Friday, April 15, 2022

Rest on the Word of God

 

నీ మాట నమ్ముకొనియున్నాను (కీర్తన 119:42).

దేవుడు తాను చేస్తానన్న దానిని చేసి తీరుతాడని మనం ఎంతవరకు నమ్ముతామో మన విశ్వాసం అంత బలంగా ఉంది అనుకోవాలి. విశ్వాసానికి మన ఆలోచనలతో గాని, అభిప్రాయాలతో గాని, ఒక విషయం జరగడానికి అవకాశం ఉందా లేదా అన్న మీమాంసతో గాని నిమిత్తం లేదు. బయటికి కనిపించే దానితో పనిలేదు. వీటన్నిటినీ విశ్వాసానికి ముడి పెట్టాలని చూస్తే మనం దేవుని మాటని నమ్మడం లేదన్నమాట. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడూ అంటే ఇక మనకి చీకటిలో పనిలేదు. విశ్వాసం అనేది కేవలం దేవుని మాట మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయన మాటను మనం ఉన్నదున్నట్టుగా నమ్మితే మన మనస్సుకి శాంతి ఉంటుంది.

మనలోని విశ్వాసాన్ని వాడుకోవడం దేవుడికెంతో సంతోషదాయకం. మొదటగా మన ఆత్మల్ని దీవించడానికి, రెండవదిగా సంఘాన్ని, సంఘంలో చేరని వాళ్ళని కూడా ఆశీర్వదించడానికి. కాని ఇలా ఉపయోగపడే స్థితినుంచి మనం మొహం చాటుచేసుకుంటాం.

శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనాలంటే “నా పరలోకపు తండ్రి ఈ శ్రమల గిన్నెని నా చేతుల్లో ఉంచాడు. ఇది గడిచిన తరువాత ఆయనే నాకు రుచికరమైన దాన్ని తాగడానికిస్తాడు.” శ్రమలనేవి విశ్వాసానికి ఆహారం. మన పరలోకపు తండ్రి చేతుల్లో ఉండిపోదాం. తన పిల్లలకి మంచి చెయ్యడమే ఆయన మనసుకి ఆనందం.

విశ్వాసం ఉపయోగపడడానికీ, అభివృద్ధి పొందడానికీ సాధనాలు కేవలం కష్టాలూ, శ్రమలే కావు. వాక్యాన్ని చదవడం, తద్వారా దేవుడు తన గురించి తాను చెప్పుకున్నదాన్ని ఆకళింపు చేసుకోవడం కూడా విశ్వాసం పెంపొందించుకునే మార్గాలే.

నీకు దేవుని వాక్యంతో ఉన్న పరిచయం వల్ల నువ్వు చెప్పగలగాలి “దేవుడెంత ప్రేయామయుడు!” అని. అలా కాని పక్షంలో నేను అపేక్షగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇలాటి స్థితికి తీసుకురమ్మని దేవుణ్ణి అడగండి. ఆయన దయనూ, మృదుమధురమైన లాలననూ మీరు పూర్తిగా అనుభవించాలనీ, ఆయన ఎంత మంచివాడో తెలుసు కోవాలనీ, తన పిల్లలకి క్షేమం జరగడం ఆయనకెంత ఇష్టమో మీకు తెలియాలని అర్ధించండి.

ఇలాటి మానసిక స్థితికి మనం ఎంత దగ్గరగా రాగలిగితే అంత నిశ్చింతగా మనల్ని మనం ఆయన చేతులకి అప్పగించుకుంటాం. మన బ్రతుకులో ఆయన ఏమి చేసినప్పటికీ తృప్తిగానే ఉంటాము. అప్పుడు శ్రమలు వస్తే మనం చెప్పగలం. “వీటి ద్వారా దేవుడు నాకేమి చేయనున్నాడో ఓపికగా కనిపెట్టి చూస్తాను. ఆయన ఏదో ఒక మేలు చేస్తాడని నా నిశ్చయం.” ఈ విధంగా ఒక హుందాతనంతో లోకం ఎదుట సాక్ష్యమిస్తాము. ఈ విధంగా ఇతరులను మనం బలపరుస్తాము.

-----------------------------------------------------------------------------------------------------------------------------

I trust in thy word (Ps - 119:42)

Just in proportion to which we believe that God will do just what He has said, is our faith strong or weak. Faith has nothing to do with feelings, or with impressions, improbabilities, or with outward appearances. If we desire to couple them with faith, then we are no longer resting on the Word of God because faith needs nothing of the kind. Faith rests on the naked Word of God. When we take Him at His Word, the heart is at peace.

God delights to exercise faith, first for blessing in our own souls, then for blessing in the Church at large, and also for those without. But this exercise we shrink from instead of welcoming. When trials come, we should say: “My Heavenly Father puts this cup of trial into my hands, that I may have something sweet afterward.”

Trials are the food of faith. Oh, let us leave ourselves in the hands of our Heavenly Father! It is the joy of His heart to do good to all His children.

But trials and difficulties are not the only means by which faith is exercised and thereby increased. There is the reading of the Scriptures, that we may buy them acquaint ourselves with God as He has revealed Himself in His Word.

Are you able to say, from the acquaintance you have made with God, that He is a lovely Being? If not, let me affectionately entreat you to ask God to bring you to this, that you may admire His gentleness and kindness, that you may be able to say how good He is, and what a delight it is to the heart of God to do good to His children.

Now the nearer we come to this in our inmost souls, the more ready we are to leave ourselves in His hands, satisfied with all His dealings with us. And when the trial comes, we shall say:

“I will wait and see what good God will do to me by it, assured He will do it.” Thus we shall bear an honorable testimony before the world, and thus we shall strengthen the hands of others. —George Mueller.

No comments:

Post a Comment