అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి - (మత్తయి 6:28).
ఆలివ్ నూనె బొత్తిగా దొరకడం లేదు. సరే, ఆ ఆలివ్ మొక్క ఒకటి నాటితే సరిపోతుంది అనుకున్నాడు పూర్వం ఒక సన్యాసి. మొక్కని నాటాడు. “దేవా దీనికి వర్షం కావాలి. దీని వేళ్ళు చాలా సున్నితమైనవి. కాబట్టి మెల్లని తొలకరి జల్లును కురిపించు” అంటూ ప్రార్ధించాడు. ఆ ప్రకారంగానే దేవుడు చిరుజల్లు కురిపించాడు. “దేవా ఈ మొక్కకి సూర్యరశ్మి కావాలి. సూర్యుడిని ప్రకాశింపజెయ్యి” మళ్ళీ ప్రార్ధించాడు, అలానే వెచ్చని సూర్యరశ్మి తొలకరి మేఘాలను చీల్చుకుని ప్రకాశించింది. "తేమ కావాలి దేవా, ఈ మొక్క కణజాలాలకు పుష్టి కలిగేందుకుగాను తేమని పంపించు” మళ్ళీ ప్రార్ధన చేశాడు. చల్లని మంచు, తేమ ఆ మొక్కని ఆవరించింది. సన్యాసి సంతోషించాడు. కాని ఆ సాయంత్రమే ఆ మొక్క వాడిపోయింది.
సన్యాసి విచారంగా మరో సన్యాసి ఆశ్రమానికి వెళ్ళి ఇదంతా ఆయనకి వివరించాడు. ఆయనన్నాడు “నేను కూడా ఓ మొక్క నాటాను. చూడూ అది ఎంత పచ్చగా కళకళలాడుతుందో. దాన్ని సృష్టించింది దేవుడు కాబట్టి నాకంటే దాని బాగోగులు ఆయనకే బాగా తెలుసు. దేవుడితో నేనేమీ బేరం ఆడలేదు. ఇలా ఇలా చెయ్యి అంటూ ఆయనకి నేనేమీ సలహాలనివ్వలేదు. “దేవా ఈ మొక్కకి ఏది కావాలో అది ఇయ్యి” అని మాత్రం ప్రార్థించాను. తుఫాను కావాలో, తుషారం కావాలో, నీరెండ కావాలో, నీటి చినుకులు కావాలో, మొక్కకి ఏది అవసరమో ఆయనకి తెలుసు కదా.”
గరిక పూలు దిగులుపడవు
దిగులుపడకు నువ్వు కూడా.
వానచినుకులో గడ్డిపరకలు
పొగమంచులో పున్నాగ పూలు
చీకటి ముసుగున సిరిమల్లెలు
ఉదయపు కాంతిలో ప్రకృతి అంతా
పెరుగుతుంది, కుసుమిస్తుంది
వాటికాధారం దేవుడే
నీరు పోసేవాడు ఆయనే
పూలు పూసేది ఆయన వల్లే
జాజికంటే సంపెంగకంటే
మంచు కడిగిన మల్లికంటే
ఆయనకి నువ్వే ఇష్టం తెలుసుకుంటే.
నీ బరువాయనదే
కొరతలు, విన్నపాలు ఆయనకి చేరాలి.
నీ బాధ్యత ఆయనదే
నిశ్చింతగా ఉండు
అంతా ఆయనకి వదిలి.
---------------------------------------------------------------------------------------------------------------------------
Consider the lilies, how they grow - (Matt - 6:28)
I need oil,“ said an ancient monk; so he planted an olive sapling. ”Lord,“ he prayed, ”it needs rain that its tender roots may drink and swell. Send gentle showers.“ And the Lord sent gentle showers. ”Lord,“ prayed the monk, ”my tree needs sun. Send sun, I pray Thee.“ And the sun shone, gilding the dripping clouds. ”Now frost, my Lord, to brace its tissues," cried the monk. And behold, the little tree stood sparkling with frost, but in the evening it died.
Then the monk sought the cell of a brother monk and told his strange experience. “I, too, planted a little tree,” he said, “and see! it thrives well. But I entrust my tree to its God. He who made it knows better what it needs than a man like me. I laid no condition. I fixed no ways or means. ’Lord, send what it needs,’ I prayed, ’storm or sunshine, wind, rain, or frost. Thou hast made it and Thou dost know.’”
Yes, leave it with Him,
The lilies all do,
And they grow—
They grow in the rain,
And they grow in the dew—
Yes, they grow:
They grow in the darkness, all hid in the night—
They grow in the sunshine, revealed by the light—
Still, they grow.
Yes, leave it with Him
’Tis dearer to His heart,
You will know,
Then the lilies that bloom,
Or the flowers that start
’Neath the snow:
Whatever you need, if you seek it in prayer,
You can leave it with Him—for you are His care.
You, you know.
No comments:
Post a Comment