Sunday, March 20, 2022

Sorrowful, Yet Rejoicing

దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము - (2 కొరింథీ 6:10)

కన్నీళ్ళు కార్చడం నామోషి అనుకునేవారున్నారు. కన్నీరు కార్చడం క్రైస్తవుడికి ఎంతమాత్రం నిషేధం కాదు. ఓర్వలేని దుఃఖం వలన హృదయం చింతాక్రాంతమై ఉండవచ్చు. శ్రమల తాకిడికి పగిలి నేలకూలే స్థితిలో ఉండవచ్చు. అయితే ఈ చింతనుండి మనిషి విలపించడం మూలంగా ఉపశమనాన్ని పొందుతాడు కాని ఇంతకంటే శ్రేష్టమైన దారి మరొకటి ఉంది.

ఉప్పుసముద్రం మధ్యలో ఎక్కడో తియ్యటి నీటి ఊటలు ఉంటాయంటారు. అతి కఠినమైన గండ శిలల నెర్రెల్లో కొండ శిఖరాలపై అతి సుకుమారమైన పుష్పాలు వికసిస్తాయంటారు. గుండెల్ని పిండిచేసే దుఃఖంలోనుండి తేనెకంటే తియ్యనైన పాటలు పుడతాయంటారు.

ఇది నిజమే. అనేకమైన శ్రమల మధ్య దేవుణ్ణి ప్రేమించే ఆత్మలకు సంతోషంతో గంతులు వెయ్యాలనిపించే కారణాలు, ప్రేరేపణలు కలుగుతాయి. రాత్రి సమయమంలో దేవుని పాటలు వినిపిస్తుంటాయి. జీవితమంతటిలోనూ అత్యంత భయంకరమైన చీకటి రాత్రిలో మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవుని స్తుతించాడు. ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా? దేవుని చిత్తాన్ని కేవలం భరించడం కాదు, దాన్ని కోరుకోవాలి. దానిలో పట్టరాని ఉత్సాహంతో ఆనందించాలి. మహిమలో తేలియాడాలి.

గాయపడిన నా హృదయం మౌనమూనింది

కలతల కెరటం నాపై పొర్లిపారింది

మూలుగు, చిన్న ఆక్రోశం కూడా ఉబికి రాలేదు

పెదవులు బిగబట్టి కన్నీటికి ఆనకట్ట వేసాను


మౌనమే శరణ్యం

బాధ కలిగించేది ప్రేమే అని తెలుసు

చివరి ఆదరణ బిందువుని ఆవిరిచేస్తుంది

మిగిలిన ఒక్క తీగెనీ తెంపేస్తుంది


దేవుడే ప్రేమ, నాకు నేను నచ్చజెప్పుకున్నాను

హృదయమా సందేహపడకు

కొంత సేపు ఎదురుచూడు, లేవనెత్తుతాడాయన

అవును, ఆయనకిష్టమైనపుడు


గుండెలో మ్రోగిన వాగ్దానాన్ని విన్నాను

నిర్వికారంగా నిలదొక్కుకున్నాను

ఆరిన కళ్ళను ఆకాశం వైపు ఎత్తాను

అవును క్రీస్తూ నీ చిత్తమే అన్నాను


 భారంగా పలికింది హృదయం

బేలగా కదిలాయి అధరాలు

ఇంతేకాదు నా హృదయమా ఇంకా ఉంది

భరించడమే కాదు, ఆనందించాలి


ఇప్పుడు నేనూ నా హృదయం పాడుతున్నాము

వాయిద్యాల మేళవింపు లేకపోయినా గానం చేస్తున్నాము

ఎడారిలో కడుపార నీళ్ళు త్రాగుతున్నాము

అణగారిపోయిన పక్షిరాజులా ఆకాశానికెగురుతున్నాము

-----------------------------------------------------------------------------------------------------------------------------

As sorrowful, yet always rejoicing - (2 Cor - 6:10)

The stoic scorns to shed a tear; the Christian is not forbidden to weep. The soul may be dumb with excessive grief, as the shearer’s scissors pass over the quivering flesh; or, when the heart is on the point of breaking beneath the meeting surges of trial, the sufferer may seek relief by crying out with a loud voice. But there is something even better.

They say that springs of a sweet freshwater well up amid the brine of salt seas; that the fairest Alpine flowers bloom in the wildest and most rugged mountain passes; that the noblest psalms were the outcome of the profoundest agony of soul.

Be it so. And thus amid manifold trials, souls which love God will find reasons for bounding, leaping joy. Though deep calls to deep, yet the Lord’s song will be heard in silver cadence through the night. And it is possible in the darkest hour that ever swept a human life to bless the God and Father of our Lord Jesus Christ. Have you learned this lesson yet? Not simply to endure God’s will, nor only to choose it, but to rejoice in it with joy unspeakable and full of glory. —Tried as by Fire

I will be still, my bruised heart faintly murmured,  

As o’er me rolled a crushing load of woe;  

The cry, the call, e’en the low moan was stifled;  

I pressed my lips; I barred the tear drop’s flow.  


I will be still, although I cannot see it,  

The love that bears a soul and fans pain’s fire;  

That takes away the last sweet drop of solace,  

Breaks the lone harp string, hides Thy precious lyre.  


But God is love, so I will bide me, bide me—  

We’ll doubt not, Soul, we will be very still;  

We’ll wait till after while when He shall lift us  

Yes, after a while, when it shall be His will.  


And I did listen to my heart’s brave promise;  

And I did quiver, struggling to be still;  

And I did lift my tearless eyes to Heaven,  

Repeating ever, “Yea, Christ, have Thy will.”  


But soon my heart upspake from ’neath our burden,  

Reproved my tight-drawn lips, my visage sad:  

“We can do more than this, O Soul,” it whispered.  

“We can be more than still, we can be glad!”  


And now my heart and I are sweetly singing—  

Singing without the sound of tuneful strings;  

Drinking abundant waters in the desert,  

Crushed, and yet soaring as on eagle’s wings.

Saturday, March 19, 2022

Preparation For Praise

ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. ... క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి - (1 పేతురు 4:12,13).

దావీదు వీణ శృతి కావాలంటే ఎన్నెన్నో లోటులు ఆయన సహించవలసి వచ్చింది. శ్రావ్యమైన స్వరమెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసు రావాలంటే ఎడారిలో ఎన్నో రోజులు వేచియుండాలి. ఇందువల్లనే ఈ లోకంలో క్రుంగిన హృదయాలను ఆహ్లాద పరచగలుగుతాము. మన తండ్రి ఇంటిని గొప్ప చెయ్యగలుగుతాము.

యెష్షయి కుమారుడు లోకారంభంనుండి ఎవరూ రాయలేనంత గొప్ప కీర్తనలను రాసాడంటే ఆయనకున్న యోగ్యత ఏమిటి?

దుష్టులు చెలరేగినందువల్లనే దేవుని సహాయం కోసం అర్థింపు బయలు వెడలింది. దేవుని విశ్వాస్యతను గురించిన ఆశ, ఆయన విమోచించిన తరువాత ఆయన కరుణాశీలతను ప్రస్తుతించే స్తుతి పాటగా పరిమళించింది. ప్రతి విచారమూ దావీదు వీణెలో మరొక తీగె. ప్రతి విడిపింపూ మరొక పాటకి ప్రాణం.

బాధ తొలగిన ఒక పులకరింత, దక్కిన ఒక దీవెన, దాటిపోయిన ఒక కష్టం, గండం, ఇలా ఏ చిన్న అనుభవం దావీదుకి కలిగి ఉండకపోయినా ఈనాడు ఒక్క కీర్తన కూడా మనకి ఉండేది కాదు. దేవుని ప్రజల అనుభూతులకి అద్దం పట్టి ఆదరణనిచ్చే ఈ కీర్తనలు మనకి లేకపోతే ఎంత నష్టమయ్యేది మనకి!

దేవుని కోసం కనిపెట్టడం, ఆయన చిత్త ప్రకారం బాధల ననుభవించడం, ఆయన్ని తెలుసుకోవడం అనేది ఆయన శ్రమల్లో పాలుపంచుకోవడమే, ఆయన కుమారుని పోలికలోకి మారడమే. కాబట్టి నీ అనుభవం పెరగాలంటే, ఆత్మీయ అవగాహన కలగాలంటే విస్తరించనున్న నీ శ్రమలను చూచి గాబరా పడకు. వాటితో బాటే దేవుని కృప కూడా నీ పట్ల విస్తరిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఊపిరి నిన్ను క్రొత్త సృష్టిగా చేసినప్పుడు చలనం లేని రాయిలాగా చెయ్యలేదు. నీ హృదాయనుభూతుల్ని ఇంకా మృదువుగా, పదిలంగా ఉంచింది. 

పౌలుని దేవుడు నమ్మకమైనవానిగా ఎంచాడు కాబట్టి తన పరిచర్యకు నియమించాడు. (1 తిమోతి 1:12)

-----------------------------------------------------------------------------------------------------------------------------

Beloved, do not be surprised at the ordeal that has come to test you...you are sharing what Christ suffered; so rejoice in it - (1 Pet - 4:12-13)

Many awaiting hours was needful to enrich the harp of David, and many awaiting hours in the wilderness will gather for us a psalm of “thanksgiving, and the voice of melody,” to cheer the hearts of fainting ones here below, and to make glad our Father’s house on high.

What was the preparation of the son of Jesse for the songs like unto which none other have ever sounded on this earth?

The outrage of the wicked brought forth cries for God’s help. Then the faint hope in God’s goodness blossomed into a song of rejoicing for His mighty deliverances and manifold mercies. Every sorrow was another string to his harp; every deliverance another theme for praise.

One thrill of anguish spared, one blessing unmarked or unprized, one difficulty or danger evaded, how great would have been our loss in that thrilling Psalmody in which God’s people today find the expression of their grief or praise!

To wait for God, and to suffer His will, is to know Him in the fellowship of His sufferings, and to be conformed to the likeness of His Son. So now, if the vessel is to be enlarged for spiritual understanding, be not affrighted at the wider sphere of suffering that awaits you. The Divine capacity of sympathy will have a more extended sphere, for the breathing of the Holy Ghost in the new creation never made a stoic, but left the heart’s affection tender and true. —Anna Shipton

“He tested me ere He entrusted me” (1 Tim. 1:12, Way’s Trans.).

Friday, March 18, 2022

Patience in the Routine

నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుము - (మత్తయి 2:13).

నన్ను ఉండమన్న చోటే ఉంటాను

ప్రియ ప్రభూ! నీవు చెప్పినచోటే ఉంటాను

సాగిపోవాలనిపించినా 

అందరితో కలిసి అడుగు వేద్దామనిపించినా

ఎగురుతున్న పతాకాన్ని అనుసరించాలనిపించినా

యుద్ధరంగంలోకి దూకాలని ఉన్నా

ఉంటాను ప్రభూ నీవుండమన్న చోటనే


నన్ను ఉండమన్న చోటనే ఉంటాను

ప్రియ ప్రభూ నీవు చెప్పిన పనే చేస్తాను

పొలం చాలా చిన్నదైనా, సారం కొదువైనా

వ్యవసాయానికి అనువు గాకపోయినా

ఉంటాను నీదే కదా ఈ పొలం

విత్తనాలు ఇస్తే విత్తుతాను

నేల దున్ని వానకోసం కనిపెడతాను

మొలకలెత్తినప్పుడు ఆనందిస్తాను

నువ్వు చెయ్యమన్న పనే చేస్తాను ప్రభూ!!


నన్ను ఉండమన్న చోటే ఉంటాను

ప్రియ ప్రభూ! నీవు చెప్పినచోటే ఉంటాను

భారాన్నీ వేడినీ భరిస్తాను

నీ మీద ఆనుకుని సాయంత్రమైనప్పుడు

బరువైన నాగలిని నీముందు ఉంచుతాను

నా పని పూర్తి అయిందని దాన్ని దించుతాను

నిత్యత్వపు తేజస్సులోకి బ్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను

నిలిచి ఉండడమే మేలు సాగిపోవడం కంటే

నిలిచి ఉండమన్నదే నీ ఆజ్ఞ గనుక.

పరిస్థితుల పంజరంకేసి రెక్కలు కొట్టుకునే అసహనం నిండిన హృదయమా! ఎక్కువగా ఉపయోగపడాలని తహతహలాడుతున్నావా? నీ రోజులన్నిటినీ దేవుడే నియమించాడు. ఓపికతో నిరీక్షించు, జీవితం చవీసారం లేదనిపించిన వేళలే నీకు బలం చేకూరే సమయాలు. ఆ బలంలో దేవుడు నీకు అందించే పెద్దపెద్ద అవకాశాలను అందుకుని ఆ వత్తిడులకు తట్టుకుని నిలబడగలవు.

---------------------------------------------------------------------------------------------------------------------------

Be thou there till I bring thee word - (Matt - 2:13)

“I’ll stay where You’ve put me;  

I will, dear Lord, Though I wanted so badly to go;  

I was eager to march with the ‘rank and file,’  

Yes, I wanted to lead them, You know.  

I planned to keep step to the music loud,  

To cheer when the banner unfurled,  

To stand amid the fight straight and proud,  

But I’ll stay where You’ve put me.  


“I’ll stay where You’ve put me; I’ll work, dear Lord,  

Though the field be narrow and small,  

And the ground be fallow, and the stones lie thick,  

And there seems to be no life at all.  

The field is Thine own, only give me the seed,  

I’ll show it with never a fear;  

I’ll till the dry soil while I wait for the rain,  

And rejoice when the green blades appear;  

I’ll work where You’ve put me.


“I’ll stay where You’ve put me; I will, dear Lord;  

I’ll bear the day’s burden and heat,  

Always trusting Thee fully; when even has come  

I’ll lay heavy sheaves at Thy feet.  

And then, when my earthwork is ended and done,  

In the light of eternity’s glow,  

Life’s record all closed, I surely shall find  

It was better to stay than to go;  

I’ll stay where You’ve put me.”

“Oh restless heart, that beat against your prison bars of circumstances, yearning for a wider sphere of usefulness, leave God to order all your days. Patience and trust, in the dullness of the routine of life, will be the best preparation for a courageous bearing of the tug and strain of the larger opportunity which God may sometimes send you.”