Saturday, February 19, 2022

Faith Becomes sight

 ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి;  అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను - (మార్కు 11:24).

మా చిన్న కొడుకు పదేళ్ళ వయస్సులో ఉన్నప్పుడు వాళ్ళ మామ్మ వాడికి క్రిస్మస్ బహుమతిగా ఒక స్టాంపుల ఆల్బమ్ ఇస్తానని మాట ఇచ్చింది. క్రిస్మస్ వచ్చేసింది కాని ఆల్బమ్ రాలేదు. మామ్మ దగ్గర్నునుండి ఉత్తరం కూడా రాలేదు. ఈ విషయాన్నెవరూ ప్రస్తావించ లేదు. వాడి స్నేహితులు వాడి క్రిస్మస్ బహుమతుల్ని చూడ్డానికి వచ్చారు. తనకి వచ్చిన బహుమతులన్నీ వాళ్ళకి చూపించాక అన్నాడు మావాడు “ఇవి కాక మా మామ్మ పంపించిన స్టాంపుల ఆల్బమ్.” నాకు ఆశ్చర్యమేసింది.

చాలామందితో అలానే  చెప్తూ వచ్చాడు. ఒకసారి వాడిని పిలిచి అడిగాను “జార్జ్, మామ్మగారు నీకు ఆల్బమ్ పంపించలేదు కదా, ఉందని ఎందుకు చెబుతున్నావు?”

జార్జి నావంక విచిత్రంగా చూసాడు. అసలా ప్రశ్న అడగవలసిన అవసరం ఏమొచ్చిందన్నట్టు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అన్నాడు. “అదేమిటమ్మా, మామ్మగారు పంపుతానని చెప్పిందిగా, చెప్తే పంపినట్టే" వాడి విశ్వాసాన్ని వమ్ముచేసే మాట ఏమి అనడానికి నాకు నోరు రాలేదు.

ఒక నెల గడిచిపోయింది. ఆల్బమ్ జాడలేదు. చివరికి ఒక రోజున జార్జి విశ్వాసం ఎలా ఉందో చూద్దామని కొంత, నిజంగానే ఆల్బమ్ ఎందుకు రాలేదా అనే సంశయంతో కొంత, వాణ్ణి పిలిచాను.

“మీ మామ్మగారు నీ ఆల్బమ్ గురించి మరిచిపోయినట్టుంది.” “లేదమ్మా" జార్జి స్థిరంగా జవాబిచ్చాడు. “ఎన్నటికి మర్చిపోదు.”

నమ్మకంతో వెలిగిపోతున్న ఆ పసిమొహాన్ని చూసాను. కాస్సేపు నేనన్నది నిజమేనేమో అన్న అనుమానపు నీడలు అందులో కదలాడినాయి. అంతలోకే మొహం కాంతివంతమైంది.

“అమ్మా, ఆల్బమ్ గురించి థ్యాంక్స్ చెప్తూ మామ్మగారికి ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది” అన్నాడు.

“ఏమో, ప్రయత్నించి చూడు” అన్నాను.

ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం నాలో ఉదయించింది. జార్జి నిమిషాలమీద ఒక ఉత్తరం రాసేసి పోస్టు చేసాడు. ఈల వేసుకుంటూ మామ్మగారి మీద తనకి ఉన్న విశ్వాసంతో తేలిక హృదయంతో వెళ్ళిపోయాడు. వెంటనే జవాబు వచ్చింది.

"ప్రియమైన జార్జి, నీకు ఆల్బమ్ ఇస్తానన్న మాటను నేను మర్చిపోలేదు. నువ్వు అడిగిన ఆల్బమ్ గురించి ప్రయత్నించాను. నీకు కావల్సింది దొరకలేదు. అందుకని న్యూయార్క్ వెళ్ళాను. క్రిస్మస్ గడిచిపోయాక తిరిగి రాలేకపోయాను. అక్కడ దొరికింది కూడా నువ్వడిగింది కాదు. అందుకని మళ్ళీ మరొకదాని కోసం రాసాను. అదింకా రాలేదు. నీకిప్పుడు మూడు డాలర్లు పంపిస్తున్నాను. చికాగోలో నీక్కావలసింది కొనుక్కో” - ప్రేమతో మామ్మగారు. 

జార్జి ఆ ఉత్తరాన్ని విజయగర్వంతో చదువుకున్నాడు. “అమ్మా, నేను చెప్పలేదూ” అనిన వాడి మాట సందేహాల్లేని ఆ హృదయపు లోతుల్లోనుండి వచ్చింది. ఆ ఆల్బమ్ వస్తుందన్న వాడి ఆశ అన్ని నిరాశలనూ జయించే ఆశ. జార్జి నమ్మకంతో కనిపెడుతున్నంతసేపూ మామ్మగారు దాని కోసం పనిచేస్తూనే ఉంది. కాలం సంపూర్ణమైనప్పుడు విశ్వాసానికి రూపం వచ్చింది.

దేవుని వాగ్దానాల మీదికి అడుగు వెయ్యబోయే ముందు మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో దాన్ని చూడాలనుకోవడం మానవసహజమైన బలహీనత. కాని యేసు ప్రభువు తోమాకీ, అతని తరువాత వచ్చిన ఎంతోమంది నమ్మకం లేనివారికీ చెప్పాడు, " చూచి నమ్మినవారికంటే చూడక నమ్మినవారు ధన్యులు ".

-----------------------------------------------------------------------------------------------------------------------------

For this reason, I tell you, whatever you pray and ask for, believe that you have received it, and it will be yours - (Mark - 11:24)

When my little son was about ten years of age, his grandmother promised him a stamp album for Christmas. Christmas came, but no stamp album, and no word from grandmother. The matter, however, was not mentioned; but when his playmates came to see his Christmas presents, I was astonished, after he had named over this and that as gifts received, to hear him add,

“And a stamp album from grandmother.”

I had heard it several times, when I called him to me, and said, “But, Georgie, you did not get an album from your grandmother. Why do you say so?”

There was a wondering look on his face as if he thought it strange that I should ask such a question, and he replied, “Well, mamma, grandma said, so it is the same as.” I could not say a word to check his faith.

A month went by, and nothing was heard from the album. Finally, one day, I said, to test his faith, and really wondering in my heart why the album had not been sent,

“Well, Georgie, I think grandma has forgotten her promise.”

“Oh, no, mamma,” he quickly and firmly said, “she hasn’t.”

I watched the dear, trusting face, which, for a while, looked very sober, as if debating the possibilities I had suggested. Finally, a bright light passed over it, and he said,

“Mamma, do you think it would do any good if I should write to her thanking her for the album?”

“I do not know,” I said, “but you might try it.”

A rich spiritual truth began to dawn upon me. In a few minutes, a letter was prepared and committed to the mail, and he went off whistling his confidence in his grandma. In just a short time a letter came, saying:

“My dear Georgie: I have not forgotten my promise to you, of an album. I tried to get such a book as you desired, but could not get the sort you wanted; so I sent it on to New York. It did not get here till after Christmas, and it was still not right, so I sent for another, and as it has not come as yet, I send you three dollars to get one in Chicago. Your loving grandma.”

“As he read the letter, his face was the face of a victor. ”Now, mamma, didn’t I tell you?“ came from the depths of a heart that never doubted, that, ”against hope, believed in hope" that the stamp album would come. While he was trusting, grandma was working, and in due season faith became sight.

It is so human to want sight when we step out on the promises of God, but our Savior said to Thomas, and to the long roll of doubters who have ever since followed him: “Blessed are they who have not seen, and yet have believed.” —Mrs. Rounds

Friday, February 18, 2022

Believing Before Seeing

 నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి - (యెహోషువ 1:2).

దేవుడిక్కడ వర్తమాన కాలంలోనే మాట్లాడుతున్నాడు. తాను 'చెయ్యబోయే పని' అనడం లేదు. కాని ఇప్పుడే ఈ క్షణమే ‘ఇస్తున్న దేశం' అంటున్నాడు. విశ్వాసం కూడా ఇలానే మాట్లాడుతుంది. దేవుడు ఇలానే ఎప్పుడూ ఇస్తుంటాడు. కాబట్టి ఈ రోజున ఇప్పుడే దేవుడు నిన్ను కలుసుకుంటున్నాడు. ఇది నీ విశ్వాసానికి పరీక్ష.  ‘విశ్వాసమనునది నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.' నమ్మకమున్న ప్రార్థన చేసేవారికి ఆజ్ఞ వర్తమాన కాలంలో ఉంది. మీరు ప్రార్థన చేయునప్పుడెల్లా అడిగిన వాటిని పొందియున్నామని నమ్ముడి, అప్పుడవి మీకు అనుగ్రహింపబడును. అలాటి స్థితికి వచ్చామా? నిత్యవర్తమాన కాలంలో దేవుని ఎదుర్కొన్నామా?

నిజమైన విశ్వాసం దేవుని మీద ఆధారపడి చూడకముందే నమ్ముతుంది.  సహజంగా మనమడిగింది మనకి లభించిందనడానికి ఏదో ఒక సూచన కనిపించాలి అనుకుంటాము. అయితే మనం విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుని మాట తప్ప మరే సూచనా మనకి అవసరం లేదు. ఆయన మాట ఇచ్చాడు. ఇక మన నమ్మిక చొప్పున  మనకి జరుగుతుంది. మనం నమ్మాము కాబట్టి చూస్తాము. ఈ విశ్వాసమే ఇబ్బందుల్లో మనకి ఆదరణగా ఉంటుంది. పరిస్థితులన్నీ దేవుడిచ్చిన మాటకి వ్యతిరేకంగా ఉన్నపుడు మనల్ని నిలబెడుతుంది. కీర్తనకారుడు అంటున్నాడు - "సజీపుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును? తన ప్రార్థనలకి జవాబును ఇంకా చూడలేదు కాని చూస్తానని నమ్మకముంచాడు. ఆ నమ్మకమే అతన్ని సొమ్మసిల్లిపోకుండా చేసింది.

చూస్తామన్న నమ్మిక ఉంటే అది మనల్ని నిరుత్సాహానికి గురికాకుండా చేస్తుంది. అసంభవాలనుకున్నవాటిని చూసి నవ్వుతాము. ఇబ్బందినుండి మానవపరంగా విడుదల లేదనుకున్న సమయంలో ఎర్రసముద్రాన్ని దేవుడు పాయలు చేసే దృశ్యాన్ని ఆనందంతో వీక్షిస్తాము. సరిగ్గా ఇలాటి తీవ్రమైన కష్టసమయాల్లోనే మన విశ్వాసం అభివృద్ధిచెంది బలపడుతుంటుంది.

ఆందోళన చెందియున్న ఆత్మలారా, సుదీర్ఘమైన రాత్రులలోనూ, విసుగు చెందించే పగటి వేళల్లోనూ ఆయన మిమ్ములను మర్చిపోయాడేమోనని భయపడుతున్నారా? ఆత్రుతగా ఆయన కోసం ఎదురుచూస్తున్నారా? మీ తలలెత్తండి. మీ దగ్గరికి వస్తూ ఉన్న విడుదల కోసం ఇప్పుడే ఆయన్ని స్తుతించండి.

---------------------------------------------------------------------------------------------------------------------------

The land which I do give them, even the children of Israel - (Josh - 1:2)

    God here speaks in the immediate present. It is not something He is going to do, but something He does do, this moment. So faith ever speaks. So God ever gives. So He is meeting you today, in the present moment. This is the test of faith. So long as you are waiting for a thing, hoping for it, looking for it, you are not believing. It may be hope, it may be earnest desire, but it is not faith; for “faith is the substance of things hoped for, the evidence of things not seen.” The command regarding believing prayer is the present tense. “When ye pray, believe that ye receive the things that ye desire, and ye shall have them.” Have we come to that moment? Have we met God in His everlasting NOW?  —Joshua, by Simpson

    True faith counts on God, and believes before it sees. Naturally, we want some evidence that our petition is granted before we believe; but when we walk by faith we need no other evidence than God’s Word. He has spoken, and according to our faith, it shall be done unto us. We shall see because we have believed, and this faith sustains us in the most trying places when everything around us seems to contradict God’s Word.

    The Psalmist says, “I had fainted, unless I had believed to see the goodness of the Lord in the land of the living” (Ps. 27:13). He did not see as yet the Lord’s answer to his prayers, but he believed to see, and this kept him from fainting.

    If we have the faith that believes to see, it will keep us from growing discouraged. We shall “laugh at impossibilities,” we shall watch with delight to see how God is going to open up a path through the Red Sea when there is no human way out of our difficulty. It is just in such places of severe testing that our faith grows and strengthens.

    Have you been waiting upon God, dear troubled one, during long nights and weary days, and have feared that you were forgotten? Nay, lift up your head and begin to praise Him even now for the deliverance which is on its way to you.  —Life of Praise

Thursday, February 17, 2022

Weeping May Last For a Night

 నేను నిన్ను బాధ పరచితినే, నేను నిన్నిక బాధపెట్టను - (నహూము 1:12).

బాధకి అంతు ఉంది. దేవుడు బాధపెడతాడు. దేవుడే తీసేస్తాడు. “ఈ బాధకి అంతమెప్పుడు?” అంటూ నిట్టూరుస్తావా? ఆయన వచ్చేదాకా ఆయన సంకల్పాన్ని శిరసావహిస్తూ నిబ్బరంగా సహనంతో ఎదురు చూద్దాం. శిక్ష పొందడం వల్ల మనకి కలగవలసిన ప్రయోజనమంతా కలిగిన తరువాత దేవుడే ఆ శిక్షను తొలగిస్తాడు.

శ్రమ ఏదైనా మనల్ని పరీక్షించడానికి వస్తే, మనం ఆయన్ని స్తుతించి, ఆయన గురించి సాక్ష్యమిచ్చి, ఆయన్ని మహిమ పర్చిన తరువాత అది అంతమవుతుంది.

మనం దేవునికి ఆపాదించవలసిన ఘనత అంతా పూర్తిగా ఆపాదించకుండా ఒక శ్రమ మన నుండి తొలగిపోవాలి అని కోరుకోకూడదు. ఈ రోజున భయంకరంగా ఆకాశాన్నంటే కెరటాలు ఎప్పుడు చప్పబడిపోతాయో ఎవరికి తెలుసు? సముద్రం గాజులాగా నిర్మలంగా అయితే సముద్ర పక్షులు అలలతో ఎంత త్వరగా ఆటలు ఆడతాయో మనకేమి తెలుసు?

శ్రమకాలం గతించాక, పనలను దుళ్ళగొట్టి తూర్పారబట్టడం అయిపోయాక, గాదెల్లో ధాన్యం నిండుతుంది. ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నామో కొద్ది గంటలు గడిచాక అంత సంతోషభరితులమవుతాము.

రాత్రిని పగలుగా మార్చడం ప్రభువుకి కష్టమేమీ కాదు. మేఘాల్ని పంపినవాడు వాటిని వెళ్ళగొట్టగలడు కూడా. దిగులు మాని ఉత్సాహంగా ఉందాం. ముందు కాలం మంచిది. దానికోసం ఎదురుచూస్తూ స్తుతులు పాడుదాం.

మన పరమ రైతు అస్తమానమూ నలగగొడుతూనే ఉండడు. ఇది ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే. వర్షాలు త్వరలోనే వెలిసిపోతాయి. ఏడుపు కొద్దిగంటలే ఉంటుంది. తెల్లవారితే ఇక శోకం ఉండదు. మన శ్రమ క్షణికమే. శ్రమకి ఓ ప్రయోజనం ఉంది.

మనకి శ్రమ వచ్చిందన్న విషయమే మనలో దేవుడికి కావలసిన అతి ప్రశస్తమైనదేదో ఉన్నదన్న విషయానికి నిరూపణ. లేకపోతే అంత సమయం వృధా చేసి అంత శ్రద్ద మన మీద ఎందుకు చూపిస్తాడాయన? మట్టి, ఖనిజం కలిసిపోయి ఉన్నట్టు మన సహజ ప్రవృత్తిలో విశ్వాసమనే విలువగల ఖనిజం కలిసిపోయి ఉంది. కాబట్టే క్రీస్తు మనల్ని ఈ పరీక్షలకి గురిచేస్తున్నాడు. ఈ నైర్మల్యాన్నీ, పరిశుద్ధతనూ వెలికి తేవాలనే ఆయన మనల్ని కొలిమిలో వేసి కాలుస్తున్నాడు.

పీడితుల్లారా, ఓపిక పట్టండి. ఆ కష్టాలు మనలను నిత్యమహిమ వారసుల్ని చేసినట్టు మనం చూస్తాం. ఆ ఫలితం ఇప్పటి కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది. దేవుడు మనల్ని మెచ్చుకుంటూ అనే ఒక్క మాట, దేవదూతల ఎదుట మనకి జరిగే సన్మానం, క్రీస్తులో మనం పొందే మహిమ, వీటన్నిటి ముందు ఈ బాధలు లెక్కలోనివా?

గోడ గడియారానికి బరువుగా వ్రేలాడే లోలకం, ఓడని స్థిరపరచడానికి వేసే బరువులు అవి సరిగా పనిచెయ్యడానికి అవసరం. మన ఆత్మీయ జీవితంలో శ్రమలు కూడా అంతే. అంతులేని వత్తిడిని ఉపయోగిస్తేనే పరిమళాలు తయారవుతాయి. ఉన్నత శిఖరాల్లో మంచు కురిసేచోట్ల కళ్ళు మిరుమిట్లు గొలిపే పూలు పూస్తాయి. కంసాలి చేతుల్లో ఎక్కువ దెబ్బలు తిన్నదే ఎక్కువ విలువగల వజ్రం. శిల్పాలు ఎంత అందంగా తయారవ్వాలంటే శిల్పిచేతిలో అన్ని ఎక్కువ ఉలి దెబ్బలు తినాలి. ఇవన్నీ నియమాలే. ఇవన్నీ అతి జాగ్రత్తగా అంచనా వేసి ముందు చూపుతో చేసేవే.

---------------------------------------------------------------------------------------------------------------------------

This is what the Lord says: “Even though they are powerful – and what is more, even though their army is numerous – nevertheless, they will be destroyed and trickle away! Although I afflicted you, I will afflict you no more - (Nah -1:12 )

There is a limit to affliction. God sends it and removes it. Do you sigh and say, “When will the end be?” Let us quietly wait and patiently endure the will of the Lord till He cometh. Our Father takes away the rod when His design in using it is fully served.

If the affliction is sent for testing us, that our graces may glorify God, it will end when the Lord has made us bear witness to His praise.

We would not wish the affliction to depart until God has gotten out of us all the honor which we can possibly yield Him.

There may be today “a great calm.” Who knows how soon those raging billows will give place to a sea of glass, and the sea birds sit on the gentle waves?

After long tribulation, the flail is hung up, and the wheat rests in the garner. We may, before many hours are past, be just as happy as now we are sorrowful.

It is not hard for the Lord to turn night into day. He that sends the clouds can as easily clear the skies. Let us be of good cheer. It is better farther on. Let us sing Hallelujah by anticipation. —C. H. Spurgeon.

The great Husbandman is not always threshing. The trial is only for a season. The showers soon pass. Weeping may tarry only for the few hours of the short summer night; it must be gone at daybreak. Our light affliction is but for a moment. The trial is for a purpose, “If needs be.”

The very fact of trial proves that there is something in us very precious to our Lord; else He would not spend so many pains and time on us. Christ would not test us if He did not see the precious ore of faith mingled in the rocky matrix of our nature, and it is to bring this out into purity and beauty that He forces us through the fiery ordeal.

Be patient, O sufferer! The result will more than compensate for all our trials when we see how they wrought out the far more exceeding and eternal weight of glory. To have one word of God’s commendation; to be honored before the holy angels; to be glorified in Christ, to be better able to flash His glory on Himself—ah! that will more than repay for all. —Tried by Fire

As the weights of the clock, or the ballast in the vessel, are necessary for their right ordering, so is trouble in the soul-life. The sweetest scents are only obtained by tremendous pressure; the fairest flowers grow amid Alpine snow-solitudes; the fairest gems have suffered longest from the lapidary’s wheel; the noblest statues have borne most blows of the chisel. All, however, are under the law. Nothing happens that has not been appointed with consummate care and foresight. —Daily Devotional Commentary