ఉదయమునకు...సీనాయి కొండయెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి యుండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు - (నిర్గమ 34:2,3).
కొండమీద కనిపెట్టడం చాలా అవసరం. దేవుణ్ణి ఎదుర్కోకుండా కొత్తరోజును ఎదుర్కోకూడదు. ఆయనతో మాట్లాడనిదే ఇతరులతో మాట్లాడకూడదు.
నీ బలాన్ని నమ్ముకుని రోజును ప్రారంభిస్తే నీకు విజయం రాదు. నీ హృదయంలో దేవుణ్ణి గురించిన కొన్ని ఆలోచనలతో, ధ్యానంతో అనుదిన జీవితంలోకి ప్రవేశించు. నీ జీవితపు నాయకుడు, మహిమాన్వితుడైన అతిథి యేసుక్రీస్తును కలుసుకోకుండా మరెవర్నీ, ఆఖరుకి నీ ఇంట్లో వాళ్ళని కూడా కలుసుకోవద్దు.
ఒంటరిగా ఆయన్ని కలుసుకో, క్రమంగా కలుసుకో. ఆయన మాటలున్న గ్రంథంలో ఆయనతో మాట్లాడు. ఆయన వ్యక్తిత్వపు మహిమ నీ దైనందిన జీవితంలోని ప్రతి పనినీ జరిగించేలా ఆ పనులన్నిటినీ ఆయన అనుమతితో ప్రారంభించు.
దేవునితో మొదలుపెట్టు ప్రతిదినం
నీ సూర్యుడాయనే
ప్రాతఃకాలపు వెలుగాయనే
చెయ్యాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకే
ఉదయమే క్రొత్త పాట పాడు
అరణ్యాలతో పర్వతాలతో
మంద మారుతాలతో మైదానాలతో
మరుమల్లెలతో గొంతు కలిపి ఆలపించు
దేవునితోనే వెయ్యి నీ మొదటి అడుగు
నీతో రమ్మని ఆయన్ని అడుగు
నదులైనా పర్వతాలైనా, జలపాతమైనా
అడుగు ఆయన తోడు
నీ మొదటి వ్యవహారం దేవునితో
వర్థిల్లుతుంది నీ వ్యాపారం
దినమంతా పెరుగుతుంది ప్రేమ
పైనున్నవానితో నీ సహవాసం
మొదటి పాట దేవునికి పాడు
నీ సాటి మనిషికి కాదు
మహిమగల సృష్టికర్తకే
ఆయన చేసిన సృష్టికి కాదు
దేవుని కోసం గొప్ప పనులు చేసిన వాళ్ళంతా ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి మోకరించినవాళ్ళే.
మాథ్యూ హెన్రీ ఉదయం నాలుగు గంటలకి లేచి ధ్యానం మొదలు పెట్టేవాడు. ఎనిమిదిదాకా ఉండేవాడు. ఉదయ ఫలహారం చేసాక కుటుంబ ప్రార్థన. మళ్ళీ మధ్యాహ్నం దాకా తన గదిలోనే చదువుకొని భోజనం చేసేవాడు. మళ్ళీ నాలుగుదాకా రాసుకుంటూ గడిపి ఆ పైన స్నేహితులను దర్శించడానికి వెళ్ళేవాడు.
డాడ్రిడ్జి గారు ఉదయం ఐదు గంటలకి లేవడానికి ఏడు గంటలకి లేవడానికి తేడాలు చెప్తుండేవారు. అంటే అలా రోజుకి 2 గంటల సమయం వృధా అయినట్టే లెక్క.
డాక్టర్ ఆడమ్ క్లార్కుగారి 'కామెంటరీ'ని ఆయన పూర్తిగా తెల్లవారు సమయంలోనే రాసాడట. బార్నెస్ గారి 'కామెంటరీ'ని కూడా ఆయన ఉదయం గంటల్లో పడిన కష్టం ఫలితమే. సిమ్యోను అనే కళాకారుడి కళాఖండాలన్నీ తెల్లవారుజాములో వేసినవే. కాబట్టి మనం కూడా ఉదయ సమయాన్ని దేవునికోసం గడపడం మంచిది కదా.
-----------------------------------------------------------------------------------------------------------------------------
Be ready in the morning, and come up ...present thyself there to me in the top of the mount. And no man shall come up with thee - (Exod - 34:2-3)
The morning watch is essential. You must not face the day until you have faced God, nor look into the face of others until you have looked into His.
You cannot expect to be victorious if the day begins only in your own strength. Face the work of every day with the influence of a few thoughtful, quiet moments with your heart and God. Do not meet other people, even those of your own home, until you have first met the great Guest and honored Companion of your life—Jesus Christ.
Meet Him alone. Meet Him regularly. Meet Him with His open Book of counsel before you, and face the regular and the irregular duties of each day with the influence of His personality definitely controlling your every act.
Begin the day with God!
He is thy Sun and Day!
His is the radiance of thy dawn;
To Him address thy lay.
Sing a new song at morn!
Join the glad woods and hills;
Join the fresh winds and seas and plains,
Join the bright flowers and rills.
Sing thy first song to God!
Not to thy fellow-men;
Not to the creatures of His hand,
But to the glorious One.
Take thy first walk with God!
Let Him go forth with thee;
By the stream, or sea, or mountain path,
Seek still His company.
Thy first transaction be
With God Himself above;
So shall thy business prosper well,
And all the day be love.
—Horatius Bonar
The men who have done the most for God in this world have been early upon their knees.
Matthew Henry used to be in his study at four, and remain there till eight; then, after breakfast and family prayer, he used to be there again till noon; after dinner, he resumed his book or pen till four, and spent the rest of the day in visiting his friends.
Doddridge himself alludes to his “Family Expositor” as an example of the difference of rising between five and seven, which, in forty years, is nearly equivalent to ten years more of life.
Dr. Adam Clark’s “Commentary” was chiefly prepared very early in the morning.
Barnes’ popular and useful “Commentary” has been also the fruit of “early morning hours.”
Simeon’s “Sketches” were chiefly worked out between four and eight.