Sunday, February 27, 2022

More Than Sufficient

 

నా కృప నీకు చాలును - (2 కొరింథీ 12:9). 

ఒకరోజు కష్టపడి పనిచేసి తిరిగి వెళ్తున్నాను. చాలా అలసటగా ఉంది. చాలా నీరసించిపోయి ఉన్నాను. హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు ఈ వాక్యం నాకు తోచింది. "నా కృప నీకు చాలును." ఇంటికి చేరి నా బైబిలు తీసి చూసాను. నా కృప నీకు చాలును. నిజమే ప్రభూ. ఒక్కసారి ఆనందంతో గట్టిగా నవ్వు వచ్చింది. అబ్రాహాము ఎందుకు నవ్వుకుంటూ ఉండేవాడో అప్పుడు అర్ధం అయింది. అపనమ్మకం అనేది ఉందని కూడా నమ్మశక్యం కాలేదు. ఆ క్షణంలో ఎలా అనిపించిందంటే ఒక చిన్న చేపకి దాహం వేసింది వేసిందట. నీళ్లు తాగితే నదిలో నీళ్లన్నీ అయి పోతాయేమోనని భయపడిందట ఆ చేప. ఇలా ఉంది నా పరిస్థితి. గోదావరి అంటుంది, "ఓ చిన్న చేపా, నీ దాహం తీర్చుకో, నాలోని నీళ్లు నీకు చాలు". లేదా ఏడు సంవత్సరాల సమృద్ధి తరువాత ఓ చిట్టెలుక తాను కరువుతో చనిపోతానేమోనని భయపడినట్టుంది. యోసేపు దానితో అంటాడు "ఓ చిట్టెలుకా దిగులుపడకు, నా ధాన్యపు కొట్టులోనిది నీకు చాలు." ఇంకా ఆలోచిస్తే ఒక మనిషి పర్వతం మీద నిలబడి అనుకుంటున్నాడు "ప్రతీసారి నేను ఇంత గాలి పీల్చుకుంటున్నాను. వాతావరణంలోని ఆక్సిజన్ అంతా అయిపోతుందేమో." అయితే భూమి అంటుంది "ఓ మనిషీ, నీ ఇష్టం వచ్చినంత గాలితో మీ ఊపిరితిత్తుల్ని నింపుకో. నా చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం నీకు సరిపోతుంది."

ఓ సోదరులారా! నమ్మకం ఉంచండి. కొంచెం పాటి విశ్వాసం మీ హృదయాలను పరలోకానికి తీసుకువెళ్తుంది. గొప్ప విశ్వాసమైతే పరలోకాన్నే మీ హృదయాల్లోకి తీసుకు వస్తుంది.


ఘనకార్యాలు చేయించే

గొప్ప కృప దేవునిది

హృదయాన్ని ముంచెత్తే కెరటాలు

ఊపిరాడనియ్యని పెనుగాలులు 

అలవిగాని విపరీతాలు కూడివచ్చినా

దేవుని కృప చాలు


చిన్న పనులు చేసిపెట్టే

గొప్ప కృప దేవునిది

చిరాకు పెట్టే చిన్న చిన్న దిగుళ్ళు

జోరీగల హోరు పెట్టే శోధనలు

మనశ్శాంతిని పాడు చేసే ముళ్ళు

అన్నింటినీ మరిపిస్తాయి ఆయన కృపా పరవళ్ళు


పరలోకపు బొక్కసంలో మన పేరున పేరున చాలా మొత్తం ఉంది. విశ్వాసాన్ని చూపించి ఆ డబ్బును తీసుకోవచ్చు. ఇష్టం వచ్చినంత తీసుకోండి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

My grace is sufficient for thee - (2 Cor - 12:9)

The other evening I was riding home after a heavy day’s work. I felt very wearied, and sore depressed, when swiftly, and suddenly as a lightning flash, that text came to me, “My grace is sufficient for thee.” I reached home and looked it up in the original, and at last, it came to me in this way, “MY grace is sufficient for thee”; and I said, “I should think it is, Lord,” and burst out laughing. I never fully understood what the holy laughter of Abraham was until then. It seemed to make unbelief so absurd. It was as though some little fish, being very thirsty, was troubled about drinking the river dry, and Father Thames said, “Drink away, little fish, my stream is sufficient for thee.” Or, it seemed after the seven years of plenty, a mouse feared it might die of famine; and Joseph might say, “Cheer up, little mouse, my granaries are sufficient for thee.” Again, I imagined a man away up yonder, in a lofty mountain, saying to himself, “I breathe so many cubic feet of air every year, I fear I shall exhaust the oxygen in the atmosphere,” but the earth might say, “Breath away, O man, and fill the lungs ever, my atmosphere is sufficient for thee.” Oh, brethren, be great believers! Little faith will bring your souls to Heaven, but great faith will bring Heaven to your souls. —C. H. Spurgeon


His grace is great enough to meet the great things  

The crashing waves that overwhelm the soul,  

The roaring winds that leave us stunned and breathless,  

The sudden storm is beyond our life’s control.  


His grace is great enough to meet the small things  

The little pin-prick troubles that annoy,  

The insect worries, buzzing and persistent,  

The squeaking wheels that grate upon our joy.  

—Annie Johnson Flint


There is always a large balance to our credit in the bank of Heaven waiting for our exercise of faith in drawing it. Draw heavily upon His resources.

No comments:

Post a Comment