Monday, November 15, 2021

Through Faith

 



అత్యధిక భారమువలన కృంగిపోతిమి (2 కొరింథీ 1:8). _

క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము_ ... (2 కొరింథీ 12:9).


పెనూయేలు దగ్గర విధేయతతో యాకోబు దేవునికి సాష్టాంగ పడినప్పుడు అన్ని వైపులనుండీ ఆపదలు అతణ్ణి చుట్టుముట్టేలా చేశాడు దేవుడు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా దేవునిపై ఆనుకొనేలా అతణ్ణి చెయ్యాలనే దీన్ని జరిగించాడు. ఆ ఆపదల దారిలోనే యాకోబు విశ్వాసంలోను, దేవుని గురించిన జ్ఞానంలోను విశారదుడయ్యాడు. విజయవంతమైన క్రొత్త జీవితానికి కావలసిన శక్తిని సంపాదించుకున్నాడు.


దేవుడు దావీదును బలవంతం చేశాడు. తన దేవుని విశ్వాస్యతను, అపార శక్తిని అతడు గ్రహించి విశ్వాసం, పరిశుద్ధత మొదలైన దివ్యసూత్రాలలో నిష్ణాతుడయ్యేలా అతనిని అంతులేని క్రమశిక్షణకు గురిచేశాడు. ఇశ్రాయేలుకు రాజయ్యే యోగ్యతను పొందాలంటే ఇదంతా అత్యవసరం మరి.


పౌలు అస్తమానము ఎదుర్కొంటూ వచ్చిన విపరీత విపత్తులే అతనికీ, అతని ద్వారా సంఘాలకీ ‘నా కృప నీకు చాలును' అనే దివ్య వాగ్దానపు అర్థాన్ని బోధించ గలిగాయి.


మనకు సంభవించిన శ్రమలు తప్ప మరేవీ దేవుణ్ణి ఇంతగా తెలుసుకొనేలా చెయ్యగలిగేవి కావు. ఇంతగా ఆయనలో నమ్మకం ఉంచేలా, ఆయన నుండి ఇంత కృపను పొందగలిగేలా చెయ్యగలిగేవి కావు. అందుకే మనకు సంభవించే వైపరీత్యాలు మనకు తప్పనిసరి.


ఆటంకాలు, బాధలు మన విశ్వాసం వైపు దేవుడు విసిరే సవాళ్ళు. మన విధి నిర్వహణలో ఆటంకాలేర్పడినప్పుడు వాటిని మనం విశ్వాసపు పాత్రలుగా గుర్తించి వాటిలో క్రీస్తు శక్తిని, పరిపూర్ణతను నింపాలి. ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్తే మనకు పరీక్షలు ఎదురుకావచ్చు. ఓర్పు అవసరం కావచ్చు. కాని ఎట్టకేలకు ఆ అడ్డుబండ తొలగిపోతుంది. మనం ఎదుర్కొన్న అగ్నిపరీక్షలో మనకు జరిగిన నష్టానికి రెండింతల దీవెనలు ఇవ్వడానికి దేవుడు ఎదురుచూస్తూ కనిపిస్తాడు.

----------------------------------------------------------------------------------------------------------------------------

Pressed out of measure (2 Cor - 1:8)

That the power of Christ may rest upon me (2 Cor - 12:9)

God allowed the crisis to close around Jacob on the night when he bowed at Peniel in supplication, to bring him to the place where he could take hold of God as he never would have done; and from that narrow pass of peril, Jacob became enlarged in his faith and knowledge of God, and in the power of a new and victorious life.

God had to compel David, by a long and painful discipline of years, to learn the almighty power and faithfulness of his God, and grow up into the established principles of faith and godliness, which were indispensable for his glorious career as the king of Israel.

Nothing but the extremities in which Paul was constantly placed could ever have taught him, and taught the Church through him, the full meaning of the great promise he so learned to claim, “My grace is sufficient for thee.”

And nothing but our trials and perils would ever have led some of us to know Him as we do, to trust Him as we have, and to draw from Him the measures of grace which our very extremities made indispensable.

Difficulties and obstacles are God’s challenges to faith. When hindrances confront us in the path of duty, we are to recognize them as vessels for faith to fill with the fullness and all-sufficiency of Jesus; and as we go forward, simply and fully trusting Him, we may be tested, we may have to wait and let patience have her perfect work; but we shall surely find at last the stone rolled away, and the Lord waiting to render unto us double for our time of testing. —A. B. Simpson

No comments:

Post a Comment