జరిగినది నా వలననే జరిగెను - (1రాజులు 12:24).
“బ్రతుకులోని నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే” అని రెవ. సి.ఎ.ఫాక్స్ గారు అన్నారు.
దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. "ప్రియ కుమారుడా, ఈ రోజు నీకోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చాను. దాన్ని నీ చెవిలో చెప్పనీ. ముసురుకుంటున్న కారుమబ్బులను అది మహిమ రథాలుగా మార్చేస్తుంది. నీ అడుగు పడబోతున్న ఇరుకు దారుల్ని మృదువుగా చేస్తుంది. ఈ సందేశంలో మూడు మాటలే ఉన్నాయి. దాన్ని నీ అంతరంగంలోకి ఇంకిపోనీ. నీ తలగడగా అది ఉపయోగపడనీ. ఆ సందేశమేమంటే జరిగినది నా వలననే జరిగెను.”
నీవెప్పుడన్నా ఆలోచించావా? నీకు సంబంధించిన వాటన్నిటిలో నా బాధ్యత కూడా ఉంది. “మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నాడు” (జెకర్యా 2:8). (స్వేచ్ఛానువాదం). “నీవు నా దృష్టికి ప్రియుడవు” (యెషయా 43:4). అందుకని నీకు సంగతులన్నీ తెలియజెప్పడం నాకెంతో ఇష్టం.
నిన్ను శోధనలెప్పుడు అటకాయిస్తాయో నీకు తెలియజేస్తాను. శత్రువు ఎప్పుడు వరదలాగ వచ్చిపడతాడో చెప్తాను. ఇవన్నీ నావల్లనే జరుగుతాయి. నీ బలహీనతకి నాశక్తిని జోడిస్తాను. నీపక్షంగా నన్ను యుద్దం చెయ్యనివ్వడంలోనే నీకు క్షేమముంది.
నిన్ను అపార్థం చేసుకునే మనుష్యుల మధ్య కష్టకాలంలో ఉంటున్నావా? వాళ్ళు నిన్ను లెక్కచేయకుండా నిన్ను ఓ మూలకి నెట్టేస్తున్నారా? ఇదంతా చేయిస్తున్నది నేనే. ఈ పరిస్థితులన్నిటికీ ప్రభువుని నేనే. నువ్విప్పుడున్న చోటికి రావడమన్నది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది కాదు. నేను నీ కోసం నిర్దేశించిన స్థానమే ఇది.
విధేయతను నేర్పమని అడిగావు కదూ. ఆ పాఠం నేర్పే బడిలో నిన్నుంచాను. నీ పరిసరాలు, పరిస్థితులు నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి.
గడ్డు పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు గడించేది పొట్టకూటికే సరిపోవడం లేదా? ఇదంతా నా వలననే జరుగుతున్నది. నీ మనీ పర్సు నా చేతిలోనే ఉంది. నా మీద ఆధారపడి నా దగ్గర్నుండి డబ్బు తీసుకో. నా సంపదకి అంతులేదు (ఫిలిప్పీ 4:19). నా వాగ్దానాలను స్వంతం చేసుకో. “మీ దేవుడైన యెహోవాయందు మీరు విశ్వాస ముంచలేదు” (ద్వితీ 1:33) అనే మాట నీపట్ల నిజం కానివ్వకు.
శోకాల చీకటిలో ఉన్నావా? నేనే దానికి కారకుణ్ణి. నేను చింతలెన్నిటినో అనుభవించాను. దుఃఖమంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఇహలోకపు ఆదరణలు నీకు సహాయపడకుండా చేశాను. ఎందుకంటే నా వైపుకి తిరగడం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుంది (2 థెస్స 2:16,17). నా కోసం ఓ గొప్ప కార్యాన్ని తలపెట్టి ఇప్పుడు బాధలో, నీరసంలో, రోగిగా ఉన్నావా? ఇది నావలన జరిగినదే. నువ్వు హడావిడిగా తిరుగుతున్న రోజుల్లో నీకు ఏదైనా చెప్పాలంటే సాధ్యపడలేదు. నీకు కొన్ని లోతైన అనుభవాలను నేర్పుదామనుకున్నాను. ఊరక నిలిచి చూస్తుండే వాళ్ళు కూడా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నవారే. నా సేవకుల్లో గొప్పవాళ్ళు చాలామందిని పనిచెయ్యనివ్వకుండా కొంతకాలం అలా ఉంచాను. తద్వారా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించడం వాళ్ళు నేర్చుకున్నారు.
ఈనాడు నీ చేతుల్లో ఈ నూనెపాత్రను పెడుతున్నాను. ఉచితంగా దాన్ని వాడుకో. నీకెదురయ్యే ప్రతి పరిస్థితినీ, నిన్ను గాయపరిచే ప్రతి మాటనీ, నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతి ఆలస్యాన్నీ, నీ బలహీనతని నువ్వు గ్రహించిన ప్రతి సమయాన్నీ ఆ నూనెతో అభిషేకించు. అన్ని విషయాల్లోనూ నా జోక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నీలో కలుక్కుమనే బాధ ఉండదు.
“ఇది నావలనే" అన్నాడు రక్షకుడు
వంగి నా నుదురు ముద్దు పెట్టుకున్నాడు
నిన్ను ప్రేమిస్తున్నవాడే దీన్ని చేసాడు
నన్ను నమ్మి ఇప్పటికి ఓపిక పట్టు
నీ అవసరాలు తెలుసు నీ తండ్రికి
నీకు దొరకనివాటి కోసం బాధపడకు
నేను పంపేవే నీకు క్షేమ కారకాలు
నీళ్ళు నిండిన కళ్ళతో వేడుకున్నాను.
ప్రియ ప్రభూ క్షమించు, గ్రహించలేకపోయాను
నేను వెళ్ళే ప్రతి దారిలో నాకంటే ముందు నీ పాదాలు వెళ్ళాయి
నా క్షేమానికి ఇదే సరైనది, అందుకే పాడతాను
నీ కృప నాకు సరిపోతుంది, నువ్వేర్పరచినదే నాకతిమధురం
-----------------------------------------------------------------------------------------------------------------------------
This thing is from me - (1 Kgs - 12:24)
“Life’s disappointments are veiled love’s appointments.” —Rev. C. A. Fox
My child, I have a message for you today; let me whisper it in your ear, that it may gild with glory any storm clouds which may arise, and smooth the rough places upon which you may have to tread. It is short, only five words, but let them sink into your inmost soul; use them as a pillow upon which to rest your weary head. This thing is from Me.
Have you ever thought of it, that all that concerns you concerns Me too? For, “he that toucheth you, toucheth the apple of mine eye” (Zech. 2:8). You are very precious in My sight. (Isa. 43:4) Therefore, it is My special delight to educate you.
I would have you learn when temptations assail you, and the “enemy comes in like a flood,” that this thing is from Me, that your weakness needs My might, and your safety lies in letting Me fight for you.
Are you in difficult circumstances, surrounded by people who do not understand you, who never consult your taste, who put you in the background? This thing is from Me. I am the God of circumstances. Thou camest not to thy place by accident, it is the very place God meant for thee.
Have you not asked to be made humble? See then, I have placed you in the very school where this lesson is taught; your surroundings and companions are only working out My will.
Are you in money difficulties? Is it hard to make both ends meet? This thing is from Me, for I am your purse-bearer and would have you draw from and depend upon Me. My supplies are limitless (Phil.4:19). I would have you prove my promises. Let it not be said of you, “In this thing ye did not believe the Lord your God” (Deut. 1:32).
Are you passing through a night of sorrow? This thing is from Me. I am the Man of Sorrows and acquainted with grief. I have let earthly comforters fail you, that by turning to Me you may obtain everlasting consolation (2 Thess. 2:16, 17). Have you longed to do some great work for Me and instead have been laid aside on a bed of pain and weakness? This thing is from Me. I could not get your attention in your busy days and I want to teach you some of my deepest lessons. “They also serve who only stand and wait.” Some of My greatest workers are those shut out from active service, that they may learn to wield the weapon of all—prayer.
This day I place in your hand this pot of holy oil. Make use of it free, my child. Let every circumstance that arises, every word that pains you, every interruption that would make you impatient, every revelation of your weakness be anointed with it. The sting will go as you learn to see Me in all things. —Laura A. Barter Snow
“’ This is from Me,’ the Saviour said,
As bending low He kissed my brow,
’For One who loves you thus has led.
Just rest in Me, be patient now,
Your Father knows you need this,
Tho’, why perchance you cannot see.
Grieve not for things you’ve seemed to miss.
The thing I send is best for thee.’
“Then, looking through my tears, I plead,
’Dear Lord, forgive, I did not know,
’Twill not be hard since Thou dost tread,
Each path before me here below.
And for my good, this thing must be,
His grace was sufficient for each test.
So still I’ll sing, ”Whatever be
God’s way for me is always best.“’”
No comments:
Post a Comment