దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము - (2 కొరింథీ 6:10)కన్నీళ్ళు కార్చడం నామోషి అనుకునేవారున్నారు. కన్నీరు కార్చడం క్రైస్తవుడికి ఎంతమాత్రం నిషేధం కాదు. ఓర్వలేని దుఃఖం వలన హృదయం చింతాక్రాంతమై ఉండవచ్చు. శ్రమల తాకిడికి పగిలి నేలకూలే స్థితిలో ఉండవచ్చు. అయితే ఈ చింతనుండి మనిషి విలపించడం మూలంగా ఉపశమనాన్ని పొందుతాడు కాని ఇంతకంటే శ్రేష్టమైన దారి మరొకటి ఉంది.
ఉప్పుసముద్రం మధ్యలో ఎక్కడో తియ్యటి నీటి ఊటలు ఉంటాయంటారు. అతి కఠినమైన గండ శిలల నెర్రెల్లో కొండ శిఖరాలపై అతి సుకుమారమైన పుష్పాలు వికసిస్తాయంటారు. గుండెల్ని పిండిచేసే దుఃఖంలోనుండి తేనెకంటే తియ్యనైన పాటలు పుడతాయంటారు.
ఇది నిజమే. అనేకమైన శ్రమల మధ్య దేవుణ్ణి ప్రేమించే ఆత్మలకు సంతోషంతో గంతులు వెయ్యాలనిపించే కారణాలు, ప్రేరేపణలు కలుగుతాయి. రాత్రి సమయమంలో దేవుని పాటలు వినిపిస్తుంటాయి. జీవితమంతటిలోనూ అత్యంత భయంకరమైన చీకటి రాత్రిలో మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియైన దేవుని స్తుతించాడు. ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావా? దేవుని చిత్తాన్ని కేవలం భరించడం కాదు, దాన్ని కోరుకోవాలి. దానిలో పట్టరాని ఉత్సాహంతో ఆనందించాలి. మహిమలో తేలియాడాలి.
గాయపడిన నా హృదయం మౌనమూనింది
కలతల కెరటం నాపై పొర్లిపారింది
మూలుగు, చిన్న ఆక్రోశం కూడా ఉబికి రాలేదు
పెదవులు బిగబట్టి కన్నీటికి ఆనకట్ట వేసాను
మౌనమే శరణ్యం
బాధ కలిగించేది ప్రేమే అని తెలుసు
చివరి ఆదరణ బిందువుని ఆవిరిచేస్తుంది
మిగిలిన ఒక్క తీగెనీ తెంపేస్తుంది
దేవుడే ప్రేమ, నాకు నేను నచ్చజెప్పుకున్నాను
హృదయమా సందేహపడకు
కొంత సేపు ఎదురుచూడు, లేవనెత్తుతాడాయన
అవును, ఆయనకిష్టమైనపుడు
గుండెలో మ్రోగిన వాగ్దానాన్ని విన్నాను
నిర్వికారంగా నిలదొక్కుకున్నాను
ఆరిన కళ్ళను ఆకాశం వైపు ఎత్తాను
అవును క్రీస్తూ నీ చిత్తమే అన్నాను
భారంగా పలికింది హృదయం
బేలగా కదిలాయి అధరాలు
ఇంతేకాదు నా హృదయమా ఇంకా ఉంది
భరించడమే కాదు, ఆనందించాలి
ఇప్పుడు నేనూ నా హృదయం పాడుతున్నాము
వాయిద్యాల మేళవింపు లేకపోయినా గానం చేస్తున్నాము
ఎడారిలో కడుపార నీళ్ళు త్రాగుతున్నాము
అణగారిపోయిన పక్షిరాజులా ఆకాశానికెగురుతున్నాము
-----------------------------------------------------------------------------------------------------------------------------
As sorrowful, yet always rejoicing - (2 Cor - 6:10)
The stoic scorns to shed a tear; the Christian is not forbidden to weep. The soul may be dumb with excessive grief, as the shearer’s scissors pass over the quivering flesh; or, when the heart is on the point of breaking beneath the meeting surges of trial, the sufferer may seek relief by crying out with a loud voice. But there is something even better.
They say that springs of a sweet freshwater well up amid the brine of salt seas; that the fairest Alpine flowers bloom in the wildest and most rugged mountain passes; that the noblest psalms were the outcome of the profoundest agony of soul.
Be it so. And thus amid manifold trials, souls which love God will find reasons for bounding, leaping joy. Though deep calls to deep, yet the Lord’s song will be heard in silver cadence through the night. And it is possible in the darkest hour that ever swept a human life to bless the God and Father of our Lord Jesus Christ. Have you learned this lesson yet? Not simply to endure God’s will, nor only to choose it, but to rejoice in it with joy unspeakable and full of glory. —Tried as by Fire
I will be still, my bruised heart faintly murmured,
As o’er me rolled a crushing load of woe;
The cry, the call, e’en the low moan was stifled;
I pressed my lips; I barred the tear drop’s flow.
I will be still, although I cannot see it,
The love that bears a soul and fans pain’s fire;
That takes away the last sweet drop of solace,
Breaks the lone harp string, hides Thy precious lyre.
But God is love, so I will bide me, bide me—
We’ll doubt not, Soul, we will be very still;
We’ll wait till after while when He shall lift us
Yes, after a while, when it shall be His will.
And I did listen to my heart’s brave promise;
And I did quiver, struggling to be still;
And I did lift my tearless eyes to Heaven,
Repeating ever, “Yea, Christ, have Thy will.”
But soon my heart upspake from ’neath our burden,
Reproved my tight-drawn lips, my visage sad:
“We can do more than this, O Soul,” it whispered.
“We can be more than still, we can be glad!”
And now my heart and I are sweetly singing—
Singing without the sound of tuneful strings;
Drinking abundant waters in the desert,
Crushed, and yet soaring as on eagle’s wings.