్కేస్తుంది. అయితే ఆత్మీయ జీవనానికి, భౌతిక జీవనానికి కూడా వర్తించే మరొక ధర్మం కూడా ఉంది. క్రీస్తులో ఉంటే మనం వర్థిల్లుతాము. ఈ సూత్రం మొదట చెప్పిన సూత్రాన్ని నిర్వీర్యం చేసి, దానికధికారం లేకుండా చేస్తుంది. కాని దీన్ని చెయ్యడానికి మనకి నిజమైన ఆత్మశక్తి, దృఢ నిశ్చయం, అలవడిన విశ్వాసం, స్థిరమైన క్రైస్తవ జీవితం ఉండాలి. మన ఫ్యాక్టరీలో ఉపయోగించే శక్తిలాటితే ఇది కూడా. యంత్రానికున్న బెల్టు తిరుగుతూనే ఉండాలి. శక్తి ఎప్పుడూ అక్కడ ఉంటుంది. కాని దాన్ని మనకు ఉపయోగపడే యంత్రాల చక్రాలకు బెల్టు వేసి కలపాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ జనరేటరులోని శక్తి మిగతా యంత్రాలన్నిటినీ తిప్పుతుంది. ఎన్నుకోవడం, నమ్మడం, కట్టుబడి ఉండడం, దేవునితో నిలకడగా నడిచి వెళ్ళడం వీటన్నిటికీ ఆత్మీయ సూత్రాలున్నాయి. ఇవన్నీ పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రపరచడానికి, స్వస్థపరచడానికి అవసరం
Friday, January 28, 2022
Peter

Thursday, January 27, 2022
Deuteronomy
దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టియున్నాను . . . స్వాధీనపరచుకొన మొదలుపెట్టుము*_ (ద్వితీ 2:31) దేవుని కోసం కనిపెట్టడం గురించి బైబిల్లో చాలా వివరణ ఉంది. దీనికున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే మనం సహసం కోల్పోతూ ఉంటాము. మన జీవితాల్లో కష్టాలన్నీ ఎందుకు వస్తాయంటే మన తొందరపాటు, దుడుకుతనం వల్లనే. ఒక ఫలం పండే దాకా మనం ఉండలేం. పచ్చిగా ఉన్నపుడే తుంచెయ్యాలని చూస్తాము. మన ప్రార్థనలకు జవాబు కోసం ఓపికతో కనిపెట్టలేం. మనం అడిగేవి పొందడానికి మనకి చాలా సంవత్సరాల పాటు అవసరమైనప్పటికీ వెంటనే పొందాలని చూస్తాము. దేవునితో నడవాలనుకుంటాము. బాగానే ఉంది. కానీ దేవుడు ఒక్కోసారి చాలా మెల్లిగా నడుస్తాడు. అంతేకాదు, దేవుడు మన కోసం ఆగి ఎదురు చూస్తాడు కూడా. ఆయనతో కలిసి ముందుకు వెళ్ళకపోవడం వల్ల మన కోసం ఆయన సిద్ధపరచిన ఆశీర్వాదాలను పొందము. దేవుని సమయం కోసం ఎదురు చూడకపోయినా, సమయం వచ్చినప్పటికీ అలా ఎదురుచూస్తూనే ఉండిపోయినా ఎంతో శ్రేయస్సుని చేతులారా జారవిడుచుకుంటాము. కదలక ఊరికే కూర్చోవడంలో ఒక్కోసారి మనకి లాభం కలుగుతుంది. ఒక్కోసారి సంకోచంలేని అడుగులతో ముందుకి సాగవలసి ఉంటుంది. మనం చెయ్యవలసిన పనిని ముందు మనం మొదలు పెట్టిన తరువాత మాత్రమే నెరవేరే దేవుని వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. మనం లోబడడం మొదలుపెడితే దేవుడు ఆశీర్వదించడం మొదలుపెడతాడు. అబ్రాహాముకి చాలా వాగ్దానాలు చేసాడు దేవుడు. కాని అబ్రాహాము కల్దీయుల దేశంలోనే ఆగిపోయినట్టయితే అవేవీ నిజమయ్యేవి కావు. అబ్రాహాము తన దేశాన్నీ, బంధువులనీ, ఇంటినీ వదిలి, కొత్త దారులగుండా ప్రయాణాలు చేసి, తొట్రుపడని విధేయతతో సాగవలసి ఉంది. అప్పుడే ఆ వాగ్దానాలు నెరవేరుతాయి. పదిమంది కుష్టరోగుల్ని ప్రభువు ఆజ్ఞాపించాడు. మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాల్ని చూపెట్టుకోండి అని. “వాళ్ళు వెళ్తూ ఉండగా” వాళ్ళ శరీరాలు బాగయ్యాయి. తమ దేహాలు పరిశుద్ధమయ్యే దాకా కదలకుండా ఉన్నట్టయితే వాళ్ళపట్ల ఆ అద్భుతం అసలు జరిగేది కాదు. వాళ్ళని బాగుచెయ్యాలని దేవుడు ఎదురుచూస్తున్నాడు. వాళ్ళ విశ్వాసం పనిచెయ్యడం మొదలుపెట్టినప్పటినుంచి ఆ దీవెన వాళ్ళలో పనిచెయ్యడం ప్రారంభించింది. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుబడిపోయినప్పుడు వాళ్ళకి వచ్చిన ఆజ్ఞ ఏమిటంటే “మీరు సాగిపోవుడి.” ఇక వేచి ఉండడం వాళ్ళ పనికాదు. లేచి సాహసోపేతమైన విశ్వాసంతో ముందుకి వెళ్ళడమే. వాళ్ళ విశ్వాసాన్ని ప్రదర్శించమని మరోసారి ఆజ్ఞ అయింది -యొర్దాను నది నిండుగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని మీదుగా నడిచి వెళ్ళమని. వాగ్దాన దేశానికి నడిపించే ద్వారాలకున్న తాళాన్ని తీసే తాళపుచెవి వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఆ ద్వారాన్ని సమీపించి దాన్ని తెరిచే దాకా అది తెరుచుకోలేదు. ఆ తాళంచెవి విశ్వాసమే. మనం కొన్ని యుద్ధాలు చేయవలసి ఉంది. మనం యుద్ధరంగంలోకి దూకినప్పుడు ఒక వ్యక్తి మన పక్షంగా పోరాడుతాడు. ఆయనలో మనం జయశాలులం. కాని మనం వణకుతూ, సందేహిస్తూ మన సహాయకుడు వచ్చే దాకా యుద్ధం మొదలుపెట్టం అని కూర్చుంటే ఆ ఎదురు తెన్నులకి అంతం ఉండేది కాదు. ఇది విశ్వాసంతో సమయానికి మించి ఎదురు చూడడం. దేవుడు నీ మీద తన పరమాశీర్వాదాలను కురిపించాలని ఎదురు చూస్తున్నాడు. ధైర్యంతో కూడిన నిరీక్షణతో ముందుకి వెళ్ళి నీ హక్కును దక్కించుకో. “నేను ఇవ్వడం మొదలుపెట్టాను, స్వాధీనపర్చుకోవడం మొదలుపెట్టు.”
Wednesday, January 26, 2022
Psalm
నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును*_ (కీర్తన 23:4)
మా నాన్నగారిది ఓ పల్లెటూరు. ఆ ఊళ్లో మా ఇంట్లో ఒక చిన్న అల్మెరా ఉంది. దాన్లో తరతరాలుగా మా పూర్వికులు వాడిన చేతికర్రలు భద్రంగా ఉన్నాయి. సెలవులకి ఆ ఊరు వెళ్ళి ఆ యింట్లో ఉంటుంటాము. అక్కడుండేటప్పుడు నేను, మా నాన్నగారు షికారుకి వెళ్తూ అల్మెరా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకుని బయటికి వెళ్ళేవాళ్ళం. ఈ సందర్భాల్లో దుడ్డుకర్ర గురించిన వాక్యం నాకు గుర్తుకు వచ్చేది.
యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డుకర్రలాగా ఆదరించేది. “చెడు వర్తమానమునకు అతడు భయపడడు. అతని హృదయము దేవుని నమ్ముకొని స్థిరముగానున్నది.”
మా కుమారుణ్ణి యుద్ధం పొట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది. వాక్యంలో మా ఆదరణకి మరో దుడ్డుకర్ర దొరికింది. “రాత్రంతయు విలాపముండెను. ఉదయముతోపాటు ఆనందము వచ్చెను.”
నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంవత్సరంపాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది. తిరిగి ఇంటికివెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి. నాతోబాటు ఓ దుడ్డుకర్రను తీసుకెళ్ళాను. అది నన్నెప్పుడు ఆదరించక మానలేదు. “నా పక్షముగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తెలియును. అవి మేలుకేగాని కీడు చేయునవి కావు.”
ప్రమాదం, లేక అనుమానం అలుముకున్న సమయంలో, సమస్య మానవ జ్ఞానానికి అందకుండాపోయిన వేళలో ఈ దుడ్డుకర్ర సాయంతో ముందుకి సాగిపోవడం నాకు తేలికైంది. “ఊరకుండుటయందే వారికి బలము కలదు.” అత్యవసర పరిస్థితుల్లో స్థిమితంగా ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డుకర్ర ఆదుకునేది. “తొందరపడని నిరీక్షణ గలవాణ్ణి.”
మార్టిన్ లూథర్ భార్య ఒకసారి అంది, “దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాక పోయినట్టయితే, ఫలానా కీర్తనలో ఫలానా విషయాలున్నాయనీ, ఆత్మ ఫలానా రీతిలో పనిచేస్తుంటుందని నాకెప్పటికీ తెలిసేది కాదు. క్రైస్తవుల బాధ్యతలేమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. దేవుని దండం చిన్న పిల్లవాడిని శిక్షించే ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది. అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది. దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితుల్లో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు.
*దేవుడెప్పుడూ తన దండంతోపాటు దుడ్డుకర్ర కూడా పంపుతాడు.*
_*“నీ కమ్ములు (పాదరక్షలు) ఇనుపవియు, ఇత్తడివియునై యుండును. నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి (బలము) కలుగును”*_ (ద్వితీ 33:25)
రాతిబండలున్న దారిగుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చెప్పులు ఇస్తాడని నిస్సందేహముగా నమ్ముదాం. మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికీ పంపడు.
Subscribe to:
Posts (Atom)