Thursday, November 11, 2021

Lawn Care

 

గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును (కీర్తనలు 72:6). 


గడ్డి కోయడాన్ని గురించి ఆమోసు రాసాడు. మన రాజు దగ్గర చాలా కొడవళ్ళు ఉన్నాయి. ఆయన నిత్యమూ తన గడ్డి భూముల్ని కోస్తున్నాడు. ఆకురాయి మీద కొడవలి పదును పెడుతున్న సంగీతానికి పరపరా గడ్డి కోస్తున్న శబ్దాలు తోడౌతున్నాయి. పచ్చని గడ్డిపరకలు, చిన్న చిన్న రంగు రంగుల పూలు ఇంత క్రితమే కళకళలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు తెగి కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. మానవ జీవితంలో కూడా బాధ అనే కొడవలి, నిరాశ అనే కత్తిరింపు రాకముందు మనం చాలా ధైర్యంగా, దర్జాగా నిలబడి ఉంటాం.


అయితే పట్టు తివాచీలాంటి పచ్చిక పెరగాలంటే ప్రతిదినం ఆ గడ్డిని కోస్తూ ఉండడమే మార్గం. దేవుని కొడవలి మన మీదికి రానిదే మనలో వాత్సల్యం, సానుభూతి, గంభీరత రావు. దేవుని వాక్యం ఎప్పుడూ మనిషిని గడ్డితోను, అతని మహిమను గరిక పువ్వుతోను పోలుస్తూ ఉంటుంది. గడ్డి కోసినప్పుడు, దాని లేత పరకలన్నీ తెగిపడినప్పుడు, పూలు పూసిన చోట అంతా సర్వనాశనం తాండవమాడినట్టు అనిపించినప్పుడు అదే మెత్తగా, వెచ్చగా వాన చినుకులు పడవలసిన సమయం.


"ఓ హృదయమా, నిన్ను కూడా దేవుడు కత్తిరించాడు. చాలాసార్లు నీ రాజు తన కొడవలితో నీ దగ్గరకు వచ్చాడు. కొడవలికి భయపడకు. వెంటనే వర్షం కురుస్తుంది.”


దౌర్భాగ్యపు మనసులో

విచారపు కెరటాలు పొంగాయి 

రేపు అనేది నిరాశ నిండిన నిశీధి అయ్యింది

తుఫాను అదుపు లేకుండా ఎగిసింది


ఇహలోకపు సౌఖ్యాలు

నోటికి చేదయ్యాయి

ఆశలు పేలవంగా కూలిపోతూ

వ్యధ నిండిన మదిని వెక్కిరించాయి


కుములుతున్న మదిలో నిట్టూర్పును

మదిలో నిండిన శూన్యాన్ని

ఎవరాపగలరు? ఎవరు మాపగలరు?

శాంతిని ఎవరు నింపగలరు?


ఎవరి హృదయం గాయపడి పగిలిపోయిందో

ఎవరు ముళ్ళకిరీటధారియై సిలువ మోశారో

మన కోసం తన జీవం ఎవరు ధారపోశారో

ఆయన ప్రేమ వాక్కులే శాంతి ప్రదాతలు


పరమ వైద్యుడా! తేలికచెయ్యి మా భారాలు

శాంతిని, నీ శాంతిని మాలో స్థాపించు

తెల్లారేదాకా నీతో తిరగనీ

నీడలు పోయేదాకా మాకు నీడగా ఉండు.

----------------------------------------------------------------------------------------------------------------------------

He shall come down like rain upon the mown grass (Ps - 72:6)

Amos speaks of the king’s mowings. Our King has many scythes, and is perpetually mowing His lawns. The musical tinkle of the whetstone on the scythe portends the cutting down of myriads of green blades, daisies and other flowers. Beautiful as they were in the morning, within an hour or two they lie in long, faded rows.

Thus in human life we make a brave show, before the scythe of pain, the shears of disappointment, the sickle of death.

There is no method of obtaining a velvety lawn but by repeated mowings; and there is no way of developing tenderness, evenness, sympathy, but by the passing of God’s scythes. How constantly the Word of God compares man to grass, and His glory to its flower! But when grass is mown, and all the tender shoots are bleeding, and desolation reigns where flowers were bursting, it is the most acceptable time for showers of rain falling soft and warm.

O soul, thou hast been mown! Time after time the King has come to thee with His sharp scythe. Do not dread the scythe—it is sure to be followed by the shower. —F. B. Meyer

“When across the heart deep waves of sorrow  

Break, as on a dry and barren shore;  

When hope glistens with no bright tomorrow,  

And the storm seems sweeping evermore;  


“When the cup of every earthly gladness  

Bears no taste of the life-giving stream;  

And high hopes, as though to mock our sadness,  

Fade and die as in some fitful dream,  


“Who shall hush the weary spirit’s chiding?  

Who the aching void within shall fill?  

Who shall whisper of a peace abiding,  

And each surging billow calmly still?  


“Only He whose wounded heart was broken  

With the bitter cross and thorny crown;  

Whose dear love glad words of Joy had spoken,  

Who His life for us laid meekly down.  


“Blessed Healer, all our burdens lighten;  

Give us peace, Thine own sweet peace, we pray!  

Keep us near Thee till the morn shall brighten,  

And all the mists and shadows flee away!”

No comments:

Post a Comment