Thursday, April 7, 2022

Inward Stillness

 

ఊరకుండుటయే వారి బలము (యెషయా 30:7)  (ఇంగ్లిష్ బైబిల్ నుండి స్వేచ్ఛానువాదం). 

దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి అంతరంగంలో నిశ్చలంగా ఉండడం అత్యవసరం. నేను దీన్ని మొదటిసారి నేర్చుకున్న సందర్భం నాకు గుర్తుంది. ఆ కాలంలో నా జీవితంలో అతి దుర్భరమైన పరిస్థితి తలెత్తింది. నాలోని అణువణువు ఆందోళనతో కంపించసాగింది. అత్యవసరంగా శక్తి సామర్థ్యాలన్నీ వెచ్చించి ఏదో ఒకటి చెయ్యవలసిన పరిస్థితుల్లో కనీసం కాలు కదపడానికి కూడా శక్తి లేనట్టుగా అయిపోయింది. పరిష్కరించవలసిన వ్యక్తేమో మెదలకుండా ఊరుకున్నాడు. 

ఇక నాలో రేగే బడబాగ్నికి నేను ఆహుతి అయిపోతానేమో అన్నంత ప్రమాదం రాగా, నా ఆత్మ లోతుల్లో ఒక మెల్లని స్వరం ఇలా పలికింది. “నేను దేవుడినని తెలుసుకుని ఊరకనే ఉండు.” ఆ మాటల్లో ఎంతో శక్తి ఉంది. నేను లోబడ్డాను. నా శరీరాన్ని, నా ఆత్మను సముదాయించి నిశ్చలంగా స్థిరంగా పైకి చూస్తూ కనిపెట్టాను. అప్పుడు నాకు అర్ధమయింది అంత అత్యవసర పరిస్థితిలో నా నిస్సహాయతలో దాన్ని ఎదుర్కోవడానికి వచ్చినది నా దేవుడే అని. ఆయనలో సేదదీరాను. ఎన్ని భాగ్యాలనైనా ఆ అనుభవం కోసం వదిలెయ్యడానికి నేను సిద్దమే. ఆ నిశ్చలతలో నుండి అత్యవసర స్థితిని కడతేర్చేందుకు ఓ వింత శక్తి పుట్టుకొచ్చింది. నా సమస్యంతా విజయవంతంగా పరిష్కారమైంది. ఊరకనే ఉండడంలోనే నా బలం ఉందని నేర్చుకున్నాను.

ఇలా నిశ్చలంగా ఉండడమూ, సోమరితనమూ ఒకటి కాదు. ఇది దేవునిపై గల నమ్మకంలోనుంచి పుట్టిన నిశ్చలత. నిశ్శబ్దంగా ఆందోళన చెందడం నమ్మకం కిందికి రాదు. అది కేవలం మూత బిగించిన ఆందోళనే.

విలయతాండవమాడే గాలివానలో కాదు

నాలుకలు చాపే అగ్నిలో, భూకంపంలో కాదు

భయాలు తొలగేది నా నిశ్శబ్దంలోనే

చల్లని మెల్లని స్వరం వినవచ్చేది మౌనంలోనే


దేవుని కొండపై ఓ హృదయమా మౌనంగా ఉండుమా

భయాలు మెండుగా, అవసరాలు దండిగా ఉండగా

వాంఛలు, విన్నపాలు వెలుగు నోచుకోక ఉండగా

అండయైన దేవుని నిండు మాటలు ఆలకించుమా

-----------------------------------------------------------------------------------------------------------------------------

Their strength is to sit still (Isa - 30:7)

In order really to know God, inward stillness is absolutely necessary. I remember when I first learned this. A time of great emergency had risen in my life, when every part of my being seemed to throb with anxiety, and when the necessity for immediate and vigorous action seemed overpowering; and yet circumstances were such that I could do nothing, and the person who could, would not stir.

For a little while, it seemed as if I must fly to pieces with the inward turmoil, when suddenly the still small voice whispered in the depths of my soul, “Be still, and know that I am God.” The word was with power, and I hearkened. I composed my body to perfect stillness, and I constrained my troubled spirit into quietness, and looked up and waited; and then I did “know” that it was God, God even in the very emergency and in my helplessness to meet it; and I rested in Him. It was an experience that I would not have missed for worlds; and I may add also, that out of this stillness seemed to arise a power to deal with the emergency, that very soon brought it to a successful issue. I learned then effectually that my “strength was to sit still.” —Hannah Whitall Smith

There is a perfect passivity that is not indolence. It is a living stillness born of trust. Quiet tension is not trusting. It is simply compressed anxiety.

Not in the tumult of the rending storm,  

Not in the earthquake or devouring flame;  

But in the hush that could all fear transform,  

The still, small whisper to the prophet came.  


0 Soul, keep silence on the mount of God,  

Though cares and needs throb around thee like a sea;  

From supplications and desires unshod,  

Be still, and hear what God shall say to thee.  


All fellowship hath interludes of rest,  

New strength maturing in each poise of power;  

The sweetest Alleluias of the blest  

Are silent, for the space of half an hour.  


0 rest, in utter quietude of soul,  

Abandon words, leave prayer and praise awhile;  

Let thy whole being, hushed in His control,  

Learn the full meaning of His voice and smile.  


Not as an athlete wrestling for a crown,  

Not taking Heaven by the violence of will;  

But with thy Father as a child sit down,  

And know the bliss that follows His “Be Still!”  

—Mary Rowles Jarvis

Wednesday, April 6, 2022

Watch For God

 

ఆయన నాకు ఏమి సెలవిచ్చునో ... చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని యుందును (హబక్కూకు 2:1).

కావలివాళ్ళు కనిపెట్టినట్టు కనిపెట్టకపోతే అది దేవుని సహాయం కోసం కనిపెట్టడం కానే కాదు. మనకే సహాయమూ రాదు. ఆయన నుండి మనకి బలము, ఆపదలలో రక్షణ లభించడం లేదంటే మనం దాని గురించి కనిపెట్టడం లేదన్నమాట. మనం మన గోపురం మీద నిలిచి కావలివాడి లాగా దూరాన వస్తున్న దేవుని రక్షణను, ఉపకారాన్ని చూడలేకపోతున్నాం. అవి దూరంగా ఉండగానే మన హృదయపు ద్వారాలను బార్లా తీసి కనిపెట్టకపోతే అవి మరో దారిన తిరిగి వెళ్ళిపోతాయి. ఒక వ్యక్తి లోని నిరీక్షణ రాబోయే ఆశీర్వాదాల కోసం అతన్ని అప్రమత్తతతో ఎదురు చూసేలా చెయ్యలేక పోయినట్టయితే అతనికి ఏమీ దొరకవు. కాబట్టి మీ దైనందిన జీవితంలో దేవుని కోసం కనిపెట్టండి.

వర్షం కురిసే వేళకి మన ఖాళీ కుండలను తెరిచి ఉంచితేనే గాని నీళ్ళు పట్టుకోలేము.

దేవుని వాగ్దానాల కోసం అడిగేటప్పుడు మనం వ్యాపార ధోరణిలో, మన సామాన్యమైన బుద్ధి జ్ఞానాల్ని ఉపయోగించాలి. ఎలాగంటే మీరొక బ్యాంకుకి వెళ్ళారనుకోండి, ఒక మనిషి లోపలికివచ్చి ఓ కాగితాన్ని కౌంటర్ మీదుంచి, వెంటనే దాన్ని వెనక్కు తీసేసుకుని బయటికి వెళ్ళిపోయి, ఇలా చాలాసార్లు చేస్తూ ఉన్నాయనుకోండి, అతనికి ఏమీ లాభంలేదు సరికదా ఆ మనిషిని లోపలికి రానియ్యవద్దని అంటారు.

బ్యాంకులో నిజంగా పని ఉండి వచ్చేవాళ్ళయితే తమ చెక్కుల్ని బ్యాంకులో ఇచ్చి తమకి డబ్బు ముట్టేదాకా ఓపిగ్గా కూచుని, తమ పని అయిన తరువాతే తిరిగి వెళ్తారు.

అంతేకాని ఆ చెక్కుని అక్కడుంచి, దానిమీద ఉన్న సంతకం ఎంత అందంగా ఉందీ అంటూ మురిసిపోయి, ఆ కాగితం ఎంత బ్రహ్మాండంగా ఉందీ అంటూ మెచ్చుకుని వెనక్కు తిరిగి వెళ్ళిపోరు. ఆ చెక్కుకు ప్రతిగా వాళ్ళకి డబ్బు కావాలి. తమ చేతికి డబ్బు వచ్చేదాకా వాళ్ళు సంతృప్తి చెందరు. ఇలాటి మనుషులకి ఆ బ్యాంకులో ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది. అయితే ప్రార్ధనలో కూడా కొందరు మనుషులు ఆటలాడుకుంటారు. ఎంత విచారకరం! దేవుడు తన ప్రార్ధనకి జవాబివ్వాలని వాళ్ళు ఎదురు చూడరు. వీళ్ళు కేవలం ఆటలాడుకునే వ్యర్ధులే. మన పరలోకపు తండ్రి ప్రార్ధనలో మనతో నిజమైన వ్యాపార సంబంధాన్ని పెట్టుకోవడానికి సిద్దంగా ఉన్నాడు. ప్రార్థన అనే చెక్కుని పరలోకపు బ్యాంకులో ఇచ్చి, మీ డబ్బు మీ చేతికి వచ్చేదాకా వేచి యుండండి.

"నీ ఆశ భంగము కానేరదు" (సామెతలు 24:14).

-----------------------------------------------------------------------------------------------------------------------------

I will stand upon my watch, and set me upon the tower, and will watch to see what he will say unto me (Hab - 2:1)

There is no waiting on God for help, and there is no help from God, without watchful expectation on our part. If we ever fail to receive strength and defense from Him, it is because we are not on the outlook for it. Many a proffered succour from heaven goes past us, because we are not standing on our watch-tower to catch the far-off indications of its approach, and to fling open the gates of our heart for its entrance. He whose expectation does not lead him to be on the alert for its coming will get but little. Watch for God in the events of your life.

The old homely proverb says: “They that watch for Providence will never want a providence to watch for,” and you may turn it the other way and say, “They that do not watch for providences will never have a providence to watch for.” Unless you put out your water-jars when it rains you will catch no water.

We want to be more business-like and use common sense with God in pleading promises. If you were to go to one of the banks, and see a man go in and out and lay a piece of paper on the table, and take it up again and nothing more—if he did that several times a day, I think there would soon be orders to keep the man out.

Those men who come to the bank in earnest present their checks, they wait until they receive their gold, and then they go; but not without having transacted real business.

They do not put the paper down, speak about the excellent signature, and discuss the excellent document; but they want their money for it, and they are not content without it. These are the people who are always welcome at the bank, and not triflers. Alas, a great many people play at praying. They do not expect God to give them an answer, and thus they are mere triflers. Our Heavenly Father would have us do real business with Him in our praying. —C. H. Spurgeon

“Thine expectation shall not be cut off.”

Tuesday, April 5, 2022

God's Mysterious Dealings

అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చి నీవును నీ కుమారులును లోపలనుండి తలుపు మూయవలెను (2 రాజులు 4:4). 

వాళ్ళు ప్రకృతి సిద్ధమైన సూత్రాలకీ, మానవ ప్రభుత్వాలకీ, సంఘానికీ, యాజకత్వానికి, చివరకి ఎలీషా ప్రవక్తకి కూడా అతీతమైన అద్భుత కార్యం కోసం ఎదురుచూస్తున్నారు గనుక దేవునితో ఒంటరిగానే ఉండాలి. మరెవ్వరు వాళ్ళతో ఉండకూడదు. మానవ అవగాహన శక్తినీ, విజ్ఞాన శాస్త్ర సూత్రాలనూ వదిలి అంతరిక్షంలో దేవుని  మహిమకి ఎదురై నిలిచి ఆ అలోక శక్తిని తేరిపార చూడాలి.

దేవునితో వ్యవహారాలు పెట్టుకోవాలంటే ఏ పద్ధతి అనుసరించాలో ఇక్కడ మనకి కన్పిస్తున్నది. ఒంటరిగా రహస్య స్థలంలో ప్రార్థన విశ్వాసాలతో ప్రతి ఆత్మా ఆయన కోసం ఎదురు చూడాలి.

కొన్ని సమయాల్లో, కొన్ని ప్రదేశాల్లో దేవుడు మనచుట్టూ ఒక అనిర్వచనీయమైన గోడ కడతాడు. మనకి ఉన్న ఆధారాలన్నింటినీ పడగొడతాడు. సాధారణంగా మనం పనులు చేసే పరిస్థితులనూ, విధానాలనూ, నిరర్ధకం చేస్తాడు. మనకర్థం కాని దివ్య వాతావరణంలో బంధిస్తాడు. అది మనకి ఇంతకుముందు అనుభవం కానిది, క్రొత్తది. మనకి ఇంతవరకు అలవాటైన అనుభవాల చట్రంలో ఇమడనిది. ఈ కొత్త అనుభవంలో అయితే ముందేం జరగనున్నదో మనకి తెలియదు. మన జీవితం అనే వస్త్రాన్ని దేవుడు తన స్వరూపం వచ్చేలా కత్తిరిస్తాడు.

చాలామంది భక్తిగల మనుష్యులు కూడా ఒక రకమైన గానుగెద్దు జీవితం గడుపుతుంటారు. ప్రతిరోజూ అదే జీవితం. ముందు ఏమి జరుగనున్నదో అనే సందేహం వాళ్లకు ఉండదు. కాని దేవుడు నడిపించే ఆత్మలైతే ఎన్నెన్నో ప్రత్యేకమైన ఊహలకందని అనుభవాల్లోకి వెళుతూ ఉంటారు. దేవుడు తమని నడిపిస్తున్నాడు అన్న విషయం తప్ప మరేదీ తెలియని అనిశ్చత పరిస్థితుల్లో ఆయన బంధిస్తాడు. వాళ్ళు దేవునిపై తప్ప మరిక దేని మీదా ఏ విధంగానూ ఆధార పడడం వీలుకాదు.

పై వాక్యంలోని విధవరాలిలాగా మనం కూడా బాహ్యమైన వాటిని వదిలి, లోపల కేవలం దేవునితో మాత్రమే కలుపబడితేనే తప్ప ఆయన చేసే అద్భుతాన్ని చూడలేము.

అతి కష్టకాలంలోనే దేవుణ్ణి గురించిన అతి మధురమైన రహస్యాలు బయటపడుతుంటాయి.

మనల్ని లోపలుంచి తలుపు మూసి
మన బాధలో, దుఃఖంలో పలుకుతాడు దేవుడు
మనసు విప్పి మృదువుగా, ఏకాంతంలో
ముత్యాల్లాంటి మాటలు మన చెవిలో
-----------------------------------------------------------------------------------------------------------------------------
    God's Mysterious Dealings

Thou shalt shut the door upon thee and upon thy sons (2 Kgs - 4:4)

They were to be alone with God, for they were not dealing with the laws of nature, nor human government, nor the church, nor the priesthood, nor even with the great prophet of God, but they must needs be isolated from all creatures, from all leaning circumstances, from all props of human reason, and swung off, as it were, into the vast blue inter-stellar space, hanging on God alone, in touch with the fountain of miracles.

Here is a part in the programme of God’s dealings, a secret chamber of isolation in prayer and faith which every soul must enter that is very fruitful.

There are times and places where God will form a mysterious wall around us, and cut away all props, and all the ordinary ways of doing things, and shut us up to something Divine, which is utterly new and unexpected, something that old circumstances do not fit into, where we do not know just what will happen, where God is cutting the cloth of our lives on a new pattern, where He makes us look to Himself.

Most religious people live in a sort of treadmill life, where they can calculate almost everything that will happen, but the souls that God leads out into immediate and special dealings, He shuts in where all they know is that God has hold of them, and is dealing with them, and their expectation is from Him alone.

Like this widow, we must be detached from outward things and attached inwardly to the Lord alone in order to see His wonders. —Soul Food

In the sorest trials God often makes the sweetest discoveries of Himself. —Gems

“God sometimes shuts the door and shuts us in,  
That He may speak, perchance through grief or pain,  
And softly, heart to heart, above the din,  
May tell some precious thought to us again.”