Monday, April 18, 2022

PHindrance to Prayer

 

ఆయన నీ కార్యము నెరవేర్చును (కీర్తన 37:5). 

ఒకప్పుడు నేను అనుకునేదాన్ని. ఒక విషయం గురించి ప్రార్ధన చేసిన తరువాత ఆ విషయం నెరవేరడానికి మానవపరంగా నేను చెయ్యగలిగిందంతా చెయ్యాలి అని. అయితే దేవుడు సరైన మార్గాన్ని బోధించాడు. ఎలాగంటే నేను చేసే ప్రయత్నాలు ఆయన పనికి ఆటంకాలు తప్ప మరేమీ కాదని. ఒకసారంటూ ప్రార్ధించి, తప్పకుండా అది జరుగుతుందని నమ్మినట్టయితే ఆత్మలో స్తుతులు చెల్లిస్తూ వేచి యుండాలనీ, ఆయనేదైనా చెప్తే చెయ్యాలనీ నేర్పించాడు. కాని చేతులు ముడుచుకు కూర్చోవడం, ఏమీ చెయ్యకుండా కేవలం దేవుని మీద భారం వేసి ఊరకుండడం మనకి రుచించదు. పోరాటంలోకి మనం స్వయంగా దూకాలన్న శోధనను తట్టుకోవడం కష్టం.

నీళ్ళలో మునిగిపోతున్నవాడు తనను రక్షించడానికి వచ్చిన వాడిని తానే రక్షించాలని ప్రయత్నిస్తుంటే వాడి ప్రాణాలు కాపాడడం ఎంత కష్టమో మనకి తెలుసు. అలాగే మన పోరాటాలు మనమే పోరాడుతూ ఉంటే మన పక్షంగా యుద్ధం చెయ్యడం దేవునికి కష్టమైపోతుంది. మనం జోక్యం కలిగించుకోవడం ఆయన్ని అడ్డగించినట్టే.

ఇహలోకపు శక్తులు చురుకుగా పనిచేస్తుంటే ఆత్మ శక్తులు మెదలకుండా ఊరుకుంటాయి.

ప్రార్థనకి జవాబివ్వడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు. ఈ సందర్భాలలో దేవుడికి మనం అసలు అవకాశమే ఇవ్వం. ఒక గులాబి పువ్వుకి రంగు వెయ్యడానికీ, ఒక దేవదారు చెట్టుని పెంచడానికీ, గోధుమ పొలాల్లోంచి రొట్టెలు తయారు చెయ్యడానికీ కొంత సమయం కావాలి. ముందు భూమిని మెత్తన చెయ్యాలి, పదును చెయ్యాలి, ఎరువు వెయ్యాలి, నీటితో తడపాలి. మొలకెత్తడానికి వేడిమి కావాలి. ఇవన్నీ చేసాక దేవుడు మొలకల్ని మొలిపిస్తాడు. వాటికి ఆకుల్ని, కంకుల్నీ అమరుస్తాడు. చివరికి కొంత కాలం గడిచాక ఆకలి కడుపుకి రొట్టెలు తయారవుతాయి.

దీనంతటికీ కొంతకాలం పడుతుంది. అందుకే మనం విత్తనాలు చల్లుతాము, దున్నుతాము. తరువాత కొంతకాలం నమ్మకంతో ఎదురు చూస్తాము. దేవుని పనంతా పూర్తయ్యేదాకా కనిపెడతాము. దేవునికి తన పని చెయ్యడానికి సమయాన్నిస్తాము. మన ప్రార్థన జీవితాల్లో కూడా ఇదే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వండి.

-----------------------------------------------------------------------------------------------------------------------------

And he shall bring it to pass (Ps - 37:5)

I once thought that after I prayed that it was my duty to do everything that I could do to bring the answer to pass. He taught me a better way and showed that my self-effort always hindered His working and that when I prayed and definitely believed Him for anything, He wanted me to wait in the spirit of praise, and only do what He bade me. It seems so unsafe to just sit still, and do nothing but trust the Lord, and the temptation to take the battle into our own hands is often tremendous.

We all know how impossible it is to rescue a drowning man who tries to help his rescuer, and it is equally impossible for the Lord to fight our battles for us when we insist upon trying to fight them ourselves. It is not that He will not, but He cannot. Our interference hinders His working. —C.H.P.

Spiritual forces cannot work while earthly forces are active.

It takes God time to answer prayer. We often fail to give God a chance in this respect. It takes time for God to paint a rose. It takes time for God to grow an oak. It takes time for God to make bread from wheat fields. He takes the earth. He pulverizes. He softens. He enriches. He wets with showers and dews. He warms with life. He gives the blade, the stock, the amber grain, and then at last the bread for the hungry.

All this takes time. Therefore we sow, and till, and wait, and trust, until all God’s purpose has been wrought out. We give God a chance in this matter of time. We need to learn this same lesson in our prayer life. It takes God time to answer prayer. —J. H. M.

No comments:

Post a Comment