Wednesday, December 8, 2021

Show Love

 దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును ... ధరించుకొనుడి (కొలొస్స 3:12).


ఒక వృద్ధుడు ఎక్కడికి వెళ్ళినా ఒక డబ్బాలో నూనె తీసుకువెళ్ళేవాడట. ఏదైనా తలుపు కిర్రుమని చప్పుడౌతుంటే కాస్త నూనెని ఆ తలుపు బందుల మధ్య పోసేవాడట. ఏదైనా గడియ తియ్యడం కాస్త కష్టంగా ఉంటే నూనె రాసి తేలికగా వచ్చేలా చేసేవాడట. ఇలా తన దారిలో కష్టంగా ఉన్న వాటినన్నిటినీ నూనెతో మెత్తన చేస్తూ తన తరువాత వచ్చేవాళ్ళకి సౌకర్యంగా ఉండేలా చేసేవాడు.


అతణ్ణి అందరూ పిచ్చివాడనేవారు. కాని ఆ వృద్ధుడు మాత్రం తొణకకుండా డబ్బా ఖాళీ అయినప్పుడెల్లా దాన్ని నింపుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోయేవాడు.


చాలా జీవితాలు ప్రతిరోజూ ఇలాటి చప్పుళ్ళు చేస్తూ భారంగా, చిరాకుగా మూలుగుతూ ఉంటాయి. ఏదీ సవ్యంగా జరగదు. వాళ్ళకి సంతోషం, సాత్వికం, వివేచన అనే నూనె అవసరం. నీ దగ్గర ఈ నూనె సీసా ఉందా? నీ సన్నిహితులకి సహాయపడడానికి ఉదయం మొదలుకొని సిద్ధపడి ఉండు. దిగులుగా ఉన్న హృదయానికి ప్రోత్సాహం అనే నూనె రాయి. అది ఆ హృదయానికి ఎంత ఆదరణకరమో కదా! వెన్నుతట్టి లేవనెత్తే ఒక్క మాట. ఆ మాటను పలకడానికి బద్ధకించకు.


జీవిత గమనంలో మన జీవితం కొన్ని జీవితాలకి ఒక్కసారే ఎదురవుతుంది. అక్కడినుండి విడిపోయి మరెన్నటికీ కలుసుకోదు. మన దగ్గర ఉన్న జాలి అనే నూనెను కష్టాల్లో ఉన్న అనేకమైన జీవితాల మీద పోసి వాటిలోని ఘర్షణనూ రాపిడినీ మెత్తగా చెయ్యగలిగితే, రక్షకుని విమోచనా వాత్సల్యానికి ఆ హృదయాలను సిద్ధపరచగలిగితే మన విధిని మనం నిర్వహించినట్టే.


దిగులుగా ఉన్న వ్యక్తితో పలికిన ఒక్క ఆదరణ వాక్యం అతని హృదయంలో సూర్యోదయాన్ని కలుగజేస్తుంది.


మనుషుల మనసుల్లో రగిలే వేదన

మనకర్థం కాదు

మనం చూడలేము

అయితే ప్రేమ అన్నిటినీ వెలిగిస్తుంది

పగులుతున్న గుండెల్ని రగులుతున్న ఆత్మల్ని

దిగులు మాన్పించి సేదదీర్చేలా జాలి చూపిద్దాం


“సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారైయుండుడి (రోమా 12:10).

-----------------------------------------------------------------------------------------------------------------------------

Put on as the elect of God, kindness - (Col - 3:12)

There is a story of an old man who carried a little can of oil with him everywhere he went, and if he passed through a door that squeaked, he poured a little oil on the hinges. If a gate was hard to open, he oiled the latch. And thus he passed through life lubricating all hard places and making it easier for those who came after him.

People called him eccentric, queer, and cranky; but the old man went steadily on refilling his can of oil when it became empty, and oiled the hard places he found.

There are many lives that creak and grate harshly as they live day by day. Nothing goes right with them. They need lubricating with the oil of gladness, gentleness, or thoughtfulness. Have you your own can of oil with you? Be ready with your oil of helpfulness in the early morning to the one nearest you. It may lubricate the whole day for him. The oil, of good cheer to the downhearted one—Oh, how much it may mean! The word of courage to the despairing. Speak it.

Our lives touch others but once, perhaps, on the road of life; and then, mayhap, our ways diverge, never to meet again, The oil of kindness has worn the sharp, hard edges off of many a sin-hardened life and left it soft and pliable and ready for the redeeming grace of the Saviour.

A word spoken pleasantly is a large spot of sunshine on a sad heart. Therefore, “Give others the sunshine, tell Jesus the rest.”


“We cannot know the grief  

That men may borrow;  

We cannot see the souls  

Storm-swept by sorrow;  

But love can shine upon the way  

Today, tomorrow;  

Let us be kind.  

Upon the wheel of pain so many weary lives are  

broken,  

We live in vain who give no tender token.  

Let us be kind.”


“Be kindly affectioned one to another with brotherly love” (Rom. 12:10).

No comments:

Post a Comment