Wednesday, April 27, 2022

The Risen Lord

 

…నేను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను (ప్రకటన 1:18). 

పువ్వుల్లారా, ఈస్టరు రోజున పూసిన లిల్లీ మొగ్గల్లారా, ఏదీ ఈ ఉదయం నాకా దివ్యమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి! ఎన్నో కృంగియున్న హృదయాలకి మీరు అందించిన ఆ శాశ్వత జీవపు కథను నాకూ వినిపించండి.

జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ గ్రంథమా, ఏదీ మరోసారి నీ పుటలు తిరగెయ్యనియ్యి. చనిపోవడం లాభం అంటూ నీవందించే నిశ్చయతను మళ్ళీ రుచి చూడనియ్యి.

కవులారా, నిత్యజీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్ళీ వినిపించండి. గాయకులారా, ఉత్సాహ గీతాలు అందుకోండి. ఆ పునరుత్థానపు కీర్తనను మళ్ళీ వినిపించండి.

-చెట్లూ, చేమలూ, పక్షులూ, పురుగులూ, ఆకాశం, సముద్రం, గాలులూ, వానలూ మీరంతా ఆ సందేశాన్ని క్రొత్తగా వినిపించండి. కిలకిలలాడండి, ప్రతిధ్వనింప జెయ్యండి. ప్రతి అణువులోనూ ఈ మాట స్పందింపజేయండి. గాలంతా ఈ నినాదం నింపండి.

మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఆశ నిశ్చయతగా మారేదాకా, నిశ్చయత అంతా ప్రత్యక్షతలో కేంద్రీకృతమయ్యేదాకా గానం చెయ్యండి. పౌలు లాగా మనమంతా చావుకెదురైనప్పుడు జయగీతాలతో విశ్వాసపు స్థిరత్వంతో, పవిత్రతతో పొంగి పొరలే వదనంతో అతిశయించేంత వరకూ పాడండి.

సమాధి దారిలో మృతుణ్ణి మోసుకుంటూ

శోక వదనాలతో మౌనంగా సాగే మానవుల్లారా

సమాధులవంక ఈ రోజుకి చూడకండి

కళ్ళెత్తి దేవుని మహిమని కలకాలం కనుగొనండి


కన్నీళ్ళ కాలం కదిలిపోయింది

పునరుత్థాన పుష్పాలు పకపకమన్నాయి

హృదయాలు పులకరించాయి

గుడిగంటల పిలుపుకి బదులు పలికాయి.


క్రీస్తు ఇప్పటికీ మృతుడై ఉంటే

మరణపు చెరలో మ్రగ్గుతూ ఉంటే

పాతాళ కూపం నుంచి విముక్తుడు కాకుంటే

నీ కన్నీరు తుడిచేవాడు లేకుంటే

నిరాశకి తావుంది, దుఃఖానికి చోటుంది.

కానీ లేచాడాయన కట్లు తెంచుకుని

మానండిక నిట్టూర్పులు ఇది గ్రహించుకుని

ఒక పాస్టరు గారు తన గదిలో కూర్చుని తాను ఈస్టరు రోజున ఇవ్వవలసిన ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు. హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనస్సుని మెరుపులా తాకింది. “ప్రభువు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు!” ఒక్క గంతులో ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చెయ్యసాగాడు. “క్రీస్తు బ్రతికే ఉన్నాడిప్పుడు. ఒకప్పుడున్నవాడు కాడు ఆయన. ఇప్పుడున్నవాడు. ఆయన కేవలం ఓ చారిత్రాత్మక సత్యం కాదు. ప్రస్తుతం సత్యం. జీవించి ఉన్న సత్యం. ఈ ఈస్టరు నిజం ఎంత గొప్పది.” 

మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తును మనం నమ్ముతాము. గతంలోకి మీ ముఖం తిప్పుకోకండి. ఆయన సమాధిని ఆరాధించకండి. బ్రతికి ఉన్న క్రీస్తుని ఆరాధించండి. ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం. ఎప్పటికీ సజీవులం.

-----------------------------------------------------------------------------------------------------------------------------

I am he that liveth, and was dead; and, behold, I am alive forevermore (Rev - 1:18)

Flower! Easter lilies! speak to me this morning the same dear old lesson of immortality which you have been speaking to so many sorrowing souls.

Wise old Book! let me read again in your pages of firm assurance that to die is gain.

Poets! recite to me your verses which repeat in every line the Gospel of eternal life.

Singers! break forth once more into songs of joy; let me hear again the well-known resurrection psalms.

Tree and blossom and bird and sea and sky and the wind whisper it, sound it afresh, warble it, echo it, let it throb and pulsate through every atom and particle; let the air be filled with it.

Let it be told and retold and still retold until hope rises to conviction, and conviction to the certitude of knowledge; until we, like Paul, even though going to our death, go with triumphant mien, with assured faith, and with a serene and shining face.

O sad-faced mourners, who each day are wending  

Through churchyard paths of cypress and of yew,  

Leave for today the low graves you are tending,  

And lift your eyes to God’s eternal blue!  


It is no time for bitterness or sadness;  

Twine Easter lilies, not pale asphodels;  

Let your souls thrill to the caress of gladness,  

And answer the sweet chime of Easter bells.  


If Christ were still within the grave’s low prison,  

A captive of the enemy we dread;  

If from that moldering cell He had not risen,  

Who then could chide the gloomy tears you shed?  


If Christ were dead there would be a need to sorrow,  

But He has risen and vanquished death for aye;  

Hush, then your sighs, if only till the morrow,  

At Easter give your grief a holiday.  

—May Riley Smith

A well-known minister was in his study writing an Easter sermon when the thought gripped him that his Lord was living. He jumped up excitedly and paced the floor repeating to himself, “Why Christ is alive, His ashes are warm, He is not the great ’I was,’ He is the great ’I am.’” He is not only a fact but a living fact. The glorious truth of Easter Day!

We believe that out of every grave there blooms an Easter lily, and in every tomb there sits an angel. We believe in a risen Lord. Turn not your faces to the past that we may worship only at His grave, but above and within that we may worship the Christ that lives. And because He lives, we shall live also.—Abbott

Tuesday, April 26, 2022

Costly Glory

 

నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను (ఫిలిప్పీ 3:8)

వస్తువులు ధగధగా మెరవాలంటే కొంత ఖర్చవుతుంది. కాంతి జనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు. వెలిగించని కొవ్వొత్తి వెలుగునియ్యదు. మంట లేనిదే తళతళలు లేవు. అలాగే మనం అగ్నికి ఆహుతైపోకుండా ఇతరుల్ని వెలిగించలేము. మండటం శ్రమ పడడానికి గుర్తు. మరి మనమైతే నొప్పినుండి దూరంగా తొలిగిపోయే ప్రయత్నం చేస్తుంటాము.

మనం దృఢంగా ఉండి పనులు చెయ్యడానికి శక్తి కలిగి ఉండి, మన మనస్సు లోను, చేతులనిండా ఇతరులకి ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నాము అనుకుంటాము.

అయితే మనం ఒక మూలన చేరి శ్రమల ననుభవించడం తప్ప మరేమీ చెయ్యలేని స్థితి లోనో, లేక రోగ పీడితులం గానో ఉన్నప్పుడూ, బాధ మనల్ని కబళిస్తున్నప్పుడూ, మన కార్యక్రమాలను పట్టించుకునే నాథుడు లేక మూలనబడినప్పుడూ మనం ఇతరులకేమీ ఉపయోగపడడం లేదు అనుకుంటాము. మన జీవితమే పనికిరానిదైపోయినట్టు బాధ పడతాము. 

అయితే దీర్ఘశాంతం కలిగి, దేవుని చిత్తానికి లోబడితే మనం హుషారుగా ఇతరులకి సహాయపడే రోజులకంటే, బాధల్లో కృశిస్తూ ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం. ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు మండే కొవ్వొత్తి లాటివాళ్ళు. వాళ్ళు కాంతుల్ని వెదజల్లుతారు.

రేపటి మహిమ తేజస్సు ఈనాటి దారిద్ర్యంలో వేళ్ళు పాతుకుంటుంది. చాలా మంది సిలువ లేకుండా మహిమ కావాలంటారు. మండకుండా వెలుగు నివ్వాలంటారు. కాని శ్రమలు పొందిన తరువాతే కదా కిరీటం దొరికేది? మండితేనే కదా వెలుగు పుట్టేది. 

మా ఊళ్ళో పెరిగే మందుచెట్టు కథ విన్నారా

నూరేళ్ళు పెరిగి పెరిగి పరిపక్వమవుతుంది

చిటారుకొమ్మన చిన్నారిమొగ్గ కళ్ళు తెరిచి

వైభవంగా విరబూస్తాయి వేవేల పుష్పాలు

మందుచెట్టు త్యాగం కన్నారా

పూలగుత్తి అందమే మందు చెట్టు అంతం


మా ఊళ్ళో పెరిగే మందు చెట్టు కథ విన్నారా

విరబూసిన వేవేల పుష్పాలు

రాలుతూ అవుతాయి నేలకి తలంబ్రాలు

రాలిన ప్రతి పువ్వు వేళ్ళు పట్టి

ప్రతి పువ్వూ అవుతుందో మందుచెట్టు


పూల ఆంతం అదే మందు చెట్ల కారంభం

అన్నిటికంటే అతిశ్రేష్టమైన కథ విన్నారా 

ఒక మహాత్ముడి, పవిత్రుడి పరమగాధ

ఆయన మరణం అనేకాత్మల జీవం

ఆకాశంలో జ్యోతుల తళతళలు

మనలో ఆయన ఆత్మజ్యోతి మిలమిలలు


బ్రతుకుని ప్రేమించకండి, ఆయన చెప్పాడు వినండి

ప్రేమ నిండిన బ్రతుకు కోరండి

మన బ్రతుక్కి ప్రాణం ఆయన త్యాగం

ఆయన భరించిన నష్టం మనకెంత లాభం!

ఆయన కన్నీళ్ళు మన చిరునవ్వుల కాంతులు

ఆయన ఆవేదన మన బ్రతుకుల్లో శాంతులు

-----------------------------------------------------------------------------------------------------------------------------

I even reckon all things as pure loss because of the priceless privilege of knowing Christ Jesus my Lord (Phil - 3:8)

Shining is always costly. Light comes only at the cost of that which produces it. An unlit candle does not shine. Burning must come before shining. We cannot be of great use to others without cost to ourselves. Burning suggests suffering. We shrink from pain.

We are apt to feel that we are doing the greatest good in the world when we are strong, and able for active duty, and when our hearts and hands are full of kindly service.

When we are called aside and can only suffer; when we are sick; when we are consumed with pain; when all our activities have been dropped, we feel that we are no longer of use, that we are not doing anything.

But, if we are patient and submissive, it is almost certain that we are a greater blessing to the world in our time of suffering and pain than we were in the days when we thought we were doing the most of our work. We are burning now, and shining because we are burning. —Evening Thoughts

“The glory of tomorrow is rooted in the drudgery of today.”

Many want the glory without the cross, the shining without the burning, but crucifixion comes before coronation.

Have you heard the tale of the aloe plant,  

Away in the sunny clime?  

By humble growth of a hundred years  

It reaches its blooming time;  

And then a wondrous bud at its crown  

Breaks into a thousand flowers;  

This floral queen, in its blooming, seen,  

Is the pride of the tropical bowers,  

But the plant to the flower is sacrificed,  

For it blooms but once, and it dies.  


Have you further heard of the aloe plant,  

That grows in the sunny clime;  

How every one of its thousand flowers,  

As they drop in the blooming time,  

Is an infant plant that fastens its roots  

In the place where it falls on the ground,  

And as fast as they drop from the dying stem,  

Grow lively and lovely around?  

By dying, it liveth a thousand-fold  

In the young that spring from the death of the old.  


Have you heard the tale of the pelican,  

The Arabs’ Gimel el Bahr,  

That lives in the African solitudes,  

Where the birds that live lonely are?  

Have you heard how it loves its tender young,  

And cares and toils for their good,  

It brings them water from mountains far,  

And fishes the seas for their food.  

In famine, it feeds them—what love can devise!  

The blood of its bosom—and, feeding them, dies.  


Have you heard this tale—the best of them all—  

The tale of the Holy and True,  

He dies, but His life, in untold souls  

Lives on in the world anew;  

His seed prevails, and is filling the earth,  

As the stars fill the sky above.  

He taught us to yield up the love of life,  

For the sake of the life of love.  

His death is our life, His loss is our gain;  

The joy for the tear, the peace for the pain.  

Monday, April 25, 2022

Waiting For Resurrection

 

మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి (మత్తయి 27:61). 

విచారం అన్నది ఎంత అర్థం లేని విషయం! అది నేర్చుకోదు, తెలుసుకోదు. కనీసం ప్రయత్నించదు. ఈ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభువు సమాధి ద్వారం దగర కూర్చుని ఉన్నప్పుడు, ఇప్పటిదాకా పునరుత్థానోత్సవాలతో జయార్భాటంతో గడిచిన ఈ రెండు వేల సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా? మా ప్రభువు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే గాని దాని వెనక ఉన్న పరమార్థాన్ని ఏమన్నా గ్రహించారా?

వాళ్ళకి దుఃఖకారణమైన క్రీస్తు - మరణం ద్వారానే- మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తుగా లేచాడు. లెక్కలేనన్ని హృదయాల అంగలార్పులో నుండి పునరుత్థానం చిగురించింది. అయితే శోకోపహతులైన ఆ స్త్రీలు మరణ బీజాన్నే చూస్తున్నారు గాని, శాఖోపశాఖలుగా విస్తరించనున్న పునరుత్థానపు మొలకను గమనించడం లేదు. తాము ఏ సంఘటనను తమ ప్రభువు అంతిమ శ్వాసగా భావించారో ఆ సంఘటనే లోకాధిపతిగా ఆయన అభిషేకానికి నాంది అని గ్రహించడం లేదు. యేసు స్వరం తాత్కాలికంగా మూగబోయింది, తిరిగి కోటి రెట్లు శక్తిగల పునరుజ్జీవనానికే.

కాని ఆ స్త్రీలకిది ప్రస్తుతం అగమ్యగోచరం. విలపించారు, ఏడ్చారు, నీరసించి తిరిగి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ హృదయాలు కుదుటబడక తిరిగి సమాధి దగ్గరికి వచ్చారు. అయితే సమాధి సమాధే. సమాధికి స్వరం లేదు, తేజస్సు లేదు. 

మన జీవితాల్లోనూ ఇది అంతే, మనమంతా వనంలో సమాధి నానుకుని దిగాలు పడి కూర్చుంటూ ఉంటాము. “ఈ దుఃఖానికి ఉపశమనం లేదు… ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు… దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు” అని అనుకుంటూ ఉంటాము. కాని మన లోతైన దుఃఖం వెనుక, అతి భయంకరమైన ఆపద వెనక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు, తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి.

చావు పొంచియుంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు. ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురు చూస్తుంటుంది. పేరుకు పోయిన కారు చీకటిలో తిరిగి మరెన్నటికీ అస్తమించని చిరుకాంతి కిరణం తళుక్కు మంటుంది. ఈ అనుభవాలన్నీ మన గుండెలో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడుచెయ్యదు. అక్కడక్కడ విచారపు నీడలున్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది. దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీపస్థంభాలవల్ల మన విచారపు క్రీనీడలు కూడా అందంగానే కనిపిస్తాయి. ఆ నీడల్లో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు. వాటిని కోసి మాల కట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు. కాని అవి ఆత్మపుష్పాలు- ప్రేమ, ఆశ, విశ్వాసం, శాంతి సంతోషాలు. ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోను ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలు ఇవి.

శోకాల కాలిబాట

క్రీస్తు విశ్రమించిన చోట

గులాబీలనివ్వదు ఈ తోట

ఇది ముళ్ళబాట

 

పరలోక దీవెనల గరిక పూలు

వికసించాలంటే ఈ చోటే మేలు

ఈ బాటలో సిలువ మోసినవాడు

రాకుమారుడవుతాడు ముందునాడు

-----------------------------------------------------------------------------------------------------------------------------

And there was Mary Magdalene and the other Mary, sitting over against the sepulchre ( Matt -  27:61)

How strangely stupid is grief. It neither learns nor knows nor wishes to learn or know. When the sorrowing sisters sat over against the door of God’s sepulchre, did they see the two thousand years that have passed triumphing away? Did they see anything but this: “Our Christ is gone!”

Your Christ and my Christ came from their loss; Myriad mourning hearts have had the resurrection amid their grief, and yet the sorrowing watchers looked at the seed-form of this result and saw nothing. What they regarded as the end of life was the very preparation for coronation; for Christ was silent that He might live again in tenfold power.

They saw it not. They mourned, they wept, and went away, and came again, driven by their hearts to the sepulchre. Still, it was a sepulchre, unprophetic, voiceless, lusterless.

So with us. Every man sits over against the sepulchre in his garden, in the first instance, and says, “This woe is irremediable. I see no benefit in it. I will take no comfort in it.” And yet, right in our deepest and worst mishaps, often, our Christ is lying, waiting for resurrection.

Where our death seems to be, there our Saviour is. Where the end of hope is, there is the brightest beginning of fruition. Where the darkness is thickest, there the bright beaming light that never is set is about to emerge. When the whole experience is consummated, then we find that a garden is not disfigured by a sepulchre. Our joys are made better if there be sorrow in the midst of them. And our sorrows are made bright by the joys that God has planted around them. The flowers may not be pleasing to us, they may not be such as we are fond of plucking, but they are heart-flowers, love, hope, faith, joy, peace—these are flowers which are planted around about every grave that is sunk in the Christian heart.

“’ Twas by a path of sorrows drear  

Christ entered into rest;  

And shall I look for roses here,  

Or think that earth is blessed?  

Heaven’s whitest lilies blow  

From earth’s sharp crown of woe.  

Who here his cross can meekly bear,  

Shall wear the kingly purple there.”