Wednesday, November 3, 2021

It Must Be Bought

 

చెట్లులేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును (యెషయా 49:9).


ఆట బొమ్మలు, చేతి గాజులు తేలికగా లభిస్తాయి. కాని విలువైన వస్తువులు కొనాలంటే కష్టపడాలి. ఉన్నతాధికారాలు రక్తం ధారపోసిన వారికే దక్కుతాయి. నీ రక్తమిచ్చి ఎంత ఎత్తైన స్థానాన్నెనా కొనుక్కోవచ్చు. పరిశుద్ధ శిఖరాలను చేరడానికి షరతు ఇదే. నిజమైన శూరత్వం ఏమిటంటే తన రక్తాన్ని ఇతరుల కోసం ఒలికించడమే. జీవితంలో అత్యుత్కృష్టమైన వ్యక్తిత్వపు విలువలు గాలివాటుగా మన పాదాల దగ్గర వచ్చి పడవు. గొప్పవాళ్ళ హృదయాల్లో గొప్ప దుఃఖాలు ఉంటాయి.


చేదు నిజాలు చెత్త కాగితాలు

గాలికి ఎగిరొచ్చే గడ్డి పరకలు

విలువైన నిజాలనైతే

ధర పెట్టి కొనుక్కోవాలి.


గొప్ప నిజాల కోసం పోరాడాలి

కలలో దొరికేవి కావవి

ఆత్మలో సంఘర్షణలో శోధనలో

ఎదురు దెబ్బలో దొరికేవవి.

 

శోకాలు బాధలు శోధించే రోజున 

బలమైన దేవుడు తన చెయ్యి చాపి

కరడుగట్టిన గుండె లోతుల్ని దున్ని

పాతుకుని ఉన్న సత్యాలని పైకి తీస్తాడు.


కలత చెందిన ఆత్మలో కార్చిన కన్నీళ్ళలో

దున్నిన భూమిలో దండిగా మొలకెత్తిన

పంటలాగా సత్యం సాక్షాత్కరిస్తే

ఆ కన్నీళ్ళు వ్యర్థం కావని తెలుస్తుంది.


దేవుడు మన విశ్వాసం ఉపయోగించవలసిన పరిస్థితుల్లోకి మనలను నడిపిస్తున్న కొద్దీ ఆయన్ను తెలుసుకొనే అవగాహన శక్తి మనలో ఎక్కువౌతూ ఉంటుంది. కాబట్టి శ్రమలు మన దారికి అడ్డం వచ్చినప్పుడల్లా దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడని మనం తెలుసుకుని సహాయం కోసం ఆయన మీదే ఆధారపడుతూ ఆయనకు కృతజ్ఞతా స్తుతులను అర్పించాలి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

On all bare heights shall be their pasture (Isa - 49:9)


Toys and trinkets are easily won, but the greatest things are greatly bought. The top-most place of power is always bought with blood. You may have the pinnacles if you have enough blood to pay. That is the conquest condition of the holy heights everywhere. The story of real heroisms is the story of sacrificial blood. The chiefest values in life and character are not blown across our way by vagrant winds. Great souls have great sorrows.


“Great truths are dearly bought, the common truths,  

Such as men give and take from day to day,  

Come in the common walk of easy life,  

Blown by the careless wind across our way.  


“Great truths are greatly won, not found by chance,  

Nor wafted on the breath of summer dream;  

But grasped in the great struggle of the soul,  

Hard buffeting with adverse wind and stream.  


“But in the day of conflict, fear and grief,  

When the strong hand of God, put forth in might,  

Plows up the subsoil of the stagnant heart,  

And brings the imprisoned truth seed to the light.  


“Wrung from the troubled spirit, in hard hours  

Of weakness, solitude, perchance of pain,  

Truth springs like harvest from the well-plowed field,  

And the soul feels it has not wept in vain.”  


The capacity for knowing God enlarges as we are brought by Him into circumstances which oblige us to exercise faith; so, when difficulties beset our path let us thank God that He is taking trouble with us, and lean hard upon Him.

No comments:

Post a Comment