చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి (మత్తయి 10:27).
మన దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పాలని మాటిమాటికీ మనల్ని చీకటిలోకి తీసుకుపోతున్నాడు. నీడలు కమ్మిన ఇంట్లోకి, ఆవేదన పరదాలు కట్టిన గదుల్లోకి, ఒంటరితనం నిండిన దిక్కుమాలిన జీవితంలోకి, ఏదో ఒక వైకల్యం మనల్ని పిండిచేసే దుఃఖపు చీకటి కొట్టులోకి నడిపిస్తున్నాడు.
అక్కడ అత్యాశ్చర్యం, అత్యద్భుతం అయిన తన నిత్య, అనంత సత్యాలను చెప్తాడు. మిరుమిట్లు గొలిపే ఈ లోకపు కాంతివల్ల గుడ్డివైపోయిన మన కళ్ళకు పరలోకపు నక్షత్ర సమూహాలు కనపడేలా చేస్తాడు. బండబారిన మన చెవులకు తన మృదువైన స్వరాన్ని వినిపిస్తాడు. ఇహలోకపు రణగొణధ్వనులలో అయితే ఆ స్వరం వినిపించదు మరి.
కాని ఈ విధంగా వినడం వల్ల బాధ్యత మన మీద దానంతటదే పడుతున్నది. "దానిని మీరు వెలుగులో చెప్పండి. ఇంటి కప్పుల మీద దానిని ప్రకటించండి." అదే దేవుడు మనకు అప్పగించిన బాధ్యత.
మనం కలకాలం చీకట్లోనే, మూసిన తలుపుల వెనకనే ఉండిపోకూడదు. త్వరలోనే జీవితపు త్రొక్కిసలాటలోకి మనమూ వెళ్ళవలసి ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మనం చీకట్లో నేర్చుకున్న దాన్ని ప్రకటించవలసి ఉంది.
దీని వలన శ్రమలు అనుభవించడంలోను, తలాతోకా లేనట్టు అనిపించే సంఘటనల్లోనూ ఒక క్రొత్త ప్రయోజనం, అర్థం మనకు స్పురిస్తాయి.
"నేనెంత పనికిమాలిన వాణ్ణి!" "మనుషుల ప్రయోజనార్థం నేనేమి చేస్తున్నాను?" "నా ఆత్మ అనే ఈ ప్రశస్త పరిమళ ద్రవ్యం ఇలా వ్యర్థం కావలసిందేనా?" శ్రమలనుభవించేవారు ఇలా వాపోతూ ఉంటారు. అయితే వీటన్నింటిలో దేవునికి ఒక పధకం ఉంది. ఆయన వాళ్లను తనకి సమీపంగా ఎత్తైన కొండల్లోకి పిలిచి ముఖాముఖి మాట్లాడుతున్నాడు. వాళ్లు కొండ దిగి వెళ్లి ఎదురు చూస్తున్న జనసమూహానికి ఆ సందేశాలను అందించాలి.
కొండమీద మోషే గడిపిన నలభై రోజులు, హోరేబులో ఏలీయా గడిపిన కాలము, అరేబియాలో పౌలు గడిపిన సంవత్సరాలు వ్యర్థం ఎలా అవుతాయి?
విశ్వాస జీవితంలో దగ్గర దారి అంటూ ఏమీ లేదు. దేవునితో ఒంటరి సంభాషణ, సహవాసం, ధ్యానం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. దైవ సన్నిధి అనే శిఖరాగ్రంలో సహవాసమూ, స్థిరమైన బండ సందులో విశ్రాంతికరమైన నిద్ర విశ్వాస జీవితంలో అంతర్భాగాలు. ఇహలోకపు తాపత్రయాలను అంధకారం కమ్మి ఆకాశ తారలు కనిపించే వేళల్లో అనంతమూ, శాశ్వతమూ అయిన ప్రపంచాల దర్శనాలను మన ఆత్మలు చూడగలగడం అన్నది అవశ్యం.
దైవసన్నిధి మన ఆత్మలో సుస్థిరంగా నెలకొని ఉండాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. అలాంటప్పుడే మన ఆత్మలు కూడా కీర్తనకారుడితో కలిసి పాడగలుగుతాయి "దేవా నీవు సమీపంగా ఉన్నావు.”
-----------------------------------------------------------------------------------------------------------------------------
What I tell you in the darkness, speak ye in the light (Matt - 10:27)
Our Lord is constantly taking us into the dark, that He may tell us things. Into the dark of the shadowed home, where bereavement has drawn the blinds; into the dark of the lonely, desolate life, where some infirmity closes us in from the light and stir of life; into the dark of some crushing sorrow and disappointment.
Then He tells us His secrets, great and wonderful, eternal and infinite; He causes the eye which has become dazzled by the glare of earth to behold the heavenly constellations; and the ear to detect the undertones of His voice, which is often drowned amid the tumult of earth’s strident cries.
But such revelations always imply a corresponding responsibility—’ that speak ye in the light—that proclaim upon the housetops.”
We are not meant to always linger in the dark, or stay in the closet; presently we shall be summoned to take our place in the rush and storm of life; and when that moment comes, we are to speak and proclaim what we have learned.
This gives a new meaning to suffering, the saddest element in which is often its apparent aimlessness. “How useless I am!” “What am I doing for the betterment of men?” “Wherefore this waste of the precious spikenard of my soul?”
Such are the desperate laments of the sufferer. But God has a purpose in it all. He has withdrawn His child to the higher altitudes of fellowship, that he may hear God speaking face to face, and bear the message to his fellows at the mountain foot.
Were the forty days wasted that Moses spent on the Mount, the period spent at Horeb by Elijah, or the years spent in Arabia by Paul?
There is no shortcut to the life of faith, which is the all-vital condition of a holy and victorious life. We must have periods of lonely meditation and fellowship with God. That our souls should have their mountains of fellowship, their valley of quiet rest beneath the shadow of a great rock, their nights beneath the stars, when darkness has veiled the material and silenced the stir of human life, and has opened the view of the infinite and eternal, is as indispensable as that our bodies should have food.
Thus alone can the sense of God’s presence become the fixed possession of the soul, enabling it to say repeatedly, with the Psalmist, “Thou art near, 0 God.” —F. B. Meyer
“Some hearts, like evening primroses, open more beautifully in the shadows of life.”
No comments:
Post a Comment