ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను (యోబు 13:15).
నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను (2 తిమోతి 1:12).
నా నావలన్నీ విరిగి
తెరచాపలు చిరిగి నిరర్థకమైనా
శంక నన్నంటదు
నే నమ్మిన వానిని నేనెరుగుదును
కనిపించే కీడంతా నాకు మేలయ్యేను
ఆశలు జారినా అదృష్టాలు మారినా
నిన్నే నమ్మానంటూ గొంతెత్తి పిలిచేను
విన్నపాలు వీగిపోయినా, సన్నుతుడు మూగయైనా
నే నమ్మిన ప్రేమను నేనెరుగుదును
నేనర్రులు చాచే ఈవులు ఇవ్వకపోయినా
కళ్ళల్లో కన్నీళ్ళు సుళ్ళు తిరిగినా
భావనలలో ఎగసిన విశ్వాస హోమం
భారమైనా దూరమైనా ఆయనకే అర్పితం
బాధలు వడగండ్లయి బాధించినా
కష్టాలు కందిరీగలై వేధించినా
నేనెదురు చూసే ఔన్నత్యం నేనెరుగుదును
కష్టనష్టాలే దానికి నిచ్చెనలు
నా సిలువ క్రింద నే నలిగి నీరైనా
నా కెదురయ్యే విపరీత నష్టాలే
నా పాలిట అపురూప లాభాలు
విశ్వాసపు లంగరు దించాను
శోధన పెనుగాలుల నెదిరించాను
తొణకదు బెణకదు నా ఆత్మ నావ
మృత్యుసాగరపు తీరం చేరే దాకా
నా మనసు, నా తనువు ప్రకటించాయి
నా కడ ఊపిరిదాకా నీ విశ్వాస్యతను అనుమానించను నేనని
ఒక అనుభవశాలి అయిన నావికుడన్నాడు - “భయంకరమైన తుపాను చెలరేగినప్పుడు చెయ్యాల్సిన పని ఒకటుంది. అది తప్ప వేరే మార్గం లేదు. అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చెయ్యడం.”
క్రైస్తవుడా, నువ్ చెయ్యవలసిందీ ఇదే. పౌలు ఉన్న ఓడ పెనుతుపానులో చిక్కుకున్నప్పుడు చాలాకాలం సూర్యుణ్ణి గాని, నక్షత్రాలు గాని చూడలేకపోయిన అనుభవం నీకు సంభవించవచ్చు. ఇలాంటప్పుడు ఒకటే దారి. ఇది తప్పనిసరి.
నీ తెలివితేటలు నీకు తోడు రావు. గతంలోని అనుభవాలు సహాయపడవు. ఒక్కోసారి ప్రార్థనలవల్ల కూడా ఓదార్పు కనిపించదు. ఇక మిగిలింది ఒకటే దారి. ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటూ ఇటూ కొట్టుకుపోకుండా చూసుకోవడమే.
క్రీస్తు దిశగా ఆత్మ నావను లంగరు వెయ్యాలి. ఝంఝామారుతాలు, ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు, విసిరికొట్టే ప్రవాహాలు, ఉరుములూ మెరుపులూ, గండశిలలూ ఏం వచ్చినా పర్వాలేదు. చుక్కానికి కట్టేసి, నీ ఆత్మ విశ్వాసానికి దేవుని విశ్వాస్యతనూ ఆయన నిబంధననూ యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమనూ ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి.
-----------------------------------------------------------------------------------------------------------------------------
Though he slays me, yet will I trust him (Job - 13:15)
For I know whom I have believed - 2 Tim 1:12
“I will not doubt, though all my ships at sea
Come drifting home with broken masts and sails;
I will believe the Hand which never fails,
From seeming evil worketh good for me.
And though I weep because those sails are tattered,
Still, will I cry, while my best hopes lie shattered:
‘I trust in Thee.’
“I will not doubt, though all my prayers return
Unanswered from the still, white realm above;
I will believe it is an all-wise love
Which has refused these things for which I yearn;
And though at times I cannot keep from grieving,
Yet the pure ardor of my fixed believing
Undimmed shall burn.
“I will not doubt, though sorrows fall like rain,
And troubles swarm like bees about a hive.
I will believe in the heights for which I strive
Are only reached by anguish and by pain;
And though I groan and writhe beneath my crosses.
I yet shall see through my severest losses
The greater gain.
“I will not doubt. Well anchored is this faith,
Like some staunch ship, my soul braves every gale;
So strong its courage that it will not quail
To breast the mighty unknown sea of death.
Oh, may I cry, though body parts with spirit,
‘I do not doubt,’ so listening worlds may hear it,
With my last breath.”
“In fierce storms,” said an old seaman, “we must do one thing; there is only one way: we must put the ship in a certain position and keep her there.”
This, Christian, is what you must do. Sometimes, like Paul, you can see neither sun nor stars, and no small tempest lies on you; and then you can do but one thing; there is only one way.
Reason cannot help you; past experiences give you no light. Even prayer fetches no consolation. Only a single course is left. You must put your soul in one position and keep it there.
You must stay upon the Lord; and come what may—winds, waves, cross-seas, thunder, lightning, frowning rocks, roaring breakers—no matter what, you must lash yourself to the helm, and hold fast your confidence in God’s faithfulness, His covenant engagement, His everlasting love in Christ Jesus. —Richard Fuller
No comments:
Post a Comment