Sunday, March 27, 2022

When We See Him Face to Face

మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను - (రోమా 8:18). 

ఇంగ్లండ్ దేశంలో ఈ మధ్య ఒక పెళ్ళిలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. పెళ్ళికొడుకు ధనవంతుడు, ఉన్నత కుటుంబికుడు, పదేళ్ళ ప్రాయంలో ఒక ప్రమాదంలో కళ్ళు రెండూ పోగొట్టుకున్నాడు. గుడ్డివాడైనప్పటికీ చదువులో అందరి మన్ననలూ పొందాడు. పెళ్ళికూతురిది వర్ణించలేనంత అందం. కాని ఏం లాభం, పెళ్ళికొడుకు ఆమె ముఖారవిందాన్ని చూడడానికి నోచుకోలేదు. కాని పెళ్ళికి కొన్ని రోజులముందే నిపుణులైన కంటి డాక్టర్లు అతనికి చికిత్స చేసారు. పెళ్ళిరోజున దాని ఫలితం తెలియనున్నది.

ఆ రోజు రానే వచ్చింది. అతిధులు, బహుమతులతో చర్చి నిండింది. మంత్రులు, ఉన్నత సైన్యాధికారులు, బిషప్పులు, ఎందరో కీర్తి ప్రతిష్టలున్న వాళ్ళు వచ్చారు. పెళ్ళికొడుకు పెళ్ళిబట్టలు వేసుకుని కళ్ళకి ఇంకా కట్టుతోనే తన తండ్రితో కలిసి కారులో చర్చికి చేరుకున్నాడు. చర్చి దగ్గర కంటి వైద్యుడు అతన్ని కలిసాడు.

పెండ్లికుమార్తె తండ్రి ఆమెను సుతారంగా నడిపిస్తూ తీసుకొచ్చాడు. రకరకాల భావాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందరూ అంతలా ప్రశంసిస్తున్న తన అందాన్ని తన ప్రియుడు వేళ్ళతో తడిమి చూడడమేనా, లేక కళ్ళారా చూసి మురిసిపోయే ప్రాప్తం ఉందా.

ఆమె ప్రవేశిస్తుండగా మధురమైన సంగీతం చర్చిలో నిండింది. పుల్ పిట్ ని నమీపిస్తుంటే ఆమె కళ్ళు ఒక వింత దృశ్యంపై పడినాయి.

 వరుని ప్రక్కన అతని తండ్రి ఉన్నాడు. వరుని ఎదుట ఆ కంటి వైద్యుడు కంటికి ఉన్న కట్లు విప్పుతూ ఉన్నాడు. చివరికట్టు కూడా తొలగించబడింది. రెప్పలు రెపరెపలాడించి తడబడుతూ ఒక అడుగు ముందుకి వేసాడు. నిద్రమేల్కొన్నవాళ్ళు పరిసరాలను నిదానించి చూసినట్టు కళ్ళు చికిలించి ముందుకు చూసాడు. పైనుండి గులాబిరంగు అద్దంలోగుండా సూర్యకాంతి అతని ముఖంపై పడుతున్నది. అయితే అతను దానివంక చూడలేదు.

మరేం కనిపించింది అతనికి? ఒక్క క్షణం పాటు తన తత్తరపాటును అణుచుకుని వదనంలో ఇదివరకెన్నడూ లేని హుందాతనం, ఆనందం ఉట్టిపడుతుండగా తన వధువును ఎదుర్కోవడానికి ముందుకి అడుగేసాడు. వాళ్ళిద్దరి చూపులు పెనవేసుకున్నాయి. కలిసిన ఆ యిద్దరి కళ్ళు మరెన్నటికీ విడిపోవన్నట్టుగా అనిపించింది.

ఎన్నాళ్ళకి!” ఆమె పెదిమలు విచ్చుకున్నాయి. “ఎన్నాళ్ళకి!” అతను బదులు పలికాడు. ఆ దృశ్యం అక్కడ చేరియున్న వాళ్ళ హృదయాల మీద హత్తుకుపోయింది. సంతోష సంభ్రమాలకు అంతులేదు.

బాధలు, విచారాలు నిండిన ఈ లోకంలో తన యాత్రను ముగించుకుని క్రైస్తవుడు పరలోకంలో చేరి తన ప్రభువును ముఖాముఖిగా చూసినప్పుడు జరిగే సన్నివేశానికి ఈ దృశ్యం ఒక మచ్చుతునకు.

నా ప్రియతమా! యేసు ప్రభూ! నీతినిలయా!

నీ పైని ఆశతో, నీ రాకకై,

దాపుచేరే వేళకై నిరీక్షించేను

నా కన్నులు కాయలు కాసేను


ఆ రోజు రావాలి ఎదురు తెన్నులిక పోవాలి

కడకు చేరేవు నన్ను  నీ స్వరం వింటాను

కన్నులారా కనుగొంటాను నీతో ఉంటాను

ఎంత రమ్యమీ నిరీక్షణా స్వప్నాలు

---------------------------------------------------------------------------------------------------------------------------

I do not count the sufferings of our present life worthy of mention when compared with the glory that is to be revealed and bestowed upon us - (Rom - 8:18)

A remarkable incident occurred recently at a wedding in England. A young man of large wealth and high social position, who had been blinded by an accident when he was ten years old, and who won University honors despite his blindness, had won a beautiful bride, though he had never looked upon her face. A little while before his marriage, he submitted to a course of treatment by experts, and the climax came on the day of his wedding.

The day came, and the presents, and guests. There were present cabinet ministers and generals arid bishops and learned men and women. The bridegroom, dressed for the wedding, his eyes still shrouded in linen, drove to the church with his father, and the famous oculist met them in the vestry.

The bride entered the church on the arm of her white-haired father. So moved was she that she could hardly speak. Was her lover, at last, to see her face that others admired, but which he knew only through his delicate fingertips?

As she neared the altar, while the soft strains of the wedding march floated through the church, her eyes fell on a strange group.

The father stood there with his son. Before the latter was the great oculist in the act of cutting away the last bandage. The bridegroom took a step forward, with the spasmodic uncertainty of one who cannot believe that he is awake. A beam of rose-colored light from a pane in the chancel window fell across his face, but he did not seem to see it.

Did he see anything? Yes! Recovering in an instant his steadiness of mien, and with dignity and joy never before seen in his face, he went forward to meet his bride. They looked into each other’s eyes, and one would have thought that his eyes would never wander from her face.

“At last!” she said. “At last!” he echoed solemnly, bowing his head. That was a scene of great dramatic power, and no doubt of great joy, and is but a mere suggestion of what will actually take place in Heaven when the Christian who has been walking through this world of trial and sorrow, shall see Him face to face. —Selected

“Just a-wearying for you,  

Jesus, Lord, beloved and true;  

Wishing for you, wondering when  

You’ll be coming back again,  

Under all, I say and do,  

Just a-wearying for you.  


“Some glad day, all watching past,  

You will come for me at last;  

Then I’ll see you, hear your voice,  

Be with you, with you rejoice;  

How the sweet hope thrills me through,  

Sets me wearying for you.”

Saturday, March 26, 2022

Receive All He Has For You

లోతు అబ్రామును విడిచి పోయినతరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పు తట్టు పడమరతట్టును చూడుము; ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. - (అది 13:14,15).

ఎస్. ఎ. కీన్ అనే భక్తుడు ఇలా అన్నాడు; 

నెరవేర్చడానికి ఇష్టం లేని కోరిక దేన్నీ పరిశుద్దాత్మ నీలో కలిగించడు. కాబట్టి నీ విశ్వాసం రెక్కలు విప్పుకొని ఆకాశానికి కెగిరి నీ కంటికి ఆనినంత మేరా ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవాలి.

విశ్వాసం అనే కంటితో నువ్వు చూసిన ప్రతీ దీవెనా నీ స్వంతం అయినట్టే భావించు. ఎంత దూరం చూడగలిగితే అంత దూరం చూడు. అదంతా నీదే. క్రైస్తవ జీవితంలో ఏ సుదూర తీరాలను చేరాలనుకుంటున్నావో, క్రీస్తుకు ఎంత శ్రేష్టమైన సేవ చెయ్యాలనుకుంటున్నావో అవన్నీ విశ్వాసంలో సాధ్యమే. ఆ తరువాత ఇంకా దగ్గరికి రా, నీ బైబిల్ చూపిన దారిలో ఆత్మ నడిపింపుకి విధేయుడివై, దేవుని సన్నిధిలో నీ ఆపాదమస్తకమూ బాప్తిస్మం పొందు. ఆయన తన మహిమ సంపూర్ణతను చూడగలిగేలా నీ ఆత్మ నేత్రాలను తెరిచినప్పుడు, నువ్వు చూసేదంతా నీ వారసత్వం అన్న నిశ్చయతను కలిగి ఉండు. తన వాక్యంలో ఆయన చేసిన వాగ్దానాలూ, ఆయన ప్రేరేపణవల్ల నీలో నిదురలేచే ఆకాంక్షలూ, యేసుని వెంబడించే వారికి దొరికే అవకాశాలూ అన్నీ నీ స్వంతమే. వాటిని స్వాధీనం చేసుకో. నీ కనుచూపు మేరలోని భూమంతా నీకు ఇయ్యబడింది.

మన దేవునికి మనపై ఉన్న కృప మన మనస్సులో తలెత్తే స్పందనల్లోనే ప్రత్యక్షపరచబడుతుంది. ఉదాహరణకి చూడండి. చలికాలం ముంచుకు వచ్చినపుడు ఎక్కడో ఉన్న పక్షి వెచ్చదనం, సూర్యరశ్మి కోసం ఖండాలు, సముద్రాలు దాటి దక్షిణ ప్రాంతాలకి వలసపోవాలన్న జ్ఞానాన్ని దేవుడు వాటి అల్పమైన మస్తిష్కంలో ఉంచుతాడు. అవి ప్రయాణం ప్రారంభించాక వాటికి ఆశాభంగం కలగడం దేవునికి ఇష్టం కాదు. వాటికి ఆ ఆలోచన ఎలా ఇచ్చాడో అలానే వాటి గమ్యంలో మృదువైన పిల్లగాలి, ప్రకాశవంతమైన ఎండను సిద్ధం చేస్తాడు. క్రేన్స్ అనే పక్షులు రష్యాలోని సైబీరియాలో మంచు, చలిగాలులు ప్రారంభం కాగానే దాదాపు 10,000 కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోని భరత్ పూర్ అనే చోటికి వలస వస్తాయి. ఇక్కడికి రావాలన్న జ్ఞానం ఆ పక్షులకి దేవుడే ఇచ్చాడు. అలానే ఇక్కడ వాటి కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా సిద్ధపరిచాడు.

పరలోక సంబంధమైన నిరీక్షణతో మన ఆత్మలను వెలిగించిన దేవుడు, ఆ ఆశ వైపుకి మనం వేగిరపడే సమయంలో మనల్ని మోసగించడు. వాటిని అనుగ్రహించ లేకుండా ఆయన చెయ్యి కురుచ కాలేదు.

“వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొనిరి” (లూకా 22:13).

-----------------------------------------------------------------------------------------------------------------------------

Look from the place where thou art, northward, and southward, and eastward, and westward: for all the land which thou seest, to thee will I give it - (Gen - 13:14-15)

No instinct can be put in you by the Holy Ghost but He purposes to fulfill. Let your faith then rise and soar away and claim all the land you can discover. —S. A. Keen

All you can apprehend in the vision of faith is your own. Look as far as you can, for it is all yours. All that you long to be as a Christian, all that you long to do for God, are within the possibilities of faith. Then come, still closer, and with your Bible before you, and your soul open to all the influences of the Spirit, let your whole being receive the baptism of His presence; and as He opens your understanding to see all His fulness, believe He has it all for you. Accept for yourself all the promises of His word, all the desires He awakens within you, all the possibilities of what you may be as a follower of Jesus. All the land you see is given to you.

The actual provisions of His grace come from the inner vision. He who puts the instinct in the bosom of yonder bird to cross the continent in search of summer sunshine in the Southern clime is too good to deceive it, and just as surely as He has put the instinct in its breast, so has He also put the balmy breezes and the vernal sunshine yonder to meet it when it arrives.

He who breathes into our hearts the heavenly hope, will not deceive or fail us when we press forward to its realization. —Selected

“And they found as he had said unto them” (Luke 22:13).

Friday, March 25, 2022

Desperate Days

 

విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెనుగదా.  (హెబ్రీ 11:6).

ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం! ఎంత గొప్ప అనుభవం! నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడ్డాయి. చాలా మట్టుకు బైబిల్ లోని వర్ణనలు ఇవే. కీర్తనల్లో భావం ఇదే. ఎన్నో సత్యాలు వెలికిరావడానికి కారణాలు ఇలాటి సమయాలే.

ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది. మనిషికి జ్ఞాన బోధ చెయ్యడానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది. 107వ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇశ్రాయేలీయులు చేసిన ఉత్సాహ గానం రాయబడింది. ఆపదలో చిక్కుకుని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరాళమయ్యేది. ఎక్కడ చూసినా ఇవే కథలు. ప్రజలు నిస్సహాయులై దిక్కుతోచక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది. జవసత్వాలుడిగిపోయి మృతతుల్యులైన ముసలి జంటకి ఎలాటి వాగ్దానమో చూడండి. నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగానూ, సముద్రం ఒడ్డునున్న ఇసుక రేణువుల్లాగానూ అవుతుంది! ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయుల రక్షణ, యొర్దాను నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తరువాత, నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలను మరోసారి చదవండి. కష్టాలతో క్రుంగిపోయి, ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఆసా, యెహోషాపాతు, హిజ్కియాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి. నెహెమ్యా, దానియేలు, హబక్కూకు, హో షేయల చరిత్ర నెమరు వెయ్యండి. గెత్సెమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి. అరిమతయి యోసేపుకి చెందిన తోటలోని ఆ సమాధి చెంత కాసేపు నిలుచోండి. ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూడండి. వాళ్ళ కష్టకాలాల గురించి అపొస్తలుల్ని అడగండి.

నిరాశతో చతికిలబడడం కంటే తెగింపు, గుండెనిబ్బరం ఉత్తమం. విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు. నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని.

బబులోనుకి చెరపట్టబడిన ముగ్గురు యూదా కుర్రవాళ్ళు ఇలాటి తెగింపు విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కన్పిస్తున్నారు. అది ఎటూ తోచని పరిస్థితి. అయినా వాళ్ళు నిబ్బరంగా రాజుకి జవాబిచ్చారు. “మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్ని గుండం నుండి మమ్మల్ని కాపాడగల సమర్థుడు. నీ చేతిలోనుండి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ ఆయన అలా చెయ్యక పోయినా ఇది మాత్రం గుర్తుంచుకో. నీ దేవతలకు గాని, నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకిగాని మేము సాష్టాంగపడము” “ఒకవేళ ఆయన అలా చెయ్యకపోయినా...”అనడం ఎంత బావుంది! ఈ భాగం నాకు ఎంతో నచ్చింది. 

గెత్సెమనె గురించి కాస్త ధ్యానిద్దాము. “అయినను, నీ చిత్తమే సిద్ధించును గాక” అన్న ప్రార్థనను గుర్తుతెచ్చుకోండి. మన ప్రభువు అంతరంగంలో చిమ్మచీకటి. విధేయత అంటే ఏమిటో తెలుసా? రక్తం కారేంత వరకు శ్రమ. పాతాళకూపంలో దిగినంత చీకటి ఎదురైనా, “ప్రభువా నా ఇష్టప్రకారము కాదు. నీ చిత్తమే కానిమ్ము” అనగలగడం. కష్టకాలంలో నిబ్బరాన్ని ఇచ్చే విశ్వాసగీతాన్ని ఆలపించండి.

*చెరసాల గోడల్లాగా*

*ఆపదలు, ఆటంకాలూ అడ్డు పడితే*

*చేయగలిగినంత చేసి నేను*

*చేతకానిది నీకు వదిలాను*


*అవరోధం పెరిగి అవకాశం తరిగి*

*ఆవేదన వలలో నేనల్లాడుతుంటే*

*అసహాయతలో ఓ చిన్ని ఆశాదీపం*

*అనుగ్రహింప వస్తావని చూస్తోంది నీకోసం*

-----------------------------------------------------------------------------------------------------------------------------

But without faith it is impossible to please him: for he that cometh to God must believe that he is and that he is a rewarder of them that diligently seek him. - (Heb -11:6)

The faith for desperate days.

The Bible is full of such days. Its record is made up of them, its songs are inspired by them, its prophecy is concerned with them, and its revelation has come through them.

The desperate days are the stepping-stones in the path of light. They seem to have been God’s opportunity and man’s school of wisdom.

There is a story of an Old Testament love feast in Psalm 107, and in every story of deliverance, the point of desperation gave God His chance. The “wit’s end” of desperation was the beginning of God’s power. Recall the promise of seed as the stars of heaven, and as the sands of the sea, to a couple as good as dead. Read again the story of the Red Sea and its deliverance, and of Jordan with its ark standing mid-stream. Study once more the prayers of Asa, Jehoshaphat, and Hezekiah, when they were sorely pressed and knew not what to do. Go over the history of Nehemiah, Daniel, Hosea, and Habakkuk. Stand with awe in the darkness of Gethsemane, and linger by the grave in Joseph’s garden through those terrible days. Call the witnesses of the early Church, and ask the apostles the story of their desperate days.

Desperation is better than despair.

Faith did not make our desperate days. Its work is to sustain and solve them. The only alternative to a desperate faith is despair, and faith holds on and prevails.

There is no more heroic example of desperate faith than that of the three Hebrew children. The situation was desperate, but they answered bravely, “Our God whom we serve can deliver us from the burning, fiery furnace; and he will deliver us out of thine hand, O king. But if not, be it known unto thee, O king, that we will not serve thy gods, nor worship the golden image which thou hast set up.” I like that, “but if not !”

I have only space to mention Gethsemane. Ponder deeply its “Nevertheless.” “If it is possible…nevertheless!” Deep darkness had settled upon the soul of our Lord. Trust meant anguish unto blood and darkness to the descent of hell—Nevertheless! Nevertheless!!

Now get your hymn book and sing your favorite hymn of desperate faith. —Rev. S. Chadwick

“When obstacles and trials seem  

Like prison walls to be,  

I do the little I can do  

And leave the rest to Thee.  


“And when there seems no chance, no change,  

From grief can set me free,  

Hope finds its strength in helplessness,  

And calmly waits for Thee.”