యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా…
భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక (కీర్తన 134).
ఆరాధించడానికి ఇంత కంటే మంచి టైము దొరకలేదా అని మీరనవచ్చు. రాత్రివేళలో దేవుని మందిరంలో నిలబడుతున్నారట. ఆవేదనల చీకటిలో ప్రభువుని స్తోత్రించడం. అవును, అందులోనే దీవెన ఉంది. ఇదే విశ్వాసానికి సరియైన పరీక్ష, నా పట్ల నా స్నేహితుడి ప్రేమ ఎలాటిదని చూడాలంటే నా కష్టకాలమే తగిన సమయం. దేవుని ప్రేమ విషయం కూడా ఇంతే. వాతావరణం నిర్మలంగా ఉన్న వేళ, చెట్లన్నీ చిగిర్చి పండ్లతో నిండి ఉన్న వేళ, గాలి అంతా ఆనంద గానాలతో నిండి ఉన్న వేళ దేవుణ్ణి పూజించడం తేలికే. చెట్లు వాడిపోయి పాటలు ఆగిపోయినప్పుడు కూడా నా హృదయం అలానే దేవుని స్తుతించగలదా? రాత్రి వేళల్లో నేను దేవుని మందిరంలో నిలబడగలనా? ఆయన కల్పించిన రాత్రిలో ఆయనపై ప్రేమను నిలుపుకోగలనా? గెత్సెమనే తోటలో గంట సేపు నిలిచి ఆయన కోసం కనిపెట్టగలనా? కల్వరి దారిలో ఆయన సిలువ మోయడానికి సహాయపడగలనా? మరియ, యోహానుల్లాగా ఆయన అంతిమ క్షణాల్లో ఆయన చెంత నిలబడగలనా? క్రీస్తు శరీరం గురించి నీకొదేములాగా శ్రద్ధ వహించగలనా? అప్పుడే నా ఆరాధన సంపూర్ణం. నా దీవెన ఫలభరితం. ఆయన అవమానాలు పొందుతుండగా ఆయనపై నా ప్రేమ నిలిచి ఉంది. ఆయన నికృష్టస్థితిలో ఉండగా నా విశ్వాసం ఆయనపై కేంద్రీకృతమైంది. ఆయన మారువేషంలో ఉండగా నా హృదయం ఆయన రాజరికాన్ని గుర్తించింది. చివరికి నాకు తెలిసింది. నాకు కావలసింది బహుమతి కాదు. బహుమతినిచ్చే దాత. రాత్రిలో ఆయన మందిరంలో నిలుచున్నానంటే ఆయనను నేను స్వీకరించానన్నమాట.
శాంతి సమాధానాలు కాదు గానీ, దేవుడే నా గమ్యం
దీవెనలు కాదు గానీ, వాటినిచ్చే దేవుడే నా గురి.
నడిపించే బాధ్యత ఆయనదే గానీ, నాది కాదు
ఏమి ఎదురైనా ఏ దారైనా సరే.
దేవునిలో గమ్యాన్ని వెదికింది విశ్వాసం
గమ్యం చేరుస్తాడని నిరీక్షించింది ప్రేమ
నా విన్నపాలను అంగీకరించి
నడిపించాడాయనే కడదాకా.
చీకటి దారైనా, భారమైనా దూరమైనా
చెల్లించవలసిన ధర ఎంతైనా
గమ్యాన్ని నేనెలా చేరగలనో నేర్పాడు
ఆ దారి ఇరుకైన తిన్నని దారి.
ఆయన అడిగిన దానిని కాదనలేను
ఆయన చెంతకి చేరక ఉండలేను
అనుదినం నా ప్రభువుకి ఘనత
ఆ ఘనతలోనే నా జీవన ఫలం.
-----------------------------------------------------------------------------------------------------------------------------
Ye servants of the Lord, which by night stand in the house of the Lord. The Lord that made heaven and earth bless thee out of Zion - (Ps - 134:1,3)
Strange time for adoration, you say, to stand in God’s house by night, to worship in the depth of sorrow —it is indeed an arduous thing. Yes, and therein lies the blessing; it is the test of perfect faith. If I would know the love of my friend I must see what it can do in the winter. So with the Divine love. It is easy for me to worship in the summer sunshine when the melodies of life are in the air and the fruits of life are on the tree. But let the song of the bird cease and the fruit of the tree fall, and will my heart still go on to sing? Will I stand in God’s house by night? Will I love Him in His own night? Will I watch with Him even one hour in His Gethsemane? Will I help to bear His cross up the dolorous way? Will I stand beside Him in His dying moments with Mary and the beloved disciple? Will I be able with Nicodemus to take up the dead Christ? Then is my worship complete and my blessing glorious. My love has come to Him in His humiliation. My faith has found Him in His lowliness. My heart has recognized His majesty through His mean disguise, and I know at last that I desire not the gift but the Giver. When I can stand in His house by night I have accepted Him for Himself alone. —George Matheson
“My goal is God Himself, not joy, nor peace,
Nor even blessing, but Himself, my God;
’Tis His to lead me there, not mine, but His
’At any cost, dear Lord, by any road!’
“So faith bounds forward to its goal in God,
And love can trust her Lord to lead her there;
’Upheld by Him, my soul is following hard
Till God hath full fulfilled my deepest prayer.
“No matter if the way be sometimes dark,
No matter though the cost be ofttimes great,
He knoweth how I best shall reach the mark,
The way that leads to Him must needs be straight.
“One thing I know, I cannot say Him nay;
One thing I do, I press towards my Lord;
My God my glory here, from day to day,
And in the glory there my Great Reward.”