Friday, March 4, 2022

The Price of Freedom

అప్పుడు అది (అపవిత్రాత్మ) కేకవేసి, వానినెంతో విలవిలలాడించి వదలిపోయెను. - (మార్కు 9:26).

దురాత్మ చివరిదాకా పోరాడకుండా ఎప్పుడూ తన స్థానాన్ని వదిలి వెళ్ళడు. మనం కూడా సరదాగా కాలక్షేపం చెయ్యడం మూలాన ఏలాటి ఆత్మీయమైన మేలును పొందలేము. కాని యుద్ధరంగంలో నిలిచి పోరాడితేనే మనకు రావలసినదాన్ని దక్కించుకోగలం. ఆత్మీయంగా కూడా ఇదే వర్తిస్తుంది. ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ఆశించిన ప్రతి విషయంలోనూ రక్తాన్ని కార్చవలసి ఉంది. నెమ్మదిగా వాదిస్తే సాతాను పారిపోడు. దారికి అడ్డంగా పరుచుకుని నిలబడే ఉంటాడు. మనం కన్నీళ్ళు, రక్తం కార్చి మన దారిని సుగమం చేసుకోవాలి. ఇది మనం గుర్తుంచుకోలేకపోతే మనకున్న ఇతర భారాలకి ఈ అజ్ఞాన భారాన్ని చేర్చుకున్న వాళ్ళమవుతాము. మనం తిరిగి పుట్టింది శిశు సంరక్షణా కేంద్రాల్లోన్ని మెత్తని పట్టు పరుపులో పడుకోవడానికి కాదు. ఆరుబయట నిలబడి తుపాను తాకిడిని తట్టుకోవడానికే, దాని బీభత్సంలోనుంచి మన శక్తిని జుర్రుకోవడానికే మనం క్రీస్తులో మళ్ళీ జన్మించాం. ఘోర శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి.

చెరసాల, ఖడ్గం, అగ్నిగుండం

అన్నిటికీ ఎదురు నిలిచిన

మన తండ్రుల విశ్వాసం 

ఈ మాటలు వింటే మనకెంత గర్వం

మన తండ్రుల విశ్వాసం, పరిశుద్ధ విశ్వాసం

దానికి వారసులమవుదాం


చీకటి కొట్టుల్లో గొలుసులతో కట్టారు వాళ్లను

గానీ వాళ్ళ మనసులు, ఆత్మలు స్వతంత్రాలే

వారి సంతానం ఆదే దారిన వెళ్ళగలిగితే

ఎంత మేలు! అది వాళ్ళకెంత క్షేమం!

-----------------------------------------------------------------------------------------------------------------------------

And the spirit cried, and rent him sore, and came out of him - (Mark - 9:26)

Evil never surrenders its hold without a sore fight. We never pass into any spiritual inheritance through the delightful exercises of a picnic, but always through the grim contentions of the battlefield. It is so in the secret realm of the soul. Every faculty which wins its spiritual freedom does so at the price of blood. Apollyon is not put to flight by a courteous request; he straddles across the full breadth of the way, and our progress has to be registered in blood and tears. This we must remember or we shall add to all the other burdens of life the gall of misinterpretation. We are not “born again” into soft and protected nurseries, but in the open country where we suck strength from the very terror of the tempest. “We must through much tribulation enter into the kingdom of God.” Dr. J. H. Jowett

“Faith of our Fathers! living still,  

Despite dungeon, fire, and sword:  

O how our hearts beat high with joy  

Whenever we hear that glorious word.  

Faith of our Fathers! Holy Faith!  

We will be true to Thee till death!  


“Our fathers, chained in prisons dark,  

Were still in heart and conscience free;  

How sweet would be their children’s fate,  

If they, like them, could die for Thee!”

No comments:

Post a Comment