మన మేలు కొరకే - (హెబ్రీ 12:10)రాల్ఫ్ కానర్ రాసిన ఒక పుస్తకంలో గ్వెన్ అనే అమ్మాయి కథ ఉంది. గ్వెన్ చాలా మొండిపిల్ల. ఎప్పుడూ అన్నింటినీ తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది. అయితే ఒక రోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించి, జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్గతి పట్టింది. ఆమె మొండితనం ఇంకా ఎక్కువైంది. ఎప్పుడూ వణుకుతూ ఉండేది. ఒక రోజున పర్వత ప్రాంతాలలో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు. అతన్ని అందరూ స్కై పైలెట్ అంటారు.
అతనామెకు కొండలోయల గురించి ఒక కథ చెప్పాడు. “మొదట్లో అసలు లోయలే లేవు. అంతా సమంగా మైదానంలాగా ఉండేది. ఒకరోజు ఆ మైదానాల యజమాని షికారుకి వెళ్తూ ఉంటే అంతా గడ్డే కనిపించింది. “పూలమొక్కలేవీ?” అంటూ మైదానాన్ని అడిగాడు. 'అయ్యా నాలో విత్తనాలు లేవండీ' అని జవాబు చెప్పింది ఆ మైదానం.
ఆయన ఎగిరే పక్షులకి ఆజ్ఞాపించాడు. అవి రకరకాల విత్తనాలను మైదాన మంతా చల్లాయి. త్వరలోనే మైదానమంతా బంతులూ, చేమంతులూ, మల్లెలూ కనకాంబరాలూ, సంపెంగలూ పూసాయి. యజమాని సంతోషించాడు. కాని తన కిష్టమైన పూలు అందులో కనిపించలేదు. మళ్ళీ మైదానాన్ని అడిగాడు. 'నాకిష్టమైన గులాబీలు, విరజాజులూ, లిల్లీలూ కనబడవేం?' మళ్ళీ ఆయన పక్షులకి ఆజ్ఞ ఇచ్చాడు. అవి మళ్ళీ విత్తనాలను ఎక్కడెక్కడినుంచో తీసుకువచ్చి చల్లాయి, కాని యజమాని వచ్చి చూస్తే మళ్ళీ తన కిష్టమైన పూలు కనబడలేదు".
“నాకిష్టమైన పూలు కనిపించవేం?"
మైదానం విచారంతో పలికింది “అయ్యా ఆ పూలు బ్రతకడంలేదు. గాలి గట్టిగా వీచేసరికి, అన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి" అంది.
యజమాని మెరుపుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఒక్క దెబ్బతో మెరుపుతీగె నేలను తాకి మైదానానికి మధ్య పెద్ద లోయను తయారు చేసింది. మైదానమంతా బాధతో అల్లాడి పోయింది. చాలా రోజులపాటు తనలో ఉన్న ఆ పెద్దగుంటను చూసి ఏడుస్తూ ఉండేది.
అయితే ఆ గాడిలోకి నదీజలాలు పారాయి. ఒండ్రుమట్టి పుష్కలంగా దానిపై మేట వేసింది. మళ్ళీ పక్షులు విత్తనాలను తీసుకొచ్చి ఆ లోయలో వేసాయి. కొంత కాలానికి ఆ లోయలోని రాళ్ళమీద పచ్చగా తళతళలాడే నాచు పరుచుకుంది, నేలంతా పూలమొక్కలు మొలిచి అందాలు విరజిమ్మాయి. సూర్యకాంతిలో పెద్ద పెద్ద చెట్లు మొలిచి తలలెత్తాయి. ఎక్కడ చూసినా రంగురంగుల పూలు. ఆ లోయ యజమానికి అత్యంత ప్రియమైనదై పోయింది.
స్కై పైలెట్ గ్వెన్ కు బైబిల్ వాక్యం ఒకటి చదివి వినిపించాడు “ఆత్మ ఫలమేమనగా - అంటే ఆత్మ పుష్పాలు ఏమిటంటే - ప్రేమ, సంతోషము, సమాధానము దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” - వీటిలో కొన్ని లోయల్లోనే పూస్తాయి.
'లోయల్లో పూసేవేమిటి?' గ్వెన్ మెల్లిగా అడిగింది. పైలట్ చెప్పాడు “దీర్ఘశాంతము, సాత్వికము, మంచితనము. మిగతావి కూడా మైదాన భూమిలో వికసించినా లోయల్లో అయితే పుష్కలంగా పూసి పరిమళాన్ని దూరదూరాలకి వ్యాపింపజేస్తాయి'
చాలా సేపు గ్వెన్ అలానే ఉండిపోయింది. ఆమె ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా వణికాయి, “అయితే నా లోయలో కఠినమైన శిలలకు బదులుగా పువ్వులు పూయాలన్నమాట "
"అమ్మా గ్వెన్, త్వరలో ఆ పూలన్నీ పూస్తాయి. నీ యజమాని వాటిని గమనిస్తాడు. మనం కూడా వాటిని చూడగలుగుతాము.”
మీ జీవితాల్లో లోయలేమైనా తటస్థిస్తే గుర్తుంచుకోండి. అందులోనే అద్భుతమైన పువ్వులు పూస్తాయి.
----------------------------------------------------------------------------------------------------------------------------
For our profit - ( Heb - 12:10)
In one of Ralph Connor’s books, he tells the story of Gwen. Gwen was a wild, wilful lassie and one who had always been accustomed to having her own way. Then one day she met with a terrible accident that crippled her for life. She became very rebellious and in the murmuring state, she was visited by the Sky Pilot, as the missionary among the mountaineers was termed.
He told her the parable of the canyon. "At first there were no canyons, but only the broad, open prairie. One day the Master of the Prairie, walking over his great lawns, where were only grasses, asked the Prairie, ’Where are your flowers?’ and the Prairie said, ’Master I have no seeds.’
“Then he spoke to the birds, and they carried seeds of every kind of flower and strewed them far and wide, and soon the prairie bloomed with crocuses and roses and buffalo beans and the yellow crowfoot and the wild sunflowers and the red lilies all summer long. Then the Master came and was well pleased; but he missed the flowers he loved best of all, and he said to the Prairie: ’Where are the clematis and the columbine, the sweet violets and wind-flowers, and all the ferns and flowering shrubs?’
“And again he spoke to the birds, and again they carried all the seeds and scattered them far and wide. But, again, when the Master came he could not find the flowers he loved best of all, and he said:
“’ Where are those my sweetest flowers?’ and the Prairie cried sorrowfully:
“’ Oh, Master, I cannot keep the flowers, for the winds sweep fiercely, and the sun beats upon my breast, and they wither up and fly away.’
“Then the Master spoke to the Lightning, and with one swift blow the Lightning cleft the Prairie to the heart. And the Prairie rocked and groaned in agony, and for many, a day moaned bitterly over the black, jagged, gaping wound.
“But the river poured its waters through the cleft, and carried down deep black mold, and once more the birds carried seeds and strewed them in the canyon. And after a long time the rough rocks were decked out with soft mosses and trailing vines, and all the nooks were hung with clematis and columbine, and great elms lifted their huge tops high up into the sunlight, and down about their feet clustered the low cedars and balsams, and everywhere the violets and wind-flower and maiden-hair grew and bloomed, till the canyon became the Master’s favorite place for rest and peace and joy.”
Then the Sky Pilot read to her: “The fruit—I’ll read ’flowers’—of the Spirit are love, joy, peace, longsuffering, gentleness—and some of these grow only in the canyon.”
“Which are the canyon flowers?” asked Gwen softly, and the Pilot answered: “Gentleness, meekness, longsuffering; but though the others, love, joy, peace, bloom in the open, yet never with so rich a bloom and so sweet a perfume as in the canyon.”
For a long time Gwen lay quite still, and then said wistfully, while her lips trembled: “There are no flowers in my canyon, but only ragged rocks.”
“Someday they will bloom, Gwen dear; the Master will find them, and we, too, shall see them.”
Beloved, when you come to your canyon, remember!