Friday, January 7, 2022

Contentment

 నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను (ఫిలిప్పీ 4:11)


తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో ఉండి, సౌకర్యాలేమీ లేని స్థితిలో పౌలు ఈ మాటలు రాసాడు. 

ఒక రాజు గారు ఒక రోజున  తన తోట లోనికి వెళ్లి చూసే సరికి మొక్కలు, చెట్లు అన్నీ వాడిపోయి ఎండిపోతూ ఉన్నాయట. గేటు దగ్గర నిలిచియున్న మర్రిచెట్టును రాజుగారు అడిగారట. ఎందుకిలా అయిపోయావు? అని. కొబ్బరి చెట్టుకంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందట ఆ మర్రి వృక్షం. కొబ్బరిచెట్టేమో తనకి ద్రాక్షపళ్ళు కాయలేదని ఆత్మహత్యకి సిద్ధపడి ఉంది. ద్రాక్షాతీగేమో నిటారుగా నిలబడలేనే అనే దిగులుతో కృశించిపోతున్నది. బంతి మొక్కేమో తన పూలకి సంపంగిలా వాసన లేదని నిరాహార దీక్షలో ఉంది. చివరికి ఒక చోట సన్నజాజి తీగె మాత్రం నిండుగా, పచ్చగా కనుల విందుగా కనిపించింది. రాజుగారన్నారు, “సన్నజాజీ, కనీసం నువ్వన్నా పచ్చగా కళకళలాడుతూ ఉన్నావు. ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించాయి. నువ్వు చిన్నదానివైనా ధైర్యంగా ఉన్నావు, చాలా సంతోషం.”


అప్పుడు సన్నజాజి అందట “రాజా, మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేమే అని బాధపడుతున్నాయి. అయితే నీకు మర్రిచెట్టు కావాలనే మర్రిమొక్క నాటావు. ద్రాక్ష కావాలనే ద్రాక్షతీగె నాటావు. సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టే నన్ను నాటావు. అందుచేత నేను సన్న జాజిగానే ఉంటాను. మరెవరిలాగానో లేననే నిరుత్సాహం నాకెందుకు?”


కొంతమంది చేస్తారెన్నైనా మహత్తులు 

పంతమెందుకు నీ పని నీదే 

సృష్టి అంతటిలోకి ఎవరూ 

నీ అంత బాగా ఆ పని చేయలేరు 


పూర్తిగా దేవునికి చెందినవాళ్ళు ఎలాంటి పరిస్థితిల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తం. ఆయన ఏం చెయ్యాలని కోరతాడో అదే ఆయన కోసం చెయ్యాలని వాళ్ళు కోరుకుంటారు. తమకున్న ప్రతిదాన్ని వాళ్ళు వదిలేసుకుంటారు. అలాటి నగ్నత్వంలో అన్ని వస్తువులూ తమకి నూరంతలుగా తిరిగి సమకూరడం వాళ్ళు చూస్తారు.

-----------------------------------------------------------------------------------------------------------------------------

I am not saying this because I am in need, for I have learned to be content in any circumstance. - (Phil -  4:11)

Paul, denied of every comfort, wrote the above words in his dungeon. A story is told of a king who went into his garden one morning and found everything withered and dying. He asked the oak that stood near the gate what the trouble was. He found it was sick of life and determined to die because it was not tall and beautiful like the pine. The pine was all out of heart because it could not bear grapes, like the vine. The vine was going to throw its life away because it could not stand erect and have as fine fruit as the peach tree. The geranium was fretting because it was not tall and fragrant like the lilac, and so on all through the garden. Coming to a heart’s-ease, he found its bright face lifted as cheery as ever. “Well, heart’s-ease, I’m glad, amidst all this discouragement, to find one brave little flower. You do not seem to be the least disheartened.” “No, I am not of much account, but I thought that if you wanted an oak, or a pine, or a peach tree, or a lilac, you would have planted one; but as I knew you wanted a heart’s-ease, I am determined to be the best little heart’s-ease that I can.”

“Others may do a greater work,

But you have your part to do;

And no one in all God’s heritage

Can do it so well as you.”

They who are God’s without reserve, are in every state content; for they will only what He wills, and desire to do for Him whatever He desires them to do; they strip themselves of everything, and in this nakedness find all things restored a hundredfold.

No comments:

Post a Comment