Tuesday, December 14, 2021

Christ's Business is Supreme

ఆయన శిష్యులలో ఒకడు - ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన నడిగెను. అందుకాయన - మీరు ప్రార్థన చేయునప్పుడు… నీ రాజ్యము వచ్చును గాక… అని పలుకుడని వారితో చెప్పెను*_ (లూకా 11:1,2). 


మాకు ప్రార్థన చెయ్యడం నేర్పించమని వాళ్ళు అడిగినప్పుడు ప్రభువు తన కళ్ళెత్తి దేవుని మహిమనొక్కసారి అవలోకించాడు. నిత్యత్వపు అంతిమ స్వప్నాన్ని ఒక్కసారి తలుచుకున్నాడు. దేవుడు మానవ జీవితంలో చేయ సంకల్పించిన దాని సారాంశాన్ని క్రోడీకరించి ఈ అర్థవంతమైన మాటల్లో ఇమిడ్చి “ఇలా ప్రార్థించండి” అంటూ ఆదేశించాడు. మనకు సాధారణంగా వినబడే ప్రార్థనకీ దీనికీ ఎంత వ్యత్యాసమో చూడండి. మన ఇష్టాన్ని అనుసరించి ప్రార్థిస్తే ఇలా ఉంటుంది మన ప్రార్థన “దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్నీ, నా సంఘాన్నీ, మా ఊరినీ, మా దేశాన్నీ దీవించు” ఎక్కడో ఓ మూలను ఆయన రాజ్యం గురించి ఒకమాట అంటామేమో.


ప్రభువైతే మనం ఎక్కడైతే వదిలేశామో అక్కడ ప్రారంభించాడు. లోకం గురించి ముందు, మన వ్యక్తిగత అవసరాలు తరువాత అడగాలి. నా ప్రార్థన ఖండాంతరాలు దాటి ప్రతి ద్వీపాన్ని కలుపుకుని, ప్రపంచమంతటి కొరకు దేవుని సంకల్పం గురించీ, ప్రతి వ్యక్తి గురించి, ప్రతి జాతి గురించి ప్రార్థించిన తరువాత నా కోసం చిన్న రొట్టెముక్కనిమ్మని అడగమంటున్నాడు.


తనకున్నదంతా ఇచ్చేసి, తనకు తానే మన కోసం సిలువపై త్యాగం చేసేసిన తరువాత ఆయన మనల్ని ఏదైనా అడగడానికి యోగ్యుడే కదా. దేవుని రాజ్యం ముందు అందరు స్త్రీ పురుషులూ అల్పులే. ఆ అద్భుత శక్తి అంచుల్ని కూడా ఎవరూ తాకలేరు. క్రీస్తుకి సంబంధించిన వ్యవహారాలే మన జీవితాల్లో ప్రధానాంశాలనీ, మన వ్యక్తిగత అవసరాలు, మనకెంత ముఖ్యమైనవైనా, ప్రియమైనవైనా అవి క్రీస్తు పని తరువాతేనని మనం నేర్చుకునేదాకా ఇంతే.


ఆఫ్రికా ఖండపు మిషనరీ రాబర్ట్ మోఫత్ ని ఒక పాప తన ఆల్బమ్ లో ఏదైనా రాయమంది. ఆయన రాసిన మాటలివి,


*నా హృదయమే నా ఆల్బమ్*

*తుపానుకమ్మి చీకటి మూసి*

*కాంతి విహీనమైన ఆల్బమ్*

*యేసు పేరు దానిపై రాయాలి*

*ఆ హృదయం ఆయన ముందు మోకరిల్లాలి*

*సౌందర్య లోకాల్ని వీక్షించాలి*

*ఇదే నా ప్రియమైన కోరిక.*


*“ఆయన రాజ్యము అంతము లేనిదైయుండును”* (లూకా 1:33).


మిషనరీ పని చెయ్యడమన్నది ఈనాటి సంఘాలు తరువాత ఆలోచించి తెలుసుకున్నది కాదు. క్రీస్తు ముందుగానే నిర్ణయించి ఆదేశించినది.

-------------------------------------------------------------------
His disciples said unto him, Lord, teach us to pray ... and he said unto them, When ye pray, say... Thy kingdom come* - (Luke 11:1-2)


When they said, “Teach us to pray,” the Master lifted His eyes and swept the far horizon of God. He gathered up the ultimate dream of the Eternal, and, rounding the sum of everything God intends to do in the life of man, He packed it all into these three terse pregnant phrases and said, “When you pray, pray after this manner.”


What a contrast between this and much praying we have heard. When we follow the devices of our own hearts, how runs it? “O Lord bless me, then My family, My church, My city, My country,” and away on the far fringe as we close up, there is a prayer for the extension of His Kingdom throughout the wide parish of the world.


The Master begins where we leave off. The world first, my personal needs second, is the order of this prayer. Only after my prayer has crossed every continent and every far-flung island of the sea, after it has taken in the last man in the last backward race, after it has covered the entire wish and purpose, of God for the world, only then am I taught to ask for a piece of bread for myself.


When Jesus gave His all, Himself for us and to us in the holy extravagance of the Cross, is it too much if He asks us to do the same thing? No man or woman amounts to anything in the kingdom, no soul ever touches even the edge of the zone of power, until this lesson is learned that Christ’s business is the supreme concern of life and that all personal considerations, however dear or important, are tributary thereto. —Dr. Francis


When Robert Moffat, the veteran African missionary and explorer, was asked once to write in a young lady’s album, he penned these lines:


“My album is a savage breast,  

Where tempests brood and shadows rest,  

Without one ray of light;  

To write the name of Jesus there,  

And see that savage bow in prayer,  

And point to worlds more bright and fair,  

This is my soul’s delight.”


“And His Kingdom shall have no frontier” (Luke 1:33, the old Moravian version).


The missionary enterprise is not the Church’s afterthought; it is Christ’s forethought; —Henry van Dyke

No comments:

Post a Comment