నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?. (కీర్తన 27:13).
ఇలాంటి సందర్భాలలో మనక్కలిగే శోధన ఎంత అపారం! మన జీవితంలో భరించరాని క్షోభలు, ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంత క్రుంగిపోతుంది! విశ్వాసం ఎంత చలించిపోతుంది! హృదయం ఎంత కలవరపడుతుంది!
ఇక నేను తట్టుకోలేను. ఈ పరిస్థితులు నన్ను క్రుంగదీస్తున్నాయి. నేనేం చెయ్యాలి? విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు. కాని కష్టాలకు సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు?
అసలు ఎవరైనా స్పృహ తప్పబోతున్నప్పుడు ఏం చేస్తారు? ఎవరూ ఏమీ చెయ్యలేరు. నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు. స్పృహ తప్పే ముందు నీకు తోడుగా నిలబడ్డ నీ సన్నిహితుడి భుజాల మీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావు, వాలిపోతావు. విశ్రాంతి తీసుకుంటావు. నువ్వు నేల మీద పడకుండా అతను నిన్ను పట్టుకుంటాడన్న నమ్మకంతో అతన్ని ఆనుకుంటావు.
మనం శ్రమల్లో శోధింపబడి, సొమ్మసిల్లినప్పుడూ ఇంతే. “బలవంతులై, ధైర్యంగా ఉండండి” అని కాదు దేవుని సందేశం. ఎందుకంటే మన బలం, ధైర్యం మనల్ని విడిచి వెళ్ళిపోయాయని ఆయనకి తెలుసు. ఆయన మృదువుగా పలికే మాట ఒక్కటే “ఊరకుండండి, నేను దేవుడినని తెలుసుకోండి. నా మీదనే ఆధారపడండి, ఆనుకోండి. ”
భక్తుడైన హడ్సన్ టేలర్ తన అంతిమ దినాల్లో శారీరకంగా నీరసించిపోయిన స్థితిలో ఒక మిత్రుడికి ఇలా రాసాడు, “కలం పుచ్చుకుని రాయలేనంత బలహీనంగా ఉన్నాను. బైబిల్ ని చదవడానిక్కూడా శక్తిలేదు. ప్రార్థన కూడా చెయ్యలేను. నేను చెయ్యగలిగిందల్లా దేవుని చేతుల్లో పసిపాపలాగ పడుకుని ఆయన మీద నమ్మకం ఉంచడమే.”
ఈ భక్తవరేణ్యుడు తనలో ఉన్న ఆత్మ తీవ్రతను శారీరకమైన నీరసం, అవస్థలు మబ్బులాగా కమ్మినవేళ నిశ్చింతగా దేవుని చేతుల్లో వాలిపోయి నమ్మకం ఉంచాడు.
దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అడిగేది కూడా ఇదే. శ్రమల అగ్నిజ్వాలల్లో నువ్వు సొమ్మసిల్లి పోయినప్పుడు, లేని ఓపిక, శక్తి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించనక్కర్లేదు. ఆయన దేవుడని గుర్తించి అన్నీ ఆయనకప్పగించి నిశ్చింతగా ఉండడమే. ఆయన నిన్ను ఆదుకొంటాడు. క్షేమంగా ఒడ్డుకి చేరుస్తాడు.
మనం ఎంత గాఢంగా సొమ్మలిస్లితే దేవుడు అంత శక్తినిచ్చే మధురామృతాన్ని మనకి త్రాగనిస్తాడు.
_“ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము”_ (కీర్తన 27:14).
*నిబ్బరంగా ఉండు*
*మోసగించ లేదు దేవుడు*
*ఇంతకు ముందెన్నడూ*
*ఎందుకు విడనాడేడు నేడు?*
*తన రెక్కల నీడ*
*నీకాశ్రయమని పలికాడు*
*దొరికేను నీకు క్షేమపు గూడు*
*తియ్యని పాట హాయిగా పాడు*
-----------------------------------------------------------------------------------------------------------------------------
I had fainted unless...!* (Ps - 27:13)
“FAINT NOT!”
How great is the temptation at this point! How the soul sinks, the heart grows sick, and the faith staggers under the keen trials and testings which come into our lives in times of special bereavement and suffering.
“I cannot bear up any longer, I am fainting under this providence. What shall I do? God tells me not to faint. But what can one do when he is fainting?”
What do you do when you are about to faint physically? You cannot do anything. You cease from your own doings. In your faintness, you fall upon the shoulder of some strong loved one. You lean hard. You rest. You lie still and trust.
It is so when we are tempted to faint under affliction. God’s message to us is not, “Be strong and of good courage,” for He knows our strength and courage have fled away. But it is that sweet word, “Be still, and know that I am God.”
Hudson Taylor was so feeble in the closing months of his life that he wrote a dear friend: “I am so weak I cannot write; I cannot read my Bible; I cannot even pray. I can only lie still in God’s arms like a little child and trust.”
This wondrous man of God with all his spiritual power came to a place of physical suffering and weakness where he could only lie still and trust.
And that is all God asks of you, His dear child when you grow faint in the fierce fires of affliction. Do not try to be strong. Just be still and know that He is God, and will sustain you, and bring you through.
“God keeps His choicest cordials for our deepest faintings.”
“Stay firm and let thine heart take courage” (Psa. 27:14, —After Osterwald).
Stay firm, He has not failed thee
In the past,
And will He go and leave thee
To sink at last?
Nay, He said He will hide thee
Beneath His wing;
And sweetly there in safety
Thou mayest sing.