Thursday, December 16, 2021

Continue in Prayer

 

అన్న అను ఒక ప్రవక్తియుండెను . . . దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను (లూకా 2:36, 37).


ప్రార్థించడం వల్ల నేర్చుకుంటామనడంలో సందేహం లేదు. ఎంత తరుచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకి ప్రార్థించడం వస్తుంది. అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరమైన, శక్తివంతం అయిన ప్రార్థనను ఎప్పటికీ నేర్చుకోలేడు.


ప్రార్థన ద్వారా మన దేవుని గొప్పశక్తి మన అందుబాటులోనే ఉంది. కాని దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి. అబ్రాహాము తన జీవితకాలమంతా దేవుని ఎదుట విజ్ఞాపన చేసే అలవాటు లేనివాడైతే సొదొమ కోసం అంతలా దేవునితో వాదించగలిగేవాడా?


పెనూయేలు దగ్గర రాత్రంతా యాకోబు తన దేవునితో పోరాడినది అతని జీవితంలో మొదటి సందర్భమనుకుంటున్నారా? మన ప్రభువు గెత్సేమనేకి వెళ్ళకముందు శిష్యులతో చేసిన ఆ మహత్తరమైన ప్రార్థన కూడా అంతకుముందు ఎన్నెన్ని రాత్రి సమయాల్లోనూ, పెందలకడనే లేచి చేసిన ప్రార్థనల ఫలితమే కదా.


తన ఇష్ట ప్రకారం ప్రార్థనా వీరుడినవ్వాలని ఎవరన్నా అనుకుంటే, అతని ప్రయాస అంతా వ్యర్థమే. ఆకాశపు వాకిళ్ళను మూసి, తరువాత వాటిని తెరచి వానలు కురిపించిన ఏలీయా ప్రార్థన కూడా అంతకుముందు చేసిన ఎన్నో ప్రార్థనల అలవాటు మూలంగానే. క్రైస్తవులు ఇది గుర్తుంచుకోవాలి. ప్రార్థన ఫలభరితం కావాలంటే పట్టుదల ఉండాలి.


హతసాక్షులు మొదలైనవాళ్ళ పేర్లు తెలిసినంతగా గొప్పగొప్ప ప్రార్థనాపరుల పేర్లు బయటికి తెలియవు. అయినప్పటికీ వాళ్ళు సంఘానికి గొప్ప మేలు చేసినవారే. కృపాసింహాసనం దగ్గర వదలకుండా ప్రాకులాడినందువల్లనే వాళ్ళంతా మనుషులందరికీ కృప ప్రాప్తించడానికి కారణభూతులయ్యారు. ప్రార్థన కోసం ప్రార్థించాలి. మన ప్రార్థనలు కొనసాగడం కోసం ప్రార్థించాలి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

And there was Anna, a prophetess ... which departed not from the temple, but served God with fastings and prayers night and day - (Luke - 2:36-37)

No doubt by praying we learn to pray, and the more we pray the oftener we can pray, and the better we can pray. He who prays in fits and starts is never likely to attain to that effectual, fervent prayer which availeth much.

Great power in prayer is within our reach, but we must go to work to obtain it. Let us never imagine that Abraham could have interceded so successfully for Sodom if he had not been all his lifetime in the practice of communion with God.

Jacob’s all-night at Peniel was not the first occasion upon which he had met his God. We may even look upon our Lord’s most choice and wonderful prayer with his disciples before His Passion as the flower and fruit of His many nights of devotion, and of His often rising up a great while before day to pray.

If a man dreams that he can become mighty in prayer just as he pleases, he labors under a great mistake. The prayer of Elias which shut up heaven and afterwards opened its floodgates, was one of long series of mighty prevailings with God. Oh, that Christian men would remember this! Perseverance in prayer is necessary to prevalence in prayer.

Those great intercessors, who are not so often mentioned as they ought to be in connection with confessors and martyrs, were nevertheless the grandest benefactors of the Church; but it was only by abiding at the mercy-seat that they attained to be such channels of mercy to men. We must pray to pray, and continue in prayer that our prayers may continue. —G. H.. Spurgeon

No comments:

Post a Comment