మనం చాల వీడియోలలో చూస్తుంటాము, అలాగే మన ఇంట్లో ఉండే పిల్లలను చూస్తుంటాము తల్లి లేదా తండ్రి ఏమి చేస్తే అదే చేస్తుంటారు, ముఖ్యంగా తండ్రి ఏది చేస్తే తమ బిడ్డలు అదే చేస్తుంటారు, తండ్రి నడిచినట్లుగానే, తండ్రి మాట్లాడినట్లుగానే, తండ్రి పడుకున్నట్లుగానే వీళ్ళు కూడా అలానే చేస్తుంటారు, అదేవిధముగా చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులు ఎంచుకున్న రంగమునే ఎంచుకుంటుంటారు. తల్లిదండ్రులు డాక్టర్స్ అయితే వీరు కూడా డాక్టర్ అవ్వాలని, వాళ్ళు టీచర్స్ అయితే వీళ్ళు కూడా టీచర్ అవ్వాలని ఇలా ప్రతిదానిలో కూడా తండ్రిని అనుసరిస్తూ ఉంటారు.
అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు "కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును - యోహాను 5:19"ఆయన పరమునుండి వచ్చారు తండ్రిని చూసారు కాబట్టే ఆ తండ్రి క్రియలనే చేస్తున్నారు, చేసారు... అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది "తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు - యోహాను 1:12,13, యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవునిమూలముగా పుట్టియున్నాడు - 1యోహాను 5:1"
యసుక్రీస్తు నందు విశ్వాసముంచి మనం కూడా ఇప్పుడు శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టక దేవుని వలన పుట్టినవారము, దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉన్నవారము, ఆయన గుణాలక్షణాలను ఎరిగి ఉన్నవారము, ఆయన ప్రేమను రుచిచూసిన మనం... మన అంతట మనమే ఏమి చెయ్యకుండా మన పరమ తండ్రి ఏమి చేసారో, మన పరమ తండ్రి ఎలాంటి క్రియలను కలిగి ఉన్నారో, యేరీతిగా పరిశుద్ధముగా ఉన్నారో, ఏ రీతిగా ప్రేమ, జాలి, దయ కృపాసమృద్ధిగల దేవుడై యున్నారో మనం కూడా అదేరీతిగా ఉండాలి కదా మరి అలా ఉంటున్నామా...
మరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు - 1పేతురు 2:9
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి - మత్తయి 5:16
ననే దేవుడను మీరే నాకు సాక్షులు - యెషయా 43:12
మరి తండ్రి తండ్రి అని పిలుస్తున్న నీవు నేను తండ్రి గుణాతిశయములను ప్రచురిస్తున్నామా... తండ్రి ప్రేమను చూపిస్తున్నామా... తండ్రి క్రియలను కలిగి ఉంటున్నామా...
మనుష్యకుమారునిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రిని లోకానికి చూపించారు, తండ్రి ప్రేమను లోకానికి తెలియజేసారు, తండ్రి చిత్తాన్ని పూర్తిగా సంపూర్తిచేసారు.... మరి ఆతండ్రికి వారసులమైన మనం మన రక్షకునివలె తండ్రిని లోకానికి కనపరుస్తున్నామా... ఆ తండ్రివలె జీవిస్తున్నామా.... లేక పెదవులతో తండ్రి అని పిలుస్తూ హృదయాన్ని తండ్రికి దూరముగా ఉంచుకుని, తండ్రిని బాధపెడుతూ, మన వలన మన పరమతండ్రికి చెడ్డపేరువచ్చేలా జీవిస్తున్నామా... ఒక్కసారి ఆలోచిద్దాము.....
No comments:
Post a Comment