Sunday, January 30, 2022

Unshaken in Christ

 

దేవుడు ఆ పట్టణములోనున్నాడు. దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు (కీర్తన 46: 5)

“దానికి చలనము లేదు” అనే మాట ఎంత ధన్యకరమైన మాట! ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం, మన ప్రశాంతతను ఏదీ భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ఈ సంగతి అపొస్తలుడైన పౌలుకు తెలుసు. యెరూషలేముకి వెళ్ళబోతున్నపుడు అక్కడ తన కోసం “బంధకములు, శ్రమలు" కాచుకొని ఉన్నాయని తెలిసినా “ఈ విషయాలేమీ నన్ను కదిలించవు" అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు. పౌలు జీవితంలోనూ, అనుభవంలోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయాయి. ఇక అతడు జీవితాన్ని గాని జీవితాశలను గానీ ప్రియంగా ఎంచుకోవడం లేదు. దేవుడు మన జీవితాల్లో చేయదలచుకున్నదాన్ని చెయ్యనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం. అప్పుడు చికాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు గాని, బాధ పెట్టే బరువైన శ్రమలు గానీ మన ఊహకందని ప్రశాంతతకు భంగం కలిగించలేవు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్నవాళ్ళకి బహుమానం ఇదే.

“జయించేవాడిని నా దేవుని మందిరంలో మూలస్థంభంగా చేస్తాను. అతణ్ణి అక్కడినుండి కదిలించడం ఎవరికీ సాధ్యం కాదు." దేవుని గుడిలో స్థంభంగా అచంచలంగా ఉండగలిగే ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి.


దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సీయోను పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది. అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోష పెట్టినప్పటికీ, ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది. అలాటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తీ ఇవ్వలేదు. ఏ శక్తీ లాగేసుకోలేదు. ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు కూడా మనుషుల హృదయాలు ఆకులా వణికిపోతాయెందుకు? దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువల్లనే కదా. దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్టించడమే కదా కావలసింది.


ప్రభువులో విశ్వాసముంచేవాళ్ళు సీయోను పర్వతంలాగా కదలక సిరులై ఉంటారు. మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది

నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించేవాళ్ళు

సీయోను శిఖరంలా నిలబడతారు నిండుగా

అది తొణకదు బెణకదు గడగడ వణకదు 

ఇనుములా, ఉక్కులా నిలిచే ఉంటుంది మొండిగా

-----------------------------------------------------------------------------------------------------------------------------

God is in the midst of her; she shall not be moved: God shall help her, and that right early - (Ps  - 46:2,3,5)

    “Shall not be moved”—what an inspiring declaration! Can it be possible that we, who are so easily moved by the things of earth, can arrive at a place where nothing can upset us or disturb our calm? Yes, it is possible; and the Apostle Paul knew it. When he was on his way to Jerusalem where he foresaw that “bonds and afflictions” awaited him, he could say triumphantly, “But none of these things move me.” Everything in Paul’s life and experience that could be shaken had been shaken, and he no longer counted his life, or any of life’s possessions, dear to him. And we, if we will but let God have His way with us, may come to the same place, so that neither the fret and tear of little things of life nor the great and heavy trials, can have the power to move us from the peace that passeth understanding, which is declared to be the portion of those who have learned to rest only on God.

    “He that overcometh will I make a pillar in the temple of my God, and he shall go no more out.” To be as immovable as a pillar in the house of our God, is an end for which one would gladly endure all the shakings that may be necessary to bring us there!  —Hannah Whitall Smith

    When God is amid a kingdom or city He makes it as firm as Mount Zion, that cannot be removed. When He is amid a soul, though calamities throng about it on all hands, and roar like the billows of the sea, yet there is a constant calm within, such a peace as the world can neither give nor take away. What is it but want of lodging God in the soul, and that in His stead the world is in men’s hearts, that makes them shake like leaves at every blast of danger?  —Archbishop Leighton

    “They that trust in the Lord shall be as mount Zion, which cannot be removed, but abideth for ever.” There is a quaint old Scottish version that puts iron into our blood:


“Who sticketh to God in stable trust

As Zion’s mount, he stands full just,

Which moveth no whit, nor yet doth reel,

But standeth forever as stiff as steel!”

No comments:

Post a Comment