Saturday, February 26, 2022

Enter Into Your Inheritance

 మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను - (యెహోషువ 1:3).

క్రీస్తు కోసం మనం ఇంతవరకు ఆక్రమించుకోలేని స్థలాల సంగతి మాత్రమే కాక, ఇంతవరకు మనం స్వతంత్రించుకోని అనేకమైన వాగ్దానాలు ఇంకా అలాగే ఉండిపోయాయి. దేవుడు యెహోషువాతో ఏం చెప్పాడు? 'మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్నీ నేను మీకిచ్చాను.' అటు తరువాత వాగ్దాన దేశాన్ని గురించిన వివరాలనిచ్చాడు. అదంతా వాళ్ళదే. కాని ఒక్క షరతు. వాళ్ళు ఆ దేశమంతటా అటు నుంచి ఇటు చివరిదాకా తిరగాలి‌, తమ పాదాలతో దాన్ని కొలవాలి.

అయితే మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ప్రదేశాన్ని వాళ్ళు తిరిగి చూడలేదు. అందుకే మూడింట ఒక వంతు భాగమే వాళ్ళ స్వాధీనమైంది. వాళ్ళు తమ పాదాలతో కొలిచి చూసినదే వాళ్ళకి దక్కింది.

పేతురు రాసిన 2వపత్రిక లో మన కోసం తెరిచి ఉన్న వాగ్దత్త దేశం గురించి చదువుతాము. మనం విధేయత, విశ్వాసాలనే అడుగులతో వాటిని కొలిచి, విధేయత గల నమ్మికతో,  దాన్నంతటినీ మన స్వంతం చేసుకోవాలని దేవుని చిత్తం.

మనలో ఎంతమందిమి క్రీస్తుపేరట దేవుని వాగ్దానాలను స్వాధీనం చేసుకొన్నాము?

విశ్వాస భూమి ఎంతో విస్తరించి ఉంది. దాని కొనల వరకు నడిచివెళ్ళి మొత్తాన్ని స్వాధీనపరచుకోవాలి.

మన స్వాస్థ్యం మొత్తాన్ని మనం చేజిక్కించుకుందాం.  ఉత్తరానికి, దక్షిణానికీ మన కన్నులెత్తుదాం. తూర్పు పడమరలను పరికించి చూద్దాం. "నీకు కనిపించే నేలంతటినీ నీకిస్తాను" అంటున్నాడు దేవుడు.

యూదా ఎక్కడెక్కడైతే తన కాలు మోపాడో అదంతా అతనిదే. బెన్యామీను ఎంత దూరం తిరిగితే అంత దూరమూ అతని స్వంతమే. ప్రతివాడూ వెళ్ళి తన అడుగుపెట్టడం ద్వారా తన స్వాస్థ్యాన్ని పొందాలి. వీళ్ళెవరైనా ఒక చోటులో పాదమూనారంటే వాళ్ళ మనసులో ఒక నిశ్చయత ఏర్పడిపోతుంది. 'ఈ భూమి నాదే.'

దానియేలు అనే ఒక నీగ్రో వృద్ధుడు కృపలో గొప్ప అనుభవం ఉన్నవాడు. అతన్ని ఒకసారి ఎవరో అడిగారు "దానియేలు, భక్తిలో నీకు అంత సంతోషం, శాంతి ఎలా దొరుకుతున్నాయి?" అతను జవాబిచ్చాడు. 'అతి శ్రేష్టమైన, విలువైన వాగ్దానాల మీద నేను బోర్లాపడిపోతాను. వాటిలో ఉన్నవన్నీ నావే. ఎంత సంతోషం!" అవును వాగ్దానాల మీద బోర్లా పడిపోయి వాటిల్లోని ఐశ్వర్యానంతటినీ కౌగలించుకుంటే అవన్నీ మనవే.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Every place that the sole of your foot shall tread upon, that have I given unto you - (Josh - 1:3)

Beside the literal ground, unoccupied for Christ, there is the unclaimed, untrodden territory of Divine promises. What did God say to Joshua? “Every place that the sole of your foot shall tread upon, that have I given unto you,” and then He draws the outlines of the Land of Promise—all theirs on one condition: that they shall march through the length and breadth of it, and measure it off with their own feet.

They never did that to more than one-third of the property, and consequently, they never had more than one-third; they had just what they measured off, and no more.

In 2 Peter, we read of the “land of promise” that is opened up to us, and it is God’s will that we should, as it were, measure off that territory by the feet of obedient faith and believing obedience, thus claiming and appropriating it for our own.

How many of us have ever taken possession of the promises of God in the name of Christ?

Here is a magnificent territory for faith to lay hold on and march through the length and breadth, and faith has never done it yet.

Let us enter into all our inheritance. Let us lift up our eyes to the north and to the south, to the east and to the west, and hear Him say, “All the land that thou seest will I give to thee.” —A. T. Pierson

Wherever Judah should set his foot that should be his; wherever Benjamin should set his foot, that should be his. Each should get his inheritance by setting his foot upon it. Now, think you not, when either had set his foot upon a given territory, he did not instantly and instinctively feel, “This is mine”?

An old colored man, who had a marvelous experience in grace, was asked: “Daniel, why is it that you have so much peace and joy in religion?” “O Massa!” he replied, “I just fall flat on the exceeding great and precious promises, and I have all that is in them. Glory! Glory!” He who falls flat on the promises feels that all the riches embraced in them are his. —Faith Papers

The Marquis of Salisbury was criticized for his Colonial policies and replied: “Gentlemen, get larger maps.”

Friday, February 25, 2022

Hidden Workers

 

యోహాను ఏ సూచక క్రియను చేయలేదుగాని యీయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైనవనిరి - (యోహాను 10:41).

నీ గురించి నువ్వు చాలాసార్లు చిరాకుపడి ఉండొచ్చు. నువ్వు పెద్ద తెలివిగలవాడివి కాదు. ప్రత్యేకమైన వరాలేమీ లేవు. దేన్లోనూ నీకు ప్రత్యేకమైన ప్రావీణ్యత లేదు. నీది సగటు జీవితం. నీ జీవితంలో గడిచే రోజులన్నీ ఒకేలాగా చప్పిడిగా ఉంటున్నాయి.

అయినా పర్వాలేదు. నీ బ్రతుకు గొప్ప మహత్తుని సంతరించుకోగలదు. యోహాను ఏమీ అద్భుతాలను చెయ్యలేదు. కాని యేసుప్రభువు అతన్ని గురించి ఏమని చెప్పాడు?  'స్త్రీలు కన్నవారిలో యోహానుకన్న గొప్పవాడు లేడు.'

యోహాను ముఖ్య విధి ఏమిటంటే వెలుగును గూర్చి సాక్ష్యమివ్వడం. ఈ పనే నువ్వూ నేనూ చేపట్టాలి. అరణ్యంలో వినిపించే ఒక శబ్దంగా మాత్రమే ఉండిపోవడానికి యోహానుకు అభ్యంతరం లేదు. వినిపించడమేగాని, కనిపించని స్వరంగా ఉండి పోవడానికి సిద్ధపడు. అద్దం వెనుక వేసిన రంగు బయటికి కనిపించదు గాని అది సూర్యతేజాన్ని ప్రతిబింబిస్తుంది. సూర్యోదయమౌతూ ఉండగా పిల్లగాలి వీచి 'తెల్లారుతోంది' అంటూ ప్రకటించి తిరిగి చప్పబడిపోతుంది.

అతి సాధారణమైన, అత్యల్పమైన పనుల్ని కూడా దేవుడు నిన్ను కనిపెట్టి చూస్తున్నాడన్నట్టుగా చెయ్యి. నీకు సరిపడని మనుషులతో నివసించవలసి వచ్చినప్పుడు వాళ్ల ప్రేమను చూరగొనడానికి ప్రయత్నించు.

విత్తనాలను చల్లుతున్న మనం, చిన్నచిన్న కాలువలను తవ్వుతున్న మనం, మనుషుల్లో క్రీస్తును గురించిన చిన్నచిన్న ఆలోచనలను నాటుతున్న మనం, అనుకుంటున్న దానికంటే ఎక్కువ సేవే చేస్తున్నాము. మన ద్వారా కొంచెం సువార్త విన్నవాళ్ళు వాటిని ఒక దినాన తలుచుకుని 'ఇక్కడిదాకా రావడానికి మాకు మొట్టమొదటిసారిగా మార్గం చూపినవి ఆ మాటలే' అంటారు. మన విషయం అంటారా మన సమాధులపై తాజ్ మహల్  కట్టకపోయినా ఫర్వాలేదు. కాని మనం చనిపోయినప్పుడు సాధారణమైన వ్యక్తులు మన సమాధి చుట్టూ చేరి అంటారు. "ఇతను మంచి మనిషండీ. ఇతనేవీ అద్భుతకార్యాలు చెయ్యలేదుకాని, క్రీస్తు మాటలు మాట్లాడాడు. ఆ మాటలే నేను క్రీస్తుని తెలుసుకునేలా చేసాయి."


వసంతం పిలిచింది

రేగడి నేలలో దాగిన

హరిత పత్రాలు వికసించాయి

ఆకుల కింద దాగిన పూలు

తలలెత్తి కిలకిలా నవ్వాయి


ఎన్నెన్ని అందాలు చందాలు

చామంతులు గులాబీలు

కంటికి కనిపించని పుష్పాలు

వెలుతురు పిలిచే సరికి

ఆకుల్ని తొలగించి తొంగిచూసాయి


ఎందరెందరో చేసారు

ఎన్నెన్నో పుణ్యకార్యాలు

ఆకుమాటున విరబూసే

ఆ అందాలను అరసినంతనే

ఆనందించేదెంతమంది?


విరిగి నలిగిన చితికిపోయిన గుండెల్లో

విశ్వాస ప్రేమ పుష్పాలు

పరలోకపు కాంతుల్ని విరజిమ్ముతూ

ప్రేమ సరాగాలతో వికసించి

ఆకుమాటున దాగి అందాలీనుతాయి


నీడల్లో చీకటి జాడల్లో

వీధుల్లో శ్రమలవాడల్లో

పూసే పూలు వెదజల్లే

విశ్వాస పరిమళం

పరిశీలనకందని పరమరహస్యం


మన మసక కంటికి అందక

ఉన్న అందాలెన్నో కాదా

పరలోకపు తోటమాలి దిగివచ్చి

దాగిన అందాలను వెలికి తీసి

వెలిగిస్తే కనిపిస్తాయి.


అజ్ఞాత వ్యక్తుల్లోనుంచి దేవుడు తన సేవకుల్ని ఎన్నుకుంటాడు -  లూకా 14:23.

-----------------------------------------------------------------------------------------------------------------------------

John did no miracle: but all things that John spake of this man were true - (John - 10:41)

You may be very discontented with yourself. You are no genius, have no brilliant gifts, and are inconspicuous for any special faculty. Mediocrity is the law of your existence. Your days are remarkable for nothing but sameness and insipidity. Yet you may live a great life.

John did no miracle, but Jesus said that among those born of women there had not appeared a greater than he.

John’s main business was to bear witness to the Light, and this may be yours and mine. John was content to be only a voice if men would think of Christ.

Be willing to be only a voice, heard but not seen; a mirror whose surface is lost to view, because it reflects the dazzling glory of the sun; a breeze that springs up just before daylight, and says, “The dawn! the dawn!” and then dies away.

Do the commonest and smallest things as beneath His eye. If you must live with uncongenial people, set to their conquest by love. If you have made a great mistake in your life, do not let it becloud all of it; but, locking the secret in your breast, compel it to yield strength and sweetness.

We are doing more good than we know, sowing seeds, starting streamlets, giving men true thoughts of Christ, to which they will refer one day as the first things that started them thinking of Him; and, of my part, I shall be satisfied if no great mausoleum is raised over my grave, but those simple souls shall gather there when I am gone, and say,

“He was a good man; he wrought no miracles, but he spake words about Christ, which led me to know Him for myself.” —George Matheson


“THY HIDDEN ONES” (Psa. 83:3)


“Thick green leaves from the soft brown earth,  

Happy springtime hath called them forth;  

The first faint promise of summer bloom  

Breathes from the fragrant, sweet perfume,  

Under the leaves.


“Lift them! what marvelous beauty lies  

Hidden beneath, from our thoughtless eyes!  

Mayflowers, rosy or purest white,  

Lift their cups to the sudden light,  

Under the leaves.


“Are there no lives whose holy deeds—  

Seen by no eye save His who reads  

Motive and action—in silence grow  

Into rare beauty, and bud and blow  

Under the leaves?


“Fair white flowers of faith and trust,  

Springing from spirits bruised and crushed;  

Blossoms of love, rose-tinted and bright,  

Touched and painted with Heaven’s own light  

Under the leaves.


“Full fresh clusters of duty borne,  

Fairest of all in that shadow grown;  

Wondrous the fragrance that sweet and rare  

Comes from the flower cups hidden there  

Under the leaves.


“Though unseen by our vision dim,  

Bud and blossom are known to Him;  

Wait we content for His heavenly ray—  

Wait till our Master Himself one day  

Lifteth the leaves.”


“God calls many of His most valued workers from the unknown multitude” (Luke 14:23).

Thursday, February 24, 2022

The Blessing of the Lion

 

గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చెను - (1 సమూ 17:34).

దేవునిలో నమ్మిక  ఉంచిన యువకుడైన దావీదుతో పరిచయం కావడం మనకి బలాన్నీ ప్రోత్సాహాన్నీఇస్తుంది. దేవుని పై విశ్వాసం మూలంగా అతను ఒక సింహాన్నీ, ఎలుగుబంటినీ చంపాడు. అటుపైన బలాఢ్యుడైన గొల్యాతును హతమార్చాడు. గొర్రెల మందను చెదరగొట్టడానికి వచ్చిన ఎలుగుబంటి దావీదు పాలిట గొప్ప అవకాశమైంది. ఆ సింహం  వచ్చినప్పుడు గనుక తొట్రుపడి పారిపోయి ఉంటే దేవుడు అతని కోసం ఉంచిన అవకాశాన్ని జారవిడుచుకునేవాడే. ఇశ్రాయేలీయులకి దేవుడేర్పరచిన రాజుగా ఎన్నటికీ పట్టాభిషేకం పొందేవాడు కాడు.

సింహం రావడం దేవుని ప్రత్యేక ఆశీర్వాదమనీ ఎవరూ అనుకోరు. ఇది హడలగొట్టే సంఘటనే. కాని సింహం అనేది మారువేషంలో ఉన్న దేవుని అవకాశం. మనకెదురయ్యే ప్రతి ఆవేదనూ మనం సరైన దృష్టితో చూసినట్లయితే అవన్నీ అవకాశాలుగా మారిపోతాయి. వచ్చే ప్రతి శోధనా మన పెరుగుదలకి ఒక మెట్టు.

సింహం వచ్చినప్పుడు దాని ఆకారం ఎంత భయానకంగా ఉన్నప్పటికీ దాన్ని దేవుడు ఇచ్చిన అవకాశంగా గ్రహించండి. దేవుని సన్నిధి గుడారాన్ని మేక వెంట్రుకలతో అలంకరించారు. దాంట్లో ఏ విధమైన మహిమైనా ఉంటుందని చూసిన వాళ్ళు ఎవరనుకోగలరు? అలాంటి కంటికింపుగా లేనివాటిల్లోనే దేవుని మహిమ దాగి ఉంటుంది. శోధనల్లో, శ్రమల్లో, ఆపదల్లో, దారిద్ర్యంలో మనం దేవుణ్ణి చూడగలిగేలా ఆయన మన కన్నులు తెరుచును గాక.

-----------------------------------------------------------------------------------------------------------------------------

And there came a lion - (1 Sam - 17:34)

It is a source of inspiration and strength to come in touch with the youthful David, trusting God. Through faith in God, he conquered a lion and a bear and afterward overthrew the mighty Goliath. When that lion came to despoil that flock, it came as a wondrous opportunity to David. If he had failed or faltered he would have missed God’s opportunity for him and probably would never have come to be God’s chosen king of Israel. “And there came a lion.”

One would not think that a lion was a special blessing from God; one would think that only an occasion of alarm. The lion was God’s opportunity in disguise. Every difficulty that presents itself to us, if we receive it in the right way, is God’s opportunity. Every temptation that comes is God’s opportunity.

When the “lion” comes, recognize it as God’s opportunity no matter how rough the exterior. The very tabernacle of God was covered with badgers’ skins and goats’ hair; one would not think there would be any glory there. The Shekinah of God was manifest under that kind of covering. May God open our eyes to see Him, whether in temptations, trials, dangers, or misfortunes. —C. H. P.