మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి (మత్తయి 27:61).
విచారం అన్నది ఎంత అర్థం లేని విషయం! అది నేర్చుకోదు, తెలుసుకోదు. కనీసం ప్రయత్నించదు. ఈ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభువు సమాధి ద్వారం దగర కూర్చుని ఉన్నప్పుడు, ఇప్పటిదాకా పునరుత్థానోత్సవాలతో జయార్భాటంతో గడిచిన ఈ రెండు వేల సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా? మా ప్రభువు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే గాని దాని వెనక ఉన్న పరమార్థాన్ని ఏమన్నా గ్రహించారా?
వాళ్ళకి దుఃఖకారణమైన క్రీస్తు - మరణం ద్వారానే- మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తుగా లేచాడు. లెక్కలేనన్ని హృదయాల అంగలార్పులో నుండి పునరుత్థానం చిగురించింది. అయితే శోకోపహతులైన ఆ స్త్రీలు మరణ బీజాన్నే చూస్తున్నారు గాని, శాఖోపశాఖలుగా విస్తరించనున్న పునరుత్థానపు మొలకను గమనించడం లేదు. తాము ఏ సంఘటనను తమ ప్రభువు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించడం లేదు. యేసు స్వరం తాత్కాలికంగా మూగబోయింది, తిరిగి కోటి రెట్లు శక్తిగల పునరుజ్జీవనానికే.
కాని ఆ స్త్రీలకిది ప్రస్తుతం అగమ్యగోచరం. విలపించారు, ఏడ్చారు, నీరసించి తిరిగి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ హృదయాలు కుదుటబడక తిరిగి సమాధి దగ్గరికి వచ్చారు. అయితే సమాధి సమాధే. సమాధికి స్వరం లేదు, తేజస్సు లేదు.
మన జీవితాల్లోనూ ఇది అంతే, మనమంతా వనంలో సమాధి నానుకుని దిగాలు పడి కూర్చుంటూ ఉంటాము. “ఈ దుఃఖానికి ఉపశమనం లేదు… ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు… దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు” అని అనుకుంటూ ఉంటాము. కాని మన లోతైన దుఃఖం వెనుక, అతి భయంకరమైన ఆపద వెనక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు, తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి.
చావు పొంచియుంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు. ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురు చూస్తుంటుంది. పేరుకు పోయిన కారు చీకటిలో తిరిగి మరెన్నటికీ అస్తమించని చిరుకాంతి కిరణం తళుక్కు మంటుంది. ఈ అనుభవాలన్నీ మన గుండెలో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడుచెయ్యదు. అక్కడక్కడ విచారపు నీడలున్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది. దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీపస్థంభాలవల్ల మన విచారపు క్రీనీడలు కూడా అందంగానే కనిపిస్తాయి. ఆ నీడల్లో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు. వాటిని కోసి మాల కట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు. కాని అవి ఆత్మపుష్పాలు- ప్రేమ, ఆశ, విశ్వాసం, శాంతి సంతోషాలు. ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోను ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలు ఇవి.
శోకాల కాలిబాట
క్రీస్తు విశ్రమించిన చోట
గులాబీలనివ్వదు ఈ తోట
ఇది ముళ్ళబాట
పరలోక దీవెనల గరిక పూలు
వికసించాలంటే ఈ చోటే మేలు
ఈ బాటలో సిలువ మోసినవాడు
రాకుమారుడవుతాడు ముందునాడు
-----------------------------------------------------------------------------------------------------------------------------
And there was Mary Magdalene and the other Mary, sitting over against the sepulchre ( Matt - 27:61)
How strangely stupid is grief. It neither learns nor knows nor wishes to learn or know. When the sorrowing sisters sat over against the door of God’s sepulchre, did they see the two thousand years that have passed triumphing away? Did they see anything but this: “Our Christ is gone!”
Your Christ and my Christ came from their loss; Myriad mourning hearts have had the resurrection amid their grief, and yet the sorrowing watchers looked at the seed-form of this result and saw nothing. What they regarded as the end of life was the very preparation for coronation; for Christ was silent that He might live again in tenfold power.
They saw it not. They mourned, they wept, and went away, and came again, driven by their hearts to the sepulchre. Still, it was a sepulchre, unprophetic, voiceless, lusterless.
So with us. Every man sits over against the sepulchre in his garden, in the first instance, and says, “This woe is irremediable. I see no benefit in it. I will take no comfort in it.” And yet, right in our deepest and worst mishaps, often, our Christ is lying, waiting for resurrection.
Where our death seems to be, there our Saviour is. Where the end of hope is, there is the brightest beginning of fruition. Where the darkness is thickest, there the bright beaming light that never is set is about to emerge. When the whole experience is consummated, then we find that a garden is not disfigured by a sepulchre. Our joys are made better if there be sorrow in the midst of them. And our sorrows are made bright by the joys that God has planted around them. The flowers may not be pleasing to us, they may not be such as we are fond of plucking, but they are heart-flowers, love, hope, faith, joy, peace—these are flowers which are planted around about every grave that is sunk in the Christian heart.
“’ Twas by a path of sorrows drear
Christ entered into rest;
And shall I look for roses here,
Or think that earth is blessed?
Heaven’s whitest lilies blow
From earth’s sharp crown of woe.
Who here his cross can meekly bear,
Shall wear the kingly purple there.”