Wednesday, December 22, 2021

Night of Pure Faith

 భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా... (ఆది 15:12).


సూర్యాస్తమయమైంది. రాత్రి తన ముసుగును భూమిపై పరచింది. రోజంతా పనిచేసి తనువూ మనస్సూ అలిసిపోయి అబ్రాహాము నిద్రకు ఒరిగాడు. నిద్రలో అతని ఆత్మ గాఢాంధకారంలో మునిగింది. అతణ్ణి ఊపిరాడనీయకుండా చేసేటంత భయంకరమైన అంధకారమది. అతని గుండెలపై పీడకల లాగా ఎక్కి కూర్చుంది. ఆ చీకటి చేసే భీభత్సం నీకు కొంచెమైనా తెలుసా? ఏదైనా ప్రగాఢ సంతాపం, తిరిగి కోలుకోనీయకుండా మనస్సుని నొక్కిపట్టినప్పుడు, దేవుని కరుణవల్లే కలిగే మనశ్శాంతిని బలవంతంగా ఊడబెరికేసినప్పుడు, ఆశా కిరణమేమీ లేని నడి సముద్రంలో దాన్ని ఏకాకిని చేసినప్పుడు, ఆశపడ్డ హృదయాన్ని క్రౌర్యం చిందర వందర చేసినప్పుడు, ఇవన్నీ చూస్తున్న దేవుడు వీటన్నిటినీ ఎందుకు జరగనిస్తున్నాడు అని మనసు విలవిలలాడినప్పుడు ఈ “భయంకరమైన కటిక చీకటి” ఏమిటో అర్థమౌతుంది. మానవ జీవితం నిండా ఇవే. చీకటి వెలుగులు, కొంతసేపు సూర్యుడు, కొంత సేపు మబ్బు నీడ, వీటన్నిటి మధ్య దేవుని న్యాయవిధి తన పని తాను జరిగించుకుంటూ వెళ్తున్నది. క్రమశిక్షణకి గురవుతున్న హృదయం మీదనే కాక చుట్టుప్రక్కల ఉన్న మనుషులందరి మీదా తన ప్రభావాన్ని చూపిస్తున్నది. దేవుడు మానవుల పట్ల జరిగించే కార్యాల మూలంగా నెలకొనే ఈ భయంకరమైన కటిక చీకటికి బెదిరిపోయేవారు ఆ దేవుని మహా జ్ఞానాన్ని బట్టి, కేవలం న్యాయమైన ఆయన విధానాలను బట్టి ఆయనలో నిరీక్షణ ఉంచాలి. ఎందుకంటే ఆయన తనంతట తానే కల్వరిలో ఆ భయంకరమైన కటిక చీకటిని అనుభవించాడు. దిక్కుమాలినవాడై కేకలు పెట్టాడు. అందుమూలంగా మరణమనే గాఢాంధకారపు లోయలో నీతో బాటు తోడుగా ఉండి అవతలి వైపున నీ కంటికి సూర్యకాంతి కనిపించేదాకా నడిపించగల సమర్థుడయ్యాడు. అందుకని మనకంటే ముందు వీటిని అనుభవించిన వానిలోనే మన ఆశలు నిలుపుకొని మనకి అగోచరమైన పరిస్థితుల్లో ఆయన పైనే ఆధార పడదాము. మన లంగరును ఆయనలోనే దించుదాము. ఆయనలో అయితే దానికి పట్టు ఉంటుంది. తెల్లవారేదాకా అది నిలిచి ఉంటుంది.


సముద్రంపై రేగిన తుపాను తమను యేసునుండి వేరుచేసిందని శిష్యులు భయపడ్డారు. అంతేకాదు, యేసు తమ గురించి బొత్తిగా మర్చిపోయాడనుకున్నారు. తమ గురించి ఆయనకు లెక్కలేదనుకున్నారు. ప్రియ స్నేహితుడా, ఇలాటి సమయాల్లోనే కష్టాల ముల్లు గుచ్చుకుంటుంది. సైతాను నీ చెవిలో ఊదుతాడు. “దేవుడు నిన్ను మర్చి పోయాడు. నిన్ను వదిలేశాడు” అని. నీ అవిశ్వాస హృదయం గిద్యోనులాగా అంగలారుస్తుంది. “ప్రభువు మాతో ఉంటే ఇది మాకు ఎందుకు సంభవించింది?” దేవుణ్ణి నీకు సమీపంగా తీసుకు రావడానికే నీకు ఈ కీడు కలిగింది. యేసును నీ నుండి వేరుచెయ్యడానికి కాదు; నువ్వు ఆయనకు మరింత విశ్వాసంతో మరింత ఆత్రుతగా హత్తుకోవాలనే.


దేవుడు మనల్ని వదిలేసాడన్నట్టు కనిపించిన  పరిస్థితుల్లోనే మనల్ని మనం ఆయన చేతుల్లో వదిలి నిశ్చింతగా ఉండాలి. ఆయన మనకి అనుగ్రహించాలనుకున్నప్పుడే మనం వెలుగునూ ఆదరణనూ అనుభవిద్దాము. ఆయన ఇచ్చే బహుమతుల మీద కాదు గాని ఆయన మీదే ఆశపెట్టుకుందాము. విశ్వాసపు రాత్రిలో ఆయన మనల్ని వదిలినప్పుడు ఉక్కిరిబిక్కిరి చేసే ఆ చీకటిలోనే సాగిపోదాం.


విజయం తెచ్చే విశ్వాసం కావాలి

పరాజయం నీ మీద పడనుంటే

కావాలి విజయాన్ని తెచ్చే విశ్వాసం

జయధ్వానాల్లోకి నడిపిస్తుంది

అపజయమెరుగని విజయ విశ్వాసం.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Lo, a horror of great darkness fell upon him - (Gen - 15:12)

The sun, at last, went down, and the swift, eastern night cast its heavy veil over the scene. Worn out with the mental conflict, the watchings, and the exertions of the day, Abraham fell into a deep sleep, and in that sleep, his soul was oppressed with dense and dreadful darkness, such as almost stifled him and lay like a nightmare upon his heart. Do you understand something of the horror of that darkness? When some terrible sorrow which seems so hard to reconcile with perfect love, crushes down upon the soul, wringing from it all its peaceful rest in the pitifulness of God, and launching it on a sea unlit by a ray of hope; when unkindness and cruelty maltreat the trusting heart, till it begins to doubt whether there be a God overhead who can see and still permit—these know something of the “horror of great darkness.” It is thus that human life is made up; brightness and gloom; shadow and sun; long tracks of cloud, succeeded by brilliant glints of light, and amid all Divine justice is working out its own schemes, affecting others equally with the individual soul which seems the subject of special discipline. O ye who are filled with the horror of great darkness because of God’s dealings with mankind, learn to trust that infallible wisdom, which is co-assessor with immutable justice; and know that He who passed through the horror of the darkness of Calvary, with the cry of forsakenness, is ready to bear you company through the valley of the shadow of death till you see the sun shining upon its further side. Let us, by our Forerunner, send forward our anchor, Hope, within the veil that parts us from the unseen; where it will grapple in-ground and will not yield, but hold until the day dawns, and we follow it into the haven guaranteed to us by God’s immutable counsel. —F. B. Meyer

The disciples thought that that angry sea separated them from Jesus. Nay, some of them thought worse than that; they thought that the trouble that had come upon them was a sign that Jesus had forgotten all about them, and did not care for them. Oh, dear friend, that is when troubles have a sting, when the devil whispers, “God has forgotten you; God has forsaken you”; when your unbelieving heart cries as Gideon cried, “If the Lord be with us, why then is all this befallen us?” The evil has come upon you to bring the Lord nearer to you. The evil has not come upon you to separate you from Jesus, but to make you cling to Him more faithfully, more tenaciously, more simply. —F. S. Webster, M.A.

Never should we so abandon ourselves to God as when He seems to have abandoned us? Let us enjoy light and consolation when it is His pleasure to give it to us, but let us not attach ourselves to His gifts, but to Himself; and when He plunges us into the night of pure faith, let us still press on through the agonizing darkness.


Oh, for the faith that brings the triumph  

When defeat seems strangely near!  

Oh, for a faith that brings the triumph  

Into victory’s ringing cheer—  

Faith triumphant; knowing not to defeat or fear.  

—Herbert Booth

No comments:

Post a Comment