Wednesday, February 9, 2022

Hope vs. Fear

యేసు - ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను - (మత్తయి 28:20).

జీవితంలో సంభవించే మార్పులు, సంఘటనల గురించి భయం భయంగా కనిపెట్టకు. నువ్వు దేవునికి చెందినవాడివి గనుక ఆయన వాటన్నిటినుండి నిన్ను విమోచిస్తాడన్న నిరీక్షణతో ఎదురు చూడు. ఇప్పటిదాకా నిన్ను ఆయన కాపాడాడు. ఆయన చేతిని గట్టిగా పట్టుకొని ఉండు. అన్ని ఆపదలలోనూ క్షేమంగా నడిపిస్తాడు. నువ్వు నిల్చోడానికి కూడా శక్తి లేకుండా ఉన్నప్పుడు తన చేతుల్లోకి నిన్ను ఎత్తుకుంటాడు.

రేపేం జరుగుతుందో అని దిగులుపడకు. నిన్ను ఈ రోజంతా కాపాడిన నీ నిత్యుడైన తండ్రి రేపు, రాబోయే అన్ని రోజుల్లోనూ నిన్ను కాపాడతాడు. నిన్ను శ్రమల నుండి తప్పిస్తాడు. లేక శ్రమను భరించే శక్తినిస్తాడు. నిబ్బరంగా ఉండు. ఆందోళనకరమైన ఆలోచనల్ని ఊహల్ని కట్టి పెట్టు.

యెహోవా నా కాపరి

‘ఒకప్పుడు నా కాపరి’ కాదు, ‘మరెప్పుడో నా కాపరి’ కాదు, 'ఇప్పుడు’ యెహోవా నా కాపరి. ఆదివారం, సోమవారం అన్ని రోజుల్లో ఆయన నా కాపరి. జనవరి నుండి డిసెంబరు దాకా, ఇక్కడైనా, చైనాలోనైనా, శాంతికాలంలోనైనా, యుద్ధంలోనైనా, సమృద్ధిలోనైనా, కరువులోనైనా యెహోవా నా కాపరి.

నీకోసం మౌనంగా ఏర్పాట్లు ఆయనే చేస్తాడు

పొంచి ఉన్న వలలో నువ్వు పడకుండా

నీ మార్గదర్శి ఆయనే

ఆయన సంరక్షణలో ఉన్నావు నీవు


నీకోసం ఏర్పాట్లు తప్పకుండా చేస్తాడు

నిన్ను విస్మరించడు

దేవుని విశ్వాస్యతలో నిశ్చింతగా ఉండు

ఆయనలో నీవు వర్ధిల్లుతావు


నీ కోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు

అవి ఆశ్చర్యకారకాలైన అనురాగ బహుమతులు 

కనీవినీ ఎరుగని అద్భుతాలు

నీ కోసమే వాటిని చేసాడు


నీ కోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు

తండ్రి సంరక్షణలో కేరింతలు కొట్టే పాపలా

ఆయన ప్రేమలో మరెవరికీ వంతులేదు

నువ్వే ఆయనకి ఇష్టుడివి 


నీ విశ్వాసం దేవుని గురించి ఎలా అర్థం చేసుకుంటే ఆయన అలాగే ఉంటాడు.

---------------------------------------------------------------------------------------------------------------------------

Lo, I am with you all the appointed days - (Matt - 28:20)

    Do not look forward to the changes and chances of this life in fear. Rather look at them with full hope that, as they arise, God, whose you are, will deliver you out of them. He has kept you hitherto; do you but hold fast to His dear hand, and He will lead you safely through all things; and when you cannot stand, He will bear you in His arms.

    Do not look forward to what may happen tomorrow. The same everlasting Father who cares for you today will take care of you tomorrow, and every day. Either He will shield you from suffering, or He will give you unfailing strength to bear it. Be at peace, then, put aside all anxious thoughts and imaginations.  —Frances do Sales

    “The Lord is my shepherd.”

    Not was, not maybe, nor will be. “The Lord is my shepherd,” is on Sunday, is on Monday, and is through every day of the week; is in January, is in December, and every month of the year; is at home, and is in China; is in peace, and, is in war; in abundance, and in penury.  —J. Hudson Taylor

He will silently plan for thee,

Object thou of omniscient care;

God Himself undertakes to be

Thy Pilot through each subtle snare.


He WILL silently plan for thee,

So certainly, He cannot fail!

Rest on the faithfulness of God,

In Him, thou surely shalt prevail.


He will SILENTLY plan for thee

Some wonderful surprise of love.

Eye hath not seen, nor ear hath heard,

But it is kept for the above.


He will silently PLAN for thee,

His purposes shall all unfold;

The tangled skein shall shine at last,

A masterpiece of skill untold.


He will silently plan FOR THEE,

Happy child of a Father’s care,

As though no other claimed His love,

But thou alone to Him were dear.

—E. Mary Grimes


    Whatever our faith says God is, He will be.

Tuesday, February 8, 2022

Cast Down

 

నా ప్రాణమా, నీవేల కృంగియున్నావు? - (కీర్తనలు 43:5)

కృంగిపోవడానికి కారణమేమైనా ఉందా? రెండంటే రెండే కారణాలు. ఒకటి, నువ్వింకా రక్షణ పొందలేదు. రెండు, రక్షణ పొంది కూడా పాపంలో జీవిస్తునావు.

ఈ రెండు కారణాలు తప్ప కృంగిపోవడానికి మరే కారణమూ లేదు. ఎందుకంటే కృంగిపోవలసిన కారణం వస్తే దాన్ని దేవునికి ప్రార్థనలో విన్నవించుకోవచ్చు. మన అవసరాలన్నిటి గురించి, కష్టాలన్నిటి గురించి, శ్రమలన్నిటి గురించి, దేవుని శక్తిలో, ప్రేమలో మనకున్న విశ్వాసాన్ని ఉపయోగించి ఆదరణ పొందవచ్చు.

“దేవుని యందు నిరీక్షణ యుంచుము.” దీన్ని గుర్తుచుకోండి. దేవునిలో నిరీక్షణ ఉంచకూడదు అనే సమయం, సందర్భం లేనే లేవు. మన అవసరాలేవైనా, మన ఇబ్బందులేవైనా, మనకి సహాయకులెవరూ లేకపోయినా, మన కర్తవ్యం ఒకటే, దేవునిలో నిరీక్షణ కలిగి ఉండడం. అదెప్పుడూ నిరర్థకం కాదు. దేవుని దృష్టికి అనుకూలమైన కాలంలో నీకు సహాయం వస్తుంది.

జార్జి ముల్లర్ అంటున్నాడు, “గడిచిన డెబ్బయి సంవత్సరాల నాలుగు నెలల్లో కొన్ని వేలసార్లు ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

“ఇక సహాయం రావడం అసాధ్యం అనుకున్నప్పుడు సహాయం వచ్చేది. ఎందుకంటే దేవుని మహిమ ఎలాంటిదో మనకి తెలియదు కదా. ఆయన శక్తికి హద్దులు లేవు. మనకి సహాయం చెయ్యాలంటే ఆయన పదివేలసార్లు పదివేల మార్గాల్లో చెయ్యగలడు.

పసిపిల్లవాడిలాగా మన సమస్యని ఆయన ముందు ఉంచడమే మన పని. “తండ్రీ, నా విన్నపాలు విని వాటికి నువ్వు జవాబివ్వడానికి నేను అర్హుణ్ణికాను. కాని మా రక్షకుడైన యేసుప్రభువు ద్వారా, ఆయన కొరకు నా ప్రార్థనని ఆలకించు. నువ్వు నా ప్రార్థనకి జవాబిచ్చేదాకా నమ్రతతో కనిపెట్టగలగడానికి కృపను ప్రసాదించు. ఎందుకంటే నీకు తగిన కాలంలో నీకు తోచినరీతిగా నాకు సమాధానమిస్తావని నాకు తెలుసు" అంటూ మన హృదయాలను ఆయన ముందు ఒలకబోయాలి.

“ఇంకను నేనాయనను స్తుతించెదను.” ఎక్కువ ప్రార్థన, ఎక్కువగా విశ్వాసం మీద ఆధారపడడం, ఓపికతో కనిపెట్టడం, వీటన్నిటి ఫలితం పుష్కలమైన ఆశీర్వాదాలు. అందుకనే నిత్యం నాలో నేను అనుకుంటాను. “దేవునియందు నిరీక్షణ యుంచుము.”

-----------------------------------------------------------------------------------------------------------------------------

Why art thou cast down, O my soul - (Ps - 43:5) 

    Is there ever any ground to be cast down? There are two reasons, but only two. If we are as yet unconverted, we have ground to be cast down; or if we have been converted and live in sin, then we are rightly cast down.

    But except for these two things, there is no ground to be cast down, for all else may be brought before God in prayer with supplication and thanksgiving. And regarding all our necessities, all our difficulties, all our trials, we may exercise faith in the power of God, and in the love of God.

    “Hope thou in God.” Oh, remember this: There is never a time when we may not hope in God. Whatever our necessities, however great our difficulties, and though to all appearance help is impossible, yet our business is to hope in God, and it will be found that it is not in vain. In the Lord’s own time help will come.

    Oh, the hundreds, yea, the thousands of times that I have found it thus within the past seventy years and four months!

    When it seemed impossible that help could come, help did come; for God has His own resources. He is not confined. In ten thousand different ways, and at ten thousand different times God may help us.

    Our business is to spread our cases before the Lord, in childlike simplicity to pour out all our heart before God, saying,

    “I do not deserve that Thou shouldst hear me and answer my requests, but for the sake of my precious Lord Jesus; for His sake answer my prayer, and give me grace quietly to wait till it pleases Thee to answer my prayer. For I believe Thou wilt do it in Thine own time and way.”

    “For I shall yet praise him.” More prayer, more exercise of faith, more patient waiting, and the result will be blessing, abundant blessing. Thus I have found it many hundreds of times, and therefore I continually say to myself, “Hope thou in God.”  —George Mueller

Monday, February 7, 2022

Rejoice in the Flood

ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను. జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయనయందు మేము సంతోషించితిమి - (కీర్తనలు 66:6)

ఇది చాలా గంభీరమైన సాక్ష్యం. మహాజలాల్లోనుంచి ప్రజలు కాలినడకన దాటారు. భయం, వణుకు, వేదన, నిరాశ ఉండవలసిన ప్రదేశంలో సంతోషం పుట్టింది. “అక్కడ ఆయనయందు మేము సంతోషించితిమి" అంటున్నాడు కీర్తనకారుడు.

తన స్వంత అనుభవంగా ఇలాటి సాక్ష్యం ఇవ్వగలవారు ఎంతమంది ఉన్నారు? “అక్కడ” బాధ, గుబులు గూడుకట్టుకుని ఉన్న సమయాల్లో అంతకుముందెన్నడూ లేనిరీతిని వారు విజయాన్ని, ఉత్సాహాన్ని చవిచూశారు.

నిబంధన మూలంగా వారి దేవుడు వారికెంత చేరువగా వచ్చాడు! ఆయన వాగ్దానాలు ఎంత ధగధగా మెరిసాయి! మనం సుఖసంపదలతో తులతూగుతున్నప్పుడు ఈ ధగధగలు మనకి కనిపించవు. మధ్యాహ్నం సూర్యబింబం యొక్క ప్రకాశం నక్షత్రాలను కనిపించకుండా చేస్తుంది. కాని మన జీవితాల్లో చీకటి మూగినప్పుడు, దుఃఖాంధకారం మూసినప్పుడు, తారలు గుంపులు గుంపులుగా బయటకి వస్తాయి. ఆశాభావం, ఓదార్పులనే బైబిల్ నక్షత్ర సమూహాలు తళతళలాడతాయి.

యబ్బోకు రేవు దగ్గర యాకోబులాగా మన ఇహలోక సూర్యబింబం అస్తమించాకే దివ్యదూత బయలుదేరతాడు. ఆయనతో మనం పోరాడి గెలవాలి. “సాయంకాలమైనప్పుడు రాత్రివేళ కొరకు” అహరోను, సన్నిధి గుడారంలో దీపాలు వెలిగిస్తాడు. బాధల నడి రాత్రిలోనే విశ్వాసి మదిలో దేదీప్యమానమైన దివ్వెలు వెలుగుతాయి.

యోహాను “ప్రవాసంలోనే, తన ఒంటరితనంలోనే” తన విమోచకుని దర్శనం పొందాడు. లోకంలో నేటికీ పత్మసులు అనేకం ఉన్నాయి. ఏకాకిగా, శోకంలో ఉన్న రోజుల్లో దేవుని సన్నిధి, కృప, ప్రేమల జ్ఞాపకాలు ప్రకాశమానంగా వెలుగుతాయి. 

ఈ లోకబాధలనే యొర్దానులు, ఎర్ర సముద్రాలు దాటుతున్న ఎందరో యాత్రికులు నిత్యత్వంలోకి ప్రవేశించాక గుర్తుచేసుకుంటారు. దేవుని ఎనలేని అనుగ్రహాన్ని తలంచుకుని ‘అక్కడ గొప్ప జలాల్లో మేము కాలినడకన వెళ్ళాం’ అంటారు. ఆ చీకటి అనుభవాల్లో నలువైపులా ఎగసిపడే అలలతో, అగాధల్లో, వరద యొర్దాను భీభత్సంలో “అక్కడ ఆయనయందు మేము సంతోషించితిమి” అంటూ సాక్ష్యమిస్తారు.

“అక్కడ నుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణద్వారముగా చేసెదను...” (హోషేయ 2:15). ప్రియులారా, దేవుని మాటను మీ హృదయంలో ముద్రించుకోండి. దేవుడు అంటున్నాడు, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగ చేసెదను.

-----------------------------------------------------------------------------------------------------------------------------

He turned the sea into dry land; they went through the flood on foot: there did we rejoice in him - (Ps - 66:6)

     It is a striking assertion, “through the floods” (the place where we might have expected nothing but trembling and terror, anguish and dismay) “there,” says the Psalmist, “did we rejoice in him!”

    How many there are who can endorse this as their experience: that “there,” in their very seasons of distress and sadness, they have been enabled, as they never did before, to triumph and rejoice.

    How near their God in the covenant is brought! How brightly shine His promises! In the day of our prosperity, we cannot see the brilliancy of these. Like the sun at noon, hiding out the stars from sight, they are indiscernible; but when night overtakes, the deep, dark night of sorrow, outcome these clustering stars—blessed constellations of Bible hope and promise of consolation.

    Like Jacob at Jabbok, it is when our earthly sun goes down that the Divine Angel comes forth, and we wrestle with Him and prevail.

    It was at night, “in the evening,” Aaron lit the sanctuary lamps. It is in the night of trouble the brightest lamps of the believer are often kindled.

    It was in his loneliness and exile John had the glorious vision of his Redeemer. There is many a Patmos still in the world, whose brightest remembrances are those of God’s presence and upholding grace and love in solitude and sadness.

    How many pilgrims, still passing through these Red Seas and Jordans of earthly affliction, will be enabled in the retrospect of eternity to say—full of the memories of God’s great goodness—“We went through the flood on foot, they're—there, in these dark experiences, with the surging waves on every side, deep calling to deep, Jordan, as when Israel crossed it, in ’the time of the overflowing’ (flood), yet, ’there did we rejoice in Him!’”  —Dr. Macduff

    “And I will give her her vineyards from thence, and the door of trouble for a door of hope: and she shall sing THERE” (Hosea 2:15).