మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి. అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్ము రప్పించియున్నావు*_ (కీర్తన 66:12).
వినేవాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు కాని, కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలం. మనిషి ఇలా సాధించిన ప్రశాంతత అనేది తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు. తుఫాను వెలిసిన తరువాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది.
కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడైనవాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండ లేడు. అతని గుణస్వభావాలు పరీక్షకి గురి కాలేదు. చిన్న విఘాతం కలిగినా దానిని తట్టుకోగలడో లేదో ఎవరికీ తెలియదు. సముద్రంలో గాలివాన ఎలాటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతను పనికి వస్తాడు. కాని పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకు ముందు తుపానులతో పోరాడి ఉన్నవాడే. తుపానుల్లో ఓడ బలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే.
మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశాలతలు తెగిపోతాయి. గాలివానకి నేల కూలిన తీగె లాగా మన హృదయం కూలిపోతుంది. కాని మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి “దేవుడున్నాడు” అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది. దేవుని పాదాల దగ్గరికి ఎత్తిపడుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం, శాంతిక్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది.
*జీవనంలో పెనుతుఫాను రేగింది.*
*జీవిత నౌక శ్రమల అలలకి అల్లాడింది.*
*అంచనాలు కొట్టుకు పోయాయి*
*గుండె బాధతో నిండింది.*
*ఆశ అడుగంటింది*
*చివరికాయన కనులు తెరిచాడు*
*అంతా ప్రశాంతత పరచుకుంది.*
*అనుమానాల పెను తుఫాన్లు*
*భయాల గాలి వానలు కలవరపరిచాయి*
*నడిపించే వెలుగు వెలవెలబోయింది.*
*చీకటి రాత్రి చరచరా చిందులేసింది*
*చివరికాయన కనులు తెరిచాడు.*
*కృపా సూర్యుడు కోటి కిరణాలతో ఫక్కున నవ్వాడు.*
*అగ్ని పరీక్షల్లో చెలరేగే దుఃఖంలో*
*క్రుంగింది మానసం, నేలకొరిగింది*
*ఆవరించింది అంతా శూన్యం, నిస్పృహ*
*వెన్ను తట్టి ధైర్యపరచేవారు లేరు.*
*చివరికాయన కనులు తెరిచాడు*
*అంతా సద్దుమణిగింది, ఆయనే దేవుడు.*
-----------------------------------------------------------------------------------------------------------------------------
We went through fire and through water: but thou broughtest us out into a wealthy place* (Ps - 66:12)
Paradoxical though it be, only that man is at rest who attains it through conflict. This peace, born of conflict, is not like the deadly hush preceding the tempest, but the serene and pure-aired quiet that follows it.
It is not generally the prosperous one, who has never sorrowed, who is strong and at rest. His quality has never been tried, and he knows not how he can stand even a gentle shock. He is not the safest sailor who never saw a tempest; he will do for fair-weather service, but when the storm is rising, place at the important post the man who has fought out a gale, who has tested the ship, who knows her hulk sound, her rigging strong, and her anchor-flukes able to grasp and hold by the ribs of the world.
When the first affliction comes upon us, how everything gives way! Our clinging, tendril hopes are snapped, and our heart lies prostrate like a vine that the storm has torn from its trellis; but when the first shock is past, we can look up, and say, “It is the Lord,” faith lifts the shattered hopes once more, and binds them fast to the feet of God. Thus the end is confidence, safety, and peace. —Selected
The adverse winds blew against my life;
My little ship with grief was tossed;
My plans were gone—heart full of strife,
And all my hope seemed to be lost—
“Then He arose”—one word of peace.
“There was a calm”—a sweet release.
A tempest great of doubt and fear
Possessed my mind; no light was there
To guide, or make my vision clear.
Dark night! ’twas more than I could bear—
“Then He arose,” I saw His face—
“There was a calm” filled with His grace.
My heart was sinking ’neath the wave
Of deepening test and raging grief;
All seemed as lost, and none could save,
And nothing could bring me relief—
“Then He arose”—and spoke one word,
“There was a calm!” IT IS THE LORD.
—L. S. P.