‘ఆ రాత్రే’ దేవుడు ప్రత్యక్షమయ్యాడట. బెయేర్షెబాకి వెళ్ళిన రాత్రే ఇలా ప్రత్యక్షమవ్వడం ఏదో యదాలాపంగా జరిగిందనుకుంటున్నారా? ఈ రాత్రి కాకపోతే ఏదో ఒక రాత్రి ప్రత్యక్షం జరిగేదేననుకుంటున్నారా? పొరపాటు. బెయేర్షెబా చేరిన రాత్రే ఇస్సాకుకి దర్శనం ఎందుకు వచ్చింది? ఎందుకంటే విశ్రాంతి పొందింది ఇస్సాకు ఆ రాత్రే. అప్పటి దాకా ఆ ప్రదేశంలో అతడికి ఎన్నెన్నో చిరాకులు కలిగాయి. బావి గురించి దెబ్బలాటల్లాంటి చిన్న చిన్న చిరాకులు వచ్చాయి. చిన్నచిన్న విషయాల గురించి పోట్లాటలంత చిరాకు మరేదీ లేదు. ముఖ్యంగా ఇలాటివి ఒక దానివెంట ఒకటి పోగవుతూ ఉంటే అది మరీ చిరాకు. ఇస్సాకుకి ఇది అనుభవంలోకి వచ్చింది.
పోట్లాట తీరకపోయినా, ఇక ఆ ప్రదేశంలో ఉండడానికి మనసొప్పదు. అక్కడినుండి వెళ్ళిపోవాలని నిర్ణయించాడు. స్థలం మార్పు అవసరమనిపించిందతనికి. తనకి తలనొప్పి కలిగించిన కజ్జాలు తలెత్తిన చోటనుండి దూరంగా వెళ్ళిపోయి తన గుడారాన్ని వేసుకున్నాడు. ఆ రాత్రే దర్శనం వచ్చింది. మనసులో ఏమీ అల్లకల్లోలాలు లేకుండా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. మనసంతా చిరాకు చిరాకుగా ఉంటే ఆయన స్వరం వినబడదు. ఆత్మలో నిశ్శబ్దం కావాలంటుంది దేవుని స్వరం. ఆత్మలో నలుమూలల నెమ్మది పరుచుకున్న తరువాతే దేవుని సన్నిధి ఇస్సాకు చెవులకు సోకింది. నిశ్చలమైన ఆకాశమే నక్షత్రాలు కనిపించే ఆకాశం.
“ఊరక నిలుచుండి చూడు” - ఈ మాటలనెప్పుడైనా నీ హృదయం ధ్యానించిందా? ఆందోళన చెందియున్న వేళ నీ ప్రార్ధనలకు వచ్చే జవాబు కూడా నీకు వినిపించదు. ప్రార్థన చేసిన తరువాత చాలా కాలానికి జవాబు వచ్చినట్టు నీకెప్పుడూ అనిపించలేదా? బాధతో నువ్వు పెట్టిన పొలికేకకి కలిగిన భూకంపంలో, ఉరుములో, రాజుకున్న అగ్నిలో నీకు జవాబు రాలేదు. నీ ఆక్రందనలు అంతమయ్యాక, నిశ్శబ్దం అలుముకున్నాక, నువ్వు తలుపు తట్టడం చాలించుకున్నాక, ఇతరుల గురించిన నీ ఆవేదనలో నీకు కలిగిన దుఃఖాన్ని నువ్వు మర్చిపోయిన తరువాత, నువ్వెప్పుడో ఎదురుచూసిన జవాబు వస్తుంది. ఓ హృదయమా, నువ్వు కోరుకున్నది నీకు దక్కాలంటే ముందు ప్రశాంతంగా విశ్రమించాలి. నీ వ్యక్తిగతమైన బాధల మూలంగా దడదడా కొట్టుకునే నీ గుండె చప్పుళ్ళను ముందు అదుపులో పెట్టుకో. నీ జీవితంలో రేగిన తుఫానును మర్చిపోయి, నీ తోటివారందరికీ కలుగుతున్న కష్టాలను గురించి పట్టించుకో. ఆ రాత్రే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఇంకిపోతున్న వరద వెనకాలే దేవుని వర్షపు ధనస్సు కనిపిస్తుంది. నిశ్చలతలో నిత్య సంగీతం నువ్వు వింటావు.
ఒంటరి బాటలో ఒక్కడివే సాగిపో
చింతలు లేని నీ అంతరంగం
ఇంతకు ముందెన్నడూ వినని వింత గొలిపే
అందమైన దైవ రహస్యాలు వింటుంది
అల్లరి మూక విరుచుకుపడుతుంది
అన్ని విషయాల కోసం ప్రాకులాడుతుంది
అన్వేషించు వినిర్మల సంగీతం వినిపించే
మరో లోకపు ధన్యతా స్వరాలను
దుమ్ము నిండిన దారి నీకొద్దు
తెల్లవారు జామున తళతళ మెరిసే
సముద్రోపరితలంలాగా మచ్చలేని ఆత్మను
నవ నవోన్మేషంగా వుంచుకో
-----------------------------------------------------------------------------------------------------------------------------
The Lord appeared to him that night and said, “I am the God of your father Abraham. Do not be afraid, for I am with you. I will bless you and multiply your descendants for the sake of my servant Abraham.” - (Gen - 26:24 )
“Appeared the same night,” the night on which he went to Beer-sheba. Do you think this revelation was an accident? Do you think the time of it was an accident? Do you think it could have happened on any other night as well as this? If so, you are grievously mistaken. Why did it come to Isaac in the night on which he reached Beer-sheba? Because that was the night on which he reached rest. In his old locality, he had been tormented. There had been a whole series of petty quarrels about the possession of paltry wells. There are no worries like little worries, particularly if there is an accumulation of them. Isaac felt this. Even after the strife was passed, the place retained a disagreeable association. He determined to leave. He sought a change of scene. He pitched his tent away from the place of former strife. That very night the revelation came. God spoke when there was no inward storm. He could not speak when the mind was fretted; His voice demands the silence of the soul. Only in the hush of the spirit could Isaac hear the garments of his God sweep by. His still night was his starry night.
My soul, hast thou pondered these words, “Be still, and know”? In the hour of perturbation, thou canst not hear the answer to thy prayers. How often has the answer seemed to come long after the heart got no response in the moment of its crying—in its thunder, its earthquake, and its fire. But when the crying ceased, when the stillness fell, when thy hand desisted from knocking on the iron gate, when the interest of other lives broke the tragedy of thine own, then appeared the long-delayed reply. Thou must rest, O soul, if thou wouldst have thy heart’s desire. Still the beating of thy pulse of personal care. Hide thy tempest of individual trouble behind the altar of a common tribulation and, that same night, the Lord shall appear to thee. The rainbow shall span the place of the subsiding flood, and in thy stillness thou shalt hear the everlasting music. —George Matheson
Tread in solitude thy pathway,
Quiet heart and undismayed.
Thou shalt know things strange, mysterious,
Which to thee no voice has said.
While the crowd of petty hustlers
Grasps at vain and paltry things,
Thou wilt see a great world rising
Where soft mystic music rings.
Leave the dusty road to others,
Spotless keep thy soul and bright,
As the radiant ocean’s surface
When the sun is taking flight.
—(From the German of V. Schoffel) H. F.
No comments:
Post a Comment