Friday, April 29, 2022

Keep Praying

 

ఏలీయా మన వంటి స్వభావము గల మనుష్యుడే  (యాకోబు 5:17).

అందుకు దేవునికి వందనాలు! రేగు చెట్టు క్రింద చతికిలబడ్డాడు. మన లాగానే, మనం తరచుగా చేసినట్టే దేవుని మీద సణుగుకున్నాడు. ఫిర్యాదు చేసాడు. మనకు లాగానే అతనిలోనూ అపనమ్మకం చోటు చేసుకుంది. అయితే నిజంగా దేవునితో సంబంధం ఏర్పడిన తరువాత మాత్రం కథ మలుపు తిరిగింది. “మన వంటి స్వభావము గల” మనుష్యుడైనప్పటికీ ఆసక్తితో ప్రార్ధన చేసాడు,” ఇంతకన్నా శ్రేష్టమైన ఆనందం మరోటి లేదు. ఏలీయా కేవలం ఆసక్తితోనే ప్రార్ధన చెయ్యలేదు. ప్రార్థనా పూర్వకంగా ప్రార్థించాడు. ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏమిటి? మనం వదలకుండా ప్రార్థించాలి.

కర్మెలు పర్వత శిఖరం మీదికి ఎక్కి రండి. విశ్వాసానికీ, ప్రత్యక్షంగా కనిపించేదానికీ సామ్యం కుదిర్చే వైనాన్ని వినండి. ఆకాశం నుండి అగ్ని దిగి రావడం కాదు. ఇప్పుడు కావలసింది. ఇప్పుడు ఆకాశంనుండి జల ధారలు కురియాలి. అగ్నిని అవరోహణం కమ్మని ఆజ్ఞాపించిన మనిషి, ఇప్పుడూ అదే పద్ధతిలో, అదే సాధనాన్ని ఉపయోగించి వర్షాన్ని రప్పించాలి. ఏలీయా నేలమీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను అని రాయబడి ఉంది. అంటే అన్ని ధ్వనులనూ, ఏకాగ్రతకి భంగం కలిగించే శబ్దాలనూ దూరంగానే ఉంచాడన్న మాట. ఇలాటి భంగిమలో దుప్పటి ముసుగేసుకుని బయట ఏం జరుగుతున్నదో కనిపించకుండా ప్రార్థించాడన్నమాట.

సేవకుణ్ణి పిలిచి “నువ్వు పైకి ఎక్కి సముద్రంవైపుకి చూడమ”న్నాడు. అతడు వెళ్ళి చూసి తిరిగి వచ్చాడు “ఏం లేదు” అన్నాడు.

ఈ పరిస్థితిలో మనం ఏం చేస్తాము.

"నేను ముందే అనుకున్నాలే" అంటామేమో. ప్రార్థించడం చాలిస్తామేమో. ఏలీయా అలా చేసాడా? లేదు. “మళ్ళీ వెళ్ళు” అన్నాడు. సేవకుడు తిరిగి వచ్చి “ఏం లేదు” అన్నాడు. ఏలీయా “మళ్ళీ వెళ్ళు” అన్నాడు. సేవకుడు “ఏం లేదు” అన్నాడు. ఏలీయా “మళ్ళీ వెళ్ళు” అన్నాడు.

కొంతసేపటికి అతడు తిరిగి వచ్చినప్పుడు “మనిషి చెయ్యంత మేఘం కన్పించింది” అన్నాడు. ఏలీయా చెయ్యి అర్థింపుగా పరలోకం వైపుకు చాపబడింది. జవాబుగా వర్షం దిగింది. ఎంత త్వరగా కురిసిందంటే తన పంచకళ్యాణి గుర్రాల సహాయంతో అహాబు సమరయ ద్వారాన్ని చేరలేకపోయాడు. ఇదే విశ్వాసానికీ, ప్రత్యక్షానికీ సామ్యం చెప్పే ఉపమానం. 

ఇలా ప్రార్థించడం నీకు తెలుసా? పనుల్ని సాధించే ప్రార్ధన నీకు తెలుసా? కనిపిస్తున్న పరిస్థితులు ఎంత నిరాశాజనకంగానైనా ఉండొచ్చు. కాని వాటిని లెక్క చెయ్యకండి. మన పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆలస్యం చెయ్యడం కూడా ఆయన మంచితనంలో ఒక భాగమే, మనకి లాభమే.

ముగ్గురు పిల్లలు విశ్వాసానికి నిర్వచనాలు చెప్పారు. మొదటి బాలుడన్నాడు “విశ్వాసం అంటే క్రీస్తును పట్టుకోవడం.” రెండో పిల్లవాడు. “పట్టుకునే ఉండడం” అన్నాడు. మూడో పిల్లవాడు “ఎప్పటికీ వదలక పోవడం” అన్నాడు. తుమ్మ జిగురులా అంటి పెట్టుకుని వదలని విశ్వాసం ఇది.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Elias was a man subject to like passions as we are (Jas - 5:17)

Thank God for that! He got under a juniper tree, as you and I have often done; he complained and murmured, as we have often done; was unbelieving, as we have often been. But that was not the case when he really got into touch with God. Though “a man subject to like passions as we are,” “he prayed to pray.” It is sublime in the original—not “earnestly,” but “he prayed in prayer.” He kept on praying. What is the lesson here? You must keep praying.

Come up on the top of Carmel, and see that remarkable parable of Faith and Sight. It was not the descent of the fire that now was necessary, but the descent of the flood; and the man that can command the fire can command the flood by the same means and methods. We are told that he bowed himself to the ground with his face between his knees; that is, shutting out all sights and sounds. He was putting himself in a position where, beneath his mantle, he could neither see nor hear what was going forward.

He said to his servant, “Go and take an observation.” He went and came back, and said—how sublimely brief! one word—“Nothing!”

What do we do under such circumstances?

We say, “It is just as I expected!” and we give up praying. Did Elijah? No, he said, “Go again.” His servant again came back and said, “Nothing!” “Go again.” “Nothing!”

By and by he came back, and said, “There is a little cloud like a man’s hand.” A man’s hand had been raised in supplication, and presently down came the rain, and Ahab had not time to get back to the gate of Samaria with all his fast steeds. This is a parable of Faith and Sight—faith shutting itself up with God; sight taking observations and seeing nothing; faith going right on, and “praying in prayer,” with utterly hopeless reports from sight.

Do you know how to pray that way, how to pray prevailingly? Let sight give as discouraging reports as it may, but pay no attention to these. The living God is still in the heavens and even delay is part of His goodness.—Arthur T. Pierson

Each of the three boys gave a definition of faith which is an illustration of the tenacity of faith. The first boy said, “It is taking hold of Christ”; the second, “Keeping hold”; and the third, “Not letting go.”

No comments:

Post a Comment