కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలనిస్తాయి. ఇది విడ్డూరమైన మాటగా అనిపించవచ్చు కాని ఇది ధన్యకరమైన సత్యం. దావీదు తన కష్టసమయంలో ఆక్రోశించాడు. “ఆహా! గువ్వవలె నాకు రెక్కలున్నయెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే!” (కీర్తన 55:6). కానీ ఈ ధ్యానాన్ని అతడు ముగించకముందే ఈ కోరిక అసాధ్యమైనదేమీ కాదని గ్రహించినట్టున్నాడు. అందుకే 22 వ వచనంలో “నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును” అంటున్నాడు.
'భారము' అనే మాటకి ఒక బైబిల్లో 'యెహోవా నీకు ఇచ్చినది' అనే అర్థం కనిపిస్తుంది. పరిశుద్దుల భారాలు దేవుడిచ్చినవే. యెహోవా మీద ఆనుకోవడానికి వాళ్ళనవి ప్రేరేపిస్తాయి. ఈ భారమే ఆశ్చర్యకరంగా మార్పుచెంది రెక్కలుగా మారిపోతుంది. రెక్కలొచ్చి పరిశుద్ధులు పక్షిరాజుల్లాగా ఎగిరిపోతారు.
ఒక రోజున నాకు దాపురించిన కష్టాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ వెళ్తున్నాను. కారుమేఘాల్లోంచి వర్షం చిందినట్టుగా నా మీదికి దూకబోయే బాధల్ని తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేసింది. “అయ్యో పాపం! నీ మీద ఎన్ని బరువు బాధ్యతలు! నీ జీవితం బాధల మయం. ఈ భారం నిన్నెప్పుడో నేలకి అణచివేయ గలదు.” నాలో నా గురించి గొప్ప సానుభూతి రేగింది. సూర్యుడు మలమలా మాడ్చేస్తున్నాడు. వేగంగా వెళ్తున్న కార్లు రేపే దుమ్ము, అవి చేసే శబ్దం అసలే అల్లకల్లోలంగా ఉన్న నా మనసుని మరింత చిరాకు పెట్టాయి. మనసంతా అలసటగా, అశాంతిగా ఉంది.
“అవును, ఈ భారం నన్నెప్పుడో హఠాత్తుగా మింగేస్తుంది. నాలాటి బలహీనుడికి ఇంత పెద్ద బరువులుండడం అన్యాయం” అనుకుంటూ నా చింతలో మునిగి తేలుతుండగా ఎక్కడినుంచో ఒక మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంది “ఈ బరువు నిన్ను లేవనెత్తుతుందేగాని అణగదొక్కదు.” వెంటనే నా పొరపాటు నాకు అర్థమైంది. నా స్థానం ఎప్పుడూ ఈ భారానికి పైనే ఉంటుంది. నేను దాన్ని మొయ్యడం దేవుని ఉద్దేశం కాదు. అదే నన్ను మొయ్యాలి. ఆయన సంకల్పిస్తూ ఉన్నప్పుడే నా శక్తి సామర్ధ్యాలు ఆయనకి తెలుసు. చిన్న మొలక పెరగాలంటే, నీరు, వెలుతురు అవసరం. తన పిల్లలికి కూడా తన కృప, శక్తి అవసరం అని ఆయనకి తెలుసు. ఆ మొలకని తానే అక్కడ నాటాడు. మీద పడిన భారం కింద నలిగి నేల వాలితే చనిపోయినట్టే. కాని ఆ భారాన్ని అధిగమించి పైకి పెరిగితే జీవం, శక్తి లభ్యమవుతాయి. మన భారాలే మన రెక్కలు. వాటితో మనం కృపా లోకాల అంచులకి ఎగిరిపోతాం. అవి లేకపోతే ప్రారంభ దశలోని విశ్వాసంతోనే ప్రాకులాడుతూ తడుములాడుతూ ఉంటాము.
పరలోకపు విధానాలు ఎంత విచిత్రమైనవి! మనల్ని అణగదొక్కుడానికి వచ్చాయనుకున్న భారాలు మనల్ని లేవనెత్తడానికేనట. కాబట్టి నా ఆత్మ ఎప్పటికీ కృంగిపోదు. కాని ఏ శక్తితో మనమీ ఔన్నత్యాన్ని చేరుకోగలం? ఆయన వాక్యంలోనే చిక్కుముడి విప్పే జవాబు ఉంది. క్రీస్తుతో ఏకాంతంగా మన భారాలపై ఎక్కిపోయి ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి.
----------------------------------------------------------------------------------------------------------------------------
Look from the top - (Song - 4:8)
Crushing weights give the Christian wings. It seems like a contradiction in terms, but it is a blessed truth. David out of some bitter experience cried: “Oh, that I had wings like a dove! Then would I fly away, and be at rest” (Ps. 55:6). But before he finished this meditation he seems to have realized that his wish for wings was a realizable one. For he says, “Cast thy burden upon Jehovah, and he will sustain thee.”
The word “burden” is translated in the Bible margin, “what he (Jehovah) hath given thee.” The saints’ burdens are God-given; they lead him to “wait upon Jehovah,” and when that is done, in the magic of trust, the “burden” is metamorphosed into a pair of wings, and the weighted one "mounts up with wings as eagles. —Sunday School Times
One day when walking down the street,
On business bent, while thinking hard
About the “hundred cares” which seemed
Like thunder clouds about to break
In torrents, Self-pity said to me:
“You poor, poor thing, you have too much
To do. Your life is far too hard.
This heavy load will crush you soon.”
A swift response of sympathy
Welled up within. The burning sun
Seemed more intense. The dust and noise
Of puffing motors flying past
With a rasping blast of blowing the horn
Incensed still more the whining nerves,
The fabled last back-breaking straw
To weary, troubled, fretting mind.
“Ah, yes, ’twill break and crush my life;
I cannot bear this constant strain
Of endless, aggravating cares;
They are too great for such as I.”
So thus my heart condoled itself,
“Enjoying misery,” when lo!
A “still small voice” distinctly said,
“I was sent to lift you—not to crush.”
I saw at once my great mistake.
My place was not beneath the load
But on the top! God meant it not
That I should carry it. He sent
It is here to carry me. Full well
He knew my incapacity
Before the plan was made. He saw
A child of His in need of grace
And power to serve; a puny twig
Requiring sun and rain to grow;
An undeveloped chrysalis;
A weak soul lacking faith in God.
He could not help but see all this
And more. And then, with tender thought
He placed it where it had to grow—
Or die. To lie and cringe beneath
One’s load means death, but life and power
Await all those who dare to rise above.
Our burdens are our wings; on them
We soar to higher realms of grace;
Without them we must roam for aye
On planes of undeveloped faith,
For faith grows but by exercise in circumstance impossible.
Oh, the paradox of Heaven. The load
We think will crush was sent to lift us
Up to God! Then, the soul of mine,
Climb up! for naught can e’er be crushed
Save what is underneath the weight.
How may we climb! By what ascent
Shall we surmount the carping cares
Of life! Within His word is found
The key which opes His secret stairs;
Alone with Christ, secluded there,
We mount our loads and rest in Him.
—Miss Mary Butterfield
No comments:
Post a Comment