నేను నిన్ను బాధ పరచితినే, నేను నిన్నిక బాధపెట్టను - (నహూము 1:12).
బాధకి అంతు ఉంది. దేవుడు బాధపెడతాడు. దేవుడే తీసేస్తాడు. “ఈ బాధకి అంతమెప్పుడు?” అంటూ నిట్టూరుస్తావా? ఆయన వచ్చేదాకా ఆయన సంకల్పాన్ని శిరసావహిస్తూ నిబ్బరంగా సహనంతో ఎదురు చూద్దాం. శిక్ష పొందడం వల్ల మనకి కలగవలసిన ప్రయోజనమంతా కలిగిన తరువాత దేవుడే ఆ శిక్షను తొలగిస్తాడు.
శ్రమ ఏదైనా మనల్ని పరీక్షించడానికి వస్తే, మనం ఆయన్ని స్తుతించి, ఆయన గురించి సాక్ష్యమిచ్చి, ఆయన్ని మహిమ పర్చిన తరువాత అది అంతమవుతుంది.
మనం దేవునికి ఆపాదించవలసిన ఘనత అంతా పూర్తిగా ఆపాదించకుండా ఒక శ్రమ మన నుండి తొలగిపోవాలి అని కోరుకోకూడదు. ఈ రోజున భయంకరంగా ఆకాశాన్నంటే కెరటాలు ఎప్పుడు చప్పబడిపోతాయో ఎవరికి తెలుసు? సముద్రం గాజులాగా నిర్మలంగా అయితే సముద్ర పక్షులు అలలతో ఎంత త్వరగా ఆటలు ఆడతాయో మనకేమి తెలుసు?
శ్రమకాలం గతించాక, పనలను దుళ్ళగొట్టి తూర్పారబట్టడం అయిపోయాక, గాదెల్లో ధాన్యం నిండుతుంది. ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నామో కొద్ది గంటలు గడిచాక అంత సంతోషభరితులమవుతాము.
రాత్రిని పగలుగా మార్చడం ప్రభువుకి కష్టమేమీ కాదు. మేఘాల్ని పంపినవాడు వాటిని వెళ్ళగొట్టగలడు కూడా. దిగులు మాని ఉత్సాహంగా ఉందాం. ముందు కాలం మంచిది. దానికోసం ఎదురుచూస్తూ స్తుతులు పాడుదాం.
మన పరమ రైతు అస్తమానమూ నలగగొడుతూనే ఉండడు. ఇది ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే. వర్షాలు త్వరలోనే వెలిసిపోతాయి. ఏడుపు కొద్దిగంటలే ఉంటుంది. తెల్లవారితే ఇక శోకం ఉండదు. మన శ్రమ క్షణికమే. శ్రమకి ఓ ప్రయోజనం ఉంది.
మనకి శ్రమ వచ్చిందన్న విషయమే మనలో దేవుడికి కావలసిన అతి ప్రశస్తమైనదేదో ఉన్నదన్న విషయానికి నిరూపణ. లేకపోతే అంత సమయం వృధా చేసి అంత శ్రద్ద మన మీద ఎందుకు చూపిస్తాడాయన? మట్టి, ఖనిజం కలిసిపోయి ఉన్నట్టు మన సహజ ప్రవృత్తిలో విశ్వాసమనే విలువగల ఖనిజం కలిసిపోయి ఉంది. కాబట్టే క్రీస్తు మనల్ని ఈ పరీక్షలకి గురిచేస్తున్నాడు. ఈ నైర్మల్యాన్నీ, పరిశుద్ధతనూ వెలికి తేవాలనే ఆయన మనల్ని కొలిమిలో వేసి కాలుస్తున్నాడు.
పీడితుల్లారా, ఓపిక పట్టండి. ఆ కష్టాలు మనలను నిత్యమహిమ వారసుల్ని చేసినట్టు మనం చూస్తాం. ఆ ఫలితం ఇప్పటి కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది. దేవుడు మనల్ని మెచ్చుకుంటూ అనే ఒక్క మాట, దేవదూతల ఎదుట మనకి జరిగే సన్మానం, క్రీస్తులో మనం పొందే మహిమ, వీటన్నిటి ముందు ఈ బాధలు లెక్కలోనివా?
గోడ గడియారానికి బరువుగా వ్రేలాడే లోలకం, ఓడని స్థిరపరచడానికి వేసే బరువులు అవి సరిగా పనిచెయ్యడానికి అవసరం. మన ఆత్మీయ జీవితంలో శ్రమలు కూడా అంతే. అంతులేని వత్తిడిని ఉపయోగిస్తేనే పరిమళాలు తయారవుతాయి. ఉన్నత శిఖరాల్లో మంచు కురిసేచోట్ల కళ్ళు మిరుమిట్లు గొలిపే పూలు పూస్తాయి. కంసాలి చేతుల్లో ఎక్కువ దెబ్బలు తిన్నదే ఎక్కువ విలువగల వజ్రం. శిల్పాలు ఎంత అందంగా తయారవ్వాలంటే శిల్పిచేతిలో అన్ని ఎక్కువ ఉలి దెబ్బలు తినాలి. ఇవన్నీ నియమాలే. ఇవన్నీ అతి జాగ్రత్తగా అంచనా వేసి ముందు చూపుతో చేసేవే.
---------------------------------------------------------------------------------------------------------------------------
This is what the Lord says: “Even though they are powerful – and what is more, even though their army is numerous – nevertheless, they will be destroyed and trickle away! Although I afflicted you, I will afflict you no more - (Nah -1:12 )
There is a limit to affliction. God sends it and removes it. Do you sigh and say, “When will the end be?” Let us quietly wait and patiently endure the will of the Lord till He cometh. Our Father takes away the rod when His design in using it is fully served.
If the affliction is sent for testing us, that our graces may glorify God, it will end when the Lord has made us bear witness to His praise.
We would not wish the affliction to depart until God has gotten out of us all the honor which we can possibly yield Him.
There may be today “a great calm.” Who knows how soon those raging billows will give place to a sea of glass, and the sea birds sit on the gentle waves?
After long tribulation, the flail is hung up, and the wheat rests in the garner. We may, before many hours are past, be just as happy as now we are sorrowful.
It is not hard for the Lord to turn night into day. He that sends the clouds can as easily clear the skies. Let us be of good cheer. It is better farther on. Let us sing Hallelujah by anticipation. —C. H. Spurgeon.
The great Husbandman is not always threshing. The trial is only for a season. The showers soon pass. Weeping may tarry only for the few hours of the short summer night; it must be gone at daybreak. Our light affliction is but for a moment. The trial is for a purpose, “If needs be.”
The very fact of trial proves that there is something in us very precious to our Lord; else He would not spend so many pains and time on us. Christ would not test us if He did not see the precious ore of faith mingled in the rocky matrix of our nature, and it is to bring this out into purity and beauty that He forces us through the fiery ordeal.
Be patient, O sufferer! The result will more than compensate for all our trials when we see how they wrought out the far more exceeding and eternal weight of glory. To have one word of God’s commendation; to be honored before the holy angels; to be glorified in Christ, to be better able to flash His glory on Himself—ah! that will more than repay for all. —Tried by Fire
As the weights of the clock, or the ballast in the vessel, are necessary for their right ordering, so is trouble in the soul-life. The sweetest scents are only obtained by tremendous pressure; the fairest flowers grow amid Alpine snow-solitudes; the fairest gems have suffered longest from the lapidary’s wheel; the noblest statues have borne most blows of the chisel. All, however, are under the law. Nothing happens that has not been appointed with consummate care and foresight. —Daily Devotional Commentary